For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Snoring Accelerates Aging: గురక పెడుతున్నారా.. త్వరగా ముసలితనం వచ్చేస్తుంది జాగ్రత్త

నిద్రలేమి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. పగటి పూట నిద్రమత్తు వస్తుంటుంది. పనిపై ఏకాగ్రత ఉంచలేం. ఉత్పత్తి తగ్గుతుంది. ఇవే కాదు గురక, నిద్ర లేమి వల్ల వృద్ధాప్యమూ త్వరగానే వస్తుందని యూనివర్సిటీ ఆఫ్ మిసౌరీ స్కూల్ ఆఫ్ మెడి

|

Snoring Accelerates Aging: గురక అనేది సాధరణ సమస్య. గురక సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు. గురక పెట్టే వ్యక్తులు చక్కగానే నిద్ర పోతారు. కానీ వాళ్లు పెట్టే గురక వల్ల ఇతరులు ముఖ్యంగా జీవిత భాగస్వాములకు నిద్ర పట్టదు. గురక నయం చేయలేని సమస్యేం కాదు. శ్వాస తీసుకునే సమయంలో సహజంగా ఎదుర్కొనే సమస్య.

New study says snoring linked to Accelerated Aging in Telugu

గొంతు వెనకాల భాగం వదులై శ్వాస మార్గానికి అడ్డుపడుతుంది. దీంతో నిద్రలో శ్వాస ఆగిపోతూ ఉంటుంది. అప్పుడు మెదడుకు అందే సంకేతాలు తిరిగి శ్వాస తీసుకునేలా ప్రేరేపిస్తాయి. అలా గురక పెడుతూ మళ్లీ శ్వాస తీసుకుంటారు. నిద్ర పోయే సమయంలో ఇదేదీ మనకు తెలియదు. గురక పెట్టే కొంత మందిలో నిద్రకు భంగం కలుగుతుంది. రాత్రి గురక వల్ల పగలు అలసట, చిరాకు, మరికొన్ని సమస్యలకు దారితీస్తుంది. ఇటువంటి ఆరోగ్యసమస్యలను క్రియేట్ చేయడంతో పాటు, నిద్ర సరిగా లేకుంటే మైండ్ ఒత్తిడికి గురవుతుంది. వ్యతిరేకత పెరిగి జీవితంలో లేదా వ్యక్తిగత జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి.

గురక వల్ల త్వరగా వృద్ధాప్యం:

గురక వల్ల త్వరగా వృద్ధాప్యం:

నిద్రలేమి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. పగటి పూట నిద్రమత్తు వస్తుంటుంది. పనిపై ఏకాగ్రత ఉంచలేం. ఉత్పత్తి తగ్గుతుంది. ఇవే కాదు గురక, నిద్ర లేమి వల్ల వృద్ధాప్యమూ త్వరగానే వస్తుందని యూనివర్సిటీ ఆఫ్ మిసౌరీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అధ్యయనం హెచ్చరిస్తోంది.

గురకతో ఇబ్బంది పడే వారి శారీరక వయస్సు త్వరగా పెరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే గురక, నిద్రలేమి వల్ల వచ్చే వృద్ధాప్యం సీప్యాప్ (Continuous Positive AirWay Pressure) చికిత్స క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శారీరక వృద్ధాప్యాన్ని వెనక్కి మళ్లించే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు. కాబట్టి మీరు గురకతో ఇబ్బంది పడుతుంటే నిర్లక్ష్యం చేయకుండా, తగిన చికిత్స తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

గురక తగ్గించుకోడానికి కొన్ని చిట్కాలు

గురక తగ్గించుకోడానికి కొన్ని చిట్కాలు

పిల్లో:

బెడ్ మీద ప్లాట్ గా నిద్రించడాని కంటే, మీకు అవసరం అయితే కొన్ని ఎక్స్ ట్రా పిల్లోను ఉపయోగించాలి. ఇది కణజాలం ద్వారా గాలి సులభంగా ప్రసరించడానికి తేలికవుతుంది. తలగడలు మెత్తగా వుండరాదు. గట్టిగా వున్న తలగడలపై పడుకుంటే గాలి బాగా ప్రవహిస్తుంది.

ఒక వైపుకు తిరిగి పడుకోవాలి:

వెల్లకిలా పడుకునే కంటే పక్కకు తిరిగి పడుకుంటే శ్వాస హాయిగా ఆడుతుంది. నిద్రలో మీరు వెల్లకిలా పడుకుంటే, పక్కకు తిప్పమని మీ భాగస్వామికి చెప్పండి.

స్టీమింగ్:

గురక నిలపడానికి, ఆవిరి పట్టడం చాలా సింపుల్ హోం రెమెడీ. ఇది శాస్వనాళంలో మ్యూకస్ ను బయటకు నెట్టివేయడం వల్ల నాజల్ బ్లాకేజ్ ను క్లియర్ చేస్తుంది. దాంతో శ్వాస ఫ్రీగా ఆడుతుంది.

ధూమపానం నిలిపివేయాలి:

ధూమపానం నిలిపివేయాలి:

గురకకు పొగతాగటం కూడా ఒక కారణం. ఈ అలవాటు గొంతులో మంట, కొద్దిపాటి వాపు కూడా కలిగిస్తుంది. శ్వాస కష్టంగా తీసుకోవలసి వుంటుంది. స్మాకింగ్ వదిలేయమని సలహా నివ్వండి. ఇతర చెడు అలవాట్లు కూడా మానేలా చూడండి. సమస్య చాలావరకు తగ్గిపోతుంది.

మద్యపానం:

ఆల్కహాలిక్ బెవరేజెస్, స్లీపింగ్ పిల్స్, ట్రాక్వైజర్స్ మరియు యాటిహిస్టమైన్స్ తీసుకోవడం నివారించడం వల్ల, గురకనుండి ఉపశమనం కలిగిస్తుంది. కండరాలను వదుల చేసి, ప్యాసేజ్ ను ఫ్రీ చేస్తుంది ను తీసుకొనే అలవాటును నిలిపివేయాలి.

జలుబు మరియు దగ్గును నివారించండి:

జలుబు మరియు దగ్గుకు కూడా గురకకు కారణం కావచ్చు. కాబట్టి మీకు దగ్గు మరియు జలుబు ఉన్నప్పుడు వెంటనే వాటిని తగ్గించుకోవాలి.

బెడ్ టైమ్ స్నాక్స్ నివారించండి:

నిద్రించేముందు స్నాక్స్ ఏవీ తినకండి. పిజ్జాలు, బర్జర్లు, ఛీజ్ పాప్ కార్న్ వంటివి తినరాదు. వీటిలో కొవ్వు అధికంగా ఉండి మ్యూకస్ పేరుకుంటుంది.

English summary

New study says snoring linked to Accelerated Aging in Telugu

read on to know New study says snoring linked to Accelerated Aging in Telugu
Story first published:Friday, December 2, 2022, 15:30 [IST]
Desktop Bottom Promotion