For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

COVID-19 వ్యాక్సిన్ తర్వాత దీర్ఘకాల గుండెపోటు సమస్యలు ఎదురవుతాయా?

కోవిద్ వ్యాక్సినేషన్ తర్వాత దీర్ఘకాలిక గుండె సంబంధిత సమస్యలు వస్తాయా? ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

|

కరోనా మహమ్మారి బారి నుండి మనం ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం. ప్రపంచ వ్యాప్తంగా కేసుల సంఖ్య పెరిగినప్పటికీ.. రికవరీ రేటు కూడా బాగా మెరుగుపడటం.. మరణాల సంఖ్య తగ్గిపోవడం వంటి వార్తలు ఊరటనిస్తున్నాయి.

Long term effects on heart health post Covid-19 vaccination in Telugu

అంతేకాకుండా కోవిద్ వ్యాక్సినేషన్ కూడా వేగవంతం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఈ సమయంలోనే గుండె సంబంధిత సమస్యలతో అనేక మంది అనారోగ్యం పాలవుతున్నారు. ఇటీవలి కాలంలో గుండె పోటు సమస్యలు, కార్డియాక్ అరెస్టు కారణంగా చాలా మంది మరణిస్తున్నారు. దీంతో ప్రతి ఒక్కరిలో మళ్లీ అలజడి మొదలైంది. ఈ సందర్భంగా ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్ స్టిట్యూట్, ఓఖ్లా రోడ్, న్యూఢిల్లీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ డైరెక్టర్ డాక్టర్ నిషిత్ చంద్ర, గుండె సంబంధిత సమస్యల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

Long term effects on heart health post Covid-19 vaccination in Telugu

గత సంవత్సరంలో గుండె సంబంధిత సమస్యలు, కోవిద్ అనంతరం ఇన్ఫెక్షన్ల కారణంగా చనిపోయిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో, అత్యంత సాధారణ అనంతర ప్రభావాలలో ఒకటి గుండెపోటు తర్వాత కోవిద్ ఆకస్మిక మరణాలు. ఈ నేపథ్యంలో గుండె సంబంధిత సమస్యలు ఉండే వారు టీకాలు వేయించుకోవాలని సూచించారు. కోవిద్-19 వ్యాక్సిన్ల చుట్టూ ఉన్న అపొహలు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవడం చాలా ముఖ్యమని చెప్పారు.

గుండె జబ్బులు ఉన్న వారికి కోవిద్-19 వ్యాక్సిన్ సురక్షితమేనా?

గుండె జబ్బులు ఉన్న వారికి కోవిద్-19 వ్యాక్సిన్ సురక్షితమేనా?

కొన్ని భద్రతా సమస్యలు లేదా కొన్ని కోవిద్-19 టీకాల యొక్క ప్రతికూల ప్రతిచర్యలు గుల్లైన్-బారె సిండ్రోమ్, పెరిగిన రక్తం గడ్డకట్టడం, మయోకార్డిటిస్ (గుండె కండరాల వాపు) లేదా అనాఫిలాక్సిస్ (యాంటిజెన్ కు తీవ్రమైన అలర్జీ ప్రతి చర్య). ఏదేమైనా కొన్ని అధ్యయనాల ప్రకారం, టీకాలు వేసిన సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటే.. అవి కొన్ని వారాల్లోనే కనిపిస్తాయి. అయితే దీర్ఘకాలంలో కనిపించవు. సాధారణంగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఒక నెలలో దాని పర్యవసాన ప్రమాదాలు సంభవించే దుష్ప్రభావాలు కనిపిస్తాయని డాక్టర్ వివరించారు. ఇలాంటి వాటిని నిర్ధారిస్తే.. ముందుగానే వాటి నుండి జాగ్రత్తలు తీసుకోవచ్చు. అయితే మన ఆరోగ్యం తీవ్రంగా దెబ్బ తినే దుష్ప్రభావాలైతే ఏమీ లేవన్నారు.

వ్యాక్సిన్లతో పోలిస్తే..

వ్యాక్సిన్లతో పోలిస్తే..

అంతేకాకుండా, టీకాలతో సంబంధం ఉన్న దుష్ప్రభావాలు సాధారణ జనాభాలో నివేదించబడిన సగటు కంటే తక్కువగా ఉన్నాయని చెప్పారు. ఉదాహరణకు, వ్యాక్సిన్లతో పోలిస్తే.. సాధారణ అంటు రోగాలతో గులియన్-బారె సిండ్రోమ్ వచ్చే ప్రమాదం 17 రెట్లు ఎక్కువ అని అధ్యయనంలో తేలిందన్నారు.

గుండె సంబంధిత రోగులు

గుండె సంబంధిత రోగులు

అదనంగా, కోవిద్-19 టీకాలు గుండె జబ్బులు ఉన్న వారికి మాత్రమే సురక్షితం కాదని నివేదికలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం పలు వేరియంట్ల ప్రమాదం పెరుగుతున్న దశలో వీలైనంత త్వరగా వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు.

అన్ని వయసుల వారు

అన్ని వయసుల వారు

ఇప్పటివరకు అన్ని వయసుల వారికి టీకా సురక్షితమైనదనే విషయాన్ని గమనించాలి. ఈ సంవత్సరం ప్రారంభంలో, అమెరికన్ హార్ట్ అసొసియేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. అర్హత ప్రమాణాలకు తగిన ప్రతి ఒక్కరూ తమ టీకా డోసులను పొందాలని కోరారు.

కోవిద్-19 వ్యాక్సిన్ల సాధారణ దుష్ప్రభావాలు ఏమిటి?

కోవిద్-19 వ్యాక్సిన్ల సాధారణ దుష్ప్రభావాలు ఏమిటి?

టీకా అనంతరం గమనించాల్సిన సాధారణ ప్రభావాలు జ్వరం, అలసట, తలనొప్పి మరియు కీళ్ల నొప్పులు, అదనంగా ఇంజెక్షన్ వేసిన ప్రాంతంలో నొప్పిని గమనించొచ్చు. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నా లేదా ముందుగా ఉన్న గుండె జబ్బు ఉన్న వ్యక్తి అయినా, టీకా వల్ల వచ్చే ఈ దుష్ప్రభావాలు ప్రతి ఒక్కరిలో ఒకే విధంగా ఉంటాయి. గుండె సంబంధిత రోగులకు ప్రత్యేకంగా, భిన్నంగా ఏమీ ఉండవు. అయితే, మీరు టీకా వేసుకునే ముందు ఓసారి వైద్యుడిని సంప్రదించి, టీకా వేసుకున్న తర్వాత నిరంతం చెక్ చేసుకోవాలని అధ్యయనం సూచించింది.

ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడా లేదా గుండె జబ్బు ఉన్న వ్యక్తి అయినా టీకాలు వేయించుకోవడం అంటే వైరస్ సంక్రమించకుండా సురక్షితంగా ఉందని కాదు. వ్యాక్సిన్లు వేయించుకోవడం వల్ల ఆసుపత్రిలో చేరే అవకాశాలు తగ్గుతాయి. అదే విధంగా భౌతిక దూరం, మాస్క్ ధరిండం, చేతులను తరచుగా కడుక్కోవడం.. ఇంట్లోనే ఎక్కువగా ఉండటం వంటి విషయాలను మరచిపోకండి.

English summary

Long term effects on heart health post Covid-19 vaccination in Telugu

Here we are talking about the long term effects on heart health post covid-19 vaccination in Telugu. Have a look
Desktop Bottom Promotion