For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషుల్లో వంధ్యత్వానికి మద్యమే కారణం! తాగితే ఏం జరుగుతుందంటే..

మద్యం ఎక్కువగా తాగేవారిలో టెస్టోస్టిరాన్ స్థాయిలు తగ్గి, స్పెర్మ్ కౌంట్ కూడా తగ్గడం వల్ల సంతానలేమి సమస్య ఇబ్బంది పెడుతుందని తేలింది.

|

మద్యం ఎక్కువ మొత్తంలో సేవిస్తే శుక్ర కణాల సంఖ్య తగ్గుతుందని తేలింది. మద్యం సేవిస్తే పురుషుల్లో సంతానలేమి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సీడీసీ కూడా 35 శాతం పెరుగుతుందని అధ్యయనాల్లో తేలింది. మితంగా ఆల్కహాల్ సేవించడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఎక్కువగా తాగేవారిలో టెస్టోస్టిరాన్ స్థాయిలు తగ్గి, స్పెర్మ్ కౌంట్ కూడా తగ్గడం వల్ల సంతానలేమి సమస్య ఇబ్బంది పెడుతుందని తేలింది.

Does alcohol kill sperm and know other fertility facts in Telugu

2019లో అమెరికాలో ఓ అధ్యయనం జరిగింది. అందులో 12 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మగవారిలో మద్యం తాగినవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గినట్లు గుర్తించారు. అత్యధిక ఆల్కహాల్ తీసుకోవడం అంటే 3-4 గ్లాసు ఆల్కహాల్ వారానికి 7-14 గ్లాసుల ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వీర్య కణాల సంఖ్య తక్కువ అవుతున్నట్లు తేలింది.

వంధ్యత్వానికి 'అతి' కారణం:

వంధ్యత్వానికి 'అతి' కారణం:

ఆండ్రాలజీ జర్నల్‌లో మరో అధ్యయన నివేదిక ప్రచురితమైంది. అధ్యయనం నివేదిక ప్రకారం అధ్యయనంలో 323 మంది పురుషులను చేర్చారు. వారిని 4 గ్రూపులుగా విభజించారు.

విపరీతంగా మద్యం సేవించే వారు మితమైన మద్యపానం చేసేవారు, అతి తక్కువ మద్యం తీసుకునేవారు, మద్యం అసలు తీసుకోని వారు. ఆల్కహాల్ మితంగా తాగడం వల్ల వీర్య కణాల ఆరోగ్యానికి మంచిదని, అదే అతిగా మద్యం సేవించడం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతున్నట్లు తేలింది. ఇది భవిష్యత్తులో వంధ్యత్వానికి దారితీస్తున్నట్లు వెల్లడైంది.

అతిగా మందు తాగడం వల్ల వచ్చే సమస్యలు:

అతిగా మందు తాగడం వల్ల వచ్చే సమస్యలు:

  • అతిగా మందు తాగడం వల్ల హార్మోన్లు తగ్గుతాయి. అలా స్పెర్మ్ కౌంట తగ్గుతుంది.
  • పురుషాంగం కుంచించుకుపోయి సంతానలేమికి కారణం అవుతుంది.
  • గోనడోట్రోపిన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఇది స్పెర్మ్ కౌంట్ కూడా తగ్గుతుంది.
  • శీఘ్ర స్కలనం ఏర్పడుతుంది.
  • అతిగా మందు తాగడం వల్ల స్మెర్మ్ నాణ్యత దెబ్బతింటుంది.
  • ఈ కారణాల వల్ల పురుషుల్లో వంధ్యత్వం వస్తుంది:

    ఈ కారణాల వల్ల పురుషుల్లో వంధ్యత్వం వస్తుంది:

    • అధిక బరువు లేదా ఊబకయం
    • వయస్సు పెరుగుతున్న కొద్దీ స్పెర్మ్ నాణ్యత తగ్గడం
    • రేడియేషన్ చికిత్స పొందుతుంటే
    • పొగాకు సేవించడం
    • సైప్రోటెరోన్, ఫ్లూటామైడ్, స్పిరోనోలక్టోన్, బైకలుటమైడ్, సిమెటిడిన్, కెటోకానజోల్ వంటి మందుల వాడకం
    • పురుషాంగంలో వేరికోసెల్ సమస్య ఉంటే


    • మహిళలు మద్యం తాగితే సంతానలేమి సమస్యలు వస్తాయా:

      నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆల్కహాల్ గర్భాశయం లేదా గర్భాశయం లోపలికి వెళ్లదు. మద్యం స్త్రీ శరీరంలోని స్పెర్మ్‌ను ఏమీ చేయలేదు. కాబట్టి ఆల్కహాల్ తాగడం వల్ల గర్భం రాకుండా ఉండదు.

English summary

Does alcohol kill sperm and know other fertility facts in Telugu

read this to know Does alcohol kill sperm and know other fertility facts in Telugu
Story first published:Sunday, January 22, 2023, 19:06 [IST]
Desktop Bottom Promotion