For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జాతీయ నేత్ర దాన దినోత్సవం 2019: చరిత్ర మరియు ప్రాముఖ్యత

|

కళ్లు.. అవి లేకపోతే ఈ అందమైన భూ ప్రపంచాన్ని ఎవ్వరూ చూడలేరు. ఆ కళ్లు తెరిస్తేనే మనకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అనేది తెలుస్తుంది. అదే కళ్లే లేకపోతే అంతా చీకటి. పగలైనా, ఉదయమైనా మనది మొత్తం చీకటి ప్రపంచమే. అంతటి ప్రాధాన్యమున్న కంటి దినోత్సవ వేడుకలు ఈ ఆగస్టు 25వ తేదీ నుండి సెప్టెంబర్ వరకు కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. నేత్ర దానం చేసే చర్యను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం లక్ష్యం.

నేత్ర దానంపై మనలో చాలా మందికి అవగాహన లేదు. మనం మరణించాక మన కళ్లను దానం చేస్తే అది వేరొకరి జీవితానికి వెలుగు ఇస్తుంది. అంతేకాదు మీరు చనిపోయిన కూడా మీ కళ్లతో ఈ అందమైన ప్రపంచాన్ని మళ్లీ చూసే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి విషయాలను ప్రజలలో అవగాహన కల్పించేందుకు, ఈ పదిహేను రోజులు భారతదేశంలో వివిధ ప్రదేశాలలో అనేక కార్యక్రమాలు జరుగుతాయి.

National Eye Donation Fortnight

ప్రజలు నేత్రదానం చేయాలనే ఆలోచనను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వమే ఈ డ్రైవ్ ను ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్ చేసింది. "దానం చేసిన మానవ కళ్లు కార్నియల్ మార్పిడి ద్వారా చూపును కాపాడటానికి, పునరుద్ధరించడానికి సహాయపడతాయి. ఇందుకు చేయూత నివ్వండి" అని కోరింది.

భారతదేశంలో నాలుగు మిలియన్ల మందికి పైగా ప్రజలు కంటికి సంబంధించిన రుగ్మతులు, కంటిచూపు లేకుండా బాధపడుతున్నాయని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. కానీ దురదృష్టవశాత్తు, నేత్రదానం చాలా తక్కువగా ఉంటోంది. కంటిచూపు లేని వారిలో వంద మందిలో ఒకరు మాత్రమే నేత్ర దానం ద్వారా చూపును పొందుతున్నారు. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ గ్యాప్ ను తగ్గించేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు ప్రతి సంవత్సరం మన దేశంలోని ఆసుపత్రులలో 20 వేల అంధత్వ కేసులు నమోదవుతున్నాయి.

ఇందుకు అనేక కారణాలున్నట్లు మనకు తెలుస్తోంది. పోషకాహార లోపం లేదా జననేంద్రియ సమస్యలు కావచ్చు. కానీ వీటన్నిటికంటే నేత్ర దాతల సంఖ్య చాలా పరిమితంగా ఉంటోంది. ఇది కూడా దేశంలో అంధత్వాన్ని నియంత్రించేందుకు చాలా కష్టమవుతోంది.

English summary

National Eye Donation Fortnight 2019: History And Significance

Some surveys show that over four million people in India suffer from ophthalmic disorders and blindness. But unfortunately, the eyesight is very low. Only about one in 100 people who do not have eyesight receive vision through eye donation. It can only mean how bad the situation is. The program is being conducted to reduce this gap.
Story first published: Monday, August 26, 2019, 15:37 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more