For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైబ్లడ్ ప్రెజర్ ను తక్కువగా అంచానా వేయకండి..ఇది ఎలా ప్రాణం తీస్తుందో తెలుసా?

హైబ్లడ్ ప్రెజర్ ను తక్కువగా అంచానా వేయకండి..ఇది ఎలా ప్రాణం తీస్తుందో తెలుసా?

|

కరోనా తర్వాత ప్రస్తుతం చాలా మంది అధిక రక్తపోటు, గుండెనాళాల్లో బ్లాక్స్ సమస్యలను ఎక్కువగా వింటున్నాము. ఒక వ్యక్తి శరీరంలో రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు, సరిగా ఆక్సిన్ సరఫరా కానప్పుడు రక్తపోటు అనారోగ్య స్థాయికి పెరిగినప్పుడు అధిక రక్తపోటు ఏర్పడుతుంది. కానీ మనలో చాలా మందికి రక్తపోటు సమస్యలు ఉన్నాయని ప్రాణాపాయ స్థితికి వచ్చే వరకూ తెలియదు. ముఖ్యంగా మనకు అధిక రక్తపోటు ఉన్నట్లయితే, మనం సాధారణంగా లక్షణాలను గమనించము. అందువల్ల ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రెటీలు హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ కు గురి అవుతున్నారు. తరచుగా దీని లక్షణాలు మనం రోజూ ఎదుర్కొనే కొన్ని సమస్యలే. కాబట్టి అధిక రక్తపోటు సమస్యను పరీక్షల ద్వారానే తెలుసుకోవచ్చు.

health threats from high blood pressure in telugu

అధిక రక్తపోటు సమస్యను గుర్తించిన వెంటనే చికిత్స చేయకుండా అలాగే వదిలేస్తే, అది రక్తనాళాలను దెబ్బతీస్తుంది మరియు మెదడు, గుండె, కళ్ళు మరియు మూత్రపిండాలు వంటి ముఖ్యమైన అవయవాలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు వైద్యుడిని సందర్శించి రక్తపోటును తనిఖీ చేయడం చాలా ముఖ్యం. ముఖ్యంగా మీరు 30 ఏళ్లు పైబడిన స్త్రీ మరియు పురుషులు ఏవరైనా సరే మీరు తప్పనిసరిగా రెగ్యులర్ మెడికల్ చెకప్స్ చేయించుకోవాలి.

ఇప్పుడు అధిక రక్తపోటు వల్ల శరీరంలోని ఏయే అవయవాలు ప్రభావితమై అటువంటి ప్రమాదానికి దారితీసే కారకాలు ఏంటో ఇక్కడ వివరంగా చూద్దాం.

హార్ట్ అటాక్

హార్ట్ అటాక్

హై బ్లడ్ ప్రెజర్ (అధిక రక్తపోటు) ధమనులను దెబ్బతీస్తుంది మరియు అవి నిరోధించబడి గుండె కండరాలకు రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది, ఫలితంగా హార్ట్ అటాక్ వస్తుంది.

స్టోక్ (పక్షవాతం)

స్టోక్ (పక్షవాతం)

హైబ్లడ్ ప్రెజర్ (అధిక రక్తపోటు) తీవ్రమైతే, అది సులభంగా మెదడులోని రక్తనాళాలను అడ్డుకుంటుంది మరియు స్ట్రోక్‌కు కారణమవుతుంది. కొన్నిసార్లు అడ్డుపడటం వల్ల మెదడులోని రక్తనాళాలు పగిలిపోతాయి. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి.

గుండె ఆగిపోవుట

గుండె ఆగిపోవుట

గుండెపై ఒత్తిడి పెరిగినప్పుడు అధిక రక్తపోటు మరింత తీవ్రంగా మారుతుంది. దాంతో శరీరంలో ఇతర ముఖ్యమైన భాగాలకు రక్తాన్ని సరఫరా చేయలేకపోతుంది. ఫలితంగా గుండె వైఫల్యం చెందుతుంది.

కిడ్నీ వ్యాధి లేదా మూత్రపిండ వైఫల్యం

కిడ్నీ వ్యాధి లేదా మూత్రపిండ వైఫల్యం

హై బ్లడ్ ప్రెజర్ కారణంగా మూత్రపిండాల చుట్టూ ఉన్న ధమనులను దెబ్బతీస్తుంది మరియు రక్తాన్ని ఫిల్టర్ చేసే మూత్రపిండాల సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది.

 దృష్టి కోల్పోవడం

దృష్టి కోల్పోవడం

అధిక రక్తపోటు కళ్లలోని రక్తనాళాలపై అధిక ఒత్తిడిని కలిగిస్తుంది మరియు వాటిని దెబ్బతీస్తుంది, కళ్ళు ఎక్కువగా ఒత్తిడికి గురైనప్పుడు దృష్టిని కోల్పోతుంది.

 లైంగిక సమస్యలు

లైంగిక సమస్యలు

అధిక రక్తపోటును ముందుగానే గుర్తించి చికిత్స చేయకపోతే, అది తీవ్రంగా మారవచ్చు, దీని ఫలితంగా పురుషులలో అంగస్తంభన మరియు మహిళల్లో సెక్సువల్ సమస్యలు ఏర్పడుతుంది.

 ఆంజినా

ఆంజినా

అధిక రక్తపోటు దీర్ఘకాలం కొనసాగితే, అది గుండె జబ్బులు లేదా మైక్రోవాస్కులర్ డిసీజ్ కి దారి తీస్తుంది. ఒక సాధారణ లక్షణం ఆంజినా లేదా ఛాతీ నొప్పి.

పరిధీయ ధమని వ్యాధి

పరిధీయ ధమని వ్యాధి

అధిక రక్తపోటు వల్ల అథెరోస్క్లెరోసిస్ వస్తుంది. ఈ పరిస్థితి కాళ్లు, చేతులు, పొట్ట మరియు తలలోని ధమనులను కుచించుకుపోయేలా చేస్తుంది, దీని వలన నొప్పి లేదా విపరీతమైన అలసట వస్తుంది.

English summary

health threats from high blood pressure in telugu

Here are the some Health Threats From High Blood Pressure. Read on..
Story first published:Tuesday, January 31, 2023, 12:38 [IST]
Desktop Bottom Promotion