For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Covaxin:2-18 ఏళ్లలోపు వారికీ కరోనా టీకా... త్వరలోనే అందరికీ అందుబాటులోకి...నిపుణులు ఏం చెబుతున్నారంటే..

మన దేశంలో చిన్నారులకు కూడా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకొచ్చేసింది.

|

ఇప్పటివరకు మన దేశంలో 18 ఏళ్ల వయసు వారికి మాత్రమే కరోనా వ్యాక్సిన్ వేసేవారు. ఈ వయసు కంటే తక్కువ ఉండే వారికి వ్యాక్సిన్ గురించి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు.

Bharat Biotechs Covaxin Vaccine got emergency approval for kids aged 2-18 years

అయితే ఇప్పుడు ఆ టెన్షన్ కూడా పోయినట్టే. ఎందుకంటే భారత్ బయోటిక్ తయారుచేసిన కరోనా టీకా కోవాగ్జిన్ ను CDSCO(సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్)కు సమర్పించింది. దీనికి సంబంధించిన డేటాను సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్ కమిటీ(SEC) క్షుణ్ణంగా పరిశీలించింది. ఇందుకు సంబంధించిన సానుకూల వివరాలను వెల్లడించింది.

Bharat Biotechs Covaxin Vaccine got emergency approval for kids aged 2-18 years

అంతేకాదు అత్యవసర వినియోగానికి కూడా సిఫార్సు చేసింది. చివరగా SEC తన సిఫార్సును డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(DGCI)కి సమర్పించింది. ప్రస్తుతం DGCI ఆమోదం లభిస్తే.. ఈ టీకాలు 2 నుండి 18 సంవత్సరాల వయసు వారికి కూడా అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా మన దేశంలో ఈ టీకాలు ఎప్పటి నుండి అందుబాటులోకి రానున్నాయి.. నెలకు ఎన్ని కోట్ల ఉత్పత్తులు అవ్వనున్నాయి. ఇవి ఎక్కడి నుండి ఉత్పత్తి కానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మన దేశంలో ఇప్పటివరకు కోవాగ్జిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్ వీ, ఫైజర్ వంటి వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటన్నింటినీ 18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే అందజేస్తున్నారు. అయితే ఇప్పుడు భారత బయోటెక్ కంపెనీ 18 ఏళ్ల వయసులోపు వారికి టీకా అందించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుంది.

చిన్నారుల కోసం తయారు చేసిన ఈ టీకాకు సంబంధించిన ట్రయల్స్ విజయవంతంగా పూర్తయినట్లు ఆ కంపెనీ ప్రతినిధులు వివరించారు. చిన్నారులపై రెండు, మూడ దశలలో 525 మంది చిన్నారులపై 2-6 సంవత్సరాల వయసు వారిపై, 6-12 వారిపై, 12-18 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న వారిపై ఈ ట్రయల్స్ ను పూర్తి చేసినట్లు ఆ సంస్థ వివరించింది. DCGI అనుమతి లభిస్తే మన దేశంలో పిల్లలకు టీకాల ప్రక్రియ ప్రారంభమిస్తారని వెల్లడించింది.

Bharat Biotechs Covaxin Vaccine got emergency approval for kids aged 2-18 years

ఒకవేళ ఈ వ్యాక్సిన్ కు ఆమోదం లభిస్తే.. నెలకు సుమారు పది కోట్ల డోసుల ఉత్పత్తి చేసేందుకు.. తమ సామర్థ్యాన్ని మరింత పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు భారత్ బయోటిక్ తెలియజేసింది. ఇందుకు సంబంధించి ఇండియన్ ఇమ్యూనాలాజికల్స్, హెస్టర్ బయో సైన్సెస్ తో ఒప్పందం చేసుకున్నట్లు ఆ సంస్థ తెలియజేసింది.

కేంద్రం కూడా ఈ వ్యాక్సిన్ కు అనుమతులు మంజూరు చేసింది. కాబట్టి అతి త్వరలోనే అందరికీ ఈ కరోనా టీకాలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం 2 నుండి 18 ఏళ్లలో పు పిల్లలకు కరోనా వ్యాక్సిన్లు అందించేందుకు కేంద్రం మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు తెలిసింది.

"కోవాక్సిన్ అనేది క్రియారహితం చేయబడిన టీకా. ఇది DPT పోలియో ఫ్లూ వంటి దశాబ్దాల నుండి మనం ఉపయోగిస్తున్న ఇతర వ్యాక్సిన్‌ల మాదిరిగానే సాంప్రదాయ పద్ధతిలో తయారు చేయబడింది. ఇది ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా చాలా ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు నిర్ధారించబడింది. కాబట్టి ఇది పీడియాట్రిక్‌లో ఇదే ప్రభావాన్ని చూపుతుంది. ఇది పిల్లలను పాఠశాలకు పంపడానికి తల్లిదండ్రులలో విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి మాత్రమే కాకుండా, రక్షణను అందించడంలో కూడా సహాయపడుతుంది. "
డా. కాంచన్ చన్నవార్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, కామినేని హాస్పిటల్స్

FAQ's
  • 2-18 ఏళ్ల లోపు వారికి కరోనా టీకా ఎవరు తయారు చేశారు?

    రెండు నుండి 18 సంవత్సరాల వయసులోపు ఉండే వారికి కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ ను భారత బయోటిక్ కంపెనీ వారు హైదరాబాద్ కేంద్రంగా తయారు చేశారు. డిజిసిఐ ఆమోదం లభించగానే అందరికీ పంపిణీ చేయనున్నారు.

English summary

Bharat Biotech's Covaxin Vaccine got emergency approval for kids aged 2-18 years

The Subject Expert Committee (SEC) of the drug regulator has recommended granting an emergency use authorization to Covaxin for children aged 2-18 years. Know more.
Desktop Bottom Promotion