For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భయపడకండి.. కరోనా టీకా వేయించుకున్న తర్వాత ఈ సైడ్ ఎఫెక్ట్స్ రావొచ్చు!

జనజీవనాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబళించి సుమారు ఏడాదికి పైగా పూర్తయింది. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాధి మంది ప్రజలు ఈ మహమ్మారికి బలయ్యారు. అంతుచిక్కని ఈ వ్యాధికి ఔషధాన్ని కనుక్కునే దిశలో భాగంగా మన శాస్త

By Ravi Kumar Katti
|

జనజీవనాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబళించి సుమారు ఏడాదికి పైగా పూర్తయింది. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాధి మంది ప్రజలు ఈ మహమ్మారికి బలయ్యారు. అంతుచిక్కని ఈ వ్యాధికి ఔషధాన్ని కనుక్కునే దిశలో భాగంగా మన శాస్త్రవేత్తలు ఓ అడుగు ముందుకు వేశారు.

ఇప్పటికే ప్రపంచంలోని కొన్ని దేశాల్లో కోవిడ్-19 వ్యాక్సీన్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఇది అందుబాటులోకి రావటానికి మరికొన్ని అడుగుల దూరం మాత్రమే మిగిలి ఉంది. నిజానికి గతంలోని ఇతర వైరస్‌లతో పోల్చుకుంటే కరోనా వైరస్‌కి మందు కనుక్కోవటం శాస్త్రవేత్తలు వేగంగానే పనిచేశారని చెప్పాలి.

COVID Vaccine Side Effects Include High Fever, Body Aches and Bad Headaches : Experts Read more at: https://kannada.boldsky.com/health/wellness/covid-vaccine-side-effects-include-high-fever-body-aches-and-bad-headaches-experts/articlecontent-pf123372-023026.html

సాధారణంగా ఏ వ్యాక్సీన్‌కైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉండటం సహజం. అలాగే, కోవిడ్-19 వ్యాక్సీన్ విషయంలో కూడా ఇదే జరిగే అవకాశం ఉంది. ఈ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత, దాని ఫలితంగా కొందరి శరీరంలో జరిగే సైడ్ ఎఫెక్ట్స్‌ను కూడా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 కోవిడ్-19 టీకాలు వేయించుకున్న తర్వాత

కోవిడ్-19 టీకాలు వేయించుకున్న తర్వాత

కోవిడ్-19 టీకాలు వేయించుకున్న తర్వాత ప్రజలు తీవ్రమైన దుష్ప్రభావాలను (సైడ్ ఎఫెక్ట్స్) అనుభవించే అవకాశం ఉందని, కాకపోతే చివరకు ఇవి వారిపై ఎలాంటి హానిచేయవని, ఇందుకోసం ప్రజలు సిద్ధంగా ఉండాలని ప్రజారోగ్య నిపుణులు చెబుతున్నారు.

మోడెర్నా మరియు ఫైజర్ నుండి వచ్చిన రెండు వ్యాక్సిన్లు కూడా

మోడెర్నా మరియు ఫైజర్ నుండి వచ్చిన రెండు వ్యాక్సిన్లు కూడా

మోడెర్నా మరియు ఫైజర్ నుండి వచ్చిన రెండు వ్యాక్సిన్లు కూడా కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని అందించడంలో 95 శాతం వరకు ప్రభావవంతంగా ఉంటుందని క్లినకల్ ట్రైల్స్‌లో స్పష్టమైంది. దీంతో, యూకే మరియు యూస్ వంటి అగ్రరాజ్యాల్లో ఇప్పటికే మోడెర్నా మరియు ఫైజర్ సంస్థలు తయారు చేసిన కరోనా వ్యాక్సీన్లకు ఆమోదం కూడా లభించింది.

 ఓవైపు కరోనాకి వ్యాక్సీన్లు సిద్ధమైనప్పటికీ

ఓవైపు కరోనాకి వ్యాక్సీన్లు సిద్ధమైనప్పటికీ

ఓవైపు కరోనాకి వ్యాక్సీన్లు సిద్ధమైనప్పటికీ, వాటిపై ప్రజల్లో విశ్వాసం మాత్రం బలపడటం లేదు. దీంతో, కరోనా వ్యాక్సీన్లపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అక్కడి ప్రముఖల నుండి సాధారణ ప్రజల వరకూ స్వచ్ఛందంగా ఈ వ్యాక్సీన్లను వేయించుకునేందుకు ముందుకు వస్తున్నారు.

మరోవైపు ఈ రెండు వ్యాక్సిన్లు గణనీయమైన ప్రాణాంతక దుష్ప్రభావాలతో (సైడ్ ఎఫెక్ట్స్) వస్తాయనే పుకార్లు కూడా బాగానే షికార్లు చేస్తున్నాయి. ఈ టీకాలను వేయించుకున్న వారు, తమ శరీరంలో ఎదురయ్యే ఇబ్బందికర ప్రతిచర్యలకు సిద్ధంగా ఉండాలని, కాకపోతే అవి తాత్కాలికమే కానీ ప్రమాదకరమైనవి మాత్రం కావని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ టీకాలపై రోగులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది

ఈ టీకాలపై రోగులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది

"ఈ టీకాలపై రోగులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఇది అంత సులువైన పని కాదు" అని అమెరికన్ మెడికల్ అసోసియేషన్ యొక్క డాక్టర్ శాండ్రా ఫ్రైహోఫర్ ఇటీవల సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్‌కు సలహా ఇచ్చే నిపుణుల బృందం సమావేశంలో అన్నారు.

ప్రజలు కరోనా వైరస్‌కు టీకా ఉందని తెలుసుకోబోతున్నారని, అది వేయించుకున్న తర్వాత వారు బహుశా అద్భుతమైన అనుభూతి చెందకపోవచ్చు, కాని వారు దాని రెండవ మోతాదు కోసం తప్పనిసరిగా తిరిగి రావల్సి ఉంటుందని ఫ్రైహోఫర్ చెప్పారు.

ఈ క్లినికల్ ట్రైల్స్ నివేదిక ప్రకారం

ఈ క్లినికల్ ట్రైల్స్ నివేదిక ప్రకారం

ఈ క్లినికల్ ట్రైల్స్ నివేదిక ప్రకారం, మోడెర్నా వ్యాక్సిన్ ట్రయల్స్‌లో, మొదటి మోతాదు (ఫస్ట్ డోస్) తర్వాత కనిపించే ఏకైక "తీవ్రమైన" దుష్ప్రభావం ఇంజెక్షన్ చేసిన ప్రాంతం వద్ద తీవ్రమైన నొప్పి కలగడం, ఇది సుమారు 2.7 శాతం రోగులలో సంభవించింది. ఇక రెండవ మోతాదు (సెకండ్ డోస్) తరువాత, అత్యంత సాధారణమైన మరియు తీవ్రమైన దుష్ప్రభావం అలసటగా ఉండటం, ఇది సుమారు 9.7 శాతం మందిలో కనిపించింది.

అంతేకాకుండా, ఈ టీకాలు వేయించుకున్న వారిలో 8.9 శాతం మందికి కండరాల నొప్పులు లేదా శారీరక నొప్పులు కలగటం, 5.2 మందికి కీళ్ల నొప్పులు రావటం జరిగింది. అలాగే, ఇంజెక్షన్ చేయించుకున్న ప్రదేశం వద్ద మరో 4.1 శాతం మందికి నొప్పి రావటం మరియు 4.5 శాతం మందికి తలనొప్పిగా అనిపించడాన్ని ఈ పరీక్షల్లో గుర్తించారు.

 మోడెర్నా క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న

మోడెర్నా క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న

మోడెర్నా క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న 43 ఏళ్ల కంప్యుటేషనల్ బయాలజిస్ట్ ల్యూక్ హచిసన్, ఓ సైన్స్ మ్యాగజైన్‌తో మాట్లాడుతూ, కోవిడ్-19 వ్యాక్సీన్‌గా చెప్పే ఈ టీకాను వేయించుకున్న తర్వాత తానకు "భరించలేని" 102 డిగ్రీల జ్వరం వచ్చిందని చెప్పాడు. అయితే, ఈ ట్రైయల్స్‌లో పాల్గొనేవారికి టీకా బదులుగా ప్లేసిబో ఇచ్చారో లేదో తనకు తెలియదని ఆయన చెప్పుకొచ్చారు.

 ఇంకా ఆ వ్యక్తి మాట్లాడుతూ..

ఇంకా ఆ వ్యక్తి మాట్లాడుతూ..

ఇంకా ఆ వ్యక్తి మాట్లాడుతూ.. "టీకా వేయించుకున్న తర్వాత నేను వణకడం మొదలుపెట్టాను, నాకు చాలా చల్లగా మరియు చాలా వేడిగా అనిపించింది. నేను ఆ రాత్రంతా ఫోన్ దగ్గరే కూర్చుని, 911 ఎమెర్జెన్సీ నెంబర్‌కు కాల్ చేయాలా? వద్దా అని ఆలోచిస్తూ ఉండిపోయాను. ఈ టీకా తీవ్రతకు ఎదుర్కునేందుకు ఎవరూ నన్ను సిద్ధం చేయలేదు.'' అంటూ హచిసన్ తన లక్షణాల గురించి వివరించారు. టీకా వేయించుకున్న సుమారు 12 గంటల తర్వాత ఈ లక్షణాలు వాటంతట అవే పోయాయని ఆయన అన్నారు.

ఫైజర్ / బయోఎంటెక్ తయారు చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్‌కు

ఫైజర్ / బయోఎంటెక్ తయారు చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్‌కు

ఫైజర్ / బయోఎంటెక్ తయారు చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్‌కు సంబంధించిన క్లినికల్ ట్రైయల్స్ డేటాను కూడా ఆ కంపెనీ త్వరలోనే విడుదల చేయనుంది. అయితే, ప్రజలు ఈ టీకాలు వేయించుకున్న తర్వాత వారు తాత్కాలికమైన దుష్ప్రభావాలను అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని, కానీ ఇవి అంత ప్రమాదకరమైనవి మాత్రం కావని నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా అన్ని టీకాలు కూడా

సాధారణంగా అన్ని టీకాలు కూడా

సాధారణంగా అన్ని టీకాలు కూడా అరుదైన మరియు తీవ్రమైనవి కాని దుష్ప్రభావాలను (సైడ్ ఎఫెక్ట్స్)ను కలిగి ఉంటాయి. కరోనా వైరస్ టీకా కూడా ఇలాంటి వాటి జాబితాలోకే వస్తుంది. తాజాగా అందుబాటులోకి వచ్చిన కరోనా వ్యాక్సీన్లతో వైరస్‌కు వీడ్కోలు చెప్పవచ్చని ఆయా కంపెనీలు ధీమాగా చెబుతున్నాయి. ఈ వ్యాక్సీన్ల వలన ఏవైనా దుష్ప్రభావాలు (సైడ్ ఎఫెక్ట్స్) సంభవిస్తే, అవి స్వల్పకాలికమైనవే అని మరియు ఇదివరకటి వ్యాధి కంటే కూడా చాలా తక్కువ తీవ్రమైనవే అని నిపుణులు చెబుతున్నారు.

Read more about: కోవిడ్ 19 covid 19
English summary

COVID Vaccine Side Effects Include High Fever, Body Aches and Bad Headaches : Experts

COVID Vaccine takers to be prepared side effects such as high fever, body Aches and bad headaches: Reports. Read in Telugu.
Desktop Bottom Promotion