For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాదంకు-పొట్ట ఉబ్బరానికి సంబంధం ఉందా? రోజుకు ఎన్ని తినవచ్చు!

|

బాదం అనేది ఒక డ్రై ఫ్రూట్. ఇందులో పోషకాలు మరియు యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆరోగ్యకరమైన చిరుతిండి. విటమిన్ ఇ మరియు మెగ్నీషియం అధికంగా ఉండే బాదం కూడా ఫైబర్ కు మంచి మూలం. ఇది మీ జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే, కొంతమందికి బాదం జీర్ణశయాంతర సమస్యలను కలిగిస్తుంది మరియు కడుపు ఉబ్బరం కలిగిస్తుంది.

Do almonds cause bloating

బాదంలో ఫైబర్ అధికంగా ఉంటుంది, కానీ ఇవి అలెర్జీకి కూడా కారణమవుతాయి. తీవ్రమైన పొత్తికడుపు ఉబ్బరం లేదా మంట వంటి జీర్ణశయాంతర సమస్యల ఇతర లక్షణాలు జీర్ణ సమస్యలను సూచిస్తాయి.

ఫైబర్ పుష్కలం

ఫైబర్ పుష్కలం

హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రకారం, మలబద్దకాన్ని నివారించడానికి మరియు ఆరోగ్యకరమైన జీర్ణక్రియను నిర్వహించడానికి పిల్లలు మరియు పెద్దలు రోజుకు 20 నుండి 30 గ్రాముల ఫైబర్ తీసుకోవాలి. ఒక కప్పు బాదంపప్పులో 18 గ్రాముల ఫైబర్ ఉంటుంది. అందుకే వారు దీనిని ఆరోగ్య చిరుతిండిగా సిఫార్సు చేశారు.

అయితే, వీటిలోని ఫైబర్ కొందరి పేగులలో గ్యాస్ ను ఉత్పత్తి చేస్తుంది మరియు ఒకేసారి ఎక్కువ బాదం తినడం వల్ల కడుపు ఉబ్బరం లేదా వాపు మరియు కడుపు నొప్పి వంటి ఇతర లక్షణాలు సంభవించవచ్చు. మీ ఆహారంలో ఫైబర్ అధికంగా తీసుకోవడం కూడా కడుపు నొప్పికి ఒక సాధారణ కారణం. అందువల్ల మీరు ఎక్కువ ఫైబర్ తీసుకోవడం మానుకోండి. బాదాలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మితంగా మాత్రమే తీసుకోవాలి.

బాదంపప్పులు అలెర్జీ

బాదంపప్పులు అలెర్జీ

చెట్టు నుండి లభించే గింజల వర్గంలో బాదంపప్పు ఉంటుంది. వాల్‌నట్స్, బ్రెజిల్ నట్ , జీడిపప్పు, హాజెల్ నట్స్, పిస్తా వంటివి ఈ వర్గంలోని గింజల రకాలు. పిల్లలు మరియు పెద్దలలో సాధారణంగా కనిపించే అలెర్జీలలో బాదం కూడా ఒకటని అలెర్జీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పేర్కొంది.

దష్ప్రభావాలు

దష్ప్రభావాలు

అలెర్జీ రోగనిరోధక వ్యవస్థ ద్వారా ప్రేరేపించబడినప్పటికీ, కడుపు నొప్పి, ఉబ్బరం, వికారం, వాంతులు మరియు విరేచనాలు కలిగిస్తాయి. జీర్ణశయాంతర సమస్యల వంటివి అలెర్జీరి ఇతర లక్షణాలు. బాదం ఎక్కువగా తినడం వల్ల నోటి ప్రాంతం చుట్టూ జలదరింపు మరియు దురద. ఈ రకమైన బాదం నట్స్ తినడం వల్ల అలెర్జీ ఉన్న వారిలో తీవ్రమైన ప్రమాధానికి గురిచేస్తుంది.

జీర్ణ సమస్యలు

జీర్ణ సమస్యలు

బాదం తిన్న వెంటనే కడుపులో వాపు రావడం జీర్ణక్రియలో తేడాలు రావచ్చు. మనిషి యొక్క జీర్ణవ్యవస్థ సరిగ్గా లేనప్పుడు ఇది జరుగుతుంది. దీనిని "ప్రకోప ప్రేగు సిండ్రోమ్" అంటారు. యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ మెడికల్ సెంటర్ ప్రకారం,అమెరికా జనాభాలో 20% వరకు వారి జీవితంలో ఏదో ఒక సమయంలో ప్రకోప ప్రేగు సిండ్రోమ్ ఉంది. ప్రకోప ప్రేగు సిండ్రోమ్ అనేది వ్యాధి యొక్క తేలికపాటి రూపం, అది మనిషి శరీరంపై తక్కువ ప్రభావాన్ని చూపుతుంది. ఇది కడుపు ఉబ్బరం, మలబద్ధకం, కడుపు నొప్పి మరియు వాంతికి కారణమవుతుంది. వీటన్నిటికీ ప్రధాన కారణం ఫైబర్ అధికంగా తీసుకోవడం. వీటన్నిటితో, కడుపు నొప్పి కూడా తీవ్రమైన సమస్య అనడంలో సందేహం లేదు.

పై సమస్యలకు ఏమైనా పరిష్కారాలు ఉన్నాయా?

పై సమస్యలకు ఏమైనా పరిష్కారాలు ఉన్నాయా?

మీరు బాదం ఎక్కువగా తింటుంటే వెంటనే మోతాదును తగ్గించడం ద్వారా, మీరు తేలికపాటి కడుపు ఉబ్బరాన్ని నివారించవచ్చు. బాదం తినడం అలవాటు లేనివారికి, నెమ్మదిగా వారి అల్పాహారానికి బాదంపప్పు వేసి దానికి సర్దుబాటు చేయండి. దీనికి కొన్ని వారాలు పట్టవచ్చు మరియు నెమ్మదిగా మీ కడుపు సమస్య తగ్గుతుంది. "సిమెథికోన్" పిల్ తీసుకోవడం ప్రాక్టీస్ చేయడం వల్ల ప్రేగులలో దాగి ఉన్న వాయువును కూడా పూర్తిగా తొలగించవచ్చు. ఇది కడుపు ఉబ్బరాన్ని కూడా తగ్గిస్తుంది. కానీ మా సలహా ఏమిటంటే, మీరు కడుపు ఉబ్బరం మరియు కడుపు నొప్పితో బాధపడుతున్నా దీర్ఘకాలిక విరేచనాలతో బాధపడుతుంటే, దయచేసి నిర్లక్ష్యం చేయకండి. లక్షణాలను నిర్ధారించడానికి మరియు చికిత్స చేయడానికి వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించండి.

English summary

Do almonds cause bloating?

A handful of almonds is a healthy snack rich in nutrients and antioxidants. Almonds are also high in vitamin E and magnesium, as well as a good source of fiber, which can help keep your digestion healthy.
Story first published: Tuesday, November 5, 2019, 12:34 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more