Just In
- 7 hrs ago
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- 7 hrs ago
సంబంధంలో సాన్నిహిత్యం, నమ్మకాన్ని పెంపొందించడానికి చిట్కాలు
- 9 hrs ago
హీమోగ్లోబిన్ తక్కువైతే ప్రమాదమే..కార్డియాక్ అరెస్ట్ కు కారణం అవుతుంది. కాబట్టి, ఈ ఆహారాలు తినండి..
- 10 hrs ago
Vastu Tips: వ్యాపారంలో లాభాల కోసం ఈ వాస్తు చిట్కాలు పాటించండి
AI Predicting Stroke: ఒక్క ఎక్స్‌రేతో ఫ్యూచర్‌లో స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని చెప్పేస్తున్న..!
AI Predicting Stroke: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వేలాది సంఖ్యలో గుండె సంబంధిత మరణాలు నమోదు అవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ(World Health Organization-WHO) అంచనా ప్రకారం ఏటా 17.9 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. గుండె సంబంధిత సమస్యలపై, వాటి చికిత్సపై ప్రపంచవ్యాప్తంగా జోరుగా పరిశోధనలు జరుగుతున్నాయి.
గుండె సంబంధిత వ్యాధుల పరిశోధనల్లో మైలురాయిగా నిలిచే సాంకేతికతను నిపుణులు అభివృద్ధి చేశారు. మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ పరిశోధకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్(Artificial Intelligence- AI) సాయంతో ఒకే ఛాతీ ఎక్స్-రే ఉపయోగించి గుండె సంబంధిత సమస్యలను అంచనా వేసే ఏఐని అభివృద్ధి చేశారు. ఇది గుండె పోటు, గుండె సంబంధిత వ్యాధులతో మరణించే వ్యక్తి యొక్క 10 సంవత్సరాలు ప్రమాదాన్ని ముందే అంచనా వేస్తుంది.
చికాగోలోని రేడియోలాజికల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా(RSNA) వార్షిక సమావేశంలో నవంబర్ చివరలో ఈ అధ్యయన ఫలితాలను సమర్పించారు.

ఛాతీ ఎక్స్-రేతో గుండె జబ్బుల అంచనా
చాలా మంది ఛాతీ ఎక్స్-రేతో ఊపిరితిత్తులను చూస్తారు. అయితే ఛాతీ ఎక్స్-రేలోని గుండె, దాని పరిసర ప్రాంతాల్లో కనిపించే చిత్రాల ఆధారంగా ఎలాంటి సమస్య ఉందో రేడియాలజిస్ట్ అంచనా వేయొచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఛాతీ ఎక్స్-రేలో ఊపిరితిత్తులు, గుండెతో సహా ఇతర అవయవాలను కూడా రేడియాలజిస్టులు చూస్తారు.
గుండె ఉండాల్సిన దాని కంటే పెద్దదిగా ఉన్నట్లు కనిపిస్తే ఏదో సమస్య ఉందని భావించవచ్చని రేడియాలజిస్టులు చెబుతున్నారు. ఛాతీ ఎక్స్-రేలో బృహద్ధమని విస్తరించినట్లు కనిపిస్తే.. అక్కడ కాల్షియం ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేయవచ్చని చెబుతున్నారు. అలాగే ఊపిరితిత్తుల క్షేత్రాల స్థావరాలలో లేదా లోపల ఖాళీ ద్రవం పేరుకుపోయినట్లైతే ఊపిరితిత్తుల కణజాలంలో చూడవచ్చు. అలాగే గుండె సంబంధిత సమస్యలను అంచనా వేయవచ్చని చెబుతున్నారు.
ఏఐ అభివృద్ధి:
ప్రస్తుతం అధ్యయనం కోసం కృత్రిమ మేధస్సు(AI)ను ఉపయోగించి పరిశోధకులు లోతైన అభ్యాస నమూనాను అభివృద్ధి చేశారు.
క్యాన్సర్ స్క్రీనింగ్ ట్రయల్‌లో దాదాపు 41 వేల మంది నుండి 1.47 లక్షల కంటే ఎక్కువ ఛాతీ ఎక్స్-రేలను పరిశోధించాలి. హృదయ సంబంధిత వ్యాధులకు సంబంధించిన స్పాట్ నమునాలను శోధించడానికి శిక్షణ పొందిన CXR-CVD వ్యవస్థను ఉపయోగించారు.
ఏఐ అభివృద్ది చెందిన తర్వాత, ఒక వ్యక్తి యొక్క ఛాతీ ఎక్స్-రే ద్వారా అతనికి గుండె పోటు వచ్చే అవకాశం ఉందా లేదా అనే విషయాన్ని 10 సంవత్సరాల ప్రమాదాన్ని ఏఐ అంచనా వేయగలిగింది.
నెక్స్ట్ ఏంటి?
ఈ పరిశోధన కేవలం ప్రాథమికమైనదేనని, ఇంకా దీర్ఘకాలిక అధ్యయనాలు అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.

హార్ట్ స్ట్రోక్ రావడానికి ప్రధాన కారణాలు:
1. మెదడులో రక్తస్రావం. దీనిని బ్రెయిన్ హెమరేజ్ అని వ్యవహరిస్తుంటారు(హెమరాజిక్ స్ట్రోక్).
2. రక్తం గడ్డకట్టడం వల్ల ఏర్పడిన స్ట్రోక్: ఇస్కీమిక్ స్ట్రోక్.
౩. మెదడుకు రక్తాన్ని అడ్డుకుంటున్న ధమనిలోని బ్లాకేజ్, ధమనుల బలహీనతకు కూడా కారణం అవుతుంటాయి. ఈ పరిస్థితిని ట్రాన్సియంట్ ఇస్కీమిక్ అటాక్ అని వ్యవహరిస్తారు.
ఈ కారణాల వల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది:
* ధూమపానం
* కుటుంబ చరిత్ర
* ఊబకాయం
* డయాబెటిస్
* అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు
* రక్తపోటు
* ఒత్తిడి
* శారీరక స్తబ్ధత
* శ్రమ లేని జీవనశైలి

స్ట్రోక్ సంబంధించిన హెచ్చరిక సంకేతాలు:
* శరీరంలో కేవలం ఒకవైపునే చేతులు, కాళ్లు బలహీనంగా మారడం.
* ముఖం శుష్కించుకుని పోవడం
* మాట్లాడటంలో తడబాటు
* స్పృహ కోల్పోవడం
* ఆకస్మికంగా తీవ్రమైన తలనొప్పి
* దృష్టిపరమైన సమస్యలు