For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Drinking Water Types: మనం తాగే నీటిలో ఎన్ని రకాలున్నాయో తెలుసా?

బోర్ నీళ్లు, నల్లా నీళ్లు, ప్యూరిపైడ్ వాటర్, మినరల్ వాటర్, బ్లాక్ వాటర్ ఒకటీ, రెండూ కాదు ఇలా చాలా రకాల నీళ్లు ఉన్నాయి. తాగే నీటిలో ఇన్ని రకాలు ఏమిటన్నది ఎప్పుడైనా ఆలోచించారా. అసలు నీళ్లు అంటే ఎలా ఉండాలి.. దానిలో ఏయే పోషక

|

Drinking Water Types: బోర్ నీళ్లు, నల్లా నీళ్లు, ప్యూరిపైడ్ వాటర్, మినరల్ వాటర్, బ్లాక్ వాటర్ ఒకటీ, రెండూ కాదు ఇలా చాలా రకాల నీళ్లు ఉన్నాయి. తాగే నీటిలో ఇన్ని రకాలు ఏమిటన్నది ఎప్పుడైనా ఆలోచించారా. అసలు నీళ్లు అంటే ఎలా ఉండాలి.. దానిలో ఏయే పోషకాలు, ఖనిజాలు, లవణాలు, మినరల్స్ ఉండాలి.. ఎలాంటి రంగులో ఉండాలి.. వీటికి సరైన జవాబు తెలుసుకోవాలనుందా అయితే ఇది చదివేయండి.

Different types of drinking water in Telugu

రెండు హైడ్రోజన్ అణువులు, ఒక ఆక్సిజన్ అణువు కలిస్తే ఒక నీటి అణువు ఏర్పడుతుంది. ఇలాంటి లక్షలాది అణువులు కలిస్తే ఒక నీటి బిందువు ఏర్పడుతుంది. ఇలాంటి నీటిని అందరం తాగుతాం. తాగే నీటి స్వచ్ఛతను హీహెచ్ విలువతో కొలుస్తాం. పీహెచ్ విలువ 6.5 నుండి 7.5 మధ్యలో ఉంటే ఆ నీటిని సాధారణ నీరు అంటారు. ఇలాంటి వాటిని తాగవచ్చు.

నదులు, చెరువులు, బావులు, బోర్ల నుండి వచ్చేది సాధారణ నీరు. ఈ నీటిని నిరభ్యంతరంగా తాగవచ్చు. అయితే వీటి నుండి వచ్చే నీరు కలుషితం కాలేదని నిర్ధారించుకోవాలి. నదులు, చెరువుల నీటిని క్లోరినేషన్, ఓజోనైజేషన్ చేసి తాగే నీటిగా మార్చిన తర్వాత ప్రభుత్వాలు కుళాయిల ద్వారా ప్రజలకు సరఫరా చేస్తుంది.

ఇలా ఇంటింటికి సరఫరా అయిన నీటిని కొంత మంది రివర్స్ ఆస్మోసిస్ యంత్రాల్లో ఫిల్టర్ చేస్తారు. ఇలా నీటిని ఆర్వో చేయడం ద్వారా అందులోని మలినాలు పూర్తి స్థాయిలో తొలగిపోయి మరింత స్వచ్ఛమైన నీరుగా తయారవుతుంది. వీటిని ఆర్వో వాటర్ అంటారు. ప్యూరిఫైడ్ వాటర్ అని కూడా పిలుస్తుంటారు. ఇలాంటి ప్రక్రియల ద్వారా ఫిల్టర్ అయిన నీటిని బాటిళ్లలో ప్యాకేజ్ చేస్తే వాటినే ప్యాకేజ్డ్ వాటర్ అని అంటారు. ప్యూరిఫైడ్ వాటర్‌ను మరిగించి ఆవిరి రూపంలో నీటిని సేకరిస్తారు. ఇలా చేసే పద్ధతిలో లవణాలు, ఖనిజాలు, కర్బన పదార్థాలు ఏవీ ఉండవు. ఈ నీటినే డిస్టిల్డ్ వాటర్ అని పిలుస్తారు. ఈ డిస్టిల్డ్ వాటర్‌ను తాగడం వల్ల దాహం తీరుతుంది కానీ శరీరానికి ఎలాంటి మినరల్స్ అందవు. ఈ డిస్టిల్డ్ నీటిని ప్రయోగశాలలు, పరిశ్రమల్లోని యంత్రాలు, బ్యాటరీల్లో వాడతారు.

మినరల్ వాటర్ అంటే..

మినరల్ వాటర్ అంటే..

నీటిలో మినరల్స్ ఉంటేనే దాని వల్ల శరీరానికి ఉపయోగం. అందులో ఎలాంటి మినరల్స్ లేకపోతే ఎలాంటి ఉపయోగం ఉండదు. నదుల్లో, చెరువులు, బావులు, బోర్లలో లభించే నీటిలో సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి మినరల్స్ ఉంటాయి. అయితే ఇవి శరీరానికి ఎంత కావాలో అంత మొత్తంలో అందితేనే మంచిది. ఎక్కువగా ఉన్నా, తక్కువగా ఉన్నా ఆరోగ్య సమస్యలు వస్తాయి.

నీటిలో ఎన్ని మినరల్స్ ఉండాలి, ఎంత మొత్తంలో ఉండాలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్దేశించింది. ప్యాకేజ్డ్ వాటర్‌ కొనేముందు ఆ బాటిల్ బీఐఎస్ నుండి అనుమతి పొందిందా లేదా చూసిన తర్వాతే కొనుగోలు చేయాలి.

టీడీఎస్ అంటే ఏంటంటే..

టీడీఎస్ అంటే ఏంటంటే..

సాధారణ నీటిలో సోడియం, పొటాషియం, మెగ్నీషియం, సోడియం లాంటి మినరల్స్ ఉన్నట్లే.. కాడ్మియం, లెడ్, నికెల్ వంటి లోహాలు కరిగి ఉంటాయి. ఈ కరిగిన మూలకాల మొత్తాన్నే టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్(టీడీఎస్) అంటారు. ఈ టీడీఎస్ లెవెన్ 500mg/L కంటే మించి ఉండకూడదు.

బ్లాక్ వాటర్ అంటే ఏంటి?

బ్లాక్ వాటర్ అంటే ఏంటి?

బ్లాక్ వాటర్ లేదా ఆల్కలీన్ వాటర్‌ను క్రికెటర్లు, సెలబ్రిటీలు వాడటం మనకు తెలిసిందే. సాధారణ నీటిలో పీహెచ్ వాల్యూ 7 వరకు ఉంటుంది. బ్లాక్ వాటర్ పీహెచ్ 8 నుండి 9 వరకు ఉంటుంది.

బ్లాక్ వాటర్‌ను శారీరక శ్రమ ఎక్కువగా ఉన్న వాళ్లు మాత్రమే తాగాలి. ఎలాంటి శారీరక శ్రమ లేని వాళ్లు తాగినే ఆరోగ్య సమస్యలు వస్తాయి. శరీరం యాక్టివ్‌గా లేకపోతే బ్లాక్ వాటర్ వల్ల క్షార లక్షణాలు శరీరంలో ఏర్పడి ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి. బ్లాక్ వాటర్‌ను అతిగా తాగడం కూడా మంచిది కాదని డైటీషియన్లు చెబుతున్నారు.

English summary

Different types of drinking water in Telugu

read on to know Different types of drinking water in Telugu
Story first published:Tuesday, December 6, 2022, 15:37 [IST]
Desktop Bottom Promotion