For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పుదీనా: ఆరోగ్య ప్రయోజనాలు, దుష్ప్రభావాలు, & వంటలు

|

పుదీనా లేదా ' మింట్ ' అని పిలువబడే ఈ ఆకు రకం మండే వేసవిలో సైతం శరీరానికి స్వాంతన చేకూర్చడంలో తనవంతు ఉత్తమ ప్రయోజనాలను కలిగి ఉంటుంది. దీనిని పుదీనా చట్నీ, పుదీనా లెమనాయిడ్, పుదీనా ఐస్ క్రీమ్, రైతా, మొదలైన రూపాలలో వినియోగించడం ద్వారా, దీని అద్భుత ప్రయోజనాలను పొందవచ్చు. కొందరికైతే పుదీనా అంటే మక్కువ ఎక్కువ. క్రమంగా లెమనాయిడ్, టీ రూపాలలోనే కాకుండా పుదీనా రైస్, సలాడ్లు వంటి వాటిలో కూడా తరచుగా జోడించుకుంటూ ఉంటారు. ఇది శరీరానికి ఊరటనివ్వడమే కాకుండా, ఆరోగ్యప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. క్రమంగా ఇది కఫాన్ని దూరంగా ఉంచడంలో కూడా ఉత్తమ ప్రయోజనాలను కలిగి ఉంటుంది. పుదీనా శరీరాన్ని లోపలి నుండి చల్లగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తుoది.

పుదీనా, స్పియర్మింట్ రెండూ కూడా వృక్ష జాతుల సమూహానికి చెందినవిగా మరియు మెంథోల్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. అయితే స్పియర్మింట్లో, పుదీనాతో పోల్చినప్పుడు స్వీట్ ఫ్లేవర్ కొంచం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా లిమోనేన్, సినియోల్, మరియు డైహైడ్రోకార్వోన్లలో కూడా సమృద్ధిగా ఉంటుంది. అదేవిధంగా పుదీనాలో కూడా మెంథోన్ మరియు లిమోనేన్ గుణాలు అధికంగా ఉంటాయి.

Mint

పుదీనా మరియు స్పియర్మింట్ విటమిన్ ఎ, పొటాషియం, కాల్షియం, విటమిన్ సి, మెగ్నీషియం, ఇనుము, ప్రోటీన్ మరియు విటమిన్ B6 లకు మంచి మూలంగా ఉంటుంది.

పుదీనా యాంటీ ఆక్సిడెంట్లలో సమృద్దిగా ఉంటుంది. మరియు దీని మూలంగా చర్మానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు సమకూరుతాయి. దీనిని కాప్సూల్ రూపంలో కూడా తీసుకోవడం జరుగుతుంది. కఫం మరియు, శ్వాస కోశ సంబంధిత పరిస్థితులు ఎదురైన పక్షంలో ఆవిరి పట్టడం ద్వారా కూడా ఉపశమనం చేకూరుతుంది.

పుదీనాలో రకాలు :

పుదీనాలో రకాలు :

1. పెప్పర్మింట్

2. స్పియర్ర్మింట్

3. ఆపిల్ మింట్

4. జింజర్ మింట్

5. చాక్లెట్ మింట్

6. పైనాపిల్ మింట్

7. పెన్నీ రాయల్

8. రెడ్ రారిపిలా మింట్

9. గ్రేప్ ఫ్రూట్ పుదీనా

10. వాటర్ మింట్

11. కార్న్ మింట్

12. హార్స్ మింట్

13. కాలా మింట్

పుదీనా యొక్క ఆరోగ్య ప్రయోజనాలు :

1. కంటి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది :

1. కంటి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది :

పుదీనా విటమిన్ ఎ యొక్క అద్భుతమైన మూలంగా చెప్పబడుతుంది, ఇది కొవ్వును కరిగించడంలో ఉత్తమంగా సహాయపడుతుంది. అంతేకాకుండా కంటి ఆరోగ్యానికి ముఖ్యమైనదిగా ఉంటూ, రేచీకటి సమస్యను తగ్గించడంలో సహాయపడగలదు. విటమిన్ ఎ లోపం మూలంగా రేచీకటి తలెత్తుతుంది. ఒక అధ్యయనం ప్రకారం, విటమిన్ ఎ అధికంగా తీసుకోవటం మూలాన రేచీకటి సమస్యను తలెత్తకుండా అడ్డుకోవచ్చు.

2. సాధారణ జలుబు లక్షణాల తగ్గిస్తుంది :

2. సాధారణ జలుబు లక్షణాల తగ్గిస్తుంది :

పుదీనా మెంథోల్ స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇది శ్లేష్మం మరియు కఫాన్ని విడగొట్టి, శరీరంలోనికి తేలికగా ప్రసరించేందుకు దోహదపడుతుంది. దీని వలన ఛాతీ నొప్పి, మరియు శ్వాసలో అంతరాన్ని తగ్గించి స్వాంతన చేకూరుస్తుంది. దగ్గు మరియు గొంతు నొప్పిని తగ్గించడం కొరకు మెంథోల్ దగ్గు మందులలో కూడా ఉపయోగించడం జరుగుతుంది.

3. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది :

3. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది :

పుదీనా ఎసెన్షియల్ ఆయిల్ యొక్క సువాసనను పీల్చడం ద్వారా జ్ఞాపకశక్తిని పెంపొందించవచ్చునని చెప్పబడుతుంది. మరియు ఒక అధ్యయనం ప్రకారం చురుకుదనం పెరుగుతుందని కూడా నిరూపించబడింది. కేవలం మింట్ ఎసెన్షియల్ ఆయిల్ సువాసనను పీల్చడం ద్వారా చురుకుదనం మెరుగుపడడమే, అలసట, ఆందోళన, చిరాకులు తగ్గుతాయని మరో అధ్యయనంలో వెల్లడైంది. ఇది తీవ్ర ఒత్తిడి, డిప్రెషన్, మరియు ఆందోళన సమస్యలను తొలగించడానికి సహాయపడుతుంది.

4. జీర్ణక్రియలను సులభతరం చేస్తుంది :

4. జీర్ణక్రియలను సులభతరం చేస్తుంది :

పుదీనా యొక్క యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ సెప్టిక్ లక్షణాలు, అజీర్ణం, మలబద్దకం మరియు శోధ నుండి ఉపశమనాన్ని కలిగించడంలో సహాయపడుతుంది. పుదీనా పైత్యరస స్రావాన్ని పెంచడం ద్వారా పనిచేస్తుంది మరియు పైత్యరస ప్రవాహాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది జీర్ణక్రియ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం, భోజనంతోపాటుగా కొద్దిగా పుదీనా ఆయిల్ తీసుకున్న వ్యక్తులు అజీర్ణ సమస్యల నుండి దూరంగా ఉన్నారని చెప్పబడింది.

5. PCOS లక్షణాలను తగ్గిస్తుంది :

5. PCOS లక్షణాలను తగ్గిస్తుంది :

పుదీనా PCOS లక్షణాలను తగ్గించడంలో ఉత్తమ ప్రభావాలను కలిగి ఉంటుంది. ఎందుకంటే ఇది టెస్టోస్టెరాన్ స్థాయిలను తగ్గించే యాంటి ఆండ్రోజెన్ లక్షణాలను కలిగి ఉంటుంది., మరియు ఇవి అన్ని హార్మోన్ స్థాయిలను సమతుల్యం చేయడానికి సహాయపడతాయి. స్పియర్మింట్ హెర్బల్ టీ, ఫైటోథెరపీ రీసెర్చ్లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం PCOS కలిగిన మహిళల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలను తగ్గించిందని చెప్పబడింది.

6. ఆస్థమా లక్షణాలను తగ్గిస్తుంది :

6. ఆస్థమా లక్షణాలను తగ్గిస్తుంది :

పుదీనాలోని స్వాంతన చేకూర్చే లక్షణాలు ఆస్తమాటిక్ రోగులపై సానుకూల ప్రభావాలను కలిగి ఉంటాయి. పుదీనా ఒక రిలాక్జెంట్ ఏజెంట్ వలె పనిచేస్తుంది మరియు శ్వాసను మెరుగుపరిచి ఉపశమనం కలిగిస్తుంది. పిప్పర్మెంట్ ఎసెన్షియల్ ఆయిల్లో కనిపించే ఒక పదార్థమైన మిథనాల్, విశ్రాంతిని చేకూర్చి వాయునాళాల రక్షణలో సహాయపడుతుంది. తద్వారా ఆస్థమా రోగులకు తేలికగా శ్వాస తీసుకోవడంలో సహాయపడుతుంది.

7. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది :

7. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది :

జీర్ణక్రియ సరిగ్గాలేని పక్షంలో ప్రేగు ప్రకోపాలకు దారితీసి డయేరియా, మలబద్ధకం, కడుపునొప్పి, వికారం, ఉబ్బరం మొదలైన వాటికి కారణమవుతుంది. పుదీనా ఆయిల్లో మెంథోల్ ఉంటుంది, ఇది ప్రేగు ప్రకోప లక్షణాలను(ఇరిటబుల్ బోవెల్ సిండ్రోం IBS) తగ్గిస్తుంది. మరియు జీర్ణాశయ కండరాలకు ఉపశమనం కలిగిస్తుంది.

8. నోటి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది :

8. నోటి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది :

చాలామంది తమ నోటి దుర్వాసనను లేదా చెడు శ్వాసను వదిలించుకోవటానికి చ్యూయింగ్-గం నమలడం చూస్తూనే ఉంటారు. అవునా ? ఎందుకంటే చ్యూయింగ్-గం లో ప్రదానంగా పుదీనాను జోడించడం జరుగుతుంటుంది. ఇది యాంటి మైక్రోబయల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటుంది. క్రమంగా ఇది నోటిలోని దుర్వాసన కారక బ్యాక్టీరియాను చంపడంలో కీలకపాత్ర పోషిస్తుంది. పుదీనా టీ త్రాగడం మూలాన చెడు శ్వాసను వదిలించుకోవటంలో సహాయపడుతుందని ఒక అధ్యయనంలో తేలింది కూడా. కొన్ని పుదీనా ఆకులను నమలడం మూలంగా కూడా యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల మూలాన దుర్వాసన కారక క్రిములను తొలగించడంలో కీలకపాత్ర పోషిస్తుందని చెప్పబడింది.

9. గ్యాస్ట్రిక్ అల్సర్స్ నివారిస్తుంది :

9. గ్యాస్ట్రిక్ అల్సర్స్ నివారిస్తుంది :

ఇథనాల్ మరియు ఇండోమెథాసిన్ యొక్క ప్రతికూల ప్రభావాల నుండి జీర్ణాశయ లైనింగ్ ప్రక్రియను కాపాడటం ద్వారా గ్యాస్ట్రిక్ అల్సర్స్ నివారించడంలో పుదీనా ఒక ప్రముఖ పాత్రను పోషిస్తుంది. ఎక్కువగా ఆల్కహాల్ సేవించడం, మరియు పెయిన్ కిల్లర్లను తరచుగా ఉపయోగించడం వలన గ్యాస్ట్రిక్ అల్సర్స్ తలెత్తే అవకాశాలు అధికంగా ఉంటాయి.

10. పాలిచ్చే తల్లుల రొమ్ములనొప్పి ఉపశమనానికి :

10. పాలిచ్చే తల్లుల రొమ్ములనొప్పి ఉపశమనానికి :

పాలిచ్చే తల్లులు తరచుగా ఎదుర్కొనే సాధారణ దుష్ప్రభావాలుగా రొమ్ముల సున్నితత్వం, పగుళ్లు మరియు నొప్పి ఉంటాయి. ఇటువంటి వాటిని పుదీనా సమర్దవంతంగా ఎదుర్కొనగలదు. ఇంటర్నేషనల్ బ్రెస్ట్ ఫీడింగ్ జర్నల్లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, పుదీనా వాటర్, మొదటి సారి పాలిచ్చే తల్లుల్లో కనబడే సాధారణ సమస్యలైన చనుమొనల పగుళ్ళు మరియు నొప్పులను నిరోధించగలుగుతుంది.

ఆయుర్వేద మరియు సంప్రదాయక చైనీస్ వైద్యంలో పుదీనా ఆకులను ఔషదంగా వినియోగిస్తారు :

ఆయుర్వేద మరియు సంప్రదాయక చైనీస్ వైద్యంలో పుదీనా ఆకులను ఔషదంగా వినియోగిస్తారు :

పుదీనా ఆకులను ఔషధాలలో కూడా విస్తారంగా వినియోగించడం జరుగుతుంది. ఆయుర్వేదంలో పుదీనా ఆకులను జీర్ణక్రియ సమస్యలను పరిష్కరించడంలో, శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో మరియు మొత్తం వాత, పిత్త, కఫ దోషాల విషయములలోనూ వినియోగించడం జరుగుతుంది.

సాంప్రదాయక చైనీస్ మెడిసిన్ (టిసిఎం) ప్రకారం, పుదీనా ఆకులు శీతలీకరణ లక్షణాలను, మరియు సుగంధ గుణాలను సైతం కలిగి ఉంటాయి. ఈ లక్షణాలు కాలేయం, ఊపిరితిత్తులు, మరియు కడుపు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, మరియు బహిష్టు నొప్పి మరియు డయేరియా చికిత్సలో శరీరానికి స్వాంతన చేకూరేలా ఉత్తమమైన ప్రభావాలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా శరీరానికి ఉపశమనం ఇవ్వడం ద్వారా చికిత్సలో కీలకపాత్రను పోషిస్తుంది.

మింట్, పుదీనా స్పియర్మింట్ మధ్య గల తేడా :

మింట్, పుదీనా స్పియర్మింట్ మధ్య గల తేడా :

పుదీనా మెంథాజీనస్ మొక్క రకానికి చెందినదిగా ఉంటుంది. వీటిలో 18 పుదీనా రకాల జాతుల వరకు ఉంటాయి.

పుదీనా, స్పియర్మింట్ కన్నా అధిక మెంథాల్ కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఎక్కువ స్థాయిలో సాంద్రీకరణ లక్షణాన్ని కలిగి ఉంటుంది. దీనిమూలంగా చర్మంపై అప్లై చేసినప్పుడు, కూలింగ్ సెన్సేషన్ కలుగుతుంది. మరోవైపు, రుచి ప్రకారం కొద్దిగా తీపి రుచిని కలిగి ఉంటుంది. క్రమంగా ఇది వంటకాలు మరియు పానీయాలలో జోడించడానికిగల ప్రధాన కారణంగా ఉంటుంది. పుదీనాను ప్రధానంగా ఔషధ ప్రయోజనాలకోసంగా ఉపయోగించడం జరుగుతుంది.

పుదీనా వలన కలిగే దుష్ప్రభావాలు :

పుదీనా వలన కలిగే దుష్ప్రభావాలు :

• ఒకవేళ మీరు గ్యాస్ట్రోఎసోఫగియల్ రిఫ్లక్స్ డిసీజ్ (GERD) తో బాధపడుతున్నట్లయితే, పుదీనా తీసుకోవడం పరిహరించవలసి ఉంటుంది. ఇది రోగ లక్షణాలను మరింత క్షీణింపజేస్తుంది.

• ఒకవేళ మీకు ఇంతకు ముందే పిత్తాశయ రాళ్లు ఉన్నట్లయితే, పుదీనా ఉత్పత్తులను ఉపయోగించడానికి ముందు మీ వైద్యునిసంప్రదించడం మంచిది.

• పిప్పర్మెంట్ నూనెను ఎక్కువ మోతాదులో తీసుకున్నా అది విష ప్రభావాలను కలుగజేయవచ్చు.

• నవజాత శిశువుల ముఖంపై పుదీనా నూనెను ఉపయోగించడాన్ని పరిహరించడం మంచిది. ఇది వారి ఒళ్ళు నొప్పులకు మరియు శ్వాసలో అంతరాయానికి దారితీయగలదు.

• పుదీనా కొన్ని ఔషధాలతో చర్యలు జరిపే అవకాశం ఉంది. కావున మీరు ఏదేని మందులను వినియోగిస్తున్న ఎడల, పుదీనా ఉత్పత్తులను ఉపయోగించడానికి ముందు వైద్యుడిని సంప్రదించండి.

పుదీనాను ఎంచుకోవడం మరియు నిల్వ చేయడం ఎలా ?

పుదీనాను ఎంచుకోవడం మరియు నిల్వ చేయడం ఎలా ?

తాజా, ప్రకాశవంతమైన మరియు మచ్చలులేని శుభ్రమైన పుదీనా ఆకులను మాత్రమే కొనుగోలు చేయండి. వాటిని ఒక వారం వరకు ఫ్రిడ్జ్లో ప్లాస్టిక్ కవర్లో నిల్వ చేయవచ్చు.

మీ ఆహారంలో పుదీనా జోడించదగిన ఉత్తమ మార్గాలు :

మీ ఆహారంలో పుదీనా జోడించదగిన ఉత్తమ మార్గాలు :

• మీరు నిమ్మ రసం, తేనె మరియు చిదిమిన పుదీనా ఆకులను తీసుకుని, కొంత నీటిని మరియు ఐస్ క్యూబ్స్ తో కలపడం ద్వారా పుదీనా లెమనాయిడ్ తయారు చేసి తీసుకోవచ్చు.

• ఫ్రూట్ సలాడ్లో పుదీనా మరియు తేనెను కలిపి తీసుకోవచ్చు.

• మండుటేసవిలో స్వావలంబన కోసం నీటిలో కొన్ని పుదీనా ఆకులను మరియు కీరాదోసను జోడించి తీసుకోవచ్చు.

• కుకీ లేదా కేక్లలో కొన్ని తరిగిన పుదీనా ఆకులను జోడించి తీసుకోవచ్చు.

• పండ్లు మరియు కూరగాయల స్మూతీలలో పుదీనాను జోడించి తీసుకోవచ్చు.

పుదీనా రెసిపీలు :

పుదీనా రెసిపీలు :

1. పుదీనా టీ ఎలా తయారు చేయాలి?

కావలసిన పదార్ధాలు :

• ఒక గుప్పెడు తాజా పుదీనా ఆకులు

• రుచికి కొద్దిగా తేనె

తయారుచేయు విధానం :

• పుదీనా ఆకులను చిదిమి, ఒక పాత్ర మరుగుతున్న నీటిలో కలపండి.

• నీరు స్వల్పంగా పసుపు లేదా ఆకుపచ్చ రంగులోనికి వచ్చేంత వరకు 2 నుండి 3 నిమిషాలపాటు కలుపుతూ ఉండండి.

ఈ నీటిని వడకట్టి రుచికి తగ్గట్టుగా తేనెను జోడించండి.

2. పుదీనా నీళ్ళను తయారుచేయు విధానం?

కావలసిన పదార్ధాలు :

• తాజా పుదీనా ఆకులు 3 నుండి 4 కాడలు

• ఒక జగ్ నిండా నీరు

తయారు చేయు విధానం :

• కడిగిన తాజా పుదీనా ఆకులు 3 నుంచి 4 కాడలు తీసుకుని ఆకులను వేరు చేసి, చిదిమి, ఒక జగ్ నీటిలో కలపండి .

• దీన్ని కవర్ చేసి 1 గంట పాటు ఫ్రిజ్లో ఉంచాలి.

ఈ నీటిని తాగుతూ, మరలా ఆ జగ్ నింపుతూ ఉండండి. ఎందుకంటే పుదీనా 3 రోజుల వరకు నీటికి ఫ్లేవర్ని అందివ్వగలుగుతుంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

Read more about: mint health benefits
English summary

Mint: Health Benefits, Side Effects & Recipes

Mint belongs to a group of plant species that includes peppermint and spearmint. Peppermint contains menthol, menthone and limonene while spearmint has a sweet flavour and is rich in limonene, cineol, and dihydrocarvone. The health benefits of mint include improving oral health, promoting digestion, reducing PCOS symptoms and asthma symptoms, etc.
Story first published:Thursday, May 2, 2019, 12:23 [IST]
Desktop Bottom Promotion