Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
ఆడవారిలో ఈస్ట్రోజన్ తగ్గితే ఆ సమయంలో సహకరించలేరు, కారణాలివే, ఈస్ట్రోజన్ పెంచే ఆహారాలు
ఇక మెనోపాజ్ దశకు చేరుకున్న మహిళలో ఈస్ట్రోజన్ పూర్తి తగ్గిపోయే అవకాశం ఉంది. అయితే ఈస్ట్రోజన్ ను పునరుద్దరించాలంటే కొన్ని రకాల ఆహారాలు తినాలి. రోజూ సోయాబీన్స్ తో తయారు చేసిన పదార్థాలను తినాలి. అంటే స
చాలా మంది మహిళలు ఏ ఏజ్ వచ్చిన తర్వాత ఎదుర్కొనే సమస్య మెనోపాజ్. కాస్త వయస్సు అయ్యాక
పీరియడ్స్ తగ్గిపోతాయి. ఆ సమయంలో ఆడవారి శరీరంలో కొన్ని రకాల మార్పులు వస్తాయి. వారికి కాస్త ఎక్కువగా చెమటలు పట్టడం, చికాకుగా ఉండడం జరుగుతుంది. దాదాపు ఇలాంటి లక్షణాలుంటే మెనోపాజ్ అని అనుమానపడాల్సి ఉంటుంది. పీరియడ్స్ ఆగిపోయే ముందు అండాశయాలు పూర్తిగా తగ్గుతాయి. అలాగే ఈ సమయంలో ఏర్పడే నష్టం ఏంటంటే ఈస్ట్రోజన్ హార్మోన్ చాలా వరకు తగ్గిపోవడం.
ఈస్ట్రోజన్ తగ్గిపోతే శరీరంలో చాలా మార్పులు వస్తాయి. శరీరం కాస్త వేడిగా మారే అవకాశం ఉంది. అలాగే చమటు ఎక్కువగా పడతాయి. ఆందోళనకు గురవుతారు. కోపం కూడా పెరగుుతంది. ఒత్తిడికి లోనవుతారు. ఇవన్నీ కూడా మెనోపాజల్ లక్షణాలుగా చెప్పొచ్చు.

ఈస్ట్రోజన్ పూర్తి తగ్గిపోయే అవకాశం
ఇక మెనోపాజ్ దశకు చేరుకున్న మహిళలో ఈస్ట్రోజన్ పూర్తి తగ్గిపోయే అవకాశం ఉంది. అయితే ఈస్ట్రోజన్ ను పునరుద్దరించాలంటే కొన్ని రకాల ఆహారాలు తినాలి. రోజూ సోయాబీన్స్ తో తయారు చేసిన పదార్థాలను తినాలి. అంటే సోయాపాలతో పాటు సోయాపిండితో తయారు చేసిన వాటిని ఎక్కువగా తినాలి.

ఈస్ట్రోజన్ ను పెంచగలవు
అలాగే పొద్దుతిరుగుడు గింజలు కూడా శరీరంలో ఈస్ట్రోజన్ ను పెంచగలవు. వీటితో తయారు చేసిన పదార్థాలను తినాలి. ఇక అవిసె గింజలు కూడా మహిళలకు కావాల్సినంత ఈస్ట్రోజన్ ను ఇవ్వగలవు. అందువల్ల వీటిని రోజూ తీసుకోవాలి. అలాగే లవంగాలు, ఖర్జురాలు కూడా రోజూ తినాలి.

వాటిని తినాలి
రెగ్యులర్ గా ఆకుకూరల్ని తినాలి. వివిధ రకా కూరగాయల్ని తినాలి. పాల పదార్థాలు తీసుకోవాలి. ఈస్టోజన్ తగ్గిన తర్వాత దాన్ని పెంచుకోవాలంటే కాస్త కష్టమే. అయితే దానికి ప్రత్యామ్నాయంగా ఫైటో ఈస్ట్రోజెన్ ను మనం శరీరంలో పెంచుకునేందుకు కొన్ని రకాల మందులు కూడా దొరుకుతాయి. అలాంటి టాబ్లెట్స్ వేసుకుంటే కూడా మంచిదే.

లక్షణాలు
• తీవ్రమైన మానసిక ఆందోళన
• సెక్స్ సమయంలో నొప్పిగా ఉండడం, ముఖ్యంగా యోని పొడిబారిపోవడం
• అలసట
• తలనొప్పి
• డిప్రెషన్
• మూత్ర నాళాలకు సంబంధించిన అంటువ్యాధులు రావడం
ఈస్ట్రోజెన్ తగ్గిందా లేదా అనేది ఒకసారి డాక్టర్ని సంప్రదించే తెలుస్తుంది.
రక్త పరీక్షలు చేస్తారు. అలాగే ఫిక్కిల్-స్టిమ్యులేటింగ్ హార్మోన్ (FSH)కు సంబంధించిన పరీక్ష కూడా చేస్తారు.

• ధూమపానం వదిలేయండి
కొందరు అమ్మాయిలకు పొగతాగే అలవాటు ఉంటుంది. ఈస్ట్రోజెన్ లెవెల్స్ తగ్గినప్పుడు వారు వెంటనే పొగతాగడం ఆపాలి. లేదంటే ఈ సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది.

• డైట్ లో మార్పులు
మీ డైట్ లో మార్పులు చేసుకోవాలి. రోజూ మీరు ఫైటో ఈస్ట్రోజెన్లను కలిగి ఉన్న ఆహారాన్ని తినేలా చూసుకోండి.టోఫు, సోయా గింజలు, బఠానీలు, కాలీఫ్లవర్, బ్రోకలీ, అవిసె గింజలు, తృణధాన్యాలు, క్రాన్బెర్రీస్ వంటివి తినాలి.

• బరువు పెరుగుట
ఈస్ట్రోజెన్ తక్కువగా ఉన్న మహిళలు కాస్త లావుగా కావాల్సిన అవసరంఉంది. దీంతో కూడా ఈస్ట్రోజెన్ కాస్త పెరుగుతుంది.

• చస్తీబెర్రీ సప్లిమెంట్స్
చస్తీబెర్రీ అనేది ఒక మూలిక. ఇది కూడా శరీరం లో ఈస్ట్రోజెన్ స్థాయిలను పెంచగలదు. అయితే, డాక్టర్ చెబితేనే వీటిని తీసుకోవాలి. లేదంటే తీసుకోకూడదు.

• హెర్బల్ టీ
కొన్ని రకాల హెర్బల్ టీలు కూడా ఈస్ట్రోజెన్ లెవెల్స్ ను పెంచుతాయి. మూలికలను 5 నిముషాల పాటు వేడి నీటిలో ఉంచి వాటితో టీ తయారు చేసుకుని తాగాలి. గ్రీన్, బ్లాక్ టీలలో ఫియోటోస్ట్రోజెన్లు ఉంటాయి. అందువల్ల వాటిని ఎక్కువగా తాగితే మీ బాడీలో ఈస్ట్రోజెన్ పెరుగుతుంది.

కెఫిన్
రోజుకు 400 mg కంటే ఎక్కువ కెఫిన్ తీసుకోకండి. అలా చేస్తే చాలా ఇబ్బందులుపడతారు. 200 mg కంటే ఎక్కువ కెఫిన్ తీసుకునే స్త్రీలలో ఈస్ట్రోజెన్ తక్కువగ ఉంటుందనికొన్ని సర్వేల్లో తేలింది.
అందువల్ల వీలైనంత వరకు కాఫీ తాగకండి.

• ఎక్కువగా వ్యాయామం చేయకండి
వ్యాయామం రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అయితే ఎక్కువగా వ్యాయామం చేస్తే ఈస్ట్రోజెన్ తగ్గిపోతుంది. అందువల్ల ఎక్కువగా వ్యాయామాలు చేయకండి. ఇక ఈస్ట్రోజెన్ తగ్గేకొద్దీ మీ శరీరంలో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి.
• సెక్స్ లో పాల్గొనాలని అనిపించదు
• నెలసరి ఎప్పుడంటే అప్పుడు వస్తుంది
• చేతులు ఎప్పుడు చల్లగా ఉంటాయి
• జుట్టు ఊడతుంది
• అలసట ఎక్కువ అవుతుంది
• మతిమరుపుతో ఇబ్బందిపడతారు
• మానసిక ఆందోళన ఉంటుంది
• తలనొప్పి
• ఉబ్బరం
• బరువు పెరుగుతారు
• ఆందోళనఎక్కువ అవుతుంది
• పానిక్ అటాక్స్
ఈస్ట్రోజెన్ హర్మోన్ తగ్గితే మహిళలు చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందువల్ల దాన్ని ఎప్పటికప్పుడు పెంచుకోవాలి. ఈ సమస్యను ప్రారంభంలో గుర్తిస్తే ఈజీగా దాని నుంచి బయటపడొచ్చు.



Click it and Unblock the Notifications











