For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఖచ్చితంగా మీరు తెలుసుకోవల్సిన కరోనావైరస్ అపోహలు మరియు వాస్తవాలు

ఖచ్చితంగా మీరు తెలుసుకోవల్సిన కరోనావైరస్ అపోహలు మరియు వాస్తవాలు

|

కరోనావైరస్ ప్రపంచంలోని అంటార్కిటికా మినహా అన్ని ఖండాలకు వ్యాపించింది. యునైటెడ్ స్టేట్స్లో, ప్రయాణించిన మరియు బాధితుడితో సంబంధం ఉన్న వ్యక్తికి కరోనావైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ప్రతిరోజూ, ఇటలీ మరియు దక్షిణ కొరియా కరోనాను ప్రభావితం చేసిన అనేక కేసులను చూస్తున్నాము. మధ్యప్రాచ్యంలో, ఎప్పటికప్పుడు కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా వార్తలు వ్యాప్తి చెందుతున్నప్పుడు, కరోనా ప్రభావితం కాకుండా నిరోధించడానికి ఏమి చేయవచ్చో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

వ్యాధికారక కరోనా వైరస్ ఒక వ్యక్తి శరీరంలో ప్రవేశించి, శరీరం అంతా వ్యాపించి వ్యాధి లక్షణాలు రావటానికి పట్టే కాలాన్ని ఇంక్యుబేషన్ పిరియడ్ అంటారు. ఇది 10-14 రోజుల వరకూ ఉండవచ్చు. అందాకా ఏ లక్షణాలూ కనిపించనంత మాత్రాన ఆ వ్యక్తి ఆరోగ్యవంతుడనటానికి వీల్లేదు. కానీ, ఆ సమయంలో పరీక్షలు చేసినా వైరస్ దొరక్క పోవచ్చు. ఇంక్యుబేషన్ పీరియడ్‌లో ఉన్న వ్యక్తి ఈ వ్యాధి వ్యాపించటానికి పెద్ద కారణం కాకపోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫిబ్రవరి 1న విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

ఖచ్చితంగా మీరు తెలుసుకోవల్సిన కరోనావైరస్ అపోహలు మరియు వాస్తవాలు

కరోనా వైరస్ ప్రమాదం దేశదేశాలకూ విస్తరిస్తున్న కొద్దీ ఈ వ్యాధి గురించిన అవగాహన కలిగించే ప్రయత్నాల కన్నా భయపెట్టేవీ, అపోహల్ని కలిగించేవీ ప్రచారంలోకి రావటం గురించి కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన ప్రకటించింది.

ఇది కూడా మామూలు ఫ్లూలాంటిదేననే అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో చాలా మంది రాస్తున్నారు. కరోనా వైరస్‌ల్లో కూడ్ COVID-19 లాంటి తక్కువ ప్రమాదకరమైన వైరస్‌ల వలన వచ్చే ఊపిరితిత్తుల లక్షణాలు ఎక్కువ మందిలో తేలికగా తగ్గే అవకాశం ఉంది. కోవిడ్ 19 కన్నా సార్స్ కరోనావైరస్ ఎక్కువ ప్రమాదకారి. అయితే గతంలో వచ్చిన ఎబోలా లాంటి వ్యాధులు ఇంతకన్నా ప్రమాదకరమైన వాటినే మానవాళి తట్టుకుంది. నిరోధించగలిగింది. ప్రమాదంలోంచి బయటపడటానికి శాస్ర్తియంగా ఆలోచించటమే ముఖ్యం.

ఈ ప్రభావాన్ని అధిగమించడానికి ప్రతి దేశంలో ప్రతి ప్రభుత్వం చాలా కృషి చేస్తోంది. ఈ ప్రభావానికి నివారణను కనుగొనడానికి శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అదే సమయంలో, వివిధ ఆరోగ్య సంరక్షణ సంస్థలు వైరస్ వ్యాప్తి గురించి అపోహలను తొలగిస్తున్నాయి.

Coronavirus: Myths And Facts About COVID-19 You Should Know

ప్రపంచ ఆరోగ్య సంస్థ తరచూ చేతులు కడుక్కోవడం, దగ్గు సమయంలో నోటి రుమాలు లేదా చేయి అడ్డు పెట్టుకోవడం వంటి కొన్ని మార్గదర్శకాలను జారీ చేయగా, కొన్ని ముందుజాగ్రత్త చర్యలతో పాటు చికిత్స లేదా నివారణ పద్దతులను సూచిస్తున్నాయి. అయితే ప్రజల్లో ఈ వ్యాధి పట్ల కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. వాటిని నివ్రుత్తి చేయడానికి ఈ వ్యాసం మీకు సహాయపడుతుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ అటువంటి అపోహల సంకలనాన్ని ప్రచురించింది. వాటిలో కొన్నింటిని మీ కోసం ఇక్కడ అందించాము. వీటి గురించి తెలుసుకోండి మరియు కరోనావైరస్ సంక్రమణ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి.

అపోహ 1: ఉప్పునీరు వాడటం కరోనాను నివారిస్తుంది.

అపోహ 1: ఉప్పునీరు వాడటం కరోనాను నివారిస్తుంది.

వాస్తవం:

ఉప్పు నీటితో ముక్కు కడగడం ద్వారా కరోనా వైరస్ వ్యాధిని నివారించవచ్చని ఎటువంటి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ విధానం సాధారణ దగ్గు, జలుబు మాత్రమే ఉపశమనం పొందగలదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. కానీ ఈ టెక్నిక్ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని నివారించడంలో సహాయపడదు.

అపోహ 2: యాంటీ బయోటిక్ మందులు ఉత్తమ పరిష్కారాన్ని అందిస్తాయి.

అపోహ 2: యాంటీ బయోటిక్ మందులు ఉత్తమ పరిష్కారాన్ని అందిస్తాయి.

వాస్తవం:

యాంటీబయాటిక్స్ ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడతాయి. కానీ ఈ వైరస్‌కు చికిత్స చేసే టీకాలు లేవు. శాస్త్రవేత్తలు ప్రస్తుతం దీనిని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు.

అపోహ 3: హ్యాండ్ డ్రైయర్‌ను ఉపయోగించడం వల్ల వైరస్‌ను చంపవచ్చు.

అపోహ 3: హ్యాండ్ డ్రైయర్‌ను ఉపయోగించడం వల్ల వైరస్‌ను చంపవచ్చు.

వాస్తవం:

చేతులను ఆరబెట్టేది వాడటం సంక్రమణను నివారించగలదని కొందరు నమ్ముతారు. కానీ ఇది నిజం కాదు. నీరు మరియు సబ్బుతో చేతులు కడుక్కోవడం ఉత్తమ పద్ధతి. ఆల్కహాల్ బేస్ ఉన్న మందులు స్వల్పంగా మాత్రమే ప్రయోజనకరంగా ఉంటాయి.

అపోహ 4: వెల్లుల్లి తింటే కరోనా రాదా? వెల్లుల్లి తీసుకోవడం సంక్రమణను నివారించవచ్చు.

అపోహ 4: వెల్లుల్లి తింటే కరోనా రాదా? వెల్లుల్లి తీసుకోవడం సంక్రమణను నివారించవచ్చు.

వాస్తవం:

వెల్లుల్లి యాంటీ సూక్ష్మజీవి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఖండించలేదు. కానీ వెల్లుల్లి తీసుకోవడం సంక్రమణను నివారిస్తుందనేది నిజం కాదు. కానీ మీ శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అదే సమయంలో, కరోనావైరస్ ప్రమాదం నివారించబడదు.

అపోహ 5: ఎండ పెరిగితే కరోనా రాదా?

అపోహ 5: ఎండ పెరిగితే కరోనా రాదా?

వాస్తవం:

అలా రుజువు కాలేదు. ఇదివరకు వచ్చిన స్వైన్ ఫ్లూ సహా చాలా వైరస్‌లు ఎండా కాలంలో కూడా ప్రభావం చూపాయి. ఇప్పటివరకూ కరోనా వైరస్ ఎండల్లో రాదనేందుకు ఆధారాలు లభించలేదు. ఎండలో ఉన్నంత మాత్రాన కరోనా వైరస్ చనిపోతుందనేందుకు ప్రూఫ్ లేదు. శరీరంలో కరోనా ప్రవేశిస్తే... బాడీలోని రోగ నిరోధక శక్తి వల్లే అది చనిపోతుంది తప్ప... వేడి వల్ల చావట్లేదు.

అపోహ 6 : హ్యాండ్ శానిటైజర్ కరోనాను ఆపేస్తుందా

అపోహ 6 : హ్యాండ్ శానిటైజర్ కరోనాను ఆపేస్తుందా

వాస్తవం:

మనం రోజూ వాడే సబ్బుల కంటే హ్యాండ్ శానిటైజర్ అనేది మరింత శక్తిమంతమైన లిక్విడ్. అందువల్ల అది రెండు చేతులకూ రెండు చుక్కలు వేసుకొని... చేతులు, వేళ్లూ, గోళ్లూ అన్నీ దానితో రుద్దుకోవాలి. ఇలా ప్రతి 4 గంటలకోసారి చేస్తే... కరోనా వైరస్ మన చేతులపైకి వచ్చినా చనిపోతుంది. అందువల్ల మనం ఆ చేతుల్ని ముక్కు, నోరు, చెవుల దగ్గర పెట్టుకున్నా సమస్య ఉండదు. అదే హ్యాండ్ శానిటైజర్ వాడకపోతే,... చేతుల్ని ఏ ముక్కు, నోటి దగ్గరో పెట్టుకున్నప్పుడు.. చేతులపై కరోనా వైరస్ ఉంటే... అది బాడీలోకి వెళ్లే ఛాన్స్ ఉంటుంది.

అపోహ 7: మాస్కులు వైరస్ రాకుండా ఆపుతాయా?

అపోహ 7: మాస్కులు వైరస్ రాకుండా ఆపుతాయా?

వాస్తవం:

డాక్టర్లు వాడే అత్యంత కాస్ట్‌లీ మాస్కుల వల్ల మాత్రమే కరోనా సోకే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సర్జికల్ మాస్కుల వల్ల కరోనా రాదని అనుకోలేం. ఎందుకంటే అవి రోగుల నుంచీ వచ్చే తుంపర్లను పెద్దగా అడ్డుకోలేవు. పైగా చాలా మంది మళ్లీ మళ్లీ వాడిన వాటినే వాడుతున్నారు. అది మరింత ప్రమాదం.

అపోహ 8: మినరల్స్ ఎక్కువగా తీసుకోవడం:

అపోహ 8: మినరల్స్ ఎక్కువగా తీసుకోవడం:

వాస్తవం:

శరీరానికి సరిపడ మినరల్స్ తీసుకోవడం వల్ల వైరస్ బారి నుంచి బయటపడొచ్చు. క్లోరిన్ డయాక్సైడ్ శరీరానికి బాగా ఉపయోగపడుతుందని చెప్తుంటారు. అది కేవలం సాధారణ అనారోగ్యానికి మాత్రమే పనిచేస్తుంది.

అపోహ 9: ఒంటిపై మద్యం, క్లోరిన్ చల్లుకుంటే వైరస్ చనిపోతుందా?

అపోహ 9: ఒంటిపై మద్యం, క్లోరిన్ చల్లుకుంటే వైరస్ చనిపోతుందా?

వాస్తవం:

అప్పటికే ఒంట్లోకి ప్రవేశించిన వైరస్ బయటి నుంచి మద్యం, క్లోరిన్ చల్లుకున్నంత మాత్రాన చనిపోదు. పైగా అవి చర్మానికి కళ్లకు హాని చేస్తాయి. చర్మం మీద రాసుకోవటం తగదు. అలాగే మద్యం తాగితే వైరస్ బారిన పడకుండా చూసుకోవచ్చన్నదీ అపోహే.

అపోహ 10: నువ్వుల నూనె రాసుకుంటే కరోనా రాదా?

అపోహ 10: నువ్వుల నూనె రాసుకుంటే కరోనా రాదా?

వాస్తవం:

నువ్వుల నూనె ఒంటికి రాసుకుంటే కరోనా వైరస్‌ ఒంట్లోకి రాదని అనుకుంటున్నారు. అది నిజం కాదు. నువ్వుల నూనె రాసుకున్నా... వైరస్ సోకే ప్రమాదం ఉంది.

అపోహ 11: కరోనా ఫ్లూనా?

అపోహ 11: కరోనా ఫ్లూనా?

వాస్తవం:

కరోనా ఇన్ఫెక్షన్ జ్వరం, దగ్గు, ఒళ్ళు నొప్పులు వంటి ఫ్లూ లక్షణాలే వేధిస్తాయి.. ఫ్లూ లాగానే తీవ్రంగా అరుదుగా ప్రాణాంతకంగా పరినమించొచ్చు. ఇవి రెండూ న్యుమోనియాకు దారితీస్తాయి. కాకపోతే కరోనాలో మరణాల శాతం ఎక్కువ. ఫ్లూ భారిన పడ్డవారిలో నూటికి ఒకరు మరణిస్తే కోవిడ్ 19 బాధితుల్లో ముగ్గురు చనిపోతున్నారు.

అపోహ 12: ఇది ముసలి వాళ్లకే వస్తుందా, పిల్లలకు రాదా?

అపోహ 12: ఇది ముసలి వాళ్లకే వస్తుందా, పిల్లలకు రాదా?

వాస్తవం:

ఇది ముసలి వాళ్లకే వస్తుందని, పిల్లలకు రాదనీ ఒక ప్రచారం బాగా జరుగుతోంది. వచ్చిన వారిలో 55 ఏళ్ల సగటు వయసున్న వారే ఎక్కువ ఉన్నప్పటికీ అన్ని వయసుల వారికి ఇది సోకే ప్రమాదం ఉంది. పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి బాగా తక్కువగా ఉంటుంది. అందువలన త్వరగా సోకే అవకాశం ఉంది. కానీ, పిల్లల్లో ఎక్కువ తీవ్రంగా రాకపోవచ్చునంటున్నారు.

అపోహ 13: కరోనా వస్తే మరణమేనా?

అపోహ 13: కరోనా వస్తే మరణమేనా?

వాస్తవం:

ఇది అబద్ధం. కొద్దిమందికే ఇది ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. చైనీస్ సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం 80.9% కేసులు మామూలువే.

English summary

Coronavirus: Myths And Facts About COVID-19 You Should Know

Coronavirus: Myths And Facts About COVID-19 You Should Know.Here are some myths and misconceptions about coronavirus. Read on...
Story first published:Wednesday, March 18, 2020, 7:32 [IST]
Desktop Bottom Promotion