For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Monkeypox:మంకీపాక్స్ డేంజరా? అదెలా వ్యాపిస్తుంది.. దాని లక్షణాలేంటి?

మంకీపాక్స్ వైరస్ రావడానికి గల కారణాలు, దాని లక్షణాలు, చికిత్స విధానం మరియు నివారణ, వ్యాక్సిన్ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

|

ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారిని మరచిపోయి అందరూ ఊపిరి పీల్చుకుంటూ ఉంటే.. తాజాగా మంకీ పాక్స్ మహమ్మారి మరోసారి ప్రపంచాన్ని కలవరపెడుతోంది.

Monkeypox

ఒకప్పుడు కేవలం ఆఫ్రికా దేశాల్లో కనిపించిన ఈ మంకీపాక్స్ ఇప్పుడు ఇతర దేశాలకు వేగంగా విస్తరిస్తోంది. తాజాగా పోర్చుగల్, యుకె, అమెరికా, కెనడా, స్పెయిన్ వంటి దేశాల్లో వందలాది మంది ప్రజలు ఈ మంకీపాక్స్ మహమ్మారి బారిన పడినట్లు నివేదికలు చెబుతున్నాయి.

Monkeypox

ఈ సందర్భంగా మంకీపాక్స్ అంటే ఏమిటి? ఇది ఎలా వ్యాపిస్తుంది? దీని లక్షణాలేంటి? ఎలాంటి చికిత్స తీసుకోవాలి.. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు ఏం చెబుతున్నారనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Carbide Free Mangoes:మామిడిలో కార్బైడ్ కలిసిందా లేదా అనేది ఇలా కనిపెట్టండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి...Carbide Free Mangoes:మామిడిలో కార్బైడ్ కలిసిందా లేదా అనేది ఇలా కనిపెట్టండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి...

మంకీపాక్స్ అంటే ఏమిటి?

మంకీపాక్స్ అంటే ఏమిటి?

మంకీపాక్స్ అనేది అరుదైన జూనోటిక్ వైరల్ వ్యాధి. ఇది ఒక అంటు వ్యాధి. ఈ వ్యాధి ఎక్కువగా పశ్చిమ మరియు మధ్య ఆఫ్రికాలోని ఉష్ణమండల వర్షారణ్య ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఒకప్పుడు ఈ వ్యాధి వానరులలో కనిపించింది. మశూచి లాంటి వ్యాధి లక్షణాలు వాటిలో కనిపించాయి. అయితే 1970లో ఆఫ్రికాలో తొలిసారిగా మానవులకు మంకీపాక్స్ సోకింది. ఆ తర్వాత ఇతర దేశాలకు వ్యాపించింది. 2003లో అమెరికాలోనూ ఈ వ్యాధి సోకిన వారిని కనిపెట్టారు. 2018లో ఇజ్రాయెల్, యుకెలకు వ్యాపించింది. ఇప్పుడు మంకీపాక్స్ రోగులు పోర్చుగల్, యుకె, స్పెయిన్, కెనడా దేశాల్లోనూ ఉన్నట్లు వెల్లడైంది.

మంకీపాక్స్ ఎలా వ్యాపిస్తుంది..

మంకీపాక్స్ ఎలా వ్యాపిస్తుంది..

ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) నివేదిక ప్రకారం, మంకీపాక్స్ అనేది జంతువుల ద్వారా మానవులకు వ్యాపిస్తుంది. కేవలం కోతులతోనే కాకుండా ఎలుకలు, ఉడుతల నుండి ఈ మహమ్మారి సోకే ప్రమాదం ఉంది. మంకీపాక్స్ వైరస్ సోకిన జంతువు రక్తం దాని శరీర చెమట లేదా దాని గాయాలను నేరుగా తాకిన కూడా ఈ వ్యాధి సోకుతుంది. ఈ రోగం నయం కావడానికి రెండు నుండి నాలుగు వారాలు పట్టొచ్చు. అయితే గాయం వల్ల చాలా నొప్పిగా ఉంటుంది.

మంకీపాక్స్ లక్షణాలు..

మంకీపాక్స్ లక్షణాలు..

మంకీపాక్స్ సోకిన వారికి ప్రారంభంలో మీజిల్స్, మశూచి లేదా చికెన్ పాక్స్ మాదిరిగా కనిపిస్తుంది. ఆ తర్వాత మొటిమల్లా మారిపోయి బాడీలోని ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. ఈ వైరస్ సోకిన వారిలో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.

* జ్వరం

* తలనొప్పి

* కండరాల నొప్పి

* వెన్ను నొప్పి

* చలిగా ఉండటం

* అలసిపోవడం

* న్యూమోనియా లక్షణాలు

* ఫ్లూ లక్షణాలు

* శోషరస గ్రంథుల వాపు

* దద్దుర్లు లేదా బొబ్బలు

ఇది ప్రమాదకరమా?

ఇది ప్రమాదకరమా?

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, మంకీపాక్స్ అనేది వైరస్ వల్ల కలిగే వ్యాధి. దీని బారిన పడిన వారిలో 10 మందిలో ఒకరు చనిపోవచ్చు. అయితే చాలా మంది చిన్న వయసులోనే చనిపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధి సోకిన తర్వాత శరీరంపై దద్దుర్లు గాయంగా మారడం ప్రారంభించి, నొప్పి ఎక్కువగా ఉంటే అది చాలా ప్రమాదకరంగా భావించాలని చెబుతున్నారు.

సకాలంలో చికిత్స చేస్తే..

సకాలంలో చికిత్స చేస్తే..

మంకీ పాక్స్ సోకిన వారికి సకాలంలో చికిత్స చేస్తే ఈ లక్షణాల నుండి రెండు నుండి నాలుగు వారాల్లో వాటంతట అవే తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

FAQ's
  • మంకీపాక్స్ మహమ్మారి ప్రమాదకరమా?

    ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, మంకీపాక్స్ అనేది వైరస్ వల్ల కలిగే వ్యాధి. దీని బారిన పడిన వారిలో 10 మందిలో ఒకరు చనిపోవచ్చు. అయితే చాలా మంది చిన్న వయసులోనే చనిపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధి సోకిన తర్వాత శరీరంపై దద్దుర్లు గాయంగా మారడం ప్రారంభించి, నొప్పి ఎక్కువగా ఉంటే అది చాలా ప్రమాదకరంగా భావించాలని చెబుతున్నారు.

  • మంకీపాక్స్ లక్షణాలు ఎలా ఉంటాయి?

    మంకీపాక్స్ సోకిన వారికి ప్రారంభంలో మీజిల్స్, మశూచి లేదా చికెన్ పాక్స్ మాదిరిగా కనిపిస్తుంది. ఆ తర్వాత మొటిమల్లా మారిపోయి బాడీలోని ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. ఈ వైరస్ సోకిన వారిలో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.

    * జ్వరం

    * తలనొప్పి

    * కండరాల నొప్పి

    * వెన్ను నొప్పి

    * చలిగా ఉండటం

    * అలసిపోవడం

    * న్యూమోనియా లక్షణాలు

    * ఫ్లూ లక్షణాలు

    * శోషరస గ్రంథుల వాపు

    * దద్దుర్లు లేదా బొబ్బలు

  • మంకీపాక్స్ అంటే ఏమిటి?

    మంకీపాక్స్ అనేది అరుదైన జూనోటిక్ వైరల్ వ్యాధి. ఇది ఒక అంటు వ్యాధి. ఈ వ్యాధి ఎక్కువగా పశ్చిమ మరియు మధ్య ఆఫ్రికాలోని ఉష్ణమండల వర్షారణ్య ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఒకప్పుడు ఈ వ్యాధి వానరులలో కనిపించింది. మశూచి లాంటి వ్యాధి లక్షణాలు వాటిలో కనిపించాయి. అయితే 1970లో ఆఫ్రికాలో తొలిసారిగా మానవులకు మంకీపాక్స్ సోకింది. ఆ తర్వాత ఇతర దేశాలకు వ్యాపించింది. 2003లో అమెరికాలోనూ ఈ వ్యాధి సోకిన వారిని కనిపెట్టారు. 2018లో ఇజ్రాయెల్, యుకెలకు వ్యాపించింది. ఇప్పుడు మంకీపాక్స్ రోగులు పోర్చుగల్, యుకె, స్పెయిన్, కెనడా దేశాల్లోనూ ఉన్నట్లు వెల్లడైంది.

English summary

Monkeypox: Causes, Symptoms, Treatment and Prevention and Vaccine Details in Telugu

Read on to know the Monkeypox Causes, Symptoms, Treatment and Prevention in Telugu
Story first published:Saturday, May 21, 2022, 13:22 [IST]
Desktop Bottom Promotion