For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bleeding Tongue : అక్కడ నుండి రక్తం ఎందుకు వస్తుందో తెలుసా...!

మీ నోటి నుండి రక్తం ఎందుకు వస్తుందో కారణాలను తెలుసుకుందాం.

|

మనం ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే బ్రష్ చేసేటప్పుడు లేదా ఏదైనా ఆహారాన్ని తినేటప్పుడు మన నోట్లో నుండి అకస్మాత్తుగా రక్తం కారుతుంది. అది చిగుళ్ల నుండి ఎక్కువగా కారుతుంది.

Bleeding Tongue: Causes, Treatments, and Remedies in Telugu

కొన్నిసార్లు మన పెదాలను కొరుక్కున్నప్పుడు కూడా రక్తస్రావం అనేది తరచుగా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సాధారణ కారణాలే కాకుండా.. ఇతర కారణాల వల్ల కూడా మీ నోటి నుండి రెగ్యులర్ గా రక్తం కారుతుందట.

Bleeding Tongue: Causes, Treatments, and Remedies in Telugu

ముఖ్యంగా మీ పళ్లు తెల్లగా తెల్లగా కనిపించాలని ఎక్కువ బ్రష్ చేసినా.. అంటువ్యాధులు ఏదైనా సోకినా లేదా గాయాల వల్ల కూడా రక్తస్రావం జరుగుతుందట. అయితే ఇలా జరిగినప్పుడు మీరు ఆందోళన చెందాల్సిన పనిలేదు.

Bleeding Tongue: Causes, Treatments, and Remedies in Telugu

మీకు ఇలా అప్పుడప్పుడు జరిగితే పర్వాలేదు కానీ.. తరచుగా ఇలాగే రక్తస్రావం జరిగితే మాత్రం మీరు దీనిపై శ్రద్ధ వహించాల్సిందే. ముందుకు మీకే ఇలా ఎందుకు జరుగుతుందో కారణాలు తెలుసుకోవాలి. ఇది తీవ్రమైన వ్యాధిగా కాకముందే, మీరు నివారణ చర్యలు తీసుకోవాలి. అందుకోసం ఏమి చేయాలి.. ఎలాంటి రెమెడీలు పాటించాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

రక్తస్రావానికి కారణాలు..

రక్తస్రావానికి కారణాలు..

దంతాల కలుపుల కారణంగా

దంతాల కారణంగా

విరిగిన పళ్లు కారణంగా

రేడియేషన్ థెరపి వల్ల..

ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల

ఈ కారణాల వల్ల ఎక్కువగా నాలుక నుండి రక్తస్రావం జరుగుతుంది.

ఓరల్ ఫంగల్ ఇన్ఫెక్షన్..

ఓరల్ ఫంగల్ ఇన్ఫెక్షన్..

కాన్షిడియాసిస్ లేదా థ్రష్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు సాధారణంగా వస్తుంటాయి. శిశువులలో లేదా రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న వారిలో థ్రష్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇది కాకుండా యాంటీ బయాటిక్స్ తీసుకునే వ్యక్తులు నాలుకలో ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల రక్తం కారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల నోరు మరియు గొంతు వెనుక భాగంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. నోటి ఫంగల్ ఇన్ఫెక్షన్లను సాధారణంగా నాలుకను చూడటం ద్వారా మాత్రమే గుర్తిస్తారు. అదే సమయంలో యాంటీ ఫంగల్ క్రీమ్ వాడకం వల్ల థ్రష్ మరియు ఇతర ఫంగల్ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ఒకవేళ ఇవి మరింత ఎక్కువగా ఉంటే మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

అవి లేకపోవడం వల్ల..

అవి లేకపోవడం వల్ల..

మీ బాడీలో హార్మోన్లలో మార్పులు, ఒత్తిడి, జన్యుపరమైన సమస్యలు, విటమిన్ బి లోపం, అజీర్ణం వంటి వాటి వల్ల నోటిలో నుండి రక్తం తరచుగా కారుతుంది. ఇలాంటి సమయంలో కొన్ని సులభమైన చిట్కాలను పాటించాలి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం.

నెయ్యితో..

నెయ్యితో..

మీ నోటిలో గాయాలు అయినప్పుడు మరియు నాలుకపై కురుపులు వంటివి వచ్చినప్పుడు లేదా మంటగా ఉంటే అప్పుడు నెయ్యిని రాసుకోవాలి. దీన్ని ప్రతిరోజూ రాత్రి వేళలో నిద్రించే ముందు రాసుకోవాలి. అలా చేస్తే తెల్లారేసరికి మీకు ఆ గాయం నుండి ఉపశమనం లభించొచ్చు.

ఐస్ ముక్కతో..

ఐస్ ముక్కతో..

మీ నోటిలో అల్సర్ల వంటి వాటి వల్ల కూడా మంటగా అనిపిస్తు ఉంటుంది. అలాంటి సమయంలో మీ ఫ్రిజ్ లోని చిన్న ఐస్ ముక్కను తీసుకుని మంటగా ఉన్న చోట ఉంచాలి. అలా చేస్తే కూడా ఆ మంట తగ్గి మీకు హాయిగా అనిపిస్తుంది.

పెరుగుతో..

పెరుగుతో..

నోట్లో మంటగా ఉన్నప్పుడు.. పుల్లని పెరుగు తినండి. ఇది మీ రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఎక్కువగా చల్లని పదార్థాలు తినాలి. వేడి వేడిగా ఉండే ఆహారం, నీరు తీసుకోవడం మానుకోవాలి.

English summary

Bleeding Tongue: Causes, Treatments, and Remedies in Telugu

Most people will experience tongue bleeding from time to time. That’s because the location of your tongue makes it
Desktop Bottom Promotion