For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నులిపురుగులు ఇలా శరీరంలోకి వెళ్తాయి, మనిషిని పీల్చిపిప్పి చేస్తాయి, మీలోనూ ఉండొచ్చు

ముఖ్యంగా రక్తహీనతతో ఇబ్బందులుపడుతుంటారు. మీరు తినే తిండిని మొత్తం కూడా నులిపురుగులు తినేస్తాయి. నులిపురుగుల్లోనూ చాలా రకాలుంటాయి. చాలా మందిలో ఏలిక పాములుంటాయి. ఇవి ఒక్కోసారి మీరు మల విసర్జన చేసినప్పుడ

|

పిల్లలు ఎక్కువగా ఎదుర్కొనే సమస్యల్లో ఒకటి నులిపురుగులు. పిల్లల్ని ఆరోగ్యాన్ని ఇవి పూర్తిగా దెబ్బతీస్తాయి. అసలు ఇవి శరీరంలోకి ఎలా ప్రవేశిస్తాయి. ఒకవేళ ప్రవేశిస్తే ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయో ఒకసారి చూడండి.

నులిపురుగులకు సంబంధించి ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నాయి. ఏటా నులిపురుగులకు సంబంధించి నిర్మూలన దినోత్సవాలను కూడా ప్రభుత్వం నిర్వహిస్తూనే ఉంది. ముఖ్యంగా నులిపురుగులను నివారించాలంటే అల్బెండజోల్‌ ట్యాబ్లెట్స్ ఉపయోగించాలి.

అపరిశుభ్రత

అపరిశుభ్రత

ప్రధానంగా అపరిశుభ్రత వల్ల నులి పురుగులు వ్యాపిస్తాయి. పరిసరాలను శుభ్రంగా లేకుంటే ఇవి అక్కడ ప్రబులుతాయి. అలాగే గోర్లు పెద్దవిగా పెంచుకుని వాటిని క్లీన్ గా ఉంచుకోకపోతే కూడా నులిపురుగులు వ్యాపిస్తాయి.

గోర్లు

గోర్లు

గోర్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ మలినాలు చేరకూడదు. అలాగే గ్రామాల్లో బహిరంగంగా మల విసర్జన చేస్తుంటారు. దాని వల్ల కూడా నులిపురుగులు శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. తినేటప్పుడు చేతులను కడుక్కోకుండా తింటే కూడా ఈ వ్యాధి బారినపడతారు.

మూసే ఉంచాలి

మూసే ఉంచాలి

తినే ఆహారాలను కూడా ఎప్పుడూ మూసే ఉంచాలి. ఎక్కువగా ఒకటి నుంచి పంతొమ్మిది ఏళ్ల పిల్లలు నులిపురుగుల సమస్య బారినపడే అవకాశం ఉంది. ఇవి పేగుల్లో ఉండే పోషకాలన్నింటినీ తినేస్తాయి. దీంతో శరీరంలో రక్తహీనత ఏర్పడుతుంది. ఎంతతిన్నా కూడా పోషకాహారం శరీరానికి అందకుండా ఉంటుంది.

Most Read :ఆ సమయంలో కలయిక జరిగితే కచ్చితంగా గర్భం వస్తుంది, ఎలాంటి అమ్మాయినైనా నెలరోజుల్లో నెల తప్పించొచ్చు

ఆకలి వేయదు

ఆకలి వేయదు

ఆకలి సరిగ్గా వేయదు. ఎక్కువగా బలహీనంగా మారుతారు. తరుచుగా కడుపునొప్పి వస్తూ ఉంటుంది. బరువు పెరగరు. చాలా మంది బక్కగా ఉండే వారు నులిపురుగుల సమస్య బారినపడి ఉంటారు. కానీ వారికి ఈ విషయం తెలియక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోరు. ఫలితంగా వారు ఎంత తిన్నా కూడా లావుకారు.

రక్తహీనత

రక్తహీనత

ముఖ్యంగా రక్తహీనతతో ఇబ్బందులుపడుతుంటారు. మీరు తినే తిండిని మొత్తం కూడా నులిపురుగులు తినేస్తాయి. నులిపురుగుల్లోనూ చాలా రకాలుంటాయి. చాలా మందిలో ఏలిక పాములుంటాయి. ఇవి ఒక్కోసారి మీరు మల విసర్జన చేసినప్పుడు కూడా కనిపిస్తాయి. అలాగే కొంకి, నులి అనే రకం పురుగులు కూడా ఉంటాయి. ఇవి కూడా చాలా డేంజర్.

ఆల్బెండజోల్‌

ఆల్బెండజోల్‌

ఈ పురుగులన్నింటినీ నివారించే మందు ఆల్బెండజోల్‌. ఈ మాత్రలు వేసుకుంటే చాలు ఎలాంటి పురుగులైన చచ్చి మలవిసర్జనలో బయటకి వెళ్లిపోతాయి. అయితే పిల్లలకు ఈ మాత్రలు వేసేటప్పుడు కాస్త జాగ్రత్త వహించాలి. ఎక్కువ డోస్ వాటిని పిల్లలకు వేయకూడదు. కళ్లు తిరిగిపడిపోతారు. అలా అని భయపడాల్సిన అవసరం లేదు.

Most Read :కామంతో కళ్లు మూసుకుపోయాయి.. శారీరక సుఖం కోసం మేకను కూడా వదలలేదుMost Read :కామంతో కళ్లు మూసుకుపోయాయి.. శారీరక సుఖం కోసం మేకను కూడా వదలలేదు

శుభ్రత

శుభ్రత

అలాగే నిత్యం శుభ్రతను పాటించాలి. ఆల్బెండజోల్‌ మాత్రలు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో , అంగన్ వాడీల్లో ఉచితంగా ఇస్తారు. మీరు కూడా నులిపురుగులకు సంబంధించిన లక్షణాలతో బాధపడుతుంటే వెంటనే డాక్టర్ని సంప్రదించి ఆ రోగాన్ని నయం చేసుకోండి.

English summary

Parasitic Worms in Humans Facts and How to get rid

Parasitic Worms in Humans Know the Facts how to get rid
Desktop Bottom Promotion