For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమ్మాయిల ఎత్తును బట్టి వారికొచ్చే వ్యాధులు చెప్పొచ్చు, ఎంత మేరకు ఆరోగ్యంగా ఉంటారో తెలుసుకోవొచ్చు

|

ఏ అమ్మాయి కాస్త బొద్దుగా ఉంటే ఆమె కొన్ని రకాల వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని మనం హెచ్చరిస్తుంటాం. బాగా లావు అయిపోతున్నావు ఫ్యాట్ పెరిగిపోతుంది జాగ్రత్త అని అంటాం. లావుగా ఉన్న వారు మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు బారిన పడతారని అంటూ ఉంటాం. అయితే కేవలం లావుగా ఉండడమే కాదు ఎత్తును బట్టి కూడా ఏయే వ్యాధుల బారిన పడతారో చెప్పొచ్చు.

మీ ఎత్తును బట్టి క్యాన్సర్, డిమెన్షియా , గుండె సంబంధిత వ్యాధుల బారిన పడతారో లేదో చెప్పొచ్చు.

 1)క్యాన్సర్ల బారిన
 

1)క్యాన్సర్ల బారిన

"మెలనోమా, థైరాయిడ్, మూత్రపిండాలు, రొమ్ము, పెద్దపేగు, పురీషనాళ సంబంధిత క్యాన్సర్లు ముఖ్యంగా మీ ఎత్తుని బట్టి వస్తుంటాయి. " అని న్యూయార్క్ లోని ఆల్బర్ట్ ఐన్ స్టీన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన సీనియర్ ఎపిడమియోలజిస్ట్ జిఫ్రీ కబాట్ చెప్పారు. ఎవరైతే 5'10 ఐదు అడుగుల పది ఇంచుల ఎత్తు ఉంటారో అలాంటి మహిళల్లో 30 నుంచి 40శాతం మంది ఇలాంటి క్యాన్సర్ల బారిన పడుతున్నారని కొన్ని పరిశోధనల్లో తేలింది. 5'2 ఎత్తు ఉన్న మహిళ్లలో ఈ వ్యాధుల బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుంది.

" ఎక్కువగా హైట్ ఉండే మహిళల అవయవాలు కూడా పెద్దగా ఉంటాయి. అలాగే ఎక్కువ కణాలను కలిగి ఉంటారు. కాబట్టి అలాంటి వారు ఎక్కువగా క్యాన్సర్ బారినపడే అవకాశం ఉంది. " అని కబాట్ వివరించారు.

2) రక్తం గడ్డకట్టడం తగ్గుతుంది

2) రక్తం గడ్డకట్టడం తగ్గుతుంది

మీ ఎత్తు 5'2 ఐదు అడుగుల రెండు ఇంచులు లేదా అంతకంటే తక్కువగా ఉంటే మీరు రక్తం గడ్డకట్టడం అనే సమస్యకు దూరంగా ఉండొచ్చు.

నార్వేలో ట్రామ్సో విశ్వవిద్యాలయం వారు నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం తక్కువ ఎత్తు ఉండే మహిళల్లో రక్తం గడ్డకట్టడం అనే సమస్య ఇతరులతో పోల్చుకుంటే మూడు రెట్లు తక్కువగా ఉంటుందని తేలింది.

3) 90 ఏళ్లోనూ బలంగా ఉంటారు

3) 90 ఏళ్లోనూ బలంగా ఉంటారు

ఆల్బర్ట్ ఐన్స్టీన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్లో పరిశోధన ప్రకారం తక్కువ పొడువు ఉంటే వారు ఎక్కువగా కాలం బతుకుతారని కాస్త వయస్సు పైబడినా కూడా బలంగా ఉంటారని తేలింది. జీన్ మ్యుటేషన్ ఇన్సులిన్ అనేది పొట్టిగా ఉండే వాళ్లలో ఎక్కువగా ఉంటుంది. ఇది కాస్త ఆయుష్షు పెరిగేలా చేస్తుంది.

4) గుండె సంబంధిత వ్యాధులు రావు
 

4) గుండె సంబంధిత వ్యాధులు రావు

న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురించిన ఒక బ్రిటన్ అధ్యయనం ప్రకారం 5'8 ఐదు అడుగుల ఎనిమిది ఇంచులున్న మహిళలు

28 శాతం ఎక్కువగా గుండె సంబంధిత వ్యాధుల బారినపడుతున్నారట.

5'3 ఐదు అడుగుల మూడు ఇంచులు లేదంటే అంతకంటే తక్కువ హైట్ ఉన్న వారు ఇలాంటి వ్యాధుల బారిన తక్కువగా పడుతున్నారు.

ఇక పొడవుగా ఉండేవారు ఇష్టానుసారంగా జంక్ ఫుడ్ తిన్నా, పొగ తాగినా వ్యాధుల బారినపడే అవకాశం ఉందని డానియల్ అనే నష్విల్లెలో వాండర్బిల్ట్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ కార్డియాలజిస్ట్ చెప్పారు.

Most Read : రోజూ సెక్స్ లో పాల్గొంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు, మగవారికి సుఖంతో పాటు మంచి లాభాలున్నాయి,

5) మైండ్ బాగా పని చేస్తుంది

5) మైండ్ బాగా పని చేస్తుంది

ఎడిన్బర్గ్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ యూనివర్సిటీ చేపట్టిన పరోశోధన ప్రకారం

5'7 ఐదు అడుగుల ఏడు ఇంచుల మహిళ 5'1 గా ఐదు అడుగుల ఇంచు మహిళలతో పోల్చితే 50% ఎక్కువగా వ్యాధుల బారినపడతారు. వీళ్లు చిన్నప్పటి నుంచి అనారోగ్యాల బారినపడడం, ఒత్తిడికి లోనుకావడం, పోషకాలు తక్కువగా ఉండడం వల్ల ఇలాంటి వ్యాధుల బారినపడే అవకాశం ఉంది.

6) గర్భస్రావం, పిల్లలు పుట్టడం కష్టం

6) గర్భస్రావం, పిల్లలు పుట్టడం కష్టం

5'6 ఐదు అడుగుల ఆరు ఇంచులున్న మహిళలు 5 అడుగుల 2 ఇంచుల హైట్ ఉన్న వారితో పోల్చితే ఎక్కువగా గర్భాశయ సమస్యలతో ఇబ్బందిపడుతుంటారు. పొడవు తక్కువగా ఉండే మహిళలు ఈ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోరు. థాయిలాండ్ లో నిర్వహించిన ఒక అధ్యయనం 5'1 లేదా అంతకంటే కాస్త పొడవైన ఆడవారు గర్భాలకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఎదుర్కోవడం లేదని తేలింది. థాయ్ మహిళలంతా కూడా పొట్టివారు కావడం వల్ల వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు రావడం లేదు.

English summary

6 Things a Woman Height Tells About Her Health

We all know how important it is for us to keep an eye on our health, especially waistlines because of the risk of ailments like, diabetes and heart disease, but it's not the only measurement that matters. Your height too can indicate a wealth of information about your risk of conditions, from cancer through to dementia and heart disease.Small comfort for all the short and tall women out there: There isn't a perfect height for your health
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more