For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Soda Effects: సోడా తాగుతున్నారా..? ఇది తెలుసుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం!

Soda Effects: సోడా తాగుతున్నారా..? ఇది తెలుసుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం!

|

Soda Effects: చాలా మంది కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. అందులోనూ సోడా ఉండే వాటిని ఎక్కువ మంది ఇష్టంగా తీసుకుంటారు. వేసవికాలం, చలికాలం అనే సంబంధం లేకుండా వీటి వాడకం ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల కలిగే ప్రయోజనాల కన్నా... ఆరోగ్య సమస్యలే ఎక్కువ. ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని తెలిసినా కూల్ డ్రింకులు, సోడాలు, చక్కెర పానీయాలు తాగడం మాత్రం ఆపలేరు చాలా మంది. ఈ డ్రింక్స్ తాగడం వల్ల మధుమేహం(diabetes), ఊబకాయం(obesity), కొవ్వు పెరిగి కాలేయం మరియు మెటబాలిక్ సిండ్రోమ్ ప్రమాదాన్ని పెంచుతుంది. కొందరు సోడా(Soda)కు బదులు డైట్ సోడా తాగితే ఆరోగ్యంపై అంతగా ప్రభావం ఉండని అనుకుంటూ ఉంటారు. కానీ, మెటబాలిక్ సిండ్రోమ్ అలాగే స్ట్రోక్ ప్రమాదాలను పెంచుతుందని పలు అధ్యయనాల్లో తేలింది. మరి కొన్ని పరిశోధనల ప్రకారం, డైట్ సోడా(diet soda) వినియోగం కూడా ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని పెంచుతుంది.

సోడా ఎలా ప్రాణాంతకం అవుతుంది?

సోడా ఎలా ప్రాణాంతకం అవుతుంది?

దాదాపు 5 లక్షల మందిపై ఒక అధ్యయనం జరిగింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు ఈ అధ్యయనం సాగింది. ఇందులో నెలకు ఒకటి కంటే ఎక్కువ గ్లాసుల సోడా తినే వ్యక్తులను పరిశోధించారు. ఇలాంటి రకమైన అధ్యయనాల్లో ఇదే అతి పెద్దది కావడం విశేషం. ఇందులో తెలిసింది ఏమిటంటే.. నెలకు ఒక గ్లాసు కంటే తక్కువ తీసుకునే వారి కంటే కూడా ఎక్కువ తీసుకున్న వారు 17 శాతం ఎక్కువ మంది చనిపోతున్నారని పరిశోధకులు కనుగొన్నారు.

 డైట్ సోడా వల్ల కూడా ప్రమాదమే

డైట్ సోడా వల్ల కూడా ప్రమాదమే

డైట్ సోడాలో చక్కెర స్థాయిలు మామూలు సోడాలో ఉన్న స్థాయుల్లోనే ఉంటాయి. వీటిని తరచూ తీసుకునే వారు క్రమంగా బరువు పెరుగుతారు. ఇది కొన్ని రోజుల్లోనే ఊబకాయానికి దారి తీస్తుంది. ఇది శరీరంలో ఇన్సులిన్ ను ప్రభావితం చేస్తుంది. ఇది వాపుకు దారి తీస్తుంది. దీని వల్ల మధుమేహం, గుండె జబ్బులు, ఊబకాయం మొదలైనవి వంటి ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చు. ఇది జీవిత కాలాన్ని తగ్గిస్తుంది. ధూమపానం, మద్యపానం, బాడీ మాస్ ఇండెక్స్ (BMI), శారీరక శ్రమ, పండ్లు మరియు కూరగాయలు తినడం ప్రాసెస్డ్ చేసిన మాంసం తీసుకున్న వారినీ పరిశోధకులు అధ్యయనం చేశారు. వారిలో అన్ని ఫలితాలు స్థిరంగా ఉన్నట్లు కనుగొన్నారు. అంటే క్రమం తగ్గకుండా సోడా లేదా డైట్ సోడా తాగే వ్యక్తులకు ప్రాణాపాయం ఉన్నట్లు తేలింది. వీరిలో ముందస్తు మరణ ప్రమాదం ఎక్కువని పరిశోధకులు తేల్చి చెప్పారు.

అయినప్పటికీ, ప్రస్తుత అధ్యయనంలో సోడా వినియోగం అలాగే ముందస్తు మరణ ప్రమాదం మధ్య ఎటువంటి కారణం కానీ సంబంధం లేదు. సోడా తాగే వారు ధూమ పానం తీసుకోవడం లేదా తక్కువ ఆరోగ్యకరమైన ఆహారం వంటివి స్వీకరించడం వల్ల మరణ ప్రమాదాన్ని పెంచే ఇతర అలవాట్లను కలిగి ఉన్నారని అనుకోవచ్చు.

 సోడా తాగడం వల్లే ఎదురయ్యే ఇతర ఆరోగ్య ప్రమాదాలు:

సోడా తాగడం వల్లే ఎదురయ్యే ఇతర ఆరోగ్య ప్రమాదాలు:

* సోడా తాగడం వల్ల కేవలం బరువు పెరగడం, ఊబకాయం, గుండె జబ్బులు లాంటి సమస్యలు మాత్రమే తలెత్తుతాయని భావిస్తే పొరబడినట్లే.. ఎందుకంటే మితిమీరిన సోడా వినియోగం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. పెద్ద ప్రేగు క్యాన్సర్ తో పాటు పార్కిన్సన్స్ వ్యాధి ఉన్న వారు సోడా తీసుకుంటే చనిపోయే ప్రమాదం మరింత పెరుగుతుంది. నెలకు ఒకటి కంటే తక్కువ తినే వారి కంటే రోజుకు ఒకటి కంటే ఎక్కువ సోడా (చక్కెర-తీపి) తినేవారిలో ఎక్కువగా ఉంటుంది.

* ప్రతి రోజూ ఒకటి కంటే ఎక్కువ చక్కెర-తీపి సోడా తాగే వ్యక్తులలో జీర్ణ సంబంధిత వ్యాధుల వల్ల చని పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

* రోజూ ఒకటి కంటే ఎక్కువ కృత్రిమ సోడా తినే వ్యక్తులు నెలకు ఒక సారి కంటే తక్కువ తినే వారి కంటే గుండె జబ్బులు, రక్త ప్రసరణ వ్యాధులతో మరణించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

 సోడాకు ప్రత్యామ్నాయంగా ఏం తీసుకోవచ్చు?

సోడాకు ప్రత్యామ్నాయంగా ఏం తీసుకోవచ్చు?

మీరు సోడాను తరచూ తీసుకుంటున్నారా.. ఆరోగ్య కారణాల రీత్యా సోడాను దూరం పెట్టాలనుకుంటే కొన్ని చిట్కాలు పాటించాల్సిందే. సోడాను మైమరిపించే వాటిని తీసుకుంటే అటు ఆరోగ్య ప్రయోజనాలతో పాటు చెడు అలవాటు నుండి కూడా బయట పడవచ్చు. సోడాను కొద్దిగా గ్రీన్ టీ లేదా తక్కువ చక్కెరతో తయారు చేసిన బ్లాక్ కాఫీతో మార్చుకోవచ్చు. కాఫీ అలాగే టీలో గుండెకు మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని పలు పరిశోధనలు సూచించాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం ద్వారా గుండె జబ్బులు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. వీటిని కూడా రోజుకు 2 నుండి 3 కప్పులకు మాత్రమే పరిమితం చేయాలి.

* తాజాగా పిండిన నిమ్మరసం

* కొబ్బరి నీరు

* ఇండియన్ క్లబ్ సోడా

* కొంబుచా

* పండు, మూలికల కషాయాలు

* ఐస్‌డ్, గ్రీన్ లేదా హాట్ టీ

* వెజిటబుల్ జ్యూస్

* సోయా మిల్క్

చాలా పరిశోధనలు, అధ్యయనాలు తేల్చి చెప్పేదేమిటంటే.. చక్కెర పానీయాలు, శీతల పానీయాలు అనారోగ్యకరమైనవి. వాటిని తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉండకపోగా.. నష్టాలే ఎక్కువ అని పరిశోధకులు చెబుతున్నారు. సోడా వినియోగం వీలైనంత తక్కువకు లేదా పూర్తిగా మానేయడం అత్యుత్తమమని సూచిస్తున్నారు. కృత్రిమంగా తయారు చేసే సోడా వల్ల ముందస్తు మరణ ప్రమాదం పెరుగుతుందని అంటున్నారు.

English summary

Drinking soda can increase your risk of early death

Read on to know the Drinking soda can increase your risk of early death..
Story first published:Wednesday, July 13, 2022, 10:42 [IST]
Desktop Bottom Promotion