For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

New COVID Variant C.1.2:కొత్త దారిని వెతుక్కున్న కరోనా... కొత్త వేరియంట్లతో మళ్లీ కలవరపెడుతోంది...

దక్షిణాఫ్రికాలో కొత్త కోవిద్ వేరియంట్ c.1.2 వచ్చింది, దీని మూలం ఎక్కడుంది. దీని లక్షణాలు ఏంటనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

|

కరోనా మహమ్మారి మూడో దశ ముప్పు పొంచి ఉన్న తరుణంలో కోవిద్-19 వైరస్ కొత్త దారిని వెతుక్కుంది. అందరూ కలవరపడుతున్నట్టుగానే కరోనా కొత్త రూపంలో వచ్చేసింది.

New COVID Variant C.1.2 Detected in South Africa ; Know Origin, Symptoms and other details in Telugu

తాజాగా దక్షిణాఫ్రికాతో పాటు మరికొన్ని దేశాల్లో కరోనా కొత్త వేరియంట్లను గుర్తించినట్లు నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ కమ్యూనికబుల్ డిసీజెస్(NICD)శాస్త్రవేత్తలు తెలిపారు. సౌతాఫ్రికాకు చెందిన KRISP సంస్థతో కలిసి జరిపిన పరిశోధనలో కరోనా కొత్త వేరియంట్ C.1.2 బయటపడిందని వెల్లడించారు.

New COVID Variant C.1.2 Detected in South Africa ; Know Origin, Symptoms and other details in Telugu

మే నెలలోనే ఈ వేరియంట్లను గుర్తించామని, ఆగస్టు చివరి నాటికి చైనా, కాంగో, మారిషస్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, పోర్చుగల్, స్విట్జర్లాండ్లో వీటి లక్షణాలు కనిపించాయని హెచ్చరించారు. ఈ కరోనా కొత్త వేరియంట్ సి.1.2 కంటే ప్రమాదకరమైనదని, ఇది అంటు వ్యాధి కావొచ్చని అభిప్రాయపడ్డారు. ఈ కొత్త వేరియంట్లపై కరోనా టీకాలు ఏ మాత్రం పని చేయవని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా సి.1.2 కరోనా వేరియంట్ అంటే ఏమిటి? దాని లక్షణాలేంటి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

C.1.2 కరోనా వేరియంట్ అంటే?

C.1.2 కరోనా వేరియంట్ అంటే?

C.1.2 వేరియంట్ యొక్క తొలి కేసు దక్షిణాఫ్రికాలో కనుగొనబడింది. ఈ వైవిధ్యంలో చాలా ఉత్పరివర్తనలు(మ్యుటేషన్లు) కనిపించాయని శాస్త్రవేత్తలు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు గుర్తించిన ఇతర వేరియంట్లతో పోలిస్తే.. ఈ వేరియంట్ చాలా భిన్నమైనదని శాస్త్రవేత్తలు తెలిపారు. అదే సమయంలో ఈ వేరియంట్లపై టీకా పని చేయదని నిరూపించవచ్చు. సౌతాఫ్రికాలో ఈ వేరియంట్ జీనోమ్స్ సంఖ్య పెరుగుతూ వస్తోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

రెట్టింపు మ్యుటేషన్..

రెట్టింపు మ్యుటేషన్..

గతంలో బీటా, డెల్టా వేరియంట్లలో కూడా జీనోమ్స్ ఇలాగే పెరిగాయని ఆ అధ్యయనంలో తేలింది. కొత్తగా కనుగొన్న వేరియంట్లో మ్యుటేషన్ రేటు సంవత్సరానికి 41.8 శాతమని, ఇతర వేరియంట్ల మ్యుటేషన్ల రేటు కన్నా ఇది దాదాపు రెట్టింపు అని అధ్యయనం వివరించింది. సగానికి పైగా సి.1.2 సీక్వెన్లలో 14 మ్యుటేషన్లున్నాయని, ఇతర స్వీక్వెన్లలో అదనపు మ్యుటేషన్లు జరుగుతూనే ఉన్నాయని వివరించింది.

కొత్త వేరియంట్ ప్రమాదకరమా?

కొత్త వేరియంట్ ప్రమాదకరమా?

C.1.2 పాత వేరియంట్లతో పోలిస్తే చాలా ప్రమాదకరమని శాస్త్రవేత్తలు తెలిపారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం సి.1 వేరియంట్ కంటే C.1.2లో ఎక్కువ మార్పులు కనిపించాయి. దీని కారణంగా ఇది మరింత ప్రమాదకరమని నిరూపించబడింది. ఈ వేరియంట్ చాలా భిన్నంగా ఉంటుందని అధ్యయనం ద్వారా వెల్లడైంది. అంతేకాదు చైనాలోని వూహాన్ నుండి ఉద్భవించిన వైరస్ నుండి చాలా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఈ వేరియంట్ మరింత ప్రమాదకరమైన అంటువ్యాధి కావొచ్చు. ఈ వేరియంట్ ఆధారంగా కూడా వ్యాక్సిన్ వేయొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

డబుల్ మ్యుటేషన్..

డబుల్ మ్యుటేషన్..

శాస్త్రవేత్తల ప్రకారం, ఈ వేరియంట్లో మ్యుటేషన్లలో చాలా మార్పు ఉంది. మే నెలలో జీనోమ్ స్వీక్వెన్స్ 0.2 శాతంగా ఉంది. ఇది జూన్ నాటికి 1.6 శాతానికి పెరగ్గా.. జులై 2 శాతానికి పెరిగింది. ఈ మ్యుటేషన్ రేటు రెట్టింపుకు మించిపోయిందని.. ఆగస్టు నాటికి ఇది 41.8 శాతానికి చేరగా.. సంవత్సరానికి మ్యుటేషన్ రేటు మరింత పెరుగుతుందని అంచనా వేశారు.

కొత్త మ్యుటేషన్లు..

కొత్త మ్యుటేషన్లు..

కొత్త వేరియంట్ స్పైక్(కొమ్ము) ప్రాంతంలో జరుగుతున్న మ్యుటేషన్లలో 52 శాతం గత వేరియంట్లలో కనిపించాయని, మిగిలినవన్నీ కొత్త మ్యుటేషన్లనీ అధ్యయనం ద్వారా వెల్లడైంది. ఈ స్పైక్ ప్రోటీన్ ద్వారానే కరోనా వైరస్ మానవ కణాల్లోకి ప్రవేశిస్తుంది. అందుకే ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు ఈ స్పైక్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పని చేస్తున్నాయి. అయితే కొత్త వేరియంట్లలో కనిపిస్తున్న N440K, Y449H మ్యుటేషన్లు కొన్ని యాంటీబాడీల నుండి తప్పించుకుపోయే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కొత్త వేరియంట్ లక్షణాలు..

కొత్త వేరియంట్ లక్షణాలు..

శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం, ఈ వేరియంట్ యొక్క లక్షణాలు కోవిద్-19 యొక్క సాధారణ లక్షణాలు ముక్కులో నుండి నీరు కారడం, నిరంతర దగ్గు, గొంతు నొప్పి, రుచి కోల్పోవడం, వాసన కోల్పోవడం, విరేచనాలు, కళ్లు ఎర్రగా మారడం మరియు కండరాల తిమ్మిరి వంటివి. C.1.2 వేరియంట్ కు సంబంధించిన కేసు ఇప్పటివరకు మన దేశంలో నమోదు కాలేదు.

English summary

New COVID Variant C.1.2 Detected in South Africa ; Know Origin, Symptoms and other details in Telugu

New COVID Variant C.1.2 Detected in South Africa ; Know Origin, Symptoms and other details in Telugu. Read On.
Desktop Bottom Promotion