For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తాజా సర్వే! కరోనా మహమ్మారి గుండె కండరాలనే టార్గెట్ చేస్తోందట... తస్మాత్ జాగ్రత్త...!

కరోనావైరస్ గుండెపై కూడా ఎక్కువ ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

|

కరోనా మహమ్మారి వూహాన్ లో పుట్టినప్పటి నుండి ఇది శ్వాసకోశకు సంబంధించిన వ్యాధి అందరూ భావించారు. అందుకే అందరూ శ్వాసకోశకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని నిపుణులు సూచించారు.

How does the coronavirus affect the heart in telugu

మన దేశంలో ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ కేసులు తగ్గుతున్నాయని సంతోషిస్తున్న సమయంలో.. కరోనా గురించి అమెరికా వైద్య నిపుణులు, చికాగో యూనివర్సిటీ ప్రొఫెసర్లు మళ్లీ ఓ భయంకరమైన విషయాన్ని వెల్లడించారు.

How does the coronavirus affect the heart in telugu

కోవిద్-19కు సంబంధించి ఇటీవల చేసిన పరిశోధనల్లో కరోనా వైరస్ నేరుగా గుండె కండరాలకు సోకుతుందని.. అంతేకాదు ఇది మనిషి యొక్క గుండెను దెబ్బతీయండంతో పాటు ఇతర సమస్యలను కూడా కలిగిస్తుందని వైద్యులు నమ్ముతున్నారట.

How does the coronavirus affect the heart in telugu

ఈ కరోనా మహమ్మారి శ్వాసకోశ వ్యవస్థపై దాడి చేస్తుంది కాబట్టి దీని ప్రభావం కచ్చితంగా మన ఊపిరితిత్తులపై పడుతుందని.. దీని కారణంగా మన గుండెపైనా తీవ్ర ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఈ కరోనా భూతం నేరుగా గుండె కండరాలపై దాడి చేస్తున్నట్లు తాజా పరిశోధనల్లో రుజువైందట. ఇప్పటివరకు జరిగిన అధ్యయనాల ప్రకారం.. కరోనా మహమ్మారి ఊపిరితిత్తులపై దాడి చేసి గుండెకు తగినంత రక్తసరఫరా, ఆక్సీజన్ అందకుండా చేస్తుండేదని తేల్చగా.. తాజాగా చికాగో విశ్వవిద్యాలయం సైంటిస్టుల అంచనాల ప్రకారం ఈ వైరస్ నేరుగా మనుషుల గుండెతో పాటు రక్తనాళాలపైనా దాడి చేస్తోందట. దీని వల్ల రక్తం గడ్డ కట్టే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీరి పరిశోధనల్లో ఇంకా ఏయే విషయాలు వెలుగులోకొచ్చాయి.. కరోనా నుండి మన గుండెను కాపాడుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం...

రక్తం గడ్డకట్టినప్పుడు..

రక్తం గడ్డకట్టినప్పుడు..

చికాగో యూనివర్సిటీ నిపుణుల అధ్యయనం ప్రకారం కొందరు కరోనా సోకిన బాధితుల బాడీలో చాలా చోట్ల రక్తం గడ్డ కట్టిపోయినట్లు గుర్తించారట. అయితే ఇవి కరోనా వచ్చిన తర్వాత ఏర్పడ్డాయా? అంతకుముందు నుండే ఉన్నాయా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

అప్రమత్తంగా ఉండాలి..

అప్రమత్తంగా ఉండాలి..

ఈ నేపథ్యంలో గుండెకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న వారు కరోనా మహమ్మారి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని.. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉండొద్దని, కరోనా పరిశోధనల్లో పాల్గొన్న అమెరికన్ శాస్త్రవేత్త డాక్టర్ సీన్ పిన్నేయ్ సూచించారు.

గుండె సమస్యలు లేకపోయినా..

గుండె సమస్యలు లేకపోయినా..

అయితే, ఇంతవరకు ఎలాంటి గుండె సంబంధిత సమస్యలు లేని వారికి కూడా కరోనా వైరస్ సోకిన తర్వాత ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగానే ఉందని.. కొంతమందిలో ఇలాంటి లక్షణాలను గుర్తించామని వివరించారు.

దాదాపు 25 శాతం మంది..

దాదాపు 25 శాతం మంది..

అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ జర్నల్ లో ఈ పరిశోధన ఫలితాలను ప్రచురించారు. తాజా అధ్యయనం ప్రకారం.. కరోనా సోకిన వారిలో దాదాపు 25 శాతం మందికి గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చాయట. మరికొన్ని చోట్ల ఈ సంఖ్య మరో 5 శాతం పెరిగి, 30 శాతంగా నమోదైంది.

శాశ్వతామా? తాత్కాలికమా?

శాశ్వతామా? తాత్కాలికమా?

కరోనా వైరస్ సోకిన వారిలో కొందరి బాడీలోని ఎంజైమ్ ల స్థాయిలను బట్టి మార్పులు చోటు చేసుకున్నాయి. దీని వల్ల వారి గుండె పని చేసే తీరు మందగించడం వంటి అంశాలను గుర్తించినట్లు నిపుణులు తెలిపారు. అయితే ఈ సమస్య శాశ్వతమా? లేక తాత్కాలికమా అన్న విషయంలో ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.

స్కానింగ్ ద్వారా..

స్కానింగ్ ద్వారా..

అయితే కరోనా వైరస్ సోకిన వారిలో గుండెపై నేరుగా ప్రభావం చూపుతుందా లేదా అనే విషయంపై పరిశోధకులు మరిన్ని ఆధారాలను కూడా సేకరించారు. ఇందులో ఒకరు న్యూమోనియాతో మరణించగా.. మరికొందరు స్వల్ప లక్షణాలున్న అథ్లెట్లలో గుండె కణజాలల మధ్య ఇన్ఫెక్షన్ చేరినట్లు స్కానింగ్ ద్వారా గుర్తించారు.

కరోనాకు ముందు..

కరోనాకు ముందు..

అయితే కరోనా వైరస్ సోకకముందు వారిలో అలాంటి లక్షణాలేమీ కనబడలేదని.. ఈ విషయంలో మరింత క్లారిటీ రావాల్సిన అవసరం ఉందని, మాకు తెలియని విషయాలు మరికొన్ని ఉన్నాయని, అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ నిపుణుడు టామ్ మేడాక్స్ తెలిపారు.

క్రమం తప్పకుండా..

క్రమం తప్పకుండా..

కరోనా సేకండ్ వేవ్ ప్రారంభమైనందున, ఈ సమయంలో గుండె సంబంధిత రోగులు క్రమం తప్పకుండా మందులను వాడాలి. ముఖ్యంగా మీ వద్ద తప్పనిసరిగా అందుబాటులో మందులను ఉంచుకోవాలి. ఏ మాత్రం చిన్న అనుమానం వచ్చినా..వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

రెగ్యులర్ ఎక్సర్ సైజ్..

రెగ్యులర్ ఎక్సర్ సైజ్..

కరోనా మహమ్మారి మరోసారి విలయ తాండవం చేస్తున్న వేళ మీరు రెగ్యులర్ గా మీ ఇంటి ఆవరణలోనే రెగ్యులర్ ఎక్సర్ సైజ్ చేయాలి. మీ బాడీని ఎక్కువ యాక్టివ్ గా ఉంచుకోండి. దీని వల్ల మీ గుండెకు మంచిది. అలాగే ఎక్సర్ సైజ్ గురించి డాక్టర్ల సలహాలు తీసుకోవాలి. దీని వల్ల గుండె సంబంధిత సమస్యలను నివారించవచ్చు.

హెల్దీ ఫుడ్ తీసుకోండి..

హెల్దీ ఫుడ్ తీసుకోండి..

గుండె సంబంధిత రోగులు, కరోనా సోకిన వారు బయట వండిన ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. ఇంట్లో కూడా తాజా కూరగాయలు, ఆకుకూరలను బాగా ఉడికించిన తర్వాత మాత్రమే తీసుకోవాలి. వంట చేయడానికి ముందు.. వంట తర్వాత మీ చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఆ సమయంలో ముక్కను తాకకండి.

ఎవ్వరినీ కలవకండి..

ఎవ్వరినీ కలవకండి..

మీకు గుండెకు సంబంధించిన మరియు కరోనా లక్షణాలు ఉన్నట్లు ఏ చిన్న అనుమానం వచ్చినా ఎక్కడికి వెళ్లకండి.. ఎవ్వరినీ మీ ఇంటికి ఆహ్వానించకండి. మీ ఇంట్లో వారితో మాట్లాడాలంటే కూడా సోషల్ డిస్టెన్స్ పాటించండి. ఇక ఎవరితో అయినా అత్యవసరంగా మాట్లాడాలనుకుంటే.. వీడియో కాల్స్ చేయండి. ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్న వారితో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దు. తరచుగా డాక్టర్ని సంప్రదించి.. వారి మార్గదర్శకాలను పాటించండి.

English summary

How does the coronavirus affect the heart in telugu

Even though it's known as a respiratory virus, doctors believe the coronavirus can directly infect the heart muscle and cause other problems leading to heart damage.
Story first published:Monday, November 2, 2020, 18:51 [IST]
Desktop Bottom Promotion