For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిరంజీవికి Covid-19 పాజిటివ్ : హోమ్ ఐసోలేషన్లో ఎన్ని రోజులుండాలి... ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి...

కరోనా వైరస్ తర్వాత హోమ్ ఐసోలేషన్లో ఉండే రోగులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

|

మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోందని.. అందరూ భావించారు. కానీ ఈ కరోనా భూతం చాప కింద నీరులా నెమ్మదిగా విస్తరిస్తోంది. సామాన్యుల నుండి సెలబ్రెటీల వరకు అందరూ దీని బారిన పడుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి కరోనా లక్షణాలు లేకపోయినప్పటికీ కోవిద్-19 పాజిటివ్ వచ్చింది.

Chiranjeevi Tests positive for COVID-19: Home Isolation Guidelines For Coronavirus Patients

ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తాను 'ఆచార్య' షూటింగ్ ప్రారంభించే ముందు కరోనా టెస్టులో భాగంగా పరీక్షలు చేసుకున్నానని.. అందులో పాజిటివ్ వచ్చినట్లు ఆయన ప్రకటించారు.

ఎలాంటి లక్షణాలు లేకున్నా పాజిటివ్ వచ్చింది కాబట్టి హోమ్ క్వారంటైన్ అయ్యాను. ఇటీవల సుమారు 4-5రోజులుగా నన్ను కలిసిన వారంతా కరోనా టెస్టు చేయించుకోవాలని కోరారు. ఎప్పటికప్పుడు తన ఆరోగ్య పరిస్థితిని కూడా తెలియజేస్తానంటూ చిరంజీవి చెప్పారు.

Chiranjeevi Tests positive for COVID-19: Home Isolation Guidelines For Coronavirus Patients

ఈ సందర్భంగా కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత హోమ్ ఐసోలేషన్లో ఉండేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం ఈ పద్ధతులు పాటిస్తే, మీరు కరోనా చైన్ లింకును బ్రేక్ చేయవచ్చు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

ప్రత్యేక గదిలో..

ప్రత్యేక గదిలో..

కరోనా పాజిటివ్ వచ్చిన రోగులంతా హోమ్ ఐసోలేషన్లో భాగంగా ప్రత్యేక గదిని ఏర్పాటు చేసుకోవాలి. ఎవరితోనూ నేరుగా సంబంధాలు పెట్టుకోరాదు. సుమారు నాలుగైదు రోజుల పాటు ఒంటరిగా గడపాలి.

ఒక సంరక్షకుడు..

ఒక సంరక్షకుడు..

కరోనా రోగి పర్యవేక్షణకు 24 గంటల పాటు ఒక సంరక్షకుడిని అందుబాటులో ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు వైద్యుల సలహాలను, సూచనలను పాటించాలి. వారు చెప్పిన విధంగా మందులను, ఆహారాన్ని తీసుకోవాలి.

మెడికల్ మాస్క్..

మెడికల్ మాస్క్..

కరోనా సోకిన రోగులు ప్రత్యేక గదిలో ఉన్నప్పుడు ట్రిపుల్ లేయర్ మెడికల్ మాస్క్ ధరించాలి. ముఖ్యంగా సంరక్షకుల ముఖం, ముక్కు లేదా నోటిని తాకకుండా ఉండాలి. రోగులు ఉండే గది, ప్రాంతం పరిశుభ్రంగా ఉండా చూసుకోవాలి.

పరిశుభ్రత విషయంలో..

పరిశుభ్రత విషయంలో..

కరోనా రోగులు క్రమం తప్పకుండా చేతులను సబ్బుతో కడుక్కోవాలి. మీరు తాగే నీటిని వేడి చేసుకుని.. అవి వెచ్చగా అయిన తర్వాతే తాగాలి. మీరు వాడే బట్టలు బాగా ఆరిన వాడాలి. ముఖ్యంగా తడిగా ఉండే టవ్వాళ్ల వంటి వాటిని ఉపయోగించకూడదు.

60 ఏళ్ల పైబడిన వారు..

60 ఏళ్ల పైబడిన వారు..

60 ఏళ్ల వయసు దాటిన వారు రక్తపోటు(బిపి), డయాబెటిస్, గుండెజబ్బులు, శ్వాస, ఊపిరితిత్తులు, కాలేయం మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు కరోనా బారినపడితే.. కచ్చితంగా డాక్టర్ల పర్మిషనత్ తోనే హోమ్ ఐసోలేషన్ లో ఉండాలి.

ఆరోగ్యసేతు యాప్..

ఆరోగ్యసేతు యాప్..

అయితే కరోనా రోగులంతా కచ్చితంగా ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని.. అలాగే దాన్ని యాక్టివ్ గా ఉంచుకోవాలి. అలాగే, రోగితో సన్నిహితంగా ఉండేవారు ముందు జాగ్రత్త చర్యగా డాక్టర్ సలహ మేరకు హైడ్రోక్లోరోక్విన్ మెడిసిన్ ను అందుబాటులో ఉంచుకోవాలి.

ఈ లక్షణాలు కనిపిస్తే..

ఈ లక్షణాలు కనిపిస్తే..

కరోనా రోగుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కేంద్రం సూచించింది. శ్వాస తీసుకోవడంలో ఏ మాత్రం ఇబ్బంది, ఆక్సిజన్ స్థాయిలో తగ్గుదల, గుండెనొప్పి, మూర్ఛ, నీరసం, పెదవులు, ముఖంలో నీలి రంగు వంటి లక్షణాలు కనిపిస్తే, వారికి వెంటనే ట్రీట్మెంట్ అందించాలని తెలిపారు.

ఐసోలేషన్ తర్వాత..

ఐసోలేషన్ తర్వాత..

ఇంట్లోనే హోమ్ ఐసోలేషన్లో ఉన్న కరోనా రోగులకు లక్షణాలు ఉన్నా, లేకున్నా.. సుమారు పది రోజులు గడిచిన తర్వాత వరుసగా మూడు రోజులు జ్వరం లేకుండా ఉంటే వారు డిశ్చార్జ్ చేసినట్లు భావించాలని తాజా మార్గదర్శకాల్లో వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. అయితే కరోనా రోగులకు హోం ఐసోలేషన్ పూర్తయిన తర్వాత మళ్లీ పరీక్షలు నిర్వహించాల్సిన లేదని స్పష్టం చేసింది.

English summary

Chiranjeevi Tests positive for COVID-19: Home Isolation Guidelines For Coronavirus Patients

The set of guidelines developed by the Ministry of Health & Family Welfare also includes the steps to be considered by caregivers, while looking after COVID-19 patients in home isolation.
Story first published:Monday, November 9, 2020, 14:15 [IST]
Desktop Bottom Promotion