For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Overthinking: అతిగా ఆలోచిస్తున్నారా.. ఈ చిట్కాలతో నియంత్రించవచ్చు

|

Overthinking: అతిగా ఆలోచించడం అనేది చాలా మందికి చిన్న విషయంగా అనిపించవచ్చు. అయితే ఇది ఇబ్బంది పెట్టనంత వరకు సరే కానీ.. అతిగా ఆలోచించడం ఎప్పుడైతే ఒత్తిడి తీసుకువచ్చే స్థాయికి చేరుకుంటుందో.. అప్పుడు దానిని నియంత్రించాల్సిన అవసరం వస్తుంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఒక విషయంపై అతిగా ఆలోచిస్తారు. మనకు ముఖ్యమైన విషయాల గురించి అతిగా ఆలోచించడం, ఆందోళన చెందడం సాధారణ విషయమే.

అతిగా ఆలోచిస్తే ఏమవుతుంది?

ఏదైనా ఒక విషయంపై అతిగా ఆలోచించడం అంటే అది మనకు ముఖ్యమైనది అయి ఉంటుంది. లేదా అది మన జీవితంపై ఎక్కువ ప్రభావం చూపేది అయి ఉంటుంది. ఎప్పుడో ఒకప్పుడు ముఖ్యమైన విషయంపై ఇలా ఆలోచించడం సాధారణమే. కానీ ప్రతి విషయంపై ఇలా అతిగా ఆలోచిస్తే ఒత్తిడి పెరుగుతుంది. ఇది మానసిక, భావోద్వేగ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అలాగే జీవితంలో దేన్ని కూడా ఆస్వాదించకపోవచ్చు. ఓవర్ థింకింగ్ వల్ల నిరాశ, నిస్పృహ కలుగుతుంది. అలాగే బయట ఏం జరుగుతుంది అనేది గుర్తించలేరు.

ఎవరిలో ఎక్కువగా ఉంటుంది

పలు అధ్యయనాల ప్రకారం మానసిక రుగ్మతలు ఉన్న వారు ఎప్పుడు అతిగా ఆలోచిస్తూ ఉంటారు. మానసికంగా బాధ పడే వారు ఏదో విషయం గురించి ఆలోచిస్తూనే ఉన్నట్లు కనిపిస్తుంది. తమ జీవితానికి సంబంధించి ఎప్పుడూ నెగెటివ్ గానే ఆలోచిస్తారు. ఆరోగ్యంపైనా ఇదే రకమైన భావన వారిలో ఉంటుంది. తమకు ఏదో అయిపోతుందని మదన పడిపోతూ ఉంటారు. తమకేదైనా అయితే తమను చూసుకునే వాళ్లు ఎవరూ ఉండబోరని అనుకుంటారు. ప్రతి అంశంలోనూ వ్యతిరేక ఆలోచనలు వారి మదిలో మెదులుతుంటాయి.

అయితే ఆరోగ్యకరమైన వ్యక్తులు అతిగా ఆలోచిస్తున్నట్లైతే వారిలో మానసిక సమస్యలు వచ్చే ప్రమాదాన్ని అది పెంచుతుంది.

ఆందోళన కలిగించేవి ఏవి?

అతిగా ఆలోచించడం అనేది రెండు రకాలుగా తలెత్తవచ్చు. అందులో ఒకటి రూమినేటింగ్ అంటే దీర్ఘంగా ఆలోచించడం.. అంటే ఒకే సమస్య గురించి పదే పదే ఆలోచించడం. గతంలో సంభవించిన సమస్యల గురించి తలచుకుని బాధ పడటం. ఆ సంఘటనకు సంబంధించి వివిధ కోణాల్లో ఆలోచిస్తూ ఉండటం. ఈ ఆలోచనా సరళి పశ్చాత్తాపంతో కూడుకున్నది అయి ఉంటుంది. అలా చేసి ఉండాల్సింది కాదు.. అలా చేయడంలో నాదే తప్పు అనే భావన కలుగుతుంది. అలా చేసినందుకు మనల్ని మనం ద్వేషించుకుంటాం. ఆ పని చేసి ఉండాల్సింది కాదు. తప్పు చేశామన్న భావన ఈ తీవ్రమైన ఆలోచనల నుండి పుడుతుంది. ఇవి మనసుకు హాని చేసేవే కానీ.. ఏమాత్రం మంచి చేయవు. అలాగే ఆందోళన విచారానికి దారి తీస్తుంది. భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ.. చింతించడం అనేది జరుగుతుంది. అనవసరమైన విషయాల గురించి చింతించడం కలత చెందడం వల్ల ఏ లాభం జరగదు. అది ఒత్తిడికి గురి చేస్తుంది.

అతిలా ఆలోచించడాన్ని కట్టడి చేయడానికి మార్గాలు

1. థింక్-స్టాప్ పద్ధతి

ఈ పద్ధతిలో అసలు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో ఒక పేపర్ పై రాయాలి. అందులో తీవ్రంగా ఒత్తిడి కలిగించే వాటి నుండి తక్కువ ఒత్తిడి కలిగించే ఆలోచనల వరకు క్రమ పద్ధతిలో రాయాలి. ఇప్పుడు చిట్ట చివరగా ఉన్న దానిని తీసేసేందుకు ప్రయత్నించాలి. అంటే దాని గురించి ఆలోచించడం వల్ల లాభాలేమైనా ఉన్నాయా.. లేదా నష్టలేమైనా ఉన్నాయా అని బేరీజు వేసుకోవాలి. తర్వాత దాని వల్ల ఎలాంటి ప్రయోజనం లేనట్లు అనిపిస్తే దాని గురించి ఆలోచించకూడదని మనకు మనం మాట తీసుకోవాలి. దీని గురించి ఇక ఆలోచించను అని గట్టిగా అరిచి మనకు మనం చెప్పుకోవాలి. అలా క్రమంగా ఒకదాని తర్వాత ఒకటిగా ఆ జాబితా నుండి తొలిగించుకుంటూ పోవాలి. ఒకటవ నంబరు దగ్గరికి వచ్చే సరికి ఇది కూడా పెద్దగా ప్రయోజనం లేనిదే అనే భావన తెలియకుండానే వచ్చేస్తుంది.

2.ఫీలింగ్ పట్ల నిజాయతీగా ఉండాలి

ప్రతి ఒక్కరూ ఇతరుల పట్ల నిజాయితీగా ఉంటారా ఉండరా అనేది వారి స్వభావంపై ఆధారపడి ఉంటుంది. కానీ ఒక వ్యక్తి తనకు తాను ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండాలి. అప్పుడే మనకు ఏం కావాలి అనే దానికి కచ్చితమైన సమాధానం దొరుకుతుంది. భావోద్వేగాలను కట్టడి చేయాలనుకున్నప్పుడు, అవి మన మానసిక ఆరోగ్యాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఒత్తిడి, నిరాశ మరింతగా ప్రమాదాన్ని పెంచుతాయి. ఒక భావోద్వేగం కలిగితే దానిని అణచివేయాలనుకుంటే అది వేరే దారిలో బయట పడే అవకాశం ఉంటుంది. నొప్పి, అధిక రక్తపోటు వంటివి తలెత్తే ప్రమాదం ఉంటుంది. నిజమైన భావాలను అంగీకరించి తీరాలి. ఆ భావాలు బయటకు వచ్చినప్పుడు అవి మనకు ఇబ్బంది కలగజేస్తున్నట్లు అనిపిస్తే.. వాటిని నెమ్మదిగా కంట్రోల్ చేయాలన్న భావన కలుగుతుంది.

3. మైండ్‌ఫుల్‌నెస్

భావాలు, అనుభవాలు, ఆలోచనలను మంచివా, చెడువా అనేది ఆలోచించకుండా కేవలం వాటిపై దృష్టి పెట్టడమే మైండ్ డ్‌ఫుల్‌నెస్. దీనిని సాధన చేయడం వల్ల గతంలో, భవిష్యత్తులో కాకుండా వర్తమానంలో ఉండటం అలవడుతుంది. దీని వల్ల మంచిగా నిద్ర పడుతుంది.

ఇతర పద్ధతులు

* రాత్రి వేళ మంచిగా నిద్ర పోవాలి.
* అవసరం అనిపిస్తే ఇతరుల నుండి సాయం తీసుకోవాలి.
* పనిభారాన్ని సక్రమంగా నిర్వహించుకోవాలి.
* ఒత్తిడిని జయించేందుకు మార్గాలు వెతకాలి.
* ఆందోళన చెందడానికి ఒక సమయాన్ని పెట్టుకోవాలి. కేవలం ఆ సమయంలో మాత్రమే ఆందోళన చెందాలి.

English summary

Are you thinking too much? You can stop it with these tips in Telugu

read on to know Are you thinking too much? You can stop it with these tips in Telugu
Story first published: Tuesday, July 19, 2022, 15:10 [IST]
Desktop Bottom Promotion