For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బద్దకోణాసనం వేస్తే కచ్చితంగా సుఖ ప్రసవం, మగవారికి ఆ సమస్య రాదు

ఫస్ట్ మీరు ఒక మ్యాట్ లేదంటే గుడ్డను నేలపై పరుచుకోండి. దానిపై రెండు కాళ్లను చాపి, మీ వెన్నెముకను బాగా నిటారుగా ఉండేటటువంటి స్థితిలో కూర్చొవాలి. ఇక మీ రెండు అర చేతుల్ని కూడా రెండు తొడలపై ఉంచుకోండి.

|

యోగాలో చాలా రకాల ఆసనాలుంటాయి. అందులో కొన్ని ఆసనాల ద్వారా మంచి ప్రయోజనాలుంటాయి. అలాంటి ఆసనమే బద్ధ కోణ ఆసనం. దీన్నే ఇంగ్లిష్ లో బటర్ ఫ్లై ఆసనం అంటారు. అలాగే జాను భూతాడ ఆసనం అని అంటారు. ఈ ఆసనంలో ముఖ్యంగా రెండు మోకాళ్లను నేలకు దగ్గరగా ఉంచాల్సి ఉంటుంది. ఈ ఆసనం వేస్తే సేమ్ బటర్ ఫ్లై మాదిరిగా ఉంటారు. దీన్ని ఈ విధంగా చేయాలి.

రెండు కాళ్లను చాపి

రెండు కాళ్లను చాపి

ఫస్ట్ మీరు ఒక మ్యాట్ లేదంటే గుడ్డను నేలపై పరుచుకోండి. దానిపై రెండు కాళ్లను చాపి, మీ వెన్నెముకను బాగా నిటారుగా ఉండేటటువంటి స్థితిలో కూర్చొవాలి. ఇక మీ రెండు అర చేతుల్ని కూడా రెండు తొడలపై ఉంచుకోండి. ఆ తర్వాత మీరు మీ రెండు కాళ్లను మోకాళ్ల వద్ద కాస్త మడిచి, రెండు అరికాళ్లు ఒకదానికొకటి తాకేలా చేస్తూ రెండు చేతుల్ని మోకాళ్లపై ఉంచుకునేలా చూసుకోండి.

జాయింట్ చేసినట్లుగా ఉంచుకుని

జాయింట్ చేసినట్లుగా ఉంచుకుని

ఇక మీ చేతి వేళ్లను ఒకదానికికొటి జాయింట్ చేసినట్లుగా ఉంచుకుని పాదాలను రెండింటిని కలిపి వాటిని పట్టుకొని దగ్గరకు తీసుకురావడానికి ట్రై చేయండి. అయితే మీ వెన్నెముక మాత్రం నిటారుగా ఉండేలా చూసుకోండి. మీ మోకాళ్లు నేలకు దగ్గరగా ఉండేలా చూసుకోవాలి. శ్వాసన నెమ్మదిగా తీసుకుంటూ వదిలేయాలి. అలా కొద్దిసేపు ఆసనంలో ఉండండి.

 ప్రెగ్నెంట్స్ కు

ప్రెగ్నెంట్స్ కు

బద్ధ కోణ ఆసనం వేస్తే చాలా లాభాలున్నాయి. ముఖ్యంగా ప్రెగ్నెంట్స్ కు ఈ యోగా ఆసనం బాగా ఉపయోగపడుతుంది. ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి 9 వ నెల వరకు బద్ధ కోణ ఆసనం వేయొచ్చు. ఈ ఆసనం వేస్తే దాదాపుగా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలున్నాయి.

Most Read :రోజూ హస్త ప్రయోగం చేసుకుని వీర్యాన్ని స్కలిస్తే వచ్చే ప్రయోజనాలు తెలుసా? బోలెడన్నీ ఉన్నాయిMost Read :రోజూ హస్త ప్రయోగం చేసుకుని వీర్యాన్ని స్కలిస్తే వచ్చే ప్రయోజనాలు తెలుసా? బోలెడన్నీ ఉన్నాయి

సుఖ ప్రసవం

సుఖ ప్రసవం

ఈ ఆసనం ఆడవారు రెగ్యులర్ గా వేస్తే నెలసరి సమస్యలు పోతాయి. అలాగే పురుషుకు ఈ ఆసనం ద్వారా చాలా ప్రయోజనాలున్నాయి. మగవారిలో హెర్నియా రాకుండా చేయగలదు. అలాగే మోకాళ్ల నొప్పులతో ఇబ్బందిపడే వారు కూడా ఉపశమనం పొందుతారు. అయితే ఎక్కువగా మోకాళ్ల నొప్పులుండేవారు ఈ ఆసనం వేయకూడదు. గర్భిణీలకు సుఖ ప్రసవం కావాలంటే ఈ ఆసనం చాలా ఉపయోగపడుతుంది.

English summary

Baddha Konasana During Pregnancy

Baddha Konasana is the Cobbler Pose. It is also called the Butterfly Pose as the open hips joined by the feet and the up.
Desktop Bottom Promotion