For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Blueberry Health Benefits:బ్లూ బెర్రీస్ తో బ్రెయిన్ పవర్ పెరుగుతుందని తెలుసా...

బ్లూ బెర్రీస్ తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.. వాటిని ఎలా వాడాలి.. ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా.. తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

|

ఆరోగ్యకరంగా జీవించాలని ఎవరు కోరుకోరు చెప్పండి. అందుకోసమే ప్రతిరోజూ డజర్ట్లు, పానీయాలు లేదా సలాడ్ లను తీసుకుంటారు. అలాగే తాజా పండ్లను తింటూ ఉంటారు.

Blueberry Health Benefits, Uses, Side Effects, Precautions in telugu

అలాంటి పండ్లలో ఒకటి బ్లూబెర్రీ. బలమైన సూపర్ ఫుడ్స్ లో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. చూడటానికి చిన్నగా ఉండే ఈ నీలి రంగు పండ్లు(blueberry) చాలా తియ్యగా, రుచికరంగా ఉంటాయి. అంతేకాదు ఇందులో అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. శాస్త్రవేత్తల అధ్యయనాల ప్రకారం, బ్లూబెర్రీస్ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

Blueberry Health Benefits, Uses, Side Effects, Precautions in telugu

అంతేకాదు మధుమేహం, ఊబకాయం మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అదనంగా, ఇది జీవక్రియ వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. మీరు వీటిని జ్యూస్ మాదిరిగా తయారు చేసుకుని తాగొచ్చు. అలాగే పండుగా మారిన సమయంలో నేరుగా తినొచ్చు లేదా వీటిని ఎండబెట్టి లేదా పొడితో తినొచ్చు. ఈ సందర్భంగా బ్లూ బెర్రీస్ తో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Health Benefits of Castor Oil :ఆముదం నూనెలో అందంతో.. ఆరోగ్య ప్రయోజనాలున్నాయని తెలుసా...Health Benefits of Castor Oil :ఆముదం నూనెలో అందంతో.. ఆరోగ్య ప్రయోజనాలున్నాయని తెలుసా...

యాంటీ ఆక్సిడెంట్స్ స్టోర్‌హౌస్

యాంటీ ఆక్సిడెంట్స్ స్టోర్‌హౌస్

బ్లూబెర్రీస్ ఆక్సిడెంట్ల పవర్‌హౌస్. వీటిలోని ఆంథోసైనిన్‌లు దీనికి లోతైన నీలం రంగును అందిస్తాయి. ఇది రక్తం నుండి ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. అంతేకాదు క్యాన్సర్‌తో సహా వివిధ వ్యాధుల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. బ్లూబెర్రీస్ సాధారణ పండ్లు మరియు కూరగాయల కంటే ఎక్కువ యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉన్నాయని అధ్యయనం ద్వారా తెలుస్తోంది. దీన్ని రెగ్యులర్ గా తీసుకుంటే గుండెకు మంచిది. ఇది న్యూరోడెజెనరేటివ్ వ్యాధులు మరియు జీర్ణ సమస్యల నుండి రక్షిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలు క్యాన్సర్, గుండె జబ్బులు, అల్జీమర్స్ మరియు పార్కిన్సన్స్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుండి శరీరాన్ని రక్షిస్తాయి.

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది..

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది..

ఒరెగాన్ స్టేట్ యూనివర్శిటీ అధ్యయనం ప్రకారం బ్లూబెర్రీస్‌లోని స్టెరోస్టిల్‌బెన్ మానవ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే కారకాలు. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో పోరాడే శరీరం యొక్క మొదటి రక్షణ మరియు సామర్థ్యంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అనేక యాంటీబయాటిక్‌లు వాటి ప్రభావాన్ని కోల్పోతాయి కాబట్టి ఆకస్మిక రోగనిరోధక ప్రతిస్పందన ముఖ్యం. బ్లూబెర్రీస్‌లో ఉండే ఫ్లేవనాయిడ్స్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటాయి. ఇది దగ్గు మరియు జలుబులను పట్టుకునే ప్రమాదాన్ని కూడా గణనీయంగా తగ్గిస్తుంది.

కొవ్వును తగ్గిస్తుంది..

కొవ్వును తగ్గిస్తుంది..

జర్నల్ ఆఫ్ ది పబ్లిక్ లైబ్రరీ ఆఫ్ సైన్స్ (PLOS)లో ప్రచురించబడిన ఒక కథనం అడవి బ్లూబెర్రీస్ తినడం వల్ల అధిక కొవ్వు ఆహారం యొక్క ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయని కనుగొన్నారు. వైల్డ్ బ్లూబెర్రీ లేదా బిల్బెర్రీ చిన్నది మరియు సాధారణ బ్లూబెర్రీస్ కంటే ఎక్కువ ప్రయోజనాలను కలిగి ఉంటుంది. వైల్డ్ బ్లూబెర్రీస్ రక్తపోటును నియంత్రించడంలో కూడా ప్రభావవంతంగా ఉన్నాయని తూర్పు ఫిన్లాండ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు కనుగొన్నారు. అధిక రక్తపోటు తరచుగా ఊబకాయం సంబంధిత వ్యాధులతో ముడిపడి ఉంటుంది.

Mushroom Health Benefits: మీకు తెలుసా? పుట్టగొడుగులను ఔషధాలలో కూడా ఉపయోగిస్తారు!Mushroom Health Benefits: మీకు తెలుసా? పుట్టగొడుగులను ఔషధాలలో కూడా ఉపయోగిస్తారు!

బ్లడ్ ప్రెజర్ తగ్గుదల..

బ్లడ్ ప్రెజర్ తగ్గుదల..

బ్లూబెర్రీస్ ను డైట్ లో భాగంగా చేసుకుంటే రక్త పోటు సమస్యల నుండి ఉపమశనం లభిస్తుంది. దీని వల్ల గుండెపోటు సమస్యలు తగ్గుతాయి. ఇవి పొడి రూపంలో లేదా ఫ్రోజెన్ వి అయినా కూడా చాలా ప్రయోజనాలు ఉంటాయట.

బ్రెయిన్ పవర్ మెరుగ్గా..

బ్రెయిన్ పవర్ మెరుగ్గా..

బ్లూబెర్రీస్ తో బ్రెయిన్ పవర్ కూడా మెరుగవుతుందట. అలాగే మన చర్మంపై ముడతలకు కారణమయ్యే బ్రెయిన్ ఫంక్షన్ పై ఇది చాలా ప్రభావం చూపుతుందట. అందుకే బ్లూబెర్రీలోని యాంటీ ఆక్సిడెంట్ మానసిక క్షీణత అంటే మెంటల్ డిక్లైన్ ను తగ్గిస్తాయట.

టైప్-2 డయాబెటిస్ తగ్గుదల..

టైప్-2 డయాబెటిస్ తగ్గుదల..

బ్లూబెర్రీస్ తీసుకోవడం వల్ల టైప్-2 డయాబెటిస్ నుండి కచ్చితంగా ఉపశమనం పొందొచ్చు. దీని గురించి దాదాపు 25 సంవత్సరాల వరకు సుదీర్ఘకాలం పాటు అధ్యయనం కొనసాగింది. వారంలో కనీసం మూడు సార్లు బ్లూ బెర్రీస్ తింటే టైప్-2 డయాబెటిస్ నుండి కచ్చితంగా ఫలితం వస్తుందని అధ్యయనం చెబుతోంది. అలాగే రోజుకు ఒకటి లేదా రెండు గ్లాసుల బ్లూబెర్రీస్ వేరే ఫ్లెవనాయిడ్ రిచ్ ఫ్రూట్స్ తో కలిపి తరచుగా తీసుకుంటే చాలా చురుగ్గా ఉంటారు.

దైవ స్వరూపమైన 'అశ్వత్థ చెట్టు లేదా రావి చెట్టు' ఆకుల ఔషధ గుణాలు..!!దైవ స్వరూపమైన 'అశ్వత్థ చెట్టు లేదా రావి చెట్టు' ఆకుల ఔషధ గుణాలు..!!

చర్మ సౌందర్యం పెరుగుదల..

చర్మ సౌందర్యం పెరుగుదల..

మీ చర్మం నిరంతరం మృతకణాల వల్ల పాడవుతుంటుంది. ఈ మృతకణాలు పెరిగితే పగుళ్ళు ఏర్పడతాయి. అయితే, బ్లూ బెర్రీల సహాయంతో, దీన్ని నివారించడం సాధ్యమే. ఈ పండులో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు మృత కణాలను సమర్ధంగా తొలగించి, తద్వారా పగుళ్ళు లేకుండా చేస్తాయి.

బరువు తగ్గుదల..

బరువు తగ్గుదల..

బ్లూబెర్రీస్ లో ఉండే పోషకాల వల్ల మీరు బరువు కూడా తగ్గొచ్చు. ఇందులో డైటరీ ఫైబర్ బరువు తగ్గేందుకు చాలా వరకు సహాయపడుతుంది. అంతేకాదు ఇది జీర్ణ వ్యవస్థలోనూ మంచిగా పని చేస్తుంది. అయితే దీనిపై మరింత లోతుగా అధ్యయనాలు జరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

FAQ's
  • బ్లూబెర్రీస్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

    శాస్త్రవేత్తల అధ్యయనాల ప్రకారం, బ్లూబెర్రీస్ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అంతేకాదు మధుమేహం, ఊబకాయం మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అదనంగా, ఇది జీవక్రియ వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

  • బ్లూ బెర్రీస్ ను ఎలా తీసుకోవచ్చు?

    బ్లూ బెర్రీస్ పండ్లతో జ్యూస్ మాదిరిగా తయారు చేసుకుని తాగొచ్చు. అలాగే పండుగా మారిన సమయంలో నేరుగా తినొచ్చు లేదా వీటిని ఎండబెట్టి లేదా పొడితో తినొచ్చు. ఈ సందర్భంగా బ్లూ బెర్రీస్ తో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

  • బ్లూ బెర్రీస్ ఎలాంటి పోషకాలు ఉంటాయి?

    బ్లూ బెర్రీస్ లో అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఫైబర్, విటమిన్ సి, విటమిన్ కె, మాంగనీస్ అధికంగా ఉంటుంది. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కేలరీస్ కూడా తక్కువగా ఉంటాయి.

English summary

Blueberry Health Benefits, Uses, Side Effects, Precautions in telugu

Here we are discussing about the bluberry health benefits, uses, side effects, precautions in Telugu. Have a look
Story first published:Tuesday, November 16, 2021, 14:01 [IST]
Desktop Bottom Promotion