For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నోటి పూత లేదా మౌత్ అల్సర్ : లక్షణాలు, కారణాలు మరియు నివారణ చర్యలు!!

|

నోటి పూత లేదా నోటి పుండు లేదా మౌత్ అల్సర్ . ఇది నోటి లోపల ఏర్పడే పుండు. ఇది అంత ప్రమాదకరం కానప్పటికీ, అది కలిగించే నొప్పి మాత్రం భరించలేనిది. రసాయన పదార్ధాలకు చాలా సున్నితంగా ఉండే వ్యక్తులు నోటి పూతల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రసాయనాల వాసన లేదా రసాయనాల ఘాటు వల్ల నోరు పుండుగా మారుతుంది. లేదా ఒళ్లు వేడి చేసినా, లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ కు గురైనా కూడా నోటి అల్సర్ కు కారణం అవుతుంది.

 Mouth Ulcers: Causes, Symptoms, Treatment & Prevention

నోటి పూతలు సాధారణంగా చిన్నవి మరియు ఒక మిల్లీమీటర్ నుండి కొన్ని సెంటీమీటర్ల వరకు పెరుగుతాయి. నోటిలోపల చర్మంపై, గొంతులోల, దవడల చర్మంపై, మరియు స్కిన్ రాషెస్ కు అవకాశం ఉన్న ఇతర ప్రదేశాల్లో ఈ పుండ్లు సంభవిస్తాయి. నోటి పూత చూట్టూ ఉబ్బుకుని ఉండే ఇవి పసుపు, తెలుపు లేదా బూడిద రంగులో ఉండవచ్చు. నోటి పూత సాధారణ విషయమే కానీ అవి పదేపదే కనిపిస్తుంటే సమస్యలు అనుభవించాల్సి వస్తుంది. నోటి పూతకు లేదా మౌత్ అల్సర్ కు కారణాలు ఈ క్రింది విధంగా:

నోటి పూత లేదా మౌత్ అల్సర్ కు కారణాలు

నోటి పూత లేదా మౌత్ అల్సర్ కు కారణాలు

1. తినేటప్పుడు లేదా మాట్లాడేటప్పుడు అనుకోకుండా నోటి లోపల చర్మంను దంతాలతో కొరుక్కోవడం వల్ల నోటి పూతకు కారణం అవుతుంది.

2. కొవ్వు పదార్థం, ఇనుము, ఫోలిక్ ఆమ్లం లేదా విటమిన్ బి లోపం వల్ల నోటి పూత వస్తుంది.

3. చాక్లెట్, వేరుశెనగ, గుడ్లు, చిక్కుళ్ళు, బాదం, స్ట్రాబెర్రీ, జున్ను మరియు సిట్రస్ పండ్ల వంటి వాటితో అలెర్జీ ఉంటే నోటి పూత వస్తుంది.

4. వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల (జలుబు).

5. జీర్ణశయాంతర ప్రేగులకు సంబంధించిన వ్యాధి లేదా మరే ఇతర సమస్య వల్ల నోటి పూతకు గురికావచ్చు.

6. ఏదైనా ఔషధాల దుష్ప్రభావాల కారణంగా.

నోటి పూత లేదా మౌత్ అల్సర్ కు కారణాలు

నోటి పూత లేదా మౌత్ అల్సర్ కు కారణాలు

7. కారంగా ఉండే ఆహార పదార్థాలను తినడం వల్ల.

8. నోటి శుభ్రతకు శ్రద్ధ చూపకపోవడం వల్ల

9. పళ్ళను నిరంతరం రుద్దడం

10. భావోద్వేగ ఒత్తిళ్ల వల్ల

11. నోటి బాక్టీరియా అలెర్జీ కారణం అవ్వడం వల్ల

12. మలబద్ధకంతో బాధపడుతున్న వారిలో కూడా నోటి పూతలు వచ్చే అవకాశం ఉంది.

13. ధూమపానం చేసేవారు ఒక్కసారిగా ధూమపానం మానేస్తే నోటి పూత వస్తుంది

నోటి పూత లేదా మౌత్ అల్సర్ కు కారణాలు

నోటి పూత లేదా మౌత్ అల్సర్ కు కారణాలు

నోటి పూత సాధారణంగా నోటి ముందు భాగంలో వస్తుంది. పుండు ఏర్పడే సందర్భంలో నోటిలో మండుతున్నట్లు మరియు ఏదో గుచ్చుకుంటున్నట్లు అనిపిస్తుంటుంది. అంటే పుండు కనిపించక ముందే ఈ లక్షణాలు కనిపిస్తాయి.

పుండు తీవ్రత ఎక్కువైనప్పుడు జ్వరం రావచ్చు, అలసట మరియు చిగుళ్ళు వాపు ఉండవచ్చు. ఒక వేళ నోట్లో పుండు ఒక నెలలోపు మానకపోతే, దానిని బయాప్సీతో చికిత్స ద్వారా నయం చేసుకోవల్సి ఉంటుంది.

నోటి పుండును గుర్తించడం ఎలా

నోటి పుండును గుర్తించడం ఎలా

డాక్టర్ నోటిని పరీక్షించి, నోరు అల్సరా కాదా అని నిర్ణయిస్తారు. ఇంకా మీ మునుపటి వైద్య చరిత్ర గురించి మీ నోట్లో వస్తున్న పుండు ఎందకు వస్తోంది అన్న విసయాలతో సహా వారు మిమ్మల్ని అడిగి తెలుసుకుంటారు. పుండు చిన్నగా ఉంటే, దానికి ఎక్కువ మోతాదులో ఔషధాల వాడకం అవసరం లేదు. కానీ పుండు పెద్దదిగా మరియు తట్టుకోలేని నొప్పిని కలిగిస్తుంటే, మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అలాగే, మీకు మూడు వారాల కన్నా ఎక్కువ రోజులు నోటి పుండు ఉంటే అప్పుడు కూడా వైద్యులను కలిసి చిన్న పాటి చికిత్స తీసుకోవడం మంచిది. కోరపళ్లు లేదా వాలుగా ఉన్న దంతాలు లేదా నోటికి స్వల్పంగా గాయం అయినప్పుడు సామాన్యంగా నోటి పండు రావడం వల్ల దీనిని గుర్తించడం చాలా సులభం.

నోటి పూతల నుండి ఉపశమనం పొందడానికి ఏమి చేయాలి?

నోటి పూతల నుండి ఉపశమనం పొందడానికి ఏమి చేయాలి?

నోటి పూతల తాత్కాలిక ఉపశమనం పొందడానికి మరియు దాని పూర్తి నివారణ కోసం మార్కెట్లో మందులు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. వీటిలో కార్టికో స్టెరాయిడ్, లోకల్ అనస్థీటిక్స్, ప్రొటెక్టర్స్, ఆస్ట్రింజెంట్స్ మరియు యాంటిసెప్టిక్స్ ఉన్నాయి. పుండ్ల నుండి ఉపశమనానికి బెంజోకైన్ మరియు ఇతర అనాల్జేసిక్ క్రీములు మరియు జెల్లు కూడా సహాయపడతాయి. రోజూ నోటిని ఉప్పునీరు, బేకింగ్ సోడాతో పుక్కిలించి, నోటి శుభ్రతను పాటించడం వల్ల నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

చమోమిలే టీ తాగడం లేదా నోటిలో అప్లై చేయడం

చమోమిలే టీ తాగడం లేదా నోటిలో అప్లై చేయడం

చమోమిలే టీ తాగడం లేదా నోటిలో అప్లై చేయడం ద్వారా నోటి పుండు కూడా తగ్గుతుంది. మీకు తరచుగా నోటి పూత ఏర్పడుతుంటే మాత్రం మీ శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మూలికా ఔషధాలు తీసుకోవడం మంచిది. ఎచినేసియా, ఆస్ట్రగలస్ మరియు వైల్డ్ ఇండిగో మూలికలను ఉపయోగించవచ్చు.

నోటి పూతల నుండి ఉపశమనం పొందడానికి ఏమి చేయాలి?

నోటి పూతల నుండి ఉపశమనం పొందడానికి ఏమి చేయాలి?

చాలా మంది నోటి పూతల నుండి ఉపశమనం పొందడానికి క్లోరాహెక్సిడైన్ గ్లూకోనేట్ అనే మౌత్ వాష్ వాడాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. నోరు రోజుకు రెండుసార్లు పుక్కిలించి శుభ్రం చేసుకోవాలి. హైడ్రోకార్టిసోన్ సాధారణంగా ఉపయోగించే కార్టికోస్టెరాయిడ్. ఇది పిప్పరమింట్ మాత్రవంటిది ఇది నోటిలో వేసుకోగానే కరిగిపోతుంది. ఇంకా మీ శరీరంలో విటమిన్ లోపంతో బాధపడుతుంటే మీరు ప్రతిరోజూ 10 నుండి 50 మిల్లీగ్రాముల బి-కాంప్లెక్స్ విటమిన్ మాత్రలు తీసుకోవాలి. నోటి పూత ఉన్న పిల్లలకు జింక్ మాత్రలు ఇవ్వవచ్చు. ఇది కొత్త కండరాలు ఏర్పడటానికి సహాయపడుతుంది. అదేవిధంగా ఐస్ క్యూబ్‌ను కాపడం పెట్టుకోవడం వల్ల పుండు త్వరగా నయం అవుతుంది. ఐస్ క్యూబ్ ను ప్రభావిత ప్రదేశంలో సుమారు 40 నిమిషాలు మర్దన చేయాలి. ఇలా చేస్తే గాయం త్వరగా నయం అవుతుంది.

నోటి పూత రాకుండా నివారించడం ఎలా?

నోటి పూత రాకుండా నివారించడం ఎలా?

- సమతుల్య ఆహారం తీసుకోండి. నోటి పూత తక్కువగా లేదా పుండు చిన్నగా ఉంటే మృదువైన ఆహారం తినండి.

- క్రమం తప్పకుండా దంత పరీక్షలు చేయండి.

- ఎల్లప్పుడూ మృదువైన బ్రిస్టల్ టూత్ బ్రష్ లేదా నోటి స్పాంజిని ఉపయోగించటానికి ప్రయత్నించండి.

- పండు ఉన్నప్పుడు ఉప్పు మరియు ఆమ్ల పదార్థాలను తినవద్దు

- తిన్న తర్వాత నోరు శుభ్రంగా కడగాలి.

- ధాన్యాలు, ఆల్కలీన్ పండ్లు మరియు కూరగాయలను అధికంగా తీసుకోవడం వల్ల నోటి పూతలను నివారించవచ్చు.

- నోటిలో ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉండటానికి మల్టీ విటమిన్ డైట్ తీసుకోవడం మంచిది.

English summary

Mouth Ulcers: Causes, Symptoms, Treatment & Prevention

Mouth ulcers are harmless, yet painful and sometimes discomforting. They are usually found inside the mouth. Individuals who are chemically sensitive can develop mouth ulcers as they sometimes result from odour sensitivity. Generally small in size, mouth ulcers can range from one millimetre up to several centimetres across. There can also be breaks-in the moist inside surfaces of the mouth.
Story first published: Tuesday, October 1, 2019, 11:54 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more