For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Omicron:‘ఇండియాలో 100కు చేరుకున్న ఒమిక్రాన్ కేసులు.. ఆ నెలలో పీక్ స్టేజీకి చేరుకుంటాయట...’

ఇండియాలో ఒమిక్రాన్ కోవిద్ థర్డ్ వేవ్ ఫిబ్రవరిలో పీక్ స్టేజ్ కు చేరుకుంటుందట.. ఆ వివరాలేంటో చూసెయ్యండి.

|

భారతదేశంలో మరోసారి ఒమిక్రాన్ కరోనా యొక్క కొత్త వేరియంట్ కలవరపెడుతోంది. ఇప్పటికే చాప కింద నీరులా ఒమిక్రాన్ కేసుల సంఖ్య ప్రతి రాష్ట్రంలో పెరుగుతూ పోతున్నాయి. ప్రపంచంతో పాటు భారతదేశంలోనూ ఒమిక్రాన్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది.

Omicron-driven 3rd wave likely to peak in February in India : Covid panel

ఆందోళనకరమైన విషయం ఏంటంటే.. కోవిద్ సూపర్ మోడల్ కమిటీ భారతదేశంలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. అయితే 2022 కొత్త సంవత్సరంలో ఒమిక్రాన్ పీక్ స్టేజీకి చేరుకుంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది.

ఫిబ్రవరి నలలో..

ఫిబ్రవరి నలలో..

ముఖ్యంగా 2022 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో ఈ ఒమిక్రాన్ కొత్త వేరియంట్ కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని.. దీంతో థర్డ్ వేవ్ వస్తుందని ప్రకటించింది.

ఒమిక్రాన్ వేరియంట్.. కరోనా సెకండ్ వేవ్ కంటే ప్రమాదకరమా అనే విషయాన్ని ఇంకా స్పష్టం చేయలేదు. అయితే ఇది కొంచెం తక్కువ ప్రభావం ఉండొచ్చని వివరించింది. ఇది ఓ మోస్తరుగా ఉండే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇటీవలి కాలంలో భారతదేశంలో రోజువారీ కరోనా కేసులు 7500 చేరుకుంటున్నాయని, అయితే ఒమిక్రాన్ డెల్టా ప్రధాన వైరస్ గా మార్చడం ప్రారంభించిన తర్వాత, ఇది సోకిన వారి సంఖ్య వేగంగా పెరిగిపోతుందని కమిటీ చీఫ్ విద్యాసాగర్ వివరించారు. డెల్టా లేదా మరేదైనా ఒమిక్రాన్ వేగంగా వ్యాపించడం ఇందుకు కారణమన్నారు.

రోజుకు 2 లక్షల కేసులు..

రోజుకు 2 లక్షల కేసులు..

2022 సంవత్సరంలో కూడా కరోనా థర్డ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని.. రోజుకు 2 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని విద్యాసాగర్ వెల్లడించారు. అయితే ఇదంతా కేవలం అంచనా మాత్రమే అని.. పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పడం కష్టమన్నారు. కానీ దీన్ని ఎదుర్కొనేందుకు దేశమంతా సిద్ధంగా ఉందని.. అందుకు తన సామర్థ్యాలను పెంచుకుందని.. దీన్ని ద్రుష్టిలో ఉంచుకుని.. రాబోయే రోజుల్లో ఒమిక్రాన్ మహమ్మారిని ఎదుర్కోవచ్చనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు.

కోవిద్ సూపర్ మోడల్ కమిటీ ప్రకటన తర్వాత, కొన్ని రాష్ట్రాల్లో మినీ-లాక్ డౌన్ వంటి చ్చలు మళ్లీ ప్రారంభమయ్యాయి. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

మరో ప్యానెల్..

మరో ప్యానెల్..

మరో ప్యానెల్ కమిటీ సభ్యుడు మనిందా అగర్వాల్ మాట్లాడుతూ.. రెండో వేవ్ కంటే ఒమిక్రాన్ ప్రభావం తక్కువగా ఉంటుందని చెప్పారు. ‘‘యుకేలో జనాభా మరియు ఊబకాయం మొదలైన సమస్యలు ఉన్నాయి. అందుకే ఇటీవల అక్కడ 93 వేల కేసులు నమోదయ్యాయి. అయితే భారతదేశంలో 20 రెట్ల జనాభా ఉంటే.. ఇక్కడ కేవలం 7,145 కేసులు నమోదయ్యాయి. కాబట్టి అక్కడ యుకేలో ఏమి జరుగుతుందనే ఆధారంగా మన దేశంలో ఏమి జరుగుతుందో దాని గురించి అనుమానం పడాల్సిన అవసరం లేదు' అని అన్నారు.

100కు పైగా ఒమిక్రాన్ కేసులు..

100కు పైగా ఒమిక్రాన్ కేసులు..

మన దేశంలో ఇప్పటివరకు 100 కేసులు నమోదైనట్లు నీతి ఆయోగ్ సభ్యుడు(హెల్త్) డాక్టర్ వీకే పాల్ శుక్రవారం మీడియా సమావేశంలో వివరించారు. అయితే ఇదే సమయంలో బ్రిటన్లో అంటువ్యాధుల పెరుగుదలను గుర్తు చేశారు. జనాభా స్థాయి మార్పిడి అంటే ఇండియాలో రోజుకు 14 లక్షల కోవిద్ కేసులు ఉంటాయని వివరించారు.

FAQ's
  • భారతదేశంలో ఒమిక్రాన్ కోవిద్ మూడో దశ ఎప్పుడు పెరుగుతుంది?

    మన దేశంలో ఒమిక్రాన్ కోవిద్ కేసుల సంఖ్య 2022 సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో పీక్ స్టేజీకి చేరుకుంటుందని కోవిద్ ప్యానెల్ కమిటీ అభిప్రాయపడింది. దీంతో చాలా మందిలో మరోసారి ఆందోళన పెరుగుతోంది.

  • ఒమిక్రాన్ కోవిద్ తొలి కేసును ఎక్కడ గుర్తించారు?

    ఒమిక్రాన్ కోవిద్ వైరస్ కేసును తొలిసారిగా దక్షిణాఫ్రికాలో గుర్తించారు. మన భారతదేశంలో బెంగళూరు నగరంలో తొలి కేసును గుర్తించారు. దక్షిణాఫ్రికా నుండి దుబాయ్ మీదుగా వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్లు గుర్తించారు.

English summary

Omicron-driven 3rd wave likely to peak in February in India : Covid panel

Here we are talking about the omicron-driven 3rd wave likely to peak in february in India:Covid panel. Read on
Story first published:Monday, December 20, 2021, 13:56 [IST]
Desktop Bottom Promotion