For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Carbide Free Mangoes:మామిడిలో కార్బైడ్ కలిసిందా లేదా అనేది ఇలా కనిపెట్టండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి...

మామిడి పండ్లలో కార్బైడ్ ను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

|

ఎండాకాలంలో మామిడి పండు పేరు వింటే చాలు ప్రతి ఒక్కరి నోట్లో నీళ్లు అలా ఊరిపోవాల్సిందే. ముఖ్యంగా బంగినపల్లి, నూజివీడు రసాలు, కొత్తపల్లి కొబ్బరి ఇలా రకరకాల మామిడి పండ్లు, ఏడాది పొడవునా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తుంటారు.

How to Detect Carbide Free Mangoes in Telugu

ఎందుకంటే ఈ పండ్లు కేవలం ఎండాకాలం సీజన్లో మాత్రమే దొరుకుతాయి. అందుకే ఈ కాలంలో అన్ని పండ్ల కంటే ఈ పండ్లను కొనడానికే చాలా మంది ఇష్టపడుతుంటారు. అయితే మామిడి పండ్లను తినడంలోనూ ఒక్కొక్కరికీ ఒక్కో అభిరుచి ఉంటుంది.

How to Detect Carbide Free Mangoes in Telugu

కొందరు పచ్చి మామిడి(raw mango)పై ఉప్పుకారం వేసుకుని తింటే.. మరికొందరు మాత్రం బాగా పక్వానికి వచ్చిన వాటిని తినేందుకు ఇష్టపడుతుంటారు. ఇంకా కొంతమంది అయితే మామిడితో కూరలు కూడా తయారు చేసుకుని తింటారు.

How to Detect Carbide Free Mangoes in Telugu

ఇలా మామిడి పండ్లను తినడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. ఎండాకాలంలో మామిడి పండ్లు పూర్తిగా పక్వానికి రాకముందే కార్బైడ్ కెమికల్ ను వేసి పండిస్తున్నారట. ఇలాంటి పండ్లను మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా ఇలాంటి పండ్లను ఎలా గుర్తించాలి.. ఏ రకమైన పండ్లు సహజంగా ఉంటాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మీకు మధుమేహం ఉందా? ఐతే ఈ వెజిటేబుల్స్ తరచుగా తినండి... కంట్రోల్లో ఉంటుంది...మీకు మధుమేహం ఉందా? ఐతే ఈ వెజిటేబుల్స్ తరచుగా తినండి... కంట్రోల్లో ఉంటుంది...

పండ్ల రారాజు..

పండ్ల రారాజు..

పండ్లలో రారాజుగా పేరొందిన మామిడి పండ్లు ఎండాకాలంలో ఎక్కువగా లభిస్తాయి. కిలోమీటర్ దూరం నుండే కమ్మని వాసనతో.. మనల్ని ఆకర్షించే మామిడి పండ్లు ఎక్కడ చూసినా విరివిగా లభిస్తాయి. ముఖ్యంగా మార్కెట్లలో పసుపు పచ్చని రంగులో కనపిస్తూ.. చూడగానే నోరు ఊరిపోయేలా చేస్తుంటాయి.

పసుపు పచ్చని పండ్లు..

పసుపు పచ్చని పండ్లు..

అయితే అలా పసుపు రంగులో కనిపించే పండ్లన్నీ సహజంగా పండినవి కాదనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే కొందరు వ్యాపారులు మామిడి పండ్లు త్వరగా పక్వం చెందాలనే ఆశతో కార్బైడ్ కెమికల్ వేస్తున్నారు. ఇదే విషయం చాలా సార్లు పత్రికల్లో, ఇతర చోట్ల వెలుగులోకి వచ్చింది. ఇది వేయడం వల్ల మన ఆరోగ్యం దెబ్బతినడమే కాదు.. ప్రమాదకరమైన క్యాన్సర్ కూడా వచ్చే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సహజమైన పండ్లు ఇలా..

సహజమైన పండ్లు ఇలా..

అందుకే మీరు మార్కెట్లో మామిడి పండ్లను కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. మీరు తీసుకుంటున్న పండ్లు సహజంగా పండినవా? లేకపోతే కార్బైడ్ వేసి పండించినవా అనేది కచ్చితంగా గుర్తించాలి. కెమికల్ లేకుండా సహజంగా పండించిన మామిడి పండ్లు ఎలాంటి మచ్చలు లేకుండా అంతా ఒకే రంగులో ఉంటాయి. అదే కెమికల్ తో పండించిన మామిడి అయితే అక్కడక్కడ కొన్ని మచ్చలు ఉంటాయి.

మంచి వాసన..

మంచి వాసన..

మామిడి పండ్ల నుండి వచ్చే వాసనను బట్టి కూడా సహజంగా పండినవా లేదా కెమికల్స్ వేసి పండించరా అనే విషయాలను తెలుసుకోవచ్చు. మీరు మామిడి పండ్లను కొనేటప్పుడు తొడిమ దగ్గర వాసన చూస్తే కమ్మనైన వాసన మిమ్మల్ని ఆకర్షిస్తుంది. అలా వాసన వస్తే అది సహజంగా పండించినట్టే. అంతేకాదు అది కాస్త మెత్తగా కూడా ఉంటుంది.

రుచికరంగా..

రుచికరంగా..

కెమికల్స్ వేసి పండించిన పండ్లు చాలా తేలికగా ఉంటాయి. సహజమైన పండ్లతో పోల్చి చూస్తే ఇవి నీటిలో తేలుతూ కనిపిస్తాయి. అలాగే వాటిపై తెల్లని పొర కనిపించిందంటే చాలు.. వాటిలో కచ్చితంగా కార్బైడ్ వేశారని అర్థం చేసుకోవాలి. కార్బైడ్ వేసి పండించిన మామిడి పండ్ల రుచి కూడా ఏ మాత్రం గొప్పగా ఉండదు. పుల్లగా ఉంటుంది. అదే సహజంగా పండిన పండ్లు మాత్రం చాలా తియ్యగా ఉంటాయి.

మామిడితో ఆరోగ్య ప్రయోజనాలు..

మామిడితో ఆరోగ్య ప్రయోజనాలు..

మామిడి పండ్లతో పాటు దాని టెంక, మామిడాకులు, బెరడు, మామిడి పువ్వు వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మామిడి పువ్వులకు అనేక వ్యాధులను దూరం చేసే సామర్థ్యముంది.

విరేచనాలకు విరుగుడుగా..

విరేచనాలకు విరుగుడుగా..

afrolet.comలో ప్రచురితమైన కథనం ప్రకారం.. దీర్ఘకాలిక విరేచనాలు(మోషన్స్) సమస్య నుండి వెంటనే ఉపశమనం కలిగించే గుణం మామిడిలో ఉంది. మామిడి పువ్వుల నుండి తయారు చేసిన సూప్ లేదా డికాషన్ తాగడం వల్ల విరేచనాల సమస్యకు చెక్ పెట్టొచ్చు. మామిడి పువ్వులను ఎండబెట్టి పొడిని తయారు చేసి నీటితో పాటు తీసుకోవాలి.

FAQ's
  • మామిడి పండ్లలో కార్బైడ్ కలిసిందా లేదా అనేది ఎలా గుర్తించాలి?

    మీరు మార్కెట్లో మామిడి పండ్లను కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. మీరు తీసుకుంటున్న పండ్లు సహజంగా పండినవా? లేకపోతే కార్బైడ్ వేసి పండించినవా అనేది కచ్చితంగా గుర్తించాలి. కెమికల్ లేకుండా సహజంగా పండించిన మామిడి పండ్లు ఎలాంటి మచ్చలు లేకుండా అంతా ఒకే రంగులో ఉంటాయి. అదే కెమికల్ తో పండించిన మామిడి అయితే అక్కడక్కడ కొన్ని మచ్చలు ఉంటాయి.

English summary

How to Detect Carbide Free Mangoes in Telugu

Here we are talking about the how to detect carbide free mangoes in Telugu. Have a look
Story first published:Thursday, May 19, 2022, 15:50 [IST]
Desktop Bottom Promotion