For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆపిల్ సైడర్ వెనిగర్ వల్ల 7 ఫ్యాసినేటింగ్ హెల్త్ బెనిఫిట్స్

|

ఆపిల్ సైడర్ వెనిగర్ను, సైడర్ వెనిగర్ అని కూడా పిలుస్తారు. దీనిని సైడర్ లేదా ఆపిల్ నుండి తయారు చేయడం జరుగుతుంది. ఆపిల్స్ పులియబెట్టి, కొంత విస్త్రృతమైన ప్రక్రియలను అనుసరించడం ద్వారా, వెలికితీసే ఉత్పాదనగా ఈ ఆపిల్ సైడర్ వెనిగర్ ఉంటుంది. ఈ ప్రక్రియలో మాష్ చేసిన తాజా యాపిల్స్ ఈస్ట్ కు బహిర్గతమవడం జరుగుతుంది. క్రమంగా కిణ్వ ప్రక్రియ ప్రారంభమవుతుంది. పులియబెట్టిన తరువాత ఇందులోని చక్కెరలు ఆల్కహాల్ గా మారుతాయి, ఇది బ్యాక్టీరియాతో జోడించబడి, కిణ్వ ప్రక్రియకు సహాయపడుతుంది. చివరికి ఎసిటిక్ ఆమ్లంగా మారి, సైడర్ వెనిగర్ గా రూపాంతరం చెందుతుంది .

ఆపిల్ సైడర్ వెనిగర్ వల్ల 7 ఫ్యాసినేటింగ్ హెల్త్ బెనిఫిట్స్

ఆపిల్ సైడర్ వెనిగర్ రక్తంలోని చక్కర నిల్వలను క్రమబద్దీకరించడానికి సహాయపడుతుంది. బరువు తగ్గడం, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం, శరీరంలోని విషతుల్య రసాయనాలను తొలగించడంలో సహాయపడటం వంటి చర్యలతో పాటుగా, చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. వీటితో పాటు, అధిక రక్తపోటు నుండి ఉపశమనాన్ని అందివ్వడం ద్వారా, మీ జీవక్రియలను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ను సేవించినప్పుడు, బర్నింగ్ సెన్షేషన్ నివారించడం కోసంగా మీరు సైడర్ వెనిగర్ తోపాటుగా నీటిని జోడించి ఉన్నారని నిర్ధారించుకోండి.

గమనిక : ఎట్టి పరిస్థితులలో నీటితో కలిపే ఈ ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవలసి ఉంటుందని, సూచించడమైనది.

పోషకాలు సమృద్ధిగా ఉండే యాపిల్ సైడర్ వెనిగర్ను సలాడ్స్, చట్నీలు, ఫుడ్ ప్రిజర్వేటివ్, మారినేడ్స్ వంటి వాటిలో వినియోగించడం జరుగుతుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ యొక్క మరిన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించిన వివరాల కోసం, వ్యాసంలో ముందుకు సాగండి.

ఆపిల్ సైడర్ వెనిగర్లోని పోషక విలువలు :

100 గ్రాముల వెనిగర్లో 0.93 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 0.40 గ్రాముల చక్కెరలు, 0.20 మిల్లీగ్రాముల ఇనుము, మరియు 0.04 మిలీగ్రాముల జింక్ ఉన్నాయి.

అంతేకాకుండా, మిగిలిన పోషకాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి :

• 93.81 గ్రాముల నీరు

• 7 మిల్లీగ్రాముల కాల్షియం

• 5 మిల్లీగ్రాముల మెగ్నీషియం

• 8 మిల్లీగ్రాముల భాస్వరం

• 73 మిల్లీగ్రాముల పొటాషియం

• 5 మిల్లీగ్రాముల సోడియం

ఆపిల్ సైడర్ వెనిగర్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు :

మీ రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడం దగ్గర నుండి జీర్ణాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరచే వరకు, ఆపిల్ సైడర్ వెనిగర్ యొక్క ప్రయోజనాలు సమృద్ధిగా ఉన్నాయి.

ఆపిల్ సైడర్ వెనిగర్ వల్ల 7 ఫ్యాసినేటింగ్ హెల్త్ బెనిఫిట్స్

1. బరువు తగ్గడంలో సహాయపడుతుంది :

ఆపిల్ సైడర్ వెనిగర్ మీ శరీరంలో ఉన్న అదనపు కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా మీ ఆకలిని అణచివేయడంలో ప్రభావవంతంగా ఉంటుంది. వెనిగర్లో ఉండే పెక్టిన్, కణజాలాలను బంధిస్తుంది మరియు శరీరం నుండి అదనపు కొవ్వులను తొలగిస్తుంది. అనవసరమైన కేలరీలను కరిగించడం ద్వారా, మీ జీవక్రియలు కూడా మెరుగుపడుతాయి. ఫలితంగా శరీరం పనితీరు మెరుగుపడుతుంది.

2. రక్తంలోని చక్కెర స్థాయిలను నిర్వహిస్తుంది :

ఆపిల్ సైడర్ వెనిగర్లో ఉండే డైటరీ ఫైబర్ నిక్షేపాలు, రక్తంలోని గ్లూకోజ్ హెచ్చుతగ్గులను నియంత్రించడానికి సహాయపడుతుంది. అదేవిధంగా టైప్ 2 డయాబెటిస్తో బాధపడే వారిలో ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం, రెండు టేబుల్ స్పూన్ల డైల్యూటెడ్ ఆపిల్ సైడర్ వెనిగర్ రక్తంలోని చక్కర స్థాయిలను తగ్గించడంలో అద్భుతంగా సహాయపడగలదు.

3. యాసిడ్ రిఫ్లెక్షన్ సమస్యను నివారిస్తుంది :

ఆపిల్ సైడర్ వెనిగర్ చాలాకాలం నుండి, ఆసిడ్ రిఫ్లెక్షన్ సమస్యకు ఒక మంచి ఉపాయంగా చెప్పబడుతుంది. క్రమంగా చాతీ మంట మరియు వికారం వంటి ఆసిడ్ రిఫ్లెక్షన్ లక్షణాల చికిత్సలో అద్భుతంగా సహాయపడుతుందని చెప్పబడుతుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్ వల్ల 7 ఫ్యాసినేటింగ్ హెల్త్ బెనిఫిట్స్

4. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది :

ఆపిల్ సైడర్ వెనిగర్లో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ తో పాటు అసిడిక్ ఆమ్లం ఉన్న కారణంగా, కొలెస్ట్రాల్ నిర్వహణలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రెండు సమ్మేళనాలు, LDL (చెడు) కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి మరియు HDL (మంచి) కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచటానికి సహాయపడతాయి.

5. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది :

పైన చెప్పినట్లుగా, ఆపిల్ సైడర్ వెనిగర్ కొలెస్ట్రాల్ నిర్వహించడానికి లాభదాయకంగా ఉంటుంది, ఇది నేరుగా గుండె ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. అంటే చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ను పెంచడం ద్వారా వెనిగర్ మీ హృదయ వ్యవస్థను సంరక్షించగలదని చెప్పబడింది.

6. జీవక్రియలను మెరుగుపరుస్తుంది :

ఆపిల్ సైడర్ వెనిగర్ మీ జీవక్రియలను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది. డైల్యూటెడ్ ఆపిల్ సైడర్ వెనిగర్ను, తరచుగా వినియోగించడం ద్వారా, మిమ్ములను అధికంగా ఆహారం తీసుకోకుండా నివారించగలుగుతుంది, మరియు మీ జీవక్రియలు అధికస్థాయిలో పనిచేయకుండా చూడగలుగుతుంది. క్రమంగా జీవక్రియలు మెరుగుపడుతాయి.

7. ఆరోగ్యకర పిహెచ్ స్థాయిలు :

ఆపిల్ సైడర్ వెనిగర్ను క్రమంతప్పకుండా తీసుకోవడం మూలంగా, ఆక్సిడేషన్ ప్రక్రియ సమయంలో రక్తాన్ని శుభ్రపరిచి., ఎసిడిటి మూలాన కలిగే దుష్ప్రభావాలు, మీ శరీరాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసేలా చేస్తాయి. తద్వారా ఆరోగ్యవంతమైన పిహెచ్ లెవల్ని నిర్వహించేందుకు ఆస్కారం ఉంటుంది.

ఆరోగ్యకర ఆపిల్ సైడర్ వెనిగర్ రెసిపీలు :

1. క్లాసిక్ లెమన్ వాటర్ డిటాక్స్ డ్రింక్ :

కావలసిన పదార్ధాలు :

• 1 కప్పు నీరు

• 1 టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్

• 1 టేబుల్ స్పూన్ తాజా నిమ్మ రసం

• 1/2 టీస్పూన్ దాల్చిన చెక్క

• 1 చిటికెడు కాయెన్నె పెప్పర్ (ఐచ్ఛికం)

• తేనె (ఐచ్ఛికం)

తయారుచేయు విధానం :

• ఒక గ్లాసులో అన్ని పదార్థాలను కలపండి.

• రుచి కోసం తేనెను జోడించండి.

2. చిక్పీ వాల్డోర్ఫ్ సలాడ్ :

కావలసిన పదార్ధాలు :

• 2 టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్

• 1 టీస్పూన్ ఆవాలు

• 1 టీస్పూన్ తేనె

• 1/2 టీస్పూన్ ఫైన్-సీ సాల్ట్

• 1/2 టీస్పూన్ పొడిచేసిన ఎర్ర మిరియాల రేకులు

• 1/4 టీస్పూన్ ఫ్రెష్ గ్రౌండ్ బ్లాక్ పెప్పర్

• కాన్ (14-ఔన్స్ల) శెనగలు (నానబెట్టి, శుభ్రపరచిన)

• సెలరీ ఆకుకాడలు, సన్నగా తరిగినవి

• 1 మీడియం ఆపిల్, ¼ అంగుళాల ముక్కలుగా తరగాలి

• 1 కప్పు ఎండు ద్రాక్ష

• 1/2 కప్ డ్రైడ్ రెడ్ ఆనియన్

• 1/4 కప్పు తరిగిన పార్స్లీ

• 1/2 కప్పు వాల్ నట్స్ (పొడి చేయండి)

• కప్పుల తాజా పాలకూర

అనుసరించు విధానం :

• ఒక గిన్నెలో ఆపిల్ సైడర్ వెనిగర్, ఆవాలు, తేనె, ఉప్పు, మాష్ చేసిన ఎర్ర మిరియాల రేకులు, మిరియాలపొడి కలిపి డ్రెస్సింగ్ సిద్ధం చేసుకోవాలి.

• అన్ని బాగుగా కలిసే వరకు కలియబెడుతూ ఉండాలి.

• శెనగలు, సెలరీ, ఆపిల్, ద్రాక్ష, ఉల్లిపాయ, పార్స్లీ, మరియు వాల్ నట్ పొడిని ఒక గిన్నెలో తీసుకుని మిక్స్ చేయాలి.

• డ్రెసింగ్లో బాగా కోటింగ్ అయ్యేంత వరకు టాస్ వేసి తిప్పండి.

• సర్వ్ చేయడానికి ముందు సుమారు 30 నిమిషాలపాటు రిఫ్రిజిరేట్లో ఉంచండి.

ఆపిల్ సైడర్ వెనిగర్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ :

• అతిగా సేవించడం మూలంగా గ్యాస్ట్రోపెరెసిస్ లక్షణాలు మరింతగా క్షీణిస్తాయి.

• ఇది ఆకలిని పూర్తిగా తగ్గించడంతో పాటు, కడుపు నిండినట్లుగా చేస్తుంది.

• ఇది పంటి ఎనామిల్ కోసుకుపోవడానికి కూడా కారణం కావచ్చు.

• డైల్యూటింగ్ చేయకుండా (నీటిని జోడించకుండా) తీసుకున్నప్పుడు, ఇది గొంతు మంటకు కారణంగా మారవచ్చు.

• ఇది మధుమేహం ఔషధాలు మరియు కిడ్నీ సంబంధిత ఔషధాలతో కలిసే అవకాశాలు ఉన్నాయి.

గమనిక : ఆపిల్ సైడర్ వెనిగర్ను అతిగా తీసుకుంటున్న పక్షంలో మాత్రమే పై దుష్ప్రభావాలు వర్తిస్తాయి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, మాతృత్వ, శిశు సంక్షేమ, జీవన శైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

7 Fascinating Health Benefits Of Apple Cider Vinegar

Apple cider vinegar, also known as cider vinegar is made from cider or apple must. The apples are fermented and passed through an extensive process to develop the final product
Desktop Bottom Promotion