For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మం లోపల పేరుకు పోయిన అవశేషాలను (స్ప్లింటర్స్) పేడులాంటివి తొలగించుకోవడానికి13 ఉత్తమమమైన చిట్కాలు

స్ప్లింటర్ తొలగించబడిన తర్వాత, ఉపరితల భాగాన్ని తరచుగా శుభ్రం చేస్తున్నారని నిర్ధారించుకోండి. మరియు సంక్రమణలను నివారించేందుకు హైడ్రోజన్ పెరాక్సైడ్ వినియోగించడం ముఖ్యమని గుర్తుంచుకోండి. ప్రభావిత ప్రాంతం

|

స్ప్లింటర్స్, ఇదొక వినూత్న సమస్య. చాలా అరుదుగా ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. ఈ సమస్య తలెత్తినప్పుడు, మీ చర్మంలో చెక్క, మెటల్, కర్భన ఉద్గారాలు లేదా గాజు రేణువులు లేదా ఏవైనా ఇతర చిన్న చిన్న ముక్కలు అనుకోకుండా చర్మ రంధ్రాలలోకి కూరుకుని పోయి, క్రమంగా ఇతర చర్మ వ్యాధులకు దారితీయడం జరుగుతుంటుంది.

ఎక్కువగా ఈ స్ప్లింటర్స్ సులభంగా వచ్చేసినా, కొన్ని సందర్భాలలో లోపలికి కూరుకుని పోయి బాధాకరంగా పరిణమిస్తుంది.

కావున మీ చర్మం నుండి ఈ అవశేషాలను, లేదా పాడైపోయిన చర్మాన్ని తొలగించటం ముఖ్యమైన చర్యగా ఉంటుంది. అదృష్టవశాత్తూ, ఇంట్లోనే ఇటువంటి స్ప్లింటర్స్ తొలగించడానికి సూచించదగిన, సమర్థవంతమైన మరియు నొప్పి లేని గృహ నివారణా చిట్కాలు అందుబాటులో ఉన్నాయి.

వాస్తవానికి మీ చర్మం పెరుగుతున్నప్పుడు (వృద్ధి చెందడం), ఈ చీలికలు సహజంగా తొలగించబడుతాయి. కానీ ఒక్కోసారి, ఇది బాధాకరమైనదిగా మరియు కలత పెట్టేలా తయారవుతుంది. చికిత్స చేయని పక్షంలో, ఈ స్ప్లింటర్స్ ప్రభావిత ప్రాంతాలలో వాపుతో కూడిన సంక్రమణలు తలెత్తడానికి దారితీయవచ్చు. మరియు ఆ ప్రాంతం వాపుతో ఎర్రగా మారడం జరుగుతుంటుంది. అనేక సందర్భాల్లో ఇది రక్త ప్రసరణలోకి ప్రవేశించి, మరింత తీవ్రమైన స్థితిగా రూపాంతరం చెందుతుంటుంది.

స్ప్లింటర్ తొలగించబడిన తర్వాత, ఉపరితల భాగాన్ని తరచుగా శుభ్రం చేస్తున్నారని నిర్ధారించుకోండి. మరియు సంక్రమణలను నివారించేందుకు హైడ్రోజన్ పెరాక్సైడ్ వినియోగించడం ముఖ్యమని గుర్తుంచుకోండి. ప్రభావిత ప్రాంతం పూర్తిగా నయం అయ్యే వరకు ఆ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచండి.

ఇప్పుడు చెప్పబోయే సహజ సిద్దమైన గృహ నివారణల వినియోగంతో, ఆ స్ప్లింటర్స్ నొప్పి నుండి ఉపశమనం పొందగలరు. అంతేకాకుండా, నొప్పితో పాటు సమస్యను కూడా నెమ్మదిగా తొలగించగలిగేవిగా ఉంటాయి.

చర్మం నుండి స్ప్లింటర్స్ తొలగించడం ఎలా ?

సంక్రమణలు లేదా, ఇతర స్ప్లింటర్స్ ఆధారిత సమస్యలను నివారించడానికి, సహజ సిద్దమైన గృహ నివారణా చిట్కాలు ఎంతగానో సహకరిస్తాయి. నేడు, ఈ స్ప్లింటర్స్ సమస్యను నొప్పి లేకుండా తొలగించడానికి సూచించగల కొన్ని గృహ నివారణా చిట్కాలను బోల్డ్ స్కై మీతో పంచుకోబోతుంది. పరిశీలించండి.

చర్మం లోపల పేరుకు పోయిన అవశేషాలను (స్ప్లింటర్స్) తొలగించడానికి సూచించదగిన 13 ఉత్తమమమైన గృహ నివారణా చిట్కాలు :

1. హైడ్రోజన్ పెరాక్సైడ్ :

1. హైడ్రోజన్ పెరాక్సైడ్ :

స్ప్లింటర్ బయటకు కనిపిస్తూ ఉన్న ఎడల, హైడ్రోజన్ పెరాక్సైడ్లో, ఒక శుభ్రమైన కాటన్ బాల్ ముంచి, స్ప్లింటర్ ఉన్న ప్రాంతానికి వర్తించి, కొన్ని నిమిషాలపాటు వేచి చూడండి. క్రమంగా ఎటువంటి కష్టం లేకుండా స్ప్లింటర్ దానికదే తొలగిపోతుంది.

2. డక్ట్ టేప్

2. డక్ట్ టేప్

స్ప్లింటర్ని ఒక డక్ట్ టేప్ ఉపయోగించి అతికించి, ఒక 30 నిమిషాలు అలాగే వదిలివేయండి. నెమ్మదిగా ఈ డక్ట్ టేప్ నకు స్ప్లింటర్ అతుక్కుని, టేప్ తొలగించే సమయంలో స్ప్లింటర్ కూడా వచ్చేస్తుంది.

3. ఉల్లిపాయ లేదా టమోటో

3. ఉల్లిపాయ లేదా టమోటో

స్ప్లింటర్ సమస్యలను నివారించడానికి సూచించదగిన ఉత్తమమైన నొప్పి నివారణలలో ఇది కూడా ఒకటిగా ఉంటుంది. ఒక తాజా ఉల్లిపాయ లేదా టమోటాను ముక్కలుగా చేసి స్ప్లింటర్ మీద సున్నితంగా దరఖాస్తు చేయండి. క్రమంగా స్ప్లింటర్ వెలుపలికి వచ్చే ప్రయత్నం చేస్తుంది. దీనిని చేతితో కాని, ట్వీజర్స్ (ఒకరకమైన పట్టకార వంటిది) ఉపయోగించి గాని తొలగించవచ్చు.

4. వంట సోడా

4. వంట సోడా

బేకింగ్ సోడా (వంట సోడా) లో నీటిని కలిపి, బేకింగ్ సోడా పేస్ట్ తయారు చేయండి. మిశ్రమం మృదువుగా మరియు స్టిక్కీగా అయ్యే వరకు కలపాలి. ఈ మిశ్రమం తయారయ్యాక, దానిని స్ప్లింటర్ భాగంలో వర్తించి, ఏదైనా బ్యాండేజ్ లేదా బాండ్ఎయిడ్తో కప్పి ఉంచి, ఒక రాత్రి పూర్తిగా వదిలివేయండి. ఈ మిశ్రమం, స్ప్లింటర్ను బ్యాండేజ్ కి అంటుకునేలా చేస్తుంది. క్రమంగా బాండేజ్ తీసేటప్పుడు, సులభంగా స్ప్లింటర్ కూడా బయటకు వస్తుంది.

Most Read :ప్రసవం తర్వాత ఆడవారు స్లిమ్ గా మారాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి, లావు కావడానికి కారణం అదేMost Read :ప్రసవం తర్వాత ఆడవారు స్లిమ్ గా మారాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి, లావు కావడానికి కారణం అదే

5. హనీ

5. హనీ

స్ప్లింటర్ మీద కొద్దిగా తేనెను తీసుకుని, సున్నితంగా వర్తించండి. తేనె నెమ్మదిగా స్ప్లింటర్ను బయటకు తీయగలిగే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. తేనె, క్రిమినాశక తత్వాలతో మరియు చికిత్సా లక్షణాలతో కూడుకుని ఉన్నందున సులభంగా తొలగించగలుగుతుంది.

6. బ్రెడ్ అండ్ మిల్క్

6. బ్రెడ్ అండ్ మిల్క్

ఒక చిన్న రొట్టె ముక్కను తీసుకుని దానిమీద కొన్ని చుక్కల పాలను వేయండి, దీనిని స్ప్లింటర్ మీద ఉంచండి. దీనిని ఒక బాండ్-ఎయిడ్ సహాయంతో కప్పి ఉంచండి. రాత్రిపూట పూర్తిగా దాన్ని వదిలివేయండి. నెమ్మదిగా స్ప్లింటర్ బ్రెడ్ భాగానికి అంటుకుంటుంది. క్రమంగా బాండ్-ఎయిడ్ తొలగించునప్పుడు, స్ప్లింటర్ కూడా వచ్చేస్తుంది.

7. ట్వీజింగ్

7. ట్వీజింగ్

చర్మం లోపల చిక్కుకున్న అవశేషాలు, బయటకు కనిపిస్తున్నట్లయితే, టిప్స్ స్టెరిలైజ్ చేసిన ట్వీజర్ వినియోగించి, నెమ్మదిగా స్ప్లింటర్ను సున్నితంగా పట్టి తీయండి. ప్రభావిత ప్రాంతానికి ట్వీజర్ వినియోగించక ముందు స్టెరిలైజ్ చేశారని నిర్ధారించుకోండి. లేనిచో, అది వేరే ఇతర సంక్రమణలకు దారితీయవచ్చు.

8. బంగాళా దుంప

8. బంగాళా దుంప

ముడి బంగాళా దుంప ముక్కను స్ప్లింటర్ మీద ఉంచండి. బంగాళా దుంప తాజా భాగం స్ప్లింటర్ తగిలేలా ఉండాలని నిర్ధారించుకోండి. ముక్కను శాంతముగా క్రిందికి లాగుతున్నట్లుగా నొక్కండి, ఆపై జాగ్రత్తగా బంగాళా దుంప ముక్కను పక్కకు తీయండి. ఈ చర్యలో కణము స్లైస్ మీదకు వస్తే, అది తేలికగా తీసివేయబడుతుంది. ఈ పద్ధతిలో కొంత జాగ్రత్త తప్పనిసరి. ఏమరపాటుగా ఉన్న ఎడల, అది చర్మం లోపలికి వెళ్లిపోయే ప్రమాదం ఉంది.

Most Read :పరగడుపునే బీట్ రూట్ జ్యూస్ తాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలుMost Read :పరగడుపునే బీట్ రూట్ జ్యూస్ తాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు

9. గ్లూ

9. గ్లూ

నొప్పి లేకుండా స్ప్లింటర్ తీసివేసే పద్దతులలో ఇది కూడా ఒకటి. స్ప్లింటర్ బయటకు కనిపిస్తూ ఉన్న ఎడల, దానిపై గ్లూ వేసి, అది పొడిగా మారిన తర్వాత నెమ్మదిగా పీల్ చేసి చూడండి. క్రమంగా స్ప్లింటర్ గ్లూకి అంటుకుని, బయటకు వచ్చేస్తుంది. లేదా పీల్ ఫేస్ మాస్క్ అయినా వినియోగించవచ్చు.

10. గుడ్లు

10. గుడ్లు

ఒక గుడ్డును పగలగొట్టి, గుడ్డు సొనను పక్కకు తొలగించి (వేరుగా భద్రపరచి). తడిగా ఉన్న దాని పెంకు భాగాన్ని స్ప్లింటర్ మీద ఉంచండి. ఇది కూడా పైన చెప్పిన గ్లూ మాదిరిగానే పనిచేసి, స్ప్లింటర్ తొలగించడంలో సహాయం చేస్తుంది. నొప్పి లేకుండా స్ప్లింటర్ తొలగించడంలో ఇది కూడా అద్భుతంగా పనిచేస్తుంది.

11. ఎప్సోమ్ ఉప్పు

11. ఎప్సోమ్ ఉప్పు

గోరు మరియు చర్మం కింద ఏర్పడిన స్ప్లింటర్ చీలికను తొలగించడం ఎలా ? బ్యాండ్-ఎయిడ్ యొక్క అంటుకునే భాగం వైపు చిటికెడు ఎప్సోమ్ ఉప్పును ఉంచండి. బ్యాండ్-ఎయిడ్తో మీ వేలిని మూసివేయండి. ఎప్సోం ఉప్పు, వేలు వాచేలా చేసి, ఉపరితల భాగాన్ని విచ్చిన్నం చేసి, స్ప్లింటర్ బయటకు వచ్చేందుకు సహాయం చేస్తుంది.

12. తెల్ల వెనిగర్

12. తెల్ల వెనిగర్

సుమారు అరగంట పాటు, తెల్ల వెనిగర్లో ప్రభావిత ప్రాంతాన్ని ముంచి ఉంచండి. ఈ చికిత్స ఉపరితలం ద్వారా చీలి, స్ప్లింటర్ బయటకు వచ్చేలా చేస్తుంది, క్రమంగా దీనిని స్టెరిలైజ్ చేసిన ట్వీజర్ లేదా స్క్రేప్ ఉపయోగించి తొలగించవచ్చు.

Most Read :విటమిన్ డీ లోపిస్తే అవన్నీ వీక్ అయిపోతాయి.. ఇలా చేస్తే సరిMost Read :విటమిన్ డీ లోపిస్తే అవన్నీ వీక్ అయిపోతాయి.. ఇలా చేస్తే సరి

13. చార్కోల్ పౌల్టిస్

13. చార్కోల్ పౌల్టిస్

చార్కోల్ ఒక గొప్ప శోషణ తత్వం కలిగిన పదార్ధంగా చెప్పబడుతుంది. ఇది విష కణాలు మరియు వాయువులను గ్రహించి తొలగించగలుగుంది. పౌల్టిస్ అంటే చార్కోల్ నుండి తయారు చేసిన పేస్ట్ వంటి పదార్ధం, దీనిని ఒక కాటన్ వస్త్రంతో తీసుకుని, స్ప్లింటర్ ప్రభావిత ప్రాంతంలో కట్టండి. రాత్రికి పైగా దీనిని అలాగే ఉంచి, ఉదయాన్నే దానిని తొలగించండి. క్రమంగా వాపు మరియు ఎరుపు తత్వం వెళ్ళిపోయి, ఆ భాగంలో స్ప్లింటర్ కనిపిస్తుంది. ఇప్పుడు దీనిని శుభ్రమైన ట్వీజర్ సహాయంతో సులభంగా తొలగించవచ్చు.

ఈ స్ప్లింటర్స్ సులభంగా రాని ఎడల, మరియు పరిస్థితి జఠిలం అవుతున్న పక్షంలో వైద్యుని సంప్రదించడం కూడా అవసరంగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో స్టెరిలైజ్ చేయని పిన్నులు, సూదులతో వాటిని తొలగించే ప్రయత్నాలు చేస్తుంటారు. క్రమంగా అది సెప్టిక్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. మరియు మధుమేహ రోగులు కూడా, ఈ విషయాలలో అత్యంత జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. లేనిచో గోటితో పోయేదానికి గొడ్డలి వరకు వచ్చిన సామెతలా తయారవుతుంది పరిస్థితి. సెప్టిక్ లేదా సంక్రమణలు, ఒక్కోసారి ఆ ప్రాంతాన్నే తొలగించవలసిన పరిస్థితికి దారితీస్తాయి. కావున, సులభంగా ఏమాత్రం అనిపించకపోయినా వెంటనే వైద్యుని సంప్రదించడం ముఖ్యం. చర్మంలో ఇరుక్కున్న స్ప్లింటర్లు కూడా ఒక్కోసారి శుభ్రమైనవి కాజాలవు. క్రమంగా బాక్టీరియా రక్తప్రసరణలోనికి చేరి వేరే సమస్యలకు దారితీయవచ్చు. కావున, అవసరం మరియు పరిస్థితి తీవ్రత దృష్ట్యా యాంటీ బయాటిక్స్ కూడా వినియోగించవలసిన పరిస్థితి ఉంటుంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

13 Painless Home Remedies To Remove Small Trapped Particles Inside Skin

13 Painless Home Remedies To Remove Small Trapped Particles Inside Skin (Splinters)
Desktop Bottom Promotion