For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Health Benefits of Kalonji:ఈ గింజలను రెగ్యులర్ గా తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా...

ల్ల జీలకర్రతో మన ఆరోగ్యాన్ని కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

|

నిగెల్లా గింజలు లేదా కలోంజి గింజలను సాధారణంగా నల్ల జీలకర్ర విత్తనాలు అంటారు. మన భారతీయులు చాలా వంటల్లో వీటిని ముఖ్యమైన పదార్థంగా ఉపయోగిస్తారు. వీటిని ప్రధానంగా కూరగాయలు, కూర, పప్పు మరియు ఇతర రుచికరమైన వంటకాలలో ఎక్కువగా వాడతారు.

Health Benefits of Kalonji in Telugu

ఇది వంటకాలకు అందమైన సువాసనను ఇచ్చే ఆసక్తికరమైన మసాలా. అయితే ఈ నల్ల జీలకర్ర గింజలు రుచితో పాటు ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలను సైతం అందిస్తోంది. ఈ విత్తనాలలో ఉండే విటమిన్లు, ప్రోటీన్లు ముడి ఫైబర్, ఐరన్, సోడియం, పొటాషియం, కాల్షియం, లినోసిక్ యాసిడ్ మరియు ఒలీయిక్ యాసిడ్ వంటి కొవ్వు ఆమ్లాలు, అమైనో ఆమ్లాలు మరియు అస్థిరమైన నూనెలు ఉంటాయి.

Health Benefits of Kalonji in Telugu

ఈ నల్ల జీలకర్రను ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇందులో ఉండే ఇమ్యునోపొటెన్షియన్, బ్రోంకోడైలేటేషన్ మరియు యాంటిట్యూమర్, యాంటి హిస్టామినిక్, యాంటీ డయాబెటిక్, యాంటీ హైపెర్టెన్సివ్, యాంటీ ఇన్ఫ్లమెటరీ, యాంటీ మైక్రో బయల్, హెపాటోప్రొటెక్టివ్ మరియు గ్యాస్ట్రోప్రొటెక్టివ్ వంటి చికిత్స లక్షణాలను కలిగి ఉంటాయి. ఇటీవలి కాలంలో బాగా పాపులర్ అవుతున్న ఈ కలోంజి విత్తనాల వల్ల ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. ఇవి ఆరోగ్యంతో పాటు అందాన్ని పెంచడంలోనూ సహాయపడతాయట. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

ఈ ఆకుకూరకు సాటిలేదు మరే ఆకుకూర..వంద రెట్లు పోషకాలు..వందరెట్లు లాభాలు..ఈ ఆకుకూరకు సాటిలేదు మరే ఆకుకూర..వంద రెట్లు పోషకాలు..వందరెట్లు లాభాలు..

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది..

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది..

నల్ల జీలకర్ర గింజలు ఉండే అస్థిర నూనెలు మరియు ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటాయి. వీటిని ప్రతిరోజూ తీసుకుంటే మీ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ గింజలను వేడినీటిలో వేసి వాటి ఆవిరిని పీలిస్తే ఛాతీ మరియు ముక్కు దిబ్బడ నుండి ఉపశమనం పొందొచ్చు. సైనసైటిస్ నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. దీన్ని తేనే మరియు గోరు వెచ్చని నీళ్ల మిశ్రమంగా చేసుకుని తాగొచ్చు.

అల్సర్ తగ్గుదల..

అల్సర్ తగ్గుదల..

మన పొట్టలోని యాసిడ్ లు, లైనింగును ఏర్పరిచే రక్షిత శ్లేష్మ పొరను తిన్నప్పుడు కడుపులో అల్సర్లు ఏర్పడతాయి. ఇలాంటి సమస్యను కలోంజి విత్తనాలు తీసుకోవడం ద్వారా నివారించొచ్చు. నల్ల జీలకర్ర గింజలు కడుపులోని పొరను సంరక్షిస్తాయని, ఇవి పొట్టలో పుండ్లు ఏర్పడకుండా నివారిస్తుందని అధ్యయనాల్లో తేలింది. కడుపు పూతలను నయం చేయడంలోనూ నల్ల జీలకర్ర మంచి ప్రభావం చూపినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.

క్యాన్సర్ నివారణ..

క్యాన్సర్ నివారణ..

నల్ల జీలకర్రలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా నిరోధిస్తుంది. ఇవి క్యాన్సర్ కారకమైన ఫ్రీ రాడికల్స్ పోరాడతాయి. థైమాక్వినోన్ అనే క్రియాశీల సమ్మేళం కారణంగా విత్తనాలు సంభావ్య యాంటీ క్యాన్సర్ ప్రభావాలు కలిగి ఉంటాయి. థైమో క్వినోన్ రక్త క్యాన్సర్ కణాలు, రొమ్ము క్యాన్సర్ కణాలు, ప్యాంక్రియాటిక్, ఊపిరితిత్తులు, గర్భాశయ, చర్మం, పెద్ద ప్రేగు మరియు ప్రొస్టేట్ క్యాన్సర్ కణాలలో కణాల మరణానికి కారణమవుతుందని ఓ అధ్యయనంలో తేలింది.

Blueberry Health Benefits:బ్లూ బెర్రీస్ తో బ్రెయిన్ పవర్ పెరుగుతుందని తెలుసా...Blueberry Health Benefits:బ్లూ బెర్రీస్ తో బ్రెయిన్ పవర్ పెరుగుతుందని తెలుసా...

కాలేయం ఆరోగ్యం మెరుగుదల..

కాలేయం ఆరోగ్యం మెరుగుదల..

మన శరీరంలోని కాలేయం యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ ఈ కలోంజి విత్తనాలు బాగా పని చేస్తాయి. ఇందులోని కీలకమైన టాక్సిన్స్, ప్రాసెస్ పోషకాలు, ప్రోటీన్లు మరియు రసాయనాలను తొలగించడం దీని ప్రధాన విధులు. ఇవి తీసుకోవడం వల్ల రసాయనాల విషాన్ని తగ్గిస్తాయి. ఒక అధ్యయనం ప్రకారం కాలేయం దెబ్బ తినకుండా మరియు గాయం కాకుండా కలోంజీ విత్తనాలు సహాయపడతాయి.

హెల్దీ హార్ట్..

హెల్దీ హార్ట్..

మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం గుండె. అందుకే గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవాలి. నల్ల జీలకర్రలో ఉండే క్రీయాశీల సమ్మేళనం థైమోక్వినోన్ గుండె-రక్షణ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది హార్ట్ ఎటాక్, హార్ట్ స్ట్రోక్ లకు సంబంధించిన నష్టాలను అరికట్టడంలో సహాయపడుతుంది. ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యం పెరుగుతుంది. ఇది చెడు కొవ్వును కూడా తగ్గిస్తుంది. మంచి కొవ్వును పెంచుతుందని పరిశోధనల ద్వారా తెలిసింది.

మధుమేహం నివారణ..

మధుమేహం నివారణ..

ప్రస్తుతం చాలా మందిలో వేగంగా మధుమేహం పెరుగుతోంది. చాలా మంది వీటి నివారణకు ఇన్సులిన్లు తీసుకుంటున్నారు. దీంతో ఇది కణజాల నష్టం, సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అయితే కలోంజి విత్తనాలు తీసుకుంటే సహజంగానే మధుమేహం నయం చేయడానికి సమర్థవంతమైన ఔషధంగా పరిగణించబడతాయి. ఇవి స్థిర నూనెలు, ఆల్కలాయిడ్స్, థైమోక్వినోన్ వంటి ముఖ్యమైన నూనెలు కలిగి ఉంటాయి. ఇందులోని పదార్థాలు ప్రేగులలో గ్లూకోజ్ శోషణను నిరోధించడంలో సహాయపడతాయి.

మధుమేహం, జీర్ణ సమస్య, కిడ్నీ సమస్యకు మెంతులు: రాత్రి నానబెట్టిన మెంతినీళ్ళు..మధుమేహం, జీర్ణ సమస్య, కిడ్నీ సమస్యకు మెంతులు: రాత్రి నానబెట్టిన మెంతినీళ్ళు..

మెమొరీ పెరుగుదల..

మెమొరీ పెరుగుదల..

ఒక అధ్యయనం ప్రకారం నల్ల జీలకర్ర గింజల్లో మెమొరీని పెంచే పవర్ ఉందని తేలింది. ఇందులోని క్రియాశీల సమ్మేళం థైమోక్వినోన్ దెబ్బ తిన్న మెదడు నాడీ కణజాలానికి చికిత్స చేయగలదు.

హై బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది..

హై బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది..

నల్ల జీలకర్ర అనేక వ్యాధులకు సంప్రదాయ ఔషధంగా ఉపయోగించబడింది. నల్ల జీలకర్ర గింజలు తీసుకోవడం వల్ల రక్తపోటు స్వల్పంగా పెరిగిన వారిలో సానుకూల ప్రభావాలను చూపుతుందని ఓ అధ్యయనంలో తేలింది.

ఆస్తమ, అలర్జీ నివారణ..

ఆస్తమ, అలర్జీ నివారణ..

నల్ల జీలకర్రలో ఉండే యాంటీ ఆస్త్మాటిక్ వల్ల అలర్జీ, అస్తమా వంటివి తగ్గుతాయి. అంతేకాదు వీటితో కొందరిలో దగ్గు, గురక సమస్యల నుండి ఉపశమనం లభించింది. ఇది ఊపిరితిత్తుల పనితీరును సైతం మెరుగుపరుస్తుంది.

ఊబకాయాన్ని నివారిస్తుంది..

ఊబకాయాన్ని నివారిస్తుంది..

ఓ అధ్యయనం ప్రకారం.. నల్ల జీలకర్ర విత్తనాలు మహిళల్లో ఊబకాయం రాకుండా తగ్గిస్తుంది. ఇది బరువు, నడుము చుట్టూ పేరుకుపోయే కొవ్వును ట్రెగ్లిజరైడ్ స్థాయిలను తగ్గిస్తుంది.

FAQ's
  • నల్ల జీలకర్రలో ఎలాంటి పోషకాలు ఉంటాయి?

    ఈ విత్తనాలలో ఉండే విటమిన్లు, ప్రోటీన్లు ముడి ఫైబర్, ఐరన్, సోడియం, పొటాషియం, కాల్షియం, లినోసిక్ యాసిడ్ మరియు ఒలీయిక్ యాసిడ్ వంటి కొవ్వు ఆమ్లాలు, అమైనో ఆమ్లాలు మరియు అస్థిరమైన నూనెలు ఉంటాయి. ఈ నల్ల జీలకర్రను ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా ఉపయోగిస్తారు.

  • కలోంజి విత్తనాల్లో ఎలాంటి చికిత్స లక్షణాలు ఉంటాయి?

    కలోంజి విత్తనాల్లో ఉండే ఇమ్యునోపొటెన్షియన్, బ్రోంకోడైలేటేషన్ మరియు యాంటిట్యూమర్, యాంటి హిస్టామినిక్, యాంటీ డయాబెటిక్, యాంటీ హైపెర్టెన్సివ్, యాంటీ ఇన్ఫ్లమెటరీ, యాంటీ మైక్రో బయల్, హెపాటోప్రొటెక్టివ్ మరియు గ్యాస్ట్రోప్రొటెక్టివ్ వంటి చికిత్స లక్షణాలను కలిగి ఉంటాయి.

  • నల్ల జీలకర్రతో క్యాన్సర్ నివారణ జరుగుతుందా?

    నల్ల జీలకర్రలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా నిరోధిస్తుంది. ఇవి క్యాన్సర్ కారకమైన ఫ్రీ రాడికల్స్ పోరాడతాయి. థైమాక్వినోన్ అనే క్రియాశీల సమ్మేళం కారణంగా విత్తనాలు సంభావ్య యాంటీ క్యాన్సర్ ప్రభావాలు కలిగి ఉంటాయి. థైమో క్వినోన్ రక్త క్యాన్సర్ కణాలు, రొమ్ము క్యాన్సర్ కణాలు, ప్యాంక్రియాటిక్, ఊపిరితిత్తులు, గర్భాశయ, చర్మం, పెద్ద ప్రేగు మరియు ప్రొస్టేట్ క్యాన్సర్ కణాలలో కణాల మరణానికి కారణమవుతుందని ఓ అధ్యయనంలో తేలింది.

English summary

Health Benefits of Kalonji in Telugu

Here are the health benefits of kalonji in Telugu. Have a look
Story first published:Thursday, November 18, 2021, 12:40 [IST]
Desktop Bottom Promotion