Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఫిట్స్ బారిన పడే వారు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
ఒకవేళ మీరు స్పోర్టింగ్ ఈవెంట్స్ లో పాల్గొనాల్సి వస్తే మీరు అన్ని రకాల సురక్షిత విధానాలను అనుసరించాలి. హెల్మెట్ , లైఫ్ జాకెట్ ఉపయోగించాలి. అలాగే మీరు స్టోర్ట్స్ లో పాల్గొనేటప్పుడు అందరి మధ్యలో ఉండేలా
ఒక వ్యక్తి హఠాత్తుగా కిందపడిపోయి కాళ్లూ చేతులూ రెండూ గిలగిల కొట్టుకుంటుంటే ఆ వ్యక్తికి ఫిట్స్ వచ్చాయని అర్థం. నోట్లోంచి నురగ వస్తుంది. దీన్ని మూర్ఛవ్యాధి అని కూడా అంటారు. బ్రెయిన్ లో కలిగే కొన్ని సమస్యల వల్ల ఈ వ్యాధి వస్తుంది. దీన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. మన బ్రెయిన్ లో తరుచుగావిద్యుత్‌ప్రవాహాలు పోతుంటాయి. ఈ విద్యుత్ ప్రవాహాల్లో కాస్త హెచ్చుతగ్గులు ఏర్పడితే ఫిట్స్ వస్తాయి. అయితే నిత్యం ఫిట్స్ బారిన పడే వారు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి.

1. మెడిసిన్స్ తీసుకోవాలి
మూర్ఛ వ్యాధి నివారణకు రోజూ మెడిసిన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని రోజులు తీసుకుని కొన్ని రోజులు మానేయడం మంచిది కాదు. రెగ్యులర్ గా చికిత్స తీసుకోవాలి. రెగ్యులర్ గా డాక్టర్ని కలవాలి.

2. జాగ్రత్తగా ఉండాలి
మూర్ఛ వ్యాధితో బాధపడేవారు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. మీ చుట్టూ ఎప్పుడూ మీకు తెలిసిన మనుషులు ఉండేలా చూసుకోవాలి. మీరు సడెన్ గా మూర్ఛపోతే మిమ్మల్ని వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లగలిగే మనుషులు కూడా మీ చుట్టూ ఉండేలా చూసుకోవాలి.

పరుగుపందేల్లో
మూర్ఛకు గురయ్యే వారు ఎట్టిపరిస్థితుల్లోనూ పరుగుపందేల్లో పాల్గొనకూడదు. అలాగే ఎక్కువగా రిస్క్ తీసుకోకూడదు. ప్రమాదకరమైన విన్యాసాలు అస్సలు చేయకూడదు.

4. స్పోర్టింగ్ ఈవెంట్స్
ఒకవేళ మీరు స్పోర్టింగ్ ఈవెంట్స్ లో పాల్గొనాల్సి వస్తే మీరు అన్ని రకాల సురక్షిత విధానాలను అనుసరించాలి. హెల్మెట్ , లైఫ్ జాకెట్ ఉపయోగించాలి. అలాగే మీరు స్టోర్ట్స్ లో పాల్గొనేటప్పుడు అందరి మధ్యలో ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే మీకు సడెన్ గా ఫిట్స్ వస్తే పక్కనున్న వారు గమనించి కాపాడే అవకాశం ఉంటుంది.

5. మద్యం:
మూర్ఛరోగంతో బాధపడేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం తీసుకోకూడదు. మద్యం తాగితే ప్రమాదం మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం తాగకండి.

6. ఉపశమనం ఇవ్వండి
మూర్ఛరోగంతో బాధపడేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి టైట్ గా ఉండే దుస్తులు వేసుకోకూడదు. ఫిట్స్ వచ్చినప్పుడు అతని దుస్తుల బటన్స్ తీసివేయాలి. బాగా గాలి తగిలేలా చూసుకోవాలి. అలాగే ఫిట్స్ తో బాధపడే వ్యక్తి పళ్లతో నాలుకను కొరుకున్న అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల వెంటనే పళ్లుకొరక్కుండా జాగ్రతపడ్డాలి.

7. ఫిట్స్ పూర్తయ్యాక
చాలా మంది ఫిట్స్ పూర్తయ్యాక గందరగోళానికి గురవుతారు. తమకు ఏమైందో అర్థంకాక సతమతం అవుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో వారి ఆత్మీయులు వారికి భరోసానివ్వాలి. మనో ధైర్యం ఇవ్వాలి.



Click it and Unblock the Notifications