For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Covid-19 Vaccination: ఇంటి నుండే కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకోండిలా...

కోవిద్ -19 వ్యాక్సిన్ కోసం సీనియర్ సిటిజన్లు ఎలా రిజిస్టర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

|

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని ఎంతలా కలవరపెట్టిందో అందరికీ తెలిసిందే. అయితే దానికి విరుగుడు కూడా మన భారతీయులు కనిపెట్టడంలో సఫలమయ్యారు.

Covid-19 Vaccination: How to Register for Covid Vaccine for Senior Citizens in Telugu

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు భారతదేశంలో ఇప్పటివరకు రెండు టీకాలు కనుగొనబడ్డాయి. వీటిని మొదటగా దేశవ్యాప్తంగా కరోనా వారియర్స్ అయిన కార్మికులకు, ఇతర సేవలు చేసిన వారికి అందజేశారు.

Covid-19 Vaccination: How to Register for Covid Vaccine for Senior Citizens in Telugu

ఆ తర్వాత సీనియర్ సిటిజన్లకు టీకాలు వేయడానికి రెండో దశను ప్రారంభిస్తామని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. అయితే ఈ కోవిద్-19 వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. మీ ఇంటి నుండే కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ అవ్వండి...

టీకా మొదటి దశ..

టీకా మొదటి దశ..

కరోనా వైరస్ టీకాను మొదటి దశలో ఆరోగ్య కార్యకర్తలు మరియు పారిశుద్ధ్య కార్మికులకు అందజేశారు. అనంతరం వారి డేటాను సంబంధిత అధికారుల నుండి పొందింది. ఓటరు జాబితా ఆధారంగా సీనియర్ సిటిజన్లపై కూడా డేటాను సేకరించింది. అందుకోసం సీనియర్ సిటిజన్లు రిజిస్టర్ చేసుకునేందుకు ఒక వెబ్ సైట్ ను కూడా ఏర్పాటు చేసింది.

45 నుండి 60 ఏళ్లు..

45 నుండి 60 ఏళ్లు..

దేశవ్యాప్తంగా రెండో దశ కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ప్రారంభమైన సందర్భంగా 45 నుండి 60 ఏళ్ల వయసు పైబడిన వారికి, ఇతర రోగాలు ఉన్న వారికి కరోనా వ్యాక్సిన్ ను ఉచితంగా అందజేస్తోంది కేంద్ర ప్రభుత్వం. వ్యాక్సిన్ తీసుకోవాలనుకునేవారు Co-WIN వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలి. అలాగే Co-WIN2.0లో కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు.

గూగుల్ ప్లేస్టోర్ లేదా ఆన్ లైనులో..

గూగుల్ ప్లేస్టోర్ లేదా ఆన్ లైనులో..

మీ స్మార్ట్ ఫోనులోని గూగుల్ ప్లేస్టోరులో లేదా ఆన్ లైనులో Co-WIN యాప్ లేదన్న సంగతిని మీరు మరచిపోవద్దు. ప్లేస్టోర్ లో కనిపించే Co-WIN యాప్ కేవలం ఆఫీసర్స్ కు మాత్రమే. వ్యాక్సిన్ కావాలనుకునేవారికి మాత్రం కాదు.

వ్యాక్సిన్ కావాలంటే..

వ్యాక్సిన్ కావాలంటే..

ఎవరైతే వ్యాక్సిన్ వేయించుకోవాలని అనుకుంటున్నారో.. వారు https://www.cowin.gov.in/వెబ్ సైట్ లోనే వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకోవాలి. వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం ఎవరైనా ఫోన్ చేసినా, మీ వివరాలు అడిగినా చెప్పాల్సిన అవసరం లేదు. https://www.cowin.gov.in/ ఇందులో రిజిస్టర్ చేసుకుంటే చాలు. ఈ వెబ్ సైట్ తప్ప మరే వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ ప్రాపెస్ అనేదే ఉండదు. కాబట్టి ఫేక్ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ వివరాలను రిజిస్టర్ చేయకండి. అలాగే వ్యాక్సిన్ కావాలనుకునేవారు టైమ్ స్లాట్ మరియు డేట్ ను కూడా ముందే సెలెక్ట్ చేసుకోవచ్చు.

ఎంత మంది బుక్ చేయొచ్చు..

ఎంత మంది బుక్ చేయొచ్చు..

ఒకరి రిజిస్ట్రేషన్ తో దాదాపు ముగ్గురి పేర్లు నమోదు చేసుకోవచ్చు. అంతకుమించి మాత్రం నమోదు చేయలేరు. అక్కడే మొదటి డోస్ మరియు రెండో డోస్ కు కూడా డేట్ అండ్ టైమ్ స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు.

ప్రైవేట్ ఆస్పత్రుల్లో..

ప్రైవేట్ ఆస్పత్రుల్లో..

దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాలతో పాటు 10 వేలకు పైగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే ఉచితంగా వ్యాక్సిన్ పొందొచ్చు. ఇతర ఆస్పత్రుల్లో మాత్రం ఒక డోస్ కు రూ.250 చెల్లించాలి. రెండో డోస్ డ్రైవ్ ఆరు వారాల పాటు కొనసాగుతుంది.

రిజిస్టర్ చేయండిలా..

* ముందుగా కోవిన్ https://www.cowin.gov.in/ఓపెన్ చేయండి.
* మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి.
* అప్పుడు మీ ఫోన్ కు ఓటీపి వస్తుంది.
* ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత Verify పైన క్లిక్ చేయండి.
* ఆ తర్వాత వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది.
* మీ వద్ద ఉన్న ఏదైనా ఐడీ ప్రూఫ్ సెలెక్ట్ చేసుకోండి.
* మీ పేరు, వయసు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఏదైనా ఐడీని అప్ లోడ్ చేయండి.
* మీకు ఇతర రోగాలున్నాయా? లేదా అనే ప్రశ్నకు సమాధానమివ్వండి.
* 45 వయసు దాటిన వారైనా, ఇతర రోగాలు ఉన్నా డాక్టర్ సర్టిఫికెట్ తప్పనిసరిగా కలిగి ఉండాలి.
* ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఐకాన్ పై క్లిక్ చేయండి.
* ఆ తర్వాత మీ వివరాలను చూసుకోండి.
* ఒకే ఫోన్ నెంబరుతో ఇతరుల పేర్లను నమోదు చేయొద్దు.
* రిజిస్ట్రేషన్ తర్వాత అపాయింట్ మెంట్ పై క్లిక్చ చేయండి.
* ఆ తర్వాత మీ రాష్ట్రం, జిల్లా, టౌన్, పిన్ కోడ్ వంటివి సెలెక్ట్ చేయాలి.
* డేట్, టైమ్ సరిచూసుకుని దానిపై క్లిక్ చేయాలి.
* రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత వ్యాక్సినేషన్ కు సంబంధించిన వివరాలు మీకు మెసెజ్ రూపంలో వస్తాయి.

Covid-19 Vaccination: How to Register for Covid Vaccine for Senior Citizens in Telugu

ఇవి తీసుకెళ్లాలి..

మీరు కోవిద్ వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కోవిద్ వ్యాక్సిన్ సెంటర్ కి ఏదో ఒక ప్రభుత్వ ఐడెంటీటీకార్డును (ఓటర్ ఐడీ, పాన్ కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఫోటో ఉన్న పెన్షన్ డాక్యుమెంట్) తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
45 నుండి 59 ఏళ్ల లోపు ఉన్న వారు డాక్టర్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి.

Covid-19 Vaccination: How to Register for Covid Vaccine for Senior Citizens in Telugu

డోసు తీసుకున్న తర్వాత..

ఒకసారి మీరు కరోనా వ్యాక్సిన్ బుక్ చేసుకున్న తర్వాత మీ అపాయిట్ మెంట్ డేట్, టైమ్ మార్చుకోవచ్చు. ఒక వేళ ముందే మొదటి డోస్ కు అపాయింట్ మెంట్ క్యాన్సిల్ చేస్తే, ఆటోమేటిక్ గా రెండో డోస్ స్లాట్ కూడా క్యాన్సిల్ అవుతుంది. మీరు డోసు తీసుకున్న తర్వాత ఆరోగ్య సేతు, డిజీ లాకర్, కోవిద్ వెబ్ సైట్లలో వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఉంటుంది. అక్కడ మీరు డౌన్ లోడ్ కూడా చేసుకోవచ్చు.

English summary

Covid-19 Vaccination: How to Register for Covid Vaccine for Senior Citizens in Telugu

Read to know how to register for covid vaccine for senior citizens in telugu. Read on.
Desktop Bottom Promotion