For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషులు సోయా మిల్క్ తాగడం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ మరియు డయాబెటిస్ రాకుండా చేస్తుందా?

పురుషులు సోయా మిల్క్ తాగడం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ మరియు డయాబెటిస్ రాకుండా చేస్తుందా?

|

సోయా మిల్క్ నాన్ డైడీ ప్రొడక్ట్. ఇది మొక్కల ఆధారిత పదార్థం. సోయా మిల్ ను సోయా బీన్స్ నుండి తయారుచేయబడుతుంది. పాల ఉత్పత్తులు తీసుకోని శాఖాహారులకు సోయా మిల్క్ ఉత్తం. డైరీ ప్రొడక్ట్స్ తో పోల్చితే ఇందులో విటమిన్ బి, విటమిన్ డి, మెగ్నీషియం, ఒమేగా 6 మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. దీన్ని తాగడం వల్ల అనారోగ్య సమస్యలను దూరం అవుతాయి.

can drinking soy milk prevent diabetes and prostate cancer in men

సోయా పాలను పురుషుల రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే డయాబెటిస్ వస్తుందనే భయం ఉండదు. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతే కాదు, పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ నివారించబడుతుంది. కాబట్టి పురుషుల రెగ్యులర్ డైట్ లో సోయా మిల్క్ తప్పనిసరిగా చేర్చుకోవాలి.

సోయా బీన్స్ ను నీటిలో వేసి రాత్రంతా నానబెట్టి, గ్రైండ్ చేసి, ఫిల్టర్ చేయడం ద్వారా సోయా మిల్క్ ను తయారు చేస్తారు. సోయా బీన్స్‌లోని అన్ని పోషకాలు సోయా పాలను ఆరోగ్యకరమైన పానీయంగా మారుస్తాయి. ఇప్పుడు, సోయా మిల్క్ లో దాగున్న 7 అద్భుతమైన ప్రయోజనాల గురించి ఇక్కడ చూద్దాం.

ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

మగవారిలో టెస్టోస్టెరాన్ హార్మోన్ అధికంగా స్రవించడం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తుంది. సోయా మిల్క్‌లో ఉండే ఫైటో-ఈస్ట్రోజెన్‌లు టెస్టోస్టెరాన్ అధికంగా స్రావాన్ని నిరోధించడంలో సహాయపడతాయి.

డయాబెటిస్ నివారిస్తుంది

డయాబెటిస్ నివారిస్తుంది

సోయా మిల్క్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెర శోషణను ఆలస్యం చేయడంలో మరియు డయాబెటిస్ నిరోధించడంలో సహాయపడుతుంది. మధుమేహంతో బాధపడేవారు దీన్ని ఆహారంలో చేర్చుకోవచ్చు.

కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది

కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది

సోయా మిల్క్ ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించవచ్చు. ఇందులో ఉండే అధిక మొత్తంలో ఫైబర్ శరీరం నుండి హానికరమైన పదార్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది.

బరువును తగ్గిస్తుంది

బరువును తగ్గిస్తుంది

సాధారణ పాలతో పోలిస్తే, సోయా పాలలో షుగర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది మరియు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్ కంటెంట్ ఎక్కువ సమయం ఆకలి కాకుండా నిరోదిస్తుంది. ఇది మీరు తినే ఆహారాన్ని తగ్గిస్తుంది, తద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

రక్తనాళాలను బలపరుస్తుంది

రక్తనాళాలను బలపరుస్తుంది

సోయా మిల్క్‌లో ఒమేగా-6 మరియు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండటం వల్ల రక్తనాళాలు బలపడతాయి. ఇది రక్త ప్రసరణను నియంత్రిస్తుంది మరియు గుండెకు హానిని నివారిస్తుంది.

బోలు ఎముకల వ్యాధిని నివారిస్తుంది

బోలు ఎముకల వ్యాధిని నివారిస్తుంది

బోలు ఎముకల వ్యాధికి అనేక కారణాలున్నాయి. బోలు ఎముకల వ్యాధి ఎముకలను బలహీనపరుస్తుంది. దాంతో ఎముకలు సులభంగా విరిగిపోయో పరిస్థితి ఏర్పడుతుంది. సోయా మిల్క్ లోని ఫైటో ఈస్ట్రోజెన్ లు ఎముకలకు కావల్సిన కాల్షియంను గ్రహించేలా చేస్తాయి. దాంతో ఎముకలు దృఢంగా తయారవుతాయి. సోయా మిల్క్ పౌడర్‌ని నీటిలో కలిపి తాగినా ఎముకలు దృఢంగా మారుతాయి.

మెనోపాజ్ లక్షణాలను నివారిస్తుంది

మెనోపాజ్ లక్షణాలను నివారిస్తుంది

సాధారణంగా, మహిళల్లో మెనోపాజ్ తర్వాత శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గుతాయి. దీని కారణంగా, శరీర ఉష్ణోగ్రత వేగంగా పెరుగుతుంది. సోయా మిల్క్‌లోని ఫైటోఈస్ట్రోజెన్ ఈ లక్షణాలను నివారిస్తుంది.

సోయా పాలలోని పోషకాంశాలు

సోయా పాలలోని పోషకాంశాలు

* సోయా పాలలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి.

* సోయా మిల్క్‌లోని కాల్షియం ఎముకలను దృఢపరుస్తుంది.

* సోయా పాలు బి-విటమిన్లు, ఐరన్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులకు మంచి మూలం.

* సోయా మిల్క్‌లో ఆరోగ్యవంతమైన శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి.

* సోయా మిల్క్ శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెంచి, చెడు కొలెస్ట్రాల్ తగ్గించడం ద్వారా కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది.

English summary

can drinking soy milk prevent diabetes and prostate cancer in men

Soy milk is good for health. The best benefits of drinking soy milk are weight loss and diabetes prevention. Read on to know more...
Story first published:Thursday, January 19, 2023, 12:00 [IST]
Desktop Bottom Promotion