Just In
- 52 min ago
భాగస్వామితో పెరుగుతున్న విభేదాలను తొలగించడానికి ఈ పనులు చేయండి
- 4 hrs ago
Chanakya Niti: ఈ పనులతో పేదలు కూడా ధనవంతులు అవుతారు, అవేంటంటే..
- 9 hrs ago
Today Rasi Palalu 28January 2023: ఈ రోజు తులారాశి వారికి అకస్మిక ధనలాభం
- 17 hrs ago
ఈ 5 రాశుల వారు తమ భాగస్వామిని ఎప్పుడూ అనుమానిస్తూనే ఉంటారు..మాటలతో చిత్రహింసలకు గురిచేస్తారు
Corbevax:మూడో వ్యాక్సిన్ వచ్చేసింది.. ఇది 12-17 ఏళ్ల వారికీ వేయొచ్చట...!
మన దేశంలో మరో వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు మన భారతదేశంలో కేవలం రెండు వ్యాక్సిన్లే బాగా పాపులర్ పేసులో ఉన్నాయి. కోవిషీల్డ్, కోవాగ్జిన్ వంటివి అందుబాటులో ఉన్నాయి. స్పుత్నిక్ వి, ఫైజర్ వంటి విదేశీ టీకాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఇన్ని టీకాలు వచ్చినా అది చిన్న పిల్లలకు కాదని చెప్పేవారు. అయితే తాజాగా 12-17 సంవవత్సరాల వారికి మూడో టీకా వేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనికి సంబంధించి తాజాగా డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా(DGCI) 12-17 వయసున్న వారికి టీకాను అత్యవసర పరిస్థితుల్లో వేయొచ్చని బయోలాజికల్ ఈ సంస్థకు ఆమోదముద్ర వేసింది. దీంతో కార్బొవాక్స్ మూడో టీకా త్వరలో మార్కెట్లో అందుబాటులోకి రానుంది.
ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఇప్పటికే 5 కోట్ల డోసుల కార్బొవాక్స్ డోస్ ల కొనుగోలు కోసం ఆర్డర్ ఇచ్చినట్లు తెలిపింది. ఈ వ్యాక్సిన్ ఫిబ్రవరి చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని బయోటెక్ యొక్క కోవాక్సిన్ మరియు జైడస్ కాడీలా యొక్క 2yCov-D తర్వాత పిల్లలకు అత్యవసర వినియోగానికి ఆమోదముద్ర వేసిన మూడో వ్యాక్సిన్ ఇది. ప్రస్తుతం 15 ఏళ్లు పైబడిన పిల్లలకు మాత్రమే టీకాలను వేస్తున్నారు. కోవిషీల్డ్ తయారీదారులైన సీరమ్ ఇనిస్ట్యూటిట్ ఆఫ్ ఇండియా(SII) కూడా 12-17 సంవత్సరంలోపు యువకులకు కార్బోవాక్స్ అత్యవసర ఉపయోగం కోసం నియంత్రణ అనుమతి కోరింది.
వాస్తవానికి బయోలాజికల్ ఈ కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి గత సంవత్సరం 2021లో డిసెంబర్ 28వ తేదీనే అత్యవసర వినియోగానికి అనుమతులు లభించాయి. తాజాగా 12 నుంచి 17 ఏళ్లలోపు వయసు వారికి ఈ టీకాను వేసేందుకు అనుమతులు ఇచ్చింది.
కోర్బోవాక్స్ ఎన్ని డోసులంటే..
ఈ వ్యాక్సిన్ ను కూడా రెండు డోసులను వేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు డోసుల మధ్య గ్యాప్ సుమారు 28 రోజుల వరకు ఉండాలి. ఈ వ్యాక్సిన్ ను 2-8 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ చేయాల్సి ఉంటుంది. ఒక్కో డోసు 5ml చొప్పున మొత్తం 10ml ఇవ్వాల్సి ఉంటుంది.
వాస్తవానికి బయోలాజికల్ ఈ కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి గత సంవత్సరం 2021లో డిసెంబర్ 28వ తేదీనే అత్యవసర వినియోగానికి అనుమతులు లభించాయి. తాజాగా ఫిబ్రవరి 21వ తేదీన సోమవారం నాడు 12 నుంచి 17 ఏళ్లలోపు వయసు వారికి ఈ టీకాను వేసేందుకు Drug Controller General of India (DCGI) అత్యవసర వినియోగం కోసం అనుమతులు ఇచ్చింది.
ఈ వ్యాక్సిన్ ను కూడా రెండు డోసులను వేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు డోసుల మధ్య గ్యాప్ సుమారు 28 రోజుల వరకు ఉండాలి. ఈ వ్యాక్సిన్ ను 2-8 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ చేయాల్సి ఉంటుంది. ఒక్కో డోసు 5ml చొప్పున మొత్తం 10ml ఇవ్వాల్సి ఉంటుంది.