For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

How to use Pulse Oximeter: ఆక్సీమీటర్ ఎలా పని చేస్తుంది... ఇంట్లోనే ఉంటూ తెలుసుకోండిలా...

ఇంట్లోనే ఆక్సీమీటర్ పల్స్ ఎలా వాడాలో తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ ను పూర్తిగా చూడండి.

|

ప్రస్తుతం మన దేశంలో కరోనావైరస్ మహమ్మారి ప్రతి ఒక్కరినీ కలవరపెడుతోంది. ఒకప్పుడు వందల సంఖ్యలో ఉండే కోవిద్ కేసులు ప్రస్తుతం లక్షల సంఖ్యకు చేరింది.

How to Use Pulse Oximeter Correctly? Here Is the Step by Step Process in Telugu

మరణాల సంఖ్య కూడా వేల స్థాయికి చేరింది. కరోనా బారిన పడినవారు ప్రాణాలను కోల్పోవడానికి ప్రధాన కారణం ఆక్సీజన్ సరిపడా లేకపోవడమేనని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో డిజిటల్ పల్స్ ఆక్సీమీటర్ పాత్ర కీలకంగా మారింది. ఆక్సీమీటర్ సహాయంతో వ్యక్తి శరీరంలో ఆక్సీజన్ స్థాయిని, పల్స్ రేటును సులభంగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఆక్సీమీటర్ సహాయంతో వ్యక్తి శరీరంలోని ఆక్సీజన్ స్థాయిని తెలుసుకుని, సకాలంలో తనకు ఆక్సీజన్ అందించగలిగితే.. తన ప్రాణాలు కాపాడటానికి అవకాశం దక్కుతుంది. ముఖ్యంగా కరోనా బారిన రోగులందరూ ఆక్సీ మీటర్ సహాయంతో ఆక్సీజన్ మొత్తాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే.. వేగంగా కోలుకునే అవకాశం ఉంటుంది. కరోనా సోకిన వారు ఆరు నిమిషాల నడక తర్వాతే ఆక్సీజన్ స్థాయిని కొలవాలి. ఒక వ్యక్తిలో ఆక్సీజన్ లెవెల్ 94 కన్నా తక్కువగా ఉంటే.. అప్పుడు పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

How to Use Pulse Oximeter Correctly? Here Is the Step by Step Process in Telugu

ఈ సందర్భంగా ఆక్సీజన్, పల్స్ లెవెల్స్ ను ఇంట్లోనే ఉంటూ తెలుసుకోవాలంటే.. ఈ పాయింట్స్ ను ఫాలో కావాల్సిందే.. ఇంకెందుకు ఆలస్యం చూసెయ్యండి మరి...

DRDO Drug 2-DG:Anti Covid Drug ఎలా పని చేస్తుంది.. మార్కెట్లోకి ఎప్పుడొస్తుందంటే...DRDO Drug 2-DG:Anti Covid Drug ఎలా పని చేస్తుంది.. మార్కెట్లోకి ఎప్పుడొస్తుందంటే...

ఆక్సీమీటర్ పనితీరు

ఆక్సీమీటర్ పనితీరు

ఆక్సీమీటర్స్ పల్స్ అనేది ఒక చిన్న పరికరం. ఇది చూడటానికి స్మార్ట్ వాచ్ లా కనిపిస్తుంది. ఈ ఆక్సీ మీటర్ లో చేతి వేలికి తొడిగించేందుకు కొంత స్థలం ఉంటుంది. దీని వల్ల మన బాడీలో ఆక్సీజన్ స్థాయిని కేవలం కొన్ని సెకన్లలో తెలుసుకోవచ్చు. ఈ ఆక్సీమీటర్ పరికరం రెడ్ మరియు బ్లూ లేదా బ్లాక్ కలర్లో ఉంటుంది. దీనిలో నుండి వచ్చే పరారుణ కాంతి కిరణాల వల్ల రక్తంలోని ఆక్సీజన్ మొత్తాన్ని మరియు పల్స్ రేటును తెలుసుకోవచ్చు. ఆక్సీమీటర్ పై భాగంలో ఒక చిన్న డిజిటల్ స్క్రీన్ ఉంటుంది. ఇది మన బాడీలోని ఆక్సీజన్ లెవెల్స్ ను చూపుతుంది. అలాగే పల్స్ రేటును కూడా చూపుతుంది.

ఆక్సీ మీటర్ వాడే సమయంలో..

ఆక్సీ మీటర్ వాడే సమయంలో..

ఆక్సీమీటర్స్ పల్స్ పరికరాన్ని సాధారణంగా ఎడమ చేతి చూపుడు వేలి మీద ఉంచాలి. మీ వేలిని అందులో ఉంచి ఆక్సీమీటర్లోని చిన్న బటన్ నొక్కితే మీకు ఆక్సీజన్ మరియు పల్స్ రేటు తెలుస్తుంది. అయితే మీరు ఆక్సీమీటర్లో చేతి వేలిని చొప్పించే సమయంలో మీ చేతి వేలికి లోహ వస్తువు లేదా ఉంగరాలు ధరించరాదు.

ఈ పాయింట్లను ఫాలో అవ్వాలి..

ఈ పాయింట్లను ఫాలో అవ్వాలి..

1) మీరు ఆక్సీమీటర్ పరికరాన్ని వాడేటప్పుడు మీ చేతి గోర్లకు నెయిల్ పాలిష్, మెహందీ, పచ్చబొట్టు వంటివాటివి ఉండకుండా చూడాలి.

2) మీ వేలు చల్లగా ఉంటే, తేమగా ఉండేలా చూసుకోవాలి.

3) ఆక్సీమీటర్లో ఆక్సీజన్ స్థాయిని చెక్ చేయడానికి ముందు, ఐదు నిమిషాలు విశ్రాంతి తీసుకోండి.

4) పల్స్ ఆక్సీమీటర్ ఆన్ చేసి, చూపుడు వేలు లేదా మధ్యవేలు కొనపై ఉంచండి.

5) ముందుగా మీ ఆక్సీజన్ స్థాయి లెవెల్స్ హెచ్చుతగ్గులకు లోనవుతుంది. అప్పుడు మీరు సుమారు ఒక నిమిషం వరకు వేచి ఉండాలి.

6) కనీసం ఐదు సెకన్ల తర్వాత మీరు దాన్ని గమనించాలి.

DRDO Drug 2-DG: కోవిద్-19 కట్టడికి కొత్త మందు వచ్చేసింది.. దీన్ని ఎలా వాడాలంటే...DRDO Drug 2-DG: కోవిద్-19 కట్టడికి కొత్త మందు వచ్చేసింది.. దీన్ని ఎలా వాడాలంటే...

ఆక్సీజన్ లెవెల్స్..

ఆక్సీజన్ లెవెల్స్..

సాధారణంగా ఆరోగ్యకరమైన వ్యక్తికి సాధారణ ఆక్సిజన్ స్థాయి 95 నుండి 100 వరకు ఉంటుంది. వైద్యుల అభిప్రాయం ప్రకారం, ఒక వ్యక్తి తన ఆక్సిజన్ సంతృప్త స్థాయిని 95 శాతం కంటే తక్కువ ఉండకుండా చూసుకోవాలి. ఒకవేళ అంతకంటే తక్కువ ఉంటే మీ పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆక్సిజన్ స్థాయి 90 శాతం కంటే తక్కువగా ఉన్నప్పుడు, రోగికి ఊపిరి, ఛాతీ నొప్పి వంటివి రావొచ్చు. అప్పుడు సకాలంలో స్పందించకపోతే.. రోగి మరణించే అవకాశం ఉంటుంది.

వైద్యుల అభిప్రాయాలు

వైద్యుల అభిప్రాయాలు

ఈ సమయంలో, వైద్యుల ప్రకారం, దాదాపు ప్రతి ఇంటికి డిజిటల్ పల్స్ ఆక్సిమీటర్ ఉండాలి. ఈ డిజిటల్ పల్స్ ఆక్సిమీటర్ రోగులకు మాత్రమే కాదు, సామాన్య ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది. ఈ అంటువ్యాధి సమయంలో మీరు ఆక్సిమీటర్ ద్వారా శరీరంలోని ఆక్సిజన్ స్థాయిని సులభంగా చెక్ చేయవచ్చు. శరీరంలో ఆక్సిజన్ కొరత కనిపిస్తే, మీరు వెంటనే డాక్టర్ నుండి సహాయం పొందవచ్చు. శరీరంలో ఆక్సిజన్ స్థాయిని రోజుకు కనీసం రెండుసార్లు కొలవడం అవసరం.

English summary

How to Use Pulse Oximeter Correctly? Here Is the Step by Step Process in Telugu

Here we are talking about the how to use pulse oximeter correctly? Here is the step by step process in Telugu. Have a look
Desktop Bottom Promotion