For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లోయర్ బ్యాక్ పెయిన్ నివారించే 10 న్యేచురల్ రెమెడీస్

|

నడుంనొప్పి లేదా వెన్నునొప్పి అనేది అన్ని వయస్సుల వారు ఎదుర్కొనే అత్యంత సాధారణమైన శారీరిక పరిస్థితిగా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది తమ జీవితంలో ఏదో ఒక సమయంలో వెన్నునొప్పి సమస్యను ఎదుర్కోక తప్పదు. ఈరోజులలో కొన్ని కష్టమైన దైనందిక కార్యకలాపాలు మరియు పని ఒత్తిడులు కూడా వెన్నునొప్పికి గల ప్రధానమైన కారణాలలో ముందు వరసలో ఉన్నాయి.

ఒత్తిడి, సరైన ఆహారం తీసుకోకపోవడం, కండరాల ఉద్రిక్తత, వ్యాయామం చేయకపోవడం, శరీర భంగిమలు సరిగ్గా లేకపోవడం, అధిక శరీర బరువు మరియు శ్రమతో కూడిన పనులు వంటి అనేక కారణాల వలన కూడా ఈ వెన్నునొప్పి రావొచ్చు.

Back Pain

వెన్నునొప్పి యొక్క సాధారణ లక్షణాలుగా, వెన్నెముక ప్రాంతంలో దృఢత్వాన్ని కలిగి ఉండటం, వీపు కింది భాగంలో లేదా పిరుదుల భాగంలో దీర్ఘకాలిక నొప్పి, మంచం మీద పడుకోవడం కష్టంగా ఉండటం, ఎక్కువ కాలం నిలబడలేకపోవడం, మరియు ఒకచోట స్థిరంగా కొద్దిసేపు కూడా కూర్చొనలేకపోవడం వంటివిగా ఉంటాయి. ఈ ఆరోగ్య సమస్యను పట్టించుకోని పక్షంలో., ఇది భవిష్యత్తులో ఇతర తీవ్రమైన అనారోగ్య మరియు దీర్ఘకాలిక సమస్యలకు కారణం కావొచ్చు. అయితే, వెన్నునొప్పికి చికిత్స చేయడం చాలా సులభతరం మరియు తక్షణ ఉపశమనం కోసం వెన్నునొప్పికి అనేకరకాల సహజ నివారణా పద్దతులు కూడా మనుగడలో ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం వ్యాసంలో ముందుకు సాగండి.

1. మూలికలు :

1. మూలికలు :

అట్రుపాల లేదా ఆరళి అనే పేరు కలిగిన "ఇండియన్ విల్లో" చెట్టు బెరడు, మరియు డెవిల్స్ బాక్ బోన్ అని పేరుగల మూలికలు శోథ నిరోధక గుణాలను కలిగి ఉంటాయి. ఇవి వెన్నునొప్పి ఉపశమనానికి ఉపయోగకరంగా ఉంటాయని చెప్పబడుతుంది. తెల్లని ఇండియన్ విల్లో చెట్టు బెరడులో సాలిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది, ఇది శరీరంలోకి చేరిన తర్వాత సాలిస్లిక్ ఆమ్లంగా మారుతుంది. ఈ ఆమ్లం, నొప్పి మరియు వాపు నుండి ఉపశమనం కలిగించడంలో ఉత్తమంగా సహాయం చేస్తుంది. డెవిల్స్ బాక్ బోన్ చెట్టులో హార్పగోసైడ్స్ అనే రసాయన సమ్మేళనాలు ఉంటాయి, ఇవి కూడా అత్యుత్తమ శోథ నిరోధక గుణాలను కలిగి ఉంటాయని చెప్పబడుతుంది.

2. క్యాప్సైసిన్ :

2. క్యాప్సైసిన్ :

క్రీమ్ మిర్చిలో క్యాప్సైసిన్ అనే క్రియాత్మక పదార్థం ఉంటుంది. ఇది నొప్పిని కలిగించే ఒక రకమైన న్యూరోకెమికల్ ను తగ్గించడానికి ఉత్తమంగా చెప్పబడుతుంది. దీనిలో అత్యుత్తమంగా అనాల్జెసిక్ ప్రభావాలు కూడా ఉంటాయని కూడా చెప్పబడుతుంది. దీర్ఘకాలిక నొప్పుల చికిత్సలో క్యాప్సైసిన్ ప్రభావశీలతను కొన్ని అధ్యయనాలు కూడా చూపించాయి.

గమనిక: క్యాప్సైసిన్ క్రీమ్ అప్లై చేయడానికి ముందు వైద్యులను సంప్రదించడం మేలు.

3. వెల్లుల్లి :

3. వెల్లుల్లి :

వెల్లుల్లి ఒక సాధారణ వంటింటి సుగంధ ద్రవ్యంగా మనందరికీ సుపరిచితమే. దీనిలోని శోథ నిరోధక లక్షణాలు వెన్నునొప్పి చికిత్సలో ఉత్తమంగా సహాయపడుతుంది. ఇది అల్లిసిన్ అనే సహజ సమ్మేళనాన్ని కూడా కలిగి ఉంటుంది. క్రమంగా ఒక పెయిన్ కిల్లర్ వలె పనిచేస్తుంది కూడా. ఖాళీ కడుపుతో ప్రతిరోజూ ఉదయాన్నే రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలను తినడం మూలంగా వెన్నునొప్పి తగ్గడంలో అత్యుత్తమంగా సహాయపడుతుంది.

4. అల్లం :

4. అల్లం :

అల్లం మన వంటింటిలో కనిపించే మరొక ఉత్తమ సుగంధ ద్రవ్యంగా చెప్పబడుతుంది. ఇది కూడా వెన్నునొప్పి ఉపశమనానికి సహాయపడే శోథ నిరోధక సమ్మేళనాలను కలిగి ఉంటుంది. అసౌకర్యం మరియు నొప్పిని తగ్గించడానికి, మీ వంటలలో అల్లాన్నితరచుగా ఉపయోగించండి లేదా ప్రతిరోజూ అల్లం టీ త్రాగవచ్చు.

5. హాట్ అండ్ కోల్డ్ కంప్రెస్ :

5. హాట్ అండ్ కోల్డ్ కంప్రెస్ :

ది జర్నల్ ఆఫ్ క్లినికల్ అండ్ డయాగ్నస్టిక్ రీసెర్చ్ లో ప్రచురించిన ఒక అధ్యయనంలో, తక్కువ స్థాయిలోని వెన్నునొప్పికి చికిత్స చేయడంలో హాట్ అండ్ కోల్డ్ కంప్రెస్ అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుంది అని చెప్పబడింది. మీ వెన్ను బెణికినప్పుడు లేదా నొప్పికి గురైనప్పుడు ఐస్ ప్యాక్ వంటి కోల్డ్ కంప్రెస్ లు లాభదాయకంగా ఉంటాయి. ఇది వెన్నునొప్పికి ఒక న్యూబింగ్ ఎఫెక్ట్ అందిస్తుంది. హీటింగ్ ప్యాడ్ లు లేదా వేడినీరు వంటి హీట్ కంప్రెస్ లు గట్టిపడినమైన లేదా బిగుసుకున్న కండరాలకు ఉపశమనాన్ని అందిస్తాయి. ఒక ఐస్ ప్యాక్ అప్లై చేస్తే 20 నిముషాల కంటే ఎక్కువ అప్లై చేయకూడదని గుర్తుంచుకోండి. నొప్పిని బట్టి రోజులో సాధ్యమైనంత వరకు వేడి లేదా కోల్డ్ కంప్రెస్ అప్లై చేయవచ్చు.

6. వర్జిన్ కోకోనట్ ఆయిల్ :

6. వర్జిన్ కోకోనట్ ఆయిల్ :

ముడి కొబ్బరి నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, అనాల్జేసిక్, మరియు యాంటీ పైరెటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. కొబ్బరి నూనె అన్నిరకాల వెన్నునొప్పులకు చికిత్స చేయగలదు. కాబట్టి, తక్షణ ఉపశమనం కోసం కొబ్బరి నూనెను అప్లై చేయడానికి ప్రయత్నించండి. ప్రభావిత ప్రాంతంలో కొన్ని చుక్కల ముడి కొబ్బరి నూనెను అప్లై చేసి 10 నిముషాలపాటు మసాజ్ అనుసరించండి. ఉత్తమ ఫలితాల కోసం రోజులో మూడుసార్లు చేయండి.

7. చామంతి టీ :

7. చామంతి టీ :

శతాబ్దాలుగా చామంతి-టీ ను నొప్పుల చికిత్సలో ఉపయోగించడం జరుగుతూ ఉంది. ఈ చామంతి టీలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సహజంగానే వెన్నునొప్పిని తగ్గిస్తుంది మరియు తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. క్రమంగా రోజులో మూడుమార్లు చామంతి టీ తీసుకోవడం ఉత్తమంగా సూచించబడుతుంది.

8. పసుపు కలిపిన పాలు :

8. పసుపు కలిపిన పాలు :

పసుపు ఒక సహజసిద్దమైన గృహ నివారణా చిట్కాగా ఉంటుందని మనందరికీ తెలిసిన విషయమే. మరియు వంటగదిలో ఎల్లప్పుడు అందుబాటులో ఉండే అత్యద్భుతమైన వైద్యలక్షణాలను కూడుకుని ఉన్న పదార్థం. పసుపులో ఉండే కుర్కుమిన్ అనే సమ్మేళనం ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో ఉత్తమంగా సహాయం చేస్తుంది. అదేవిధంగా పాలలోని క్యాల్షియం మరియు విటమిన్ డి అధిక నిల్వల కారణంగా ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. నిద్రకు ఉపక్రమించే ముందు పసుపు కలిపిన పాలను తీసుకోవడం ఉత్తమం.

9. ఎక్స్ ట్రా-వర్జిన్ ఆలివ్ ఆయిల్ :

9. ఎక్స్ ట్రా-వర్జిన్ ఆలివ్ ఆయిల్ :

ఆలివ్ ఆయిల్లో నొప్పి ఉపశమనానికి సహాయపడే ఓలియోకాంతల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది కూడా ఒక సహజ నొప్పి నివారణిగా ఉంటుంది. అంతేకాకుండా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉండి, నొప్పిని మరియు మంటను తగ్గించడానికి సహాయం చేస్తుందని కూడా చెప్పబడుతుంది. ప్రభావిత ప్రాంతంలో కొన్ని చుక్కల ఎక్స్ ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ అప్లై చేసి 10 నిముషాలపాటు సున్నితంగా మసాజ్ చేయాలి.

10. యోగా :

10. యోగా :

యోగా శరీరానికి సాగుదలతత్వాన్ని, మరియు బలాన్ని అందిస్తుంది. ఇది వెన్నునొప్పి నుంచి ఉపశమనం కలిగించడానికి అత్యుత్తమంగా దోహదపడుతుంది. ఒక అధ్యయనం ప్రకారం, యోగా సహాయంతో దీర్ఘకాలికంగా వెన్నునొప్పికి తక్కువ సమయంలోనే మంచి చికిత్సను అందిస్తుంది.

వైద్యుని ఎప్పుడు సంప్రదించాలి :

వెన్నునొప్పి శరీరాన్ని శుష్కింపజేస్తున్నప్పుడు, లేదా నొప్పి విపరీతంగా ఉన్నప్పుడు, ఇంటి చికిత్సలకు లొంగనప్పుడు, చేతులు మరియు కాళ్లు తిమ్మిర్లెక్కడం లేదా మొద్దుబారడం వంటి లక్షణాలకు లోనైనప్పుడు, రాత్రి సమయంలో నొప్పి పెరిగుతున్నప్పుడు, 6 వారాల కంటే ఎక్కువగా నొప్పి కొనసాగుతూ కనిపించిన పక్షంలో వైద్యుడిని సంప్రదించవలసి ఉంటుంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, మాతృత్వ, శిశు సంక్షేమ, జీవన శైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

10 Natural Remedies For Lowering Back Pain

Backache can occur due to a number of reasons which include stress, improper diet, muscle tension, lack of exercise, poor body postures, excess body weight and arduous physical labour. The natural remedies for back pain are garlic, chamomile tea, yoga, herbs, capsaicin cream, hot and cold compress etc.
Story first published: Thursday, June 13, 2019, 13:05 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more