For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రపంచ జనాభా దినోత్సవం 2021 : ఈసారి జనాభా దినోత్సవం ప్రాముఖ్యత ఏంటంటే..

ఈసారి వ‌ర‌ల్డ్ పాప్యులేష‌న్ డే సంద‌ర్భంగా కుటుంబ నియంత్ర‌ణ‌(ఫ్యామిలీ ప్లానింగ్) అనే అంశాన్ని ఇతివృత్తంగా తీసుకున్నారు. కుటుంబ నియంత్ర‌ణ అనేది మాన‌వ హ‌క్కు.

|

నానాటికి పెరుగుతున్న జనాభా.. తద్వారా తలెత్తే దుష్పరిణామాలను ప్రజలకు వివరించేందుకు, వారికి ఆయా సమస్యలపై అవగాహన కలిగించేందుకు ప్రతి ఏటా జూలై 11వ తేదీన "ప్రపంచ జనాభా దినోత్సవాన్ని" నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుదలకు, తరుగుదలకు సంబంధించిన విషయాల గురించి ప్రజలలో చలనం తెచ్చేందుకుగాను ఐక్యరాజ్యసమితి దీనిని ప్రారంభించింది. ఇక జనాభా విషయంలో చైనా, భారత్‌ ఎప్పుడు ముందంజలోనే ఉన్నాయి.

అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతోంది

అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతోంది

ఇక ప్రపంచ జనాభా మొత్తంగా అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతోంది. అవసరాలు తీర్చే వన రులు ఆ స్థాయిని అందుకోలేకపోతున్నాయి. ఆశలు, ఆకాంక్షలు అపరిమితం అయిపోతు న్నాయి. తీర్చగలిగే సంపద, సేవలు, సరుకులు అంతరించి పోతున్నాయి. పర్యవసానం జన విస్ఫోటనం. ప్రజలు భూమికి భారమై, శాపమై పోతున్నారు. కనుకనే దేశాల మధ్య జల, జన యుద్ధాలు, ఆధిపత్య పోరాటాలు, భూమి, సహజ సంపదలను దోచుకోవడాలు, దాచుకోవ డాలు జరుగుతున్నాయి. పెరుగుతున్న జనాభాకు ఆవాసం కల్పించాలంటే మరో గ్రహాన్ని వెతుక్కో వాల్సిందే అని ఇటీవల వినిపిస్తున్న ఘోష.

అందుకే ప్రపంచ జనాభా దినోత్సవం

అందుకే ప్రపంచ జనాభా దినోత్సవం

జనాభా ఎందుకు పెరుగుతోంది? దీనివలన లాభ నష్టాలేమిటి? అసలు జనాభా అనేది దానికి అదే ఒక శాపమా? లేక వరమయ్యే అవకాశాలు న్నాయా? దానిని అదుపు చేయడమా? స్థిరీకరించడమా? పెరుగుదల వేగాన్ని తగ్గించడమా? వంటి అంశాలను ప్రపంచానికి తెలియజేయడా నికే ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపు కుంటున్నాము.

పుట్టేబోయే పిల్లలంతా ఆరోగ్యపరంగా ఉంటేనే కదా

పుట్టేబోయే పిల్లలంతా ఆరోగ్యపరంగా ఉంటేనే కదా

జనాభా దినోత్సవం సందర్భంగా అందరూ తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలున్నాయి. జనాభా పెరుగుతుంది కానీ ఆ జనాభా మొత్తం ఆరోగ్యకరంగా ఉండాలి. అంటే పుట్టేబోయే పిల్లలంతా కూడా ఆరోగ్యపరంగా ఉంటేనే కదా... ఈ సమాజం కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది. అయితే కొన్ని రకాల వ్యాధుల వల్ల మన జనాభా నాసిరకంగా మారిపోతుంది.

గర్భాశయం.. స్త్రీ జన్మకు పరిపూర్ణతనిస్తూ అండాన్ని పిండంగా మార్చే కర్మాగారం,. అలా చరాచర సృష్టికి మూలం గర్భసంచి. దానికి ఎలాంటి సమస్య వచ్చినా కూడా భూమి మీదకు ఏ మనిషి రాలేడనేది గుర్తించుకోవాలి.

పున‌రుత్ప‌త్తి వ్య‌వ‌స్థ‌, ఆరోగ్య స‌మ‌స్య‌లు

పున‌రుత్ప‌త్తి వ్య‌వ‌స్థ‌, ఆరోగ్య స‌మ‌స్య‌లు

ఈసారి వ‌ర‌ల్డ్ పాప్యులేష‌న్ డే సంద‌ర్భంగా కుటుంబ నియంత్ర‌ణ‌(ఫ్యామిలీ ప్లానింగ్) అనే అంశాన్ని ఇతివృత్తంగా తీసుకున్నారు. కుటుంబ నియంత్ర‌ణ అనేది మాన‌వ హ‌క్కు. మ‌హిళ‌లు, బాలిక‌లు ఎంత మందిని క‌నాలి అనే దానిలో స్వేచ్ఛ వారికే ఉంటుంది. ఈ ఇనిషియేటివ్ ప్ర‌ధాన ఉద్దేశం పున‌రుత్ప‌త్తి వ్య‌వ‌స్థ‌, ఆరోగ్య స‌మ‌స్య‌లు వంటి వాటిపై ప్ర‌జ‌ల్లో విస్తృత అవ‌గాహ‌న క‌ల్పించ‌డం. గ‌ణంకాల ప్ర‌కారం ప్ర‌స‌వ‌ స‌మ‌యంలో ప్ర‌తి రోజూ చాలా మంది త‌ల్లులు మ‌ర‌ణిస్తున్నారు. అందుకే వాటిపైన అవగాహన పెంచుకోవాలి.

గర్భసంచికి ఫిబ్రాయిడ్స్(గడ్డలు)

గర్భసంచికి ఫిబ్రాయిడ్స్(గడ్డలు)

సాధారణంగా గర్భసంచి తొలగింపు అనేది చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది. అసలు గర్భసంచిని ఎందుకు తొలగిస్తారు? అనే ప్రశ్న వేస్తే... కేవంల మూడు సందర్భాల్లో మాత్రమే తొలగించాల్సి ఉంటుందనే సమాధానం. గర్భసంచికి ఫిబ్రాయిడ్స్(గడ్డలు) వచ్చి అవి పెద్దగా విస్తరించడం, ఎంతకూ తగ్గని రక్తస్రావం, గర్భసంచి ముఖద్వారం నుంచి బయటకు రావడం(ప్రొలాప్సీ) లాంటి సందర్భాల్లో మాత్రమే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. గర్భసంచికి గడ్డలయినా మయోమెక్టమీ ఆపరేషన్ ద్వారా కేవలం గడ్డలను తొలగించవచ్చు. గర్భాశయాన్ని తీసేయాల్సిన అవసరం ఉండదు. గర్భసంచికి ఫిబ్రాయిడ్స్(గడ్డలు) అనేవి సాధారణంగా మహిళలు ఎదుర్కొనే ప్రధాన సమస్య.

ఎండోమెట్రియోసిస్

ఎండోమెట్రియోసిస్

ఇది ఒక మహిళ గర్భంపై ప్రభావం చూపే ఆరోగ్య సమస్య. దీని వల్ల ఆడవారి జననాంగల వద్ద వీపరీతమైన నొప్పి ఏర్పడుతుంది. అండాశయాల్లో, గర్భాశయం, పిత్తాశయం పేగులపై ఎండోమెట్రియోసిస్ ఏర్పడుతుంది. దీని వల్ల వంధ్యత్వం ఏర్పడే అవకాశం ఉంది.

హెచ్ ఐవీ, ఎయిడ్స్

హెచ్ ఐవీ, ఎయిడ్స్

హెచ్ ఐవీ, ఎయిడ్స్ సోకిన మహిళలకు పుట్టే బిడ్డలకు కూడా ఆ వ్యాధి సోకే అవకాశం ఉంది. అక్రమ లైంగిక సంబంధాలు, ఎయిడ్స్ సోకిన వ్యక్తి రక్తాన్ని ఎక్కించడం తదితర కారణాల వల్ల ఎయిడ్స్ వస్తుంది. అయితే ఎయిడ్స్ వచ్చిన మహిళలు మరో బిడ్డకు జన్మనిస్తే ఆ బిడ్డకు కూడా ఎయిడ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి గర్భంతో ఉన్న మహిళ కచ్చితంగా ఎయిడ్స్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. జనాభా అంతా ఆరోగ్యంగా ఉండాలి కానీ ఇలాంటి రోగాలతో బాధపడకూడదు.

పాలిసిస్టిక్ ఓవిరీ సిండ్రోమ్

పాలిసిస్టిక్ ఓవిరీ సిండ్రోమ్

పాలిసిస్టిక్ ఓవిరీ సిండ్రోమ్ అనేది కూడా మహిళలకు సోకుతూ ఉంటుంది. పిసిఒఎస్ (పాలీసిస్టిక్ ఒవరీ సిండ్రోమ్)పాలిసిస్టిక్ ఓవిరీ సిండ్రోమ్తో బాధపడుతున్న మహిళలకు వంధ్యత రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే పిసిఒఎస్ తో బాధపడుతున్న మహిళలకు, గర్భం ధరించడం చాలా కష్టమవుతుంది. దీంతో బాధపడుతున్న కొందరు మహిళలకు ముఖం మీద జుట్టుప పెరుగుతుంది. అండర్ ఆర్మ్స్, ముఖం బాగా నల్లబడిపోతుంది. పిసిఒఎస్ అనేది మెదడు, అండాశయము లో హార్మోన్లలో సంతులనం లేకపోవడం వలన సంభవిస్తుంది.

లైంగిక వేధింపులు

లైంగిక వేధింపులు

లైంగిక వేధింపులు అనేవి ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నవే. చాలా మంది ఆడవారు లైంగికవేధింపులకు గురువుతూనే ఉన్నారు. ఇలాంటి లైంగిక వేధింపుల వల్ల కూడా ఆడవారు చాలా రకాలుగా అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఈ ప్రభావం పుట్టబోయే బిడ్డలపై అంటే మన జనాభాపై పడుతుంది.

జనాభా కీలకపాత్ర వహిస్తుంది

జనాభా కీలకపాత్ర వహిస్తుంది

ఇక మానవవనరుల్లో జనాభా ముఖ్యమైంది. ఒక దేశాభివృద్ధిని నిర్ణయించడంలో జనాభా కీలకపాత్ర వహిస్తుంది. సహజవనరులను సమర్థవంతంగా ఉపయోగించి అధిక ఉత్పత్తిని, దేశ ప్రగతిని పెంపొందించడం మానవవనరుల సామర్థ్యంపై ఆధారపడుతుంది. అంటే జనాభా పరిమాణం, పెరుగుదల తీరు, పెరుగుదల రేటు, అభివృద్ధి ప్రక్రియను ప్రభావితం చేస్తాయి. ఒక దేశ జనాభా పెరుగుదల అభిలషణీయ స్థాయి కంటే తక్కువగా ఉంటే ఆ దేశ ఆర్థికాభివృద్ధికి ప్రోత్సాహకంగా ఉంటుంది. కానీ, ప్రస్తుతం ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్యల్లో ప్రధానమైంది జనాభా పెరుగుదల.

దేశాభివృద్ధికి సూచిక

దేశాభివృద్ధికి సూచిక

ఒక దేశ జనాభా పెరుగుదల అభిలషణీయమైన స్థాయిలో కంటే తక్కువగా ఉంటే అది దేశాభివృద్ధికి సూచికగా పరిగణించవచ్చు. అందుకే ప్రఖ్యాత జనాభా శాస్త్రవేత్త ఎడ్విన్ కానన్ భూమి మీద పుట్టే ప్రతి బిడ్డ అభివృద్ధికి కారకమవుతుంది అని అన్నారు. ఇక మన మనుగడకు ఐక్యరాజ్య సమితి చేపట్టిన సెవెన్‌ బిలియన్‌ క్యాంపెయిన్‌ కొన్ని సూచనలు చేస్తోంది. అవి 1. దారిద్య్రాన్ని, అసమానతలను తగ్గించడం, జనాభా పెరుగుదల వేగాన్ని అదుపు చేయడం. 2. చిన్న, బలమైన కుటుంబాలకు ప్రోత్సాహకాలు ఇచ్చి ఆరోగ్యకర మైన కుటుం బాలకు దారి సుగమం చేయడం. 3 తక్కువ సంతానం, దీర్ఘాయుష్షుల వలన వృద్ధుల సంఖ్య పెరగడంపై జాగరూకతతో ఉండటం.

కుటుంబ ప్రణాళికను ప్రపంచ మానవాళి హక్కుగా నిర్ణ యించింది

కుటుంబ ప్రణాళికను ప్రపంచ మానవాళి హక్కుగా నిర్ణ యించింది

ఈసారి ప్రత్యేకించి ఐక్యరాజ్యసమితి కుటుంబ ప్రణాళికను ప్రపంచ మానవాళి హక్కుగా నిర్ణ యించింది. దీంతో తొలిసారిగా ప్రపంచ వ్యాప్తంగా తల్లిదండ్రులు వారి పిల్లల సంఖ్య, ఇంకా వారి మధ్య అంతరాన్ని గుర్తించడాన్ని ఒక ప్రాథమిక మానవ హక్కుగా వెలుగులోకి తెచ్చినట్లైంది. ఈ ప్రపంచ జనాభా దినోత్సవం ప్రత్యేకించి యువతరాన్ని ఉత్తేజపరచనుంది. తమ ఆరోగ్యం, శరీర పుష్టి, లైంగిక సమస్యలు వంటివాటిపై యువత సరైన నిర్ణయాలను తీసుకోగలిగేలా ప్రేరే పించడమే నేటి జనాభా దినోత్సవం లక్ష్యం.

English summary

World Population Day 2018: Importance Of Reproductive Health

World Population Day 2018: Importance Of Reproductive Health
Desktop Bottom Promotion