For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వ్యాధులన్నింటినీ నయం చేయగల తిప్పతీగ, ఆయుర్వేద ఔషధ గని తిప్పతీగ

సీజనల్ వ్యాధులు విష జ్వరాలైన డెంగ్యూ, స్వైన్ ఫ్లూ మలేరియా వంటి వాటిని పూర్తిగా నివారించగల శక్తి తిప్పతీగకు ఉంటుంది.  జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుందిఅజీర్తి సమస్యతో బాధపడుతున్న వారు తిప్పతీగతో తయార

|

తిప్పతీగను ఆయర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీన్ని గిలోయ్ (టినోస్పోరా కార్డిఫోలియా) అంటారు. మనదేశంలో ఆయుర్వేదానికి సంబంధించిన చాలా మందులకు తిప్ప తీగను ఉయోగిస్తారు.

మనదేశంలో దీన్ని చాలా ఏళ్ల తరబడి దీన్ని ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారని ఢిల్లీకి చెందిన పౌష్టికాహార నిపుణుడు అన్షుల్ జైహరాత్ చెప్పారు. సంస్కృతంలో దీన్ని "అమృతా" అని కూడా అంటారు.

ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు

ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు

తిప్పతీగతో పాటు దాన్ని కాండాన్ని ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. ఎఫ్ డీఏ (ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) కూడా తిప్పతీగను ధ్రువీకరించింది. తిప్పతీగను ఉపయోగించి జ్యూస్, పౌడర్, కాప్సూల్స్ తయారు చేస్తారు. ఇవన్నీ కూడా కొన్ని రకాల వ్యాధులను నయం చేయడానికి బాగా ఉపయోగపడతాయి.

తిప్పతీగ ద్వారా కలిగే 10 ప్రయోజనాలు

రోగనిరోధక శక్తి పెరుగుతుంది

రోగనిరోధక శక్తి పెరుగుతుంది

తిప్పతీగతో తయారు చేసిన మందులను, పదార్థాలను తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తిప్పతీగలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడగలవు. అలాగే మీ శరరీంలోని కణాలు దెబ్బతినకుండా ఉండేందుకు వ్యాధుల బారినపడకుండా ఉండేందుకు తిప్పతీగ బాగా పని చేస్తుంది.

బ్యాక్టీరియాతో పోరాడ గల గుణాలు

బ్యాక్టీరియాతో పోరాడ గల గుణాలు

రక్తాన్ని శుభ్రపరిచే గుణాలు తిప్పతీగలో ఉంటాయి. పలు రకాల వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడగల గుణాలు తిప్పతీగలో ఉంటాయి. కాలేయ సంబంధిత వ్యాధుల బారిన పకుండా చేయగలదు. కొందరు ప్రత్యేక నిపుణులు తిప్పతీగతో హృదయ సంబంధిత వ్యాధుల బారినపడకుండా మందులు తయారు చేస్తారు.

కొన్ని రకాల విష జ్వరాలను నివారించగలదు

కొన్ని రకాల విష జ్వరాలను నివారించగలదు

సీజనల్ వ్యాధులు విష జ్వరాలైన డెంగ్యూ, స్వైన్ ఫ్లూ మలేరియా వంటి వాటిని పూర్తిగా నివారించగల శక్తి తిప్పతీగకు ఉంటుంది.

జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది

జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది

అజీర్తి సమస్యతో బాధపడుతున్న వారు తిప్పతీగతో తయారు చేసిన మందుల్ని వాడితే మంచిది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచేగల శక్తి తిప్పతీగకు ఉంటుంది. కాస్త తిప్పతీగ పొడిని కాస్త బెల్లంలో కలుపుకుని తింటే చాలు అజీర్తి సమస్య పోతుంది.

Most Read :పురుషాంగం క్యాన్సర్ గురించి తెలుసా? అంగాన్ని అలా ఉంచుకోకండి, ఆ విషయంలో చాలా జాగ్రత్త అవసరంMost Read :పురుషాంగం క్యాన్సర్ గురించి తెలుసా? అంగాన్ని అలా ఉంచుకోకండి, ఆ విషయంలో చాలా జాగ్రత్త అవసరం

మధుమేహానికి బాగా ఉపయోగపడుతుంది

మధుమేహానికి బాగా ఉపయోగపడుతుంది

తిప్పతీగ హైపోగ్లైకేమిక్ ఏజెంట్ గా పని చేస్తుంది. తిప్పతీగలో మధుమేహాన్ని నివారించే గుణాలున్నాయి. ముఖ్యంగా టైప్ 2 మధుమేహం తగ్గేందుకు ఇది ఉపయోగపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించగలదు.

ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది

ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది

మీరు నిత్యం ఒత్తిడి, ఆందోళనతో ఇబ్బందిపడుతుంటే తిప్పతీగతో తయారు చేసిన మందుల్ని ఉపయోగించడం మంచిది. ఇది మీ మానసిక ఒత్తిడిని, ఆందోళన తగ్గించగలదు. మీ జ్ఞాపకశక్తి పెంచగలదు.

శ్వాస సంబంధిత సమస్యల్ని పోగొడుతుంది

శ్వాస సంబంధిత సమస్యల్ని పోగొడుతుంది

తిప్పతీగలో యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారికి తిప్పతీగ మందులు బాగా పని చేస్తాయి. దగ్గు, జబలుబు, టాన్సిల్స్ వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించగల గుణాలు తిప్పతీగలో ఉన్నాయి.

ఆర్థరైటిస్

ఆర్థరైటిస్

ఆర్థరైటిస్ తో బాధపడేవారు తిప్పతీగను ఉపయోగిస్తే చాలా మంచిది. కీళ్లవ్యాధులను తగ్గించే గుణాలు తిప్పతీగలో చాలా ఉన్నాయి. తిప్పతీగ పొడిని కాస్త వేడి పాలలో కలుపుకుని తాగితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యల బారి నుంచి బయటపడొచ్చు. ఆ పాలలో కాస్త అల్లం కలుపుకుని కూడా తాగొచ్చు.

Most Read :మధుమేహం, షుగర్ ను చిటికెలో తగ్గించే ఇన్సులిన్ మొక్క ఆకులు, రోజుకు ఒక్క ఆకు తింటే చాలుMost Read :మధుమేహం, షుగర్ ను చిటికెలో తగ్గించే ఇన్సులిన్ మొక్క ఆకులు, రోజుకు ఒక్క ఆకు తింటే చాలు

కంటిచూపును మెరుగుపరుస్తుంది

కంటిచూపును మెరుగుపరుస్తుంది

కంటిచూపును మెరుగుపరిచే గుణాలు తిప్పతీగలో ఉన్నాయి. తిప్పతీగ పొడిని చల్లటి నీళ్లలో కలుపుకోండి. ఆ నీటిని ఐలిడ్స్ పై పోసుకోండి. ఇలా చేయడం వల్ల కంటిచూపు మెరుగవుతుంది.

వృద్ధాప్య ఛాయలు రాకుండా చేయగలదు

వృద్ధాప్య ఛాయలు రాకుండా చేయగలదు

తిప్పతీగ వృద్ధాప్య ఛాయలు రాకుండా చేయగలదు. అలాగే ముఖంపై మచ్చలు, మొటిమలు రాకుండా, ముడతలు ఏర్పడకుండా చేయగల ప్రత్యేక గుణాలు తిప్పతీగలో ఉంటాయి.

గమనిక: గర్భిణీలు, చిన్నపిల్లల తల్లులు తిప్పతీగతో తయారు చేసిన మందులను అస్సలు వాడొద్దు.

English summary

10 Amazing Benefits of Giloy

10 amazing benefits of giloy the ayurvedic root of immortality
Desktop Bottom Promotion