For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాలేయంలో కొవ్వు పెరిగిపోతే ఎలా, ఫ్యాటీ లివర్ తో వచ్చే ప్రాబ్లమ్స్ ఏమిటి, మద్యపానంతోనే ఎక్కువ

అంతేకాదు బక్కగా ఉన్నవారు కూడా కొన్ని సందర్భాల్లో ఫ్యాటీ లివర్ బారిన పడుతుంటారు. అయితే లివర్ లో కొవ్వు పెరిగిపోయిందనే విషయాన్ని మనం అంత తేలికగా గుర్తించలేము. ఇలా గుర్తించొచ్చుకడుపులో రైట్ సైడ్ నొప్

|

మన శరీరంలో కాలేయం పని తీరుకు చాలా ప్రాముఖ్యం ఉంది. శ‌రీరంలో ఉన్న వ్య‌ర్థాలన్నింటినీ బయటకు పంపడంలో లివర్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఒక్కోసారి కాలేయంలో కొవ్వు శాతం కాస్త పెరుగుతుంది. దీన్ని ఫ్యాటీ లివర్‌ అంటారు. మనం రోజూ తీసుకునే ఆహారాన్ని కాలేయం ప్రోటీన్ గా మార్చుతుంది.

మన బాడీలో లివర్ రెండో పెద్ద ఆర్గాన్. మనం తీసుకునే ఫుడ్ లో ఏవైనా హాని కారకాలు ఉంటే వాటిని తొలగిస్తుంది లివర్. లివర్ కొంత మేర కొవ్వుతో కూడుకుని ఉంటుంది.

కొవ్వు అలా పెరుగుతుంది

కొవ్వు అలా పెరుగుతుంది

అయితే బాడీలోని కొన్ని అవయవాల నుంచి కూడా కాలేయానికి కొవ్వు వెళ్తూ ఉంటుంది. దీంతో కాలేయంలో కొవ్వు శాతం పెరిగిపోతుంది. లివర్ ఫ్యాటీ లివర్ గా మారితే చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుంది. కొవ్వు పెరిగేకొద్ది కాలేయం సక్రమంగా పని చేయలేదు.

మద్యపానం చేస్తే

మద్యపానం చేస్తే

ఇక మద్యపానం ఎక్కువగా చేసేవారు ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ బారిన పడతారు. అలాగే ఇంకొందరు మద్యపానం అలవాటు లేకపోయినా కూడా ఫ్యాటీ లివర్ బారిన పడతారు. సాధారణంగా ఫ్యాట్ ఎక్కువగా ఉండడం, షుగర్ తో బాధపడేవారు ఇలాంటి వ్యాధుల బారిన పడుతుంటారు.

బక్కగా ఉన్నా కూడా

బక్కగా ఉన్నా కూడా

అంతేకాదు బక్కగా ఉన్నవారు కూడా కొన్ని సందర్భాల్లో ఫ్యాటీ లివర్ బారిన పడుతుంటారు. అయితే లివర్ లో కొవ్వు పెరిగిపోయిందనే విషయాన్ని మనం అంత తేలికగా గుర్తించలేము.

ఇలా గుర్తించొచ్చు

ఇలా గుర్తించొచ్చు

కడుపులో రైట్ సైడ్ నొప్పి ఏర్పడడం, నీరసంగా ఉండడం లక్షణాలు కాలేయంలో కొవ్వు పెరిగిందని తెలియజేస్తాయి. అలాంటి సమయంలో వెంటనే డాక్టర్ని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. స్కానింగ్, రక్తపరీక్షలు చేసి ఈ వ్యాధిని గుర్తిస్తారు. వ్యాధి నిర్దారణ అయితే జాగ్రత్తలు తీసుకోవాలి.

Most Read :పరగడుపునే బీట్ రూట్ జ్యూస్ తాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలుMost Read :పరగడుపునే బీట్ రూట్ జ్యూస్ తాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు

మద్యపానంతోనే

మద్యపానంతోనే

మద్యపానానికి దూరంగా ఉంటే ఫ్యాటీ లివర్ బారిన పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. మితంగా మద్యపానం చేస్తే అంతగా ఇబ్బందులుండవు.

షుగర్ పెరగకూడదు

షుగర్ పెరగకూడదు

ఇక బ్లడ్ లో షుగర్ స్థాయి పెరగకుండా చూసుకోవాలి. తీసుకునే ఫుడ్ లో షుగర్, కొలెస్ట్రాల్ మోతాదు తక్కువ ఉండేలా చూసుకోండి. అలాగే అధిక బరువు అదుపులో ఉంచుకోవాలి.

ఎక్సర్ సైజ్ లు చేయాలి

ఎక్సర్ సైజ్ లు చేయాలి

తరుచూ ఎక్సర్ సైజ్ లు చేయాలి. తాజాగా ఉండేవాటిని ఆహారంగా తీసుకోవాలి. కొవ్వు తక్కువగా ఉండే పదార్థాలనే తినాలి. మధుమేహం అదుపులో ఉండేలా చూసుకోవాలి. కొన్ని రకాల చిట్కాలను పాటిస్తే కూడా ఫ్యాటీ లివర్ తగ్గుతుంది.

ఆపిల్ సైడ‌ర్

ఆపిల్ సైడ‌ర్

కాస్త వేడి నీళ్లలో ఆపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ కలుపునికుని తాగితే ఫ్యాటీ లివర్ సమస్య నుంచి బయటపడొచ్చు.

Most Read :ప్రతిరోజూ మీ తలకు నూనె పెడుతున్నారా? అలా చేస్తే ఏమైతుందో తెలుసా, ఒక్కసారి తెలుసుకోండి మరిMost Read :ప్రతిరోజూ మీ తలకు నూనె పెడుతున్నారా? అలా చేస్తే ఏమైతుందో తెలుసా, ఒక్కసారి తెలుసుకోండి మరి

గ్రీన్ టీ

గ్రీన్ టీ

గ్రీన్ టీ ద్వారా ఫ్యాటీ లివర్ ను తగ్గించుకోవొచ్చు. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కాలేయాన్ని బాగా ఉంచగలవు. తరుచూ గ్రీన్ టీ తాగే వారు ఈ వ్యాధి బారిన పడరు.

పాలలో పసుపు

పాలలో పసుపు

పాలలో పసుపు కలుపుకుని తాగితే కూడా చాలా మంచిది. ఇలా రోజూ చేస్తే ఫ్యాటీ లివర్ సమస్య తగ్గుతుంది.

బొప్పాయి

బొప్పాయి

బొప్పాయి పండు కూడా కాలేయంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించగలదు. రెగ్యులర్ గా బొప్పాయిని తింటూ ఉంటే ఫ్యాటీ లివర్ నుంచి బయటపడొచ్చు.

Most Read :అధికంగా క్రూరత్వాన్ని ప్రదర్శించే రాశిచక్రాలు ఇవే, అందులో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండిMost Read :అధికంగా క్రూరత్వాన్ని ప్రదర్శించే రాశిచక్రాలు ఇవే, అందులో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి

ఉసిరి

ఉసిరి

తరచూ ఉసిరికాయ ర‌సాన్ని తాగినా మంచి ఫలితం ఉంటుంది. ఇలా రెగ్యులర్ గా చేస్తే ఫ్యాటీ లివర్ సమస్య నుంచి తప్పించుకోవొచ్చు.

English summary

fatty liver symptoms and home remedies

fatty liver symptoms and home remedies
Desktop Bottom Promotion