For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆకలిని కంట్రోల్ చేయడానికి 12 మార్గాలు

|

మీ దైనందిక జీవన సరళిలో రోజులో ఏ సమయంలోనైనా ఆకలి మిమ్మల్ని ఇబ్బందిపెట్టవచ్చు? అవునా? ఒక్కోసారి, సమయానికి తగిన కార్యాచరణలు లేక కొంత అసౌకర్యానికి కూడా గురికావొచ్చు. ఇక మీదట అటువంటి అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకు, మీ ఆకలిని ఏవిధంగా నియంత్రించవచ్చో తెలియజేసేందుకు ఇక్కడ కొన్ని సూచనలను పొందుపరచబడ్డాయి. మరిన్ని వివరాలకు వ్యాసంలో ముందుకు సాగండి.

మీరు మీరోజులో తీసుకునే ప్రధాన భోజనాన్ని ముగించిన తరువాత కూడా, మీరు ఆకలిని అనుభవించడానికి అనేక కారణాలున్నాయి. ప్రధానంగా శరీరానికి తగిన ప్రోటీన్ అందకపోవడం, తగినంత నిద్రలేకపోవడం, శుద్ది చేసిన (రీఫైండ్) కార్బోహైడ్రేట్లను తీసుకోవడం, ఆరోగ్యకరమైన కొవ్వులను సరిగ్గా తీసుకోకపోవడం, తగినంత నీరు త్రాగకపోవడం, పీచు అధికంగా ఉండే ఆహార పదార్ధాలను తినకపోవడం, మరియు అధికంగా ఆల్కహాల్ సేవించడం, ధూమపానం వంటివి కూడా ఉన్నాయి.

Control Your Hunger

కానీ కొందరు, ఈ ఆకలిని అణిచివేయడానికి మాత్రల మీద ఆధారపడడం కూడా చేస్తుంటారు. కానీ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH) ప్రకారం, ఆకలిని అణచివేసే మాత్రలు ప్రమాదకరమైన దుష్ప్రభావాలను కూడుకుని ఉంటాయి. ఇవి ప్రమాదకర రోగాలకు, అనారోగ్య పరిస్థితులకు కారణంగా మారవచ్చునని చెప్పబడుతుంది.

బదులుగా, ఆకలిని అరికట్టేందుకు సహజసిద్దమైన మార్గాలను అనుసరించడం మంచిదిగా సూచించబడుతుంది. ఈ పద్దతులుఆకలిని అణిచివేయడమే కాకుండా, ఎటువంటి దుష్ప్రభావాలు లేనివిగా మరియు ఆరోగ్యకర జీర్ణవ్యవస్థకు తోడ్పాటుని అందివ్వగాలవని చెప్పబడుతుంది.

1. పీచు అధికంగా వుండే ఆహారాలను తీసుకోండి.

1. పీచు అధికంగా వుండే ఆహారాలను తీసుకోండి.

బీన్స్, బఠానీలు, చిక్పీస్, మరియు పప్పు ధాన్యాలు వంటి ఫైబర్ రిచ్ ఆహార పదార్ధాలను మీ ఆహార ప్రణాళికలోనికి చేర్చుకోవడం ద్వారా, మీ కడుపు 31 శాతం సంపూర్ణతకు లోనవుతుంది. ఫైబర్ అధికంగా ఉన్న ఆహార పదార్ధాలు జీర్ణక్రియలకు తోడ్పాటును అందివ్వడమే కాకుండా, ఎక్కువసేపు ఆకలి కలుగకుండా చూడగలుగుతుంది. అంతేకాకుండా ఆకలి పెంచే హార్మోనులను అదుపులో ఉంచుతుంది. ఫైబర్ అధికంగా ఉండే తృణధాన్యాలు కూడా మీ ఆకలి కోరికలను తగ్గించి, కడుపును నిండునట్లు ఉంచుతాయి.

2. ప్రోటీన్ ఎక్కువ తీసుకోండి.

2. ప్రోటీన్ ఎక్కువ తీసుకోండి.

మీ ఆహారంలో అధిక ప్రోటీన్ జోడించడం మూలంగా మరింత ఎక్కువ సమయం మీకు కడుపునిండిన అనుభూతికి లోనయ్యేలా చూడగలదు. గుడ్లు, మాంసం, సోయా ఉత్పత్తులు, బీన్స్ మరియు బఠానీలు, గ్రీక్ యోగర్ట్ మొదలైన అధిక ప్రోటీన్ ఆధారిత ఆహార పదార్ధాలను మీ ఆహార ప్రణాళికలో జోడించుకోండి.

3. ఆరోగ్యకర కొవ్వులను అధికంగా తినండి.

3. ఆరోగ్యకర కొవ్వులను అధికంగా తినండి.

ఆలివ్ ఆయిల్, అవకాడో, గింజలు మరియు విత్తనాలలో కనిపించే ఆరోగ్యకర కొవ్వులు మీ ఆకలిని సంతృప్తిపరచగలవు మరియు ఎక్కువసేపు మీ కడుపును నిండేలా చూడగలవు. ఎందుకంటే, ఈ ఆరోగ్యకర కొవ్వులను తీసుకోవడం ద్వారా, కొవ్వు కణాల నుంచి లెప్టోన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇది హైపోథాలమస్ హార్మోన్ను అదుపులో ఉంచడం ద్వారా ఆకలిని తగ్గించగలదు. లెప్టిన్ లోపం కూడా, విపరీతమైన ఆకలికి కారణం కాగలదు.

4. ఎటువంటి భోజనానికి ముందైనా నీరు లేదా సూప్ తీసుకోవడం మంచిది.

4. ఎటువంటి భోజనానికి ముందైనా నీరు లేదా సూప్ తీసుకోవడం మంచిది.

ఏదైనా ఆహారం లేదా భోజనం తీసుకోవడానికి ముందు కనీసం ఒక గ్లాసు నీటిని నీటిని తీసుకోవడం మూలాన, కడుపు నిండిన అనుభూతికి లోనుచేయడమే కాకుండా, భోజనం చేసిన తర్వాత కూడా, ఆకలి వేయకుండా అదుపు చేయగలదని ఒక అధ్యయనంలో తేలింది. భోజనానికి ముందు నీటికి బదులుగా సూప్ తీసుకోవడం కూడా, ఆకలి భాదలు తలెత్తకుండా చూడవచ్చునని మరో అధ్యయనంలో తేలింది.

5. భోజనానికి ముందు సలాడ్ తీసుకోండి.

5. భోజనానికి ముందు సలాడ్ తీసుకోండి.

భోజనానికి ముందు తక్కువ క్యాలరీలతో కూడిన సలాడ్ ఏదైనా తీసుకునే అలవాటును కలిగి ఉండడం కూడా మంచి అలవాటుగా సూచించబడుతుంది. మరియు ఈ అలవాటు ఉండేవారికి ప్రధాన భోజనంలో 12 శాతం తక్కువ కాలరీలను కలిగి ఉన్నట్లుగా చెప్పబడుతుంది. అదేవిధంగా తక్కువగా సలాడ్ తీసుకున్న వారు, వారి ప్రధాన భోజనంలో 7 శాతం తక్కువ క్యాలరీలను కలిగి ఉన్నట్లుగా చెప్పబడుతుంది. ఈ సలాడ్లో పాలకూర, క్యారెట్లు, టమోటాలు, దోసకాయలు మరియు సెలరీ వంటి పదార్థాలను జోడించుకోవడం ఉత్తమంగా సూచించబడుతుంది.

6. కాఫీ తాగడం కూడా మంచిదే...

6. కాఫీ తాగడం కూడా మంచిదే...

కాఫీ తీసుకోవడం మూలంగా పెప్టైడ్ yy (PYY) విడుదల పెరుగుతుంది. ఇది ఆకలి హార్మోనులను క్రమబద్దీకరిస్తుంది.,క్రమంగా మీ కడుపును నిండుగా ఉంచడంలో సహాయపడుతుంది. మీరు ఎంత ఆహారం తీసుకోగలరో తెలుసుకోవడానికి ఈ హార్మోన్ ప్రధానపాత్ర పోషిస్తుందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. మీ ఆకలిని తగ్గించడంలో డీకాఫినేటెడ్ కాఫీ అత్యుత్తమంగా పనిచేస్తుందని చెప్పబడింది.

7. సోయా తినండి.

7. సోయా తినండి.

సోయాబీన్స్లో ప్రోటీన్, ఆరోగ్యకర కొవ్వులు మరియు కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఈ పోషకాలన్నీ మీ కడుపును నింపినట్లు ఉంచడంలో ప్రధాన పాత్రను పోషించగలవని చెప్పబడుతుంది. మరియు మీ ఆకలిని నియంత్రణలో ఉంచడానికి ఎక్కువ అవకాశం ఉంది.

8. డార్క్ చాక్లెట్ ముక్క తీసుకోండి.

8. డార్క్ చాక్లెట్ ముక్క తీసుకోండి.

డార్క్ చాక్లెట్ ఆకలిని తగ్గించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఇందులో స్టియరిక్ యాసిడ్ ఉండటం మూలంగా, ఆహార కోరికలను నియంత్రించడంలో సహాయపడవచ్చునని ఒక పరిశోధన తెలియజేస్తుంది. డార్క్ చాక్లెట్లో ఉండే ఈ స్టియరిక్ ఆమ్లం జీర్ణక్రియలను నెమ్మదిస్తుంది. మరియు, సంపూర్ణతా భావాలను మరింత పెంచుతుంది.

9. ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకోండి.

9. ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకోండి.

ఆరోగ్యవంతమైన స్నాక్స్ తీసుకోవడం మూలంగా మీ ఆకలిని నియంత్రించడానికి మరియు భోజనం సమయంలో ఆహారం తక్కువగా తీసుకోడానికి మీకు సహాయం చేస్తుంది. క్యారెట్లు, యాపిల్ మరియు పీనట్ బట్టర్, కాల్చిన టోర్టిలా చిప్స్ మొదలైన స్నాక్స్ ను మీ ఆహార ప్రణాళికలో జోడించుకోండి.

10. తరచుగా అల్లం తినండి.

10. తరచుగా అల్లం తినండి.

అల్లంలో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉంటాయి. వాటిలో ఒకటి, ఆకలిని అణచివేయడం. అల్లం జీర్ణ వ్యవస్థను ఉత్తేజపరిచే ప్రభావాన్ని కలిగి ఉంటుంది, ఇది మీ ఆకలిని తగ్గిస్తుంది మరియు సంపూర్ణతను పెంచుతుంది.

11. ఒత్తిడి స్థాయిలను తగ్గించే ప్రయత్నం చేయండి.

11. ఒత్తిడి స్థాయిలను తగ్గించే ప్రయత్నం చేయండి.

అధిక ఒత్తిడులు కార్టిసాల్ హార్మోన్ను పెంచుతుంది. క్రమంగా ఇది ఆహార కోరికలను పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుందని చెప్పబడుతుంది. అంతేకాకుండా, తర్వాతి కాలంలో ఊబకాయం, హార్మోనుల అసమతుల్యత మరియు జీవక్రియల మీద ప్రతికూల ప్రభావాలకు దారితీస్తుంది. కావున ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయడం ఉత్తమం.

12. భోజనం సమయంలో నెమ్మదిగా తినండి.

12. భోజనం సమయంలో నెమ్మదిగా తినండి.

భోజనం నెమ్మదిగా ఆస్వాదిస్తూ తినాలని పెద్దలు చెబుతుంటారు. ఎందుకంటే మీ మెదడుకు కడుపు నిండింది అన్న సంకేతం అందడానికి కనీసం 20 నిమిషాల సమయం పడుతుంది. నెమ్మదిగా తినడం మూలంగా మెదడుకు, కడుపు నుండి సంకేతాలను సరిగ్గా అందుకోడానికి అవకాశం ఉంటుంది. క్రమంగా మీ కడుపుకు సరిపడినంత మాత్రమే భోజనం చేసేందుకు వెసులుబాటు కల్పిస్తుంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

12 Ways To Control Your Hunger

There are several reasons why you are always hungry. The reasons include not eating enough protein, eating too much refined carbohydrates, not eating healthy high-fat foods, etc. There are different ways to control your hunger which include consuming fibre-rich and protein-rich foods, drinking water before meal, eating healthy fats, etc.
Desktop Bottom Promotion