For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కళ్ళకు లెన్స్ వాడుతున్నారా? అయితే ఈ డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకోండి

కళ్ళకు లెన్స్ వాడుతున్నారా? అయితే ఈ డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకోండి

|

కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోవడానికి కూల్ గా ఉంటాయి...కానీ....కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందన్న విషయం మీకెవరికైనా తెలుసా లేదా ఎప్పుడైనా విన్నారా? ఖచ్చితంగా కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోవడం వల్ల దుష్పభావాలు కూడా ఉన్నాయి. కాంటాక్ట్ లెన్స్ పెట్టుకొనే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కొన్ని హెల్త్ రిస్క్ లను వెంటనే నివారించుకోవచ్చు.

ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో అద్దాలకు బదులుగా కాంటాక్ట్ లెన్స్ వాడకం ఎక్కువగా ఉన్నది. కంటి చూపును మెరుగుపరుచుకోవడానికి, అందంగా కనబడటానికి కాంటాక్ట్ లెన్స్ వాడకం పెరిగినది. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యవంతంగా మరియు ఫ్లెక్సిబుల్ గా ఉండటం వల్ల వీటి వాడకం ఎక్కువైనది. అయితే కొంత మంది మాత్రం ఫ్యాషన్ కోసం ధరించే వారు కూడా ఉన్నారు.

కాంటాక్ట్ లెన్స్ ఎక్కువ రోజులు ఉపయోగించే వారు కొన్ని జాగ్రత్తుల తీసుకోవాలి. మరి కాంటాక్ట్ లెన్స్ ను తరచూ ఉపయోగించడం వల్ల కొన్ని ఆరోగ్య దుష్ప్రభాలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం..

1. కళ్ళు పొడిబారడం

1. కళ్ళు పొడిబారడం

కొంత మందిలో కాంటాక్ట్ లెన్స్ వాడకం వల్ల కళ్ళ పొడి బారడం జరుగుతుంది. కాంటాక్ట్స్ కళ్ళను కవర్ చేయడం వల్ల కళ్ళకు ఆక్సిజన్ సరఫరా బ్లాక్ అవుతుంది . ఆ కారణం వల్ల కళ్ళ పొడిబారడం జరుగుతుంది.

2. కార్నియల్ రాపిడి

2. కార్నియల్ రాపిడి

కాంటాక్ట్ లెన్స్ కార్నియాకు స్క్రాక్చ్ అయినప్పుడు , లేదా అవి సరిగా ఫిట్ కానప్పుడు లేదా కళ్ళు మరీ డ్రైగా ఉన్నప్పుడు కార్నియల్ రాపిడి జరగుతుంది. అలాగే, కాంటాక్ట్ లెన్స్‌లతో నిద్రపోవడం వల్ల కార్నియల్ రాపిడి ప్రమాదం పెరుగుతుంది. అలాగే కాంటాక్ట్ లెన్స్ పై దుమ్ము మరియు ధూళి చేరుతుంది. ఇది కార్నియాకు వ్యతిరేఖంగా రబ్ అవుతుంది. ఇది కంటి ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది.

3. కళ్ళకు ఆక్సిజన్ ప్రవాహాన్ని అడ్డుకుంటుంది

3. కళ్ళకు ఆక్సిజన్ ప్రవాహాన్ని అడ్డుకుంటుంది

కార్నియా అంచులకు కాకుండా ఇతర బాగం రక్తనాళాలు ఉండవు. కార్నియాకు తగినంత ఆక్సిజన్ అందకపోవడం వల్ల కార్నియా జీవక్రియ ఒత్తిడికి గురి అవుతుంది. మరియు లాక్టిక్ యాసిడ్ ఓస్మోటిక్ లోడ్ ను పెంచుతుంది,దాంతో కంటిలోని తడిని వేగంగా లాగేస్తుంది, ఫలితంగా కార్నియల్ వాపు లేదా ఎడిమా వస్తుంది.

4. కార్నియల్ అల్సర్:

4. కార్నియల్ అల్సర్:

కాంటాక్ట్ లెన్స్ వాడకం వల్ల మరొక దుష్ప్రభావం కార్నియల్ అల్సర్, ఇది మృదువైన కాంటాక్ట్ లెన్స్‌లపై ఉపరితల నిక్షేపాలపై బ్యాక్టీరియా కలుషితం అయినప్పుడు సంభవిస్తుంది మరియు అక్కడ రెట్టింపు అవ్వొచ్చు.ఇది బ్యాక్టిరియల్ బయోపిల్మ్ ఇన్ఫెక్షన్ కు కారణం అయ్యే కారకాలను సరఫరా చేస్తుంది

 కళ్ళు ఎర్రగా మారడం

కళ్ళు ఎర్రగా మారడం

మీరు కాంటాక్ట్ లెన్స్‌లను ఎక్కువ గంటలు, ముఖ్యంగా రాత్రంతా ధరించినప్పుడు కళ్ళు ఎర్రగా మారుతాయి. ఇలా పెట్టుకోవడం వల్ల బ్యాక్టీరియా పెరగడానికి కారణం అవుతుంది. డిఫార్మ్డ్ లెన్స్ లెన్స్ డిపాసిట్స్ వల్ల కళ్ళకు చీకాకు కలుగుతుంది.

సూపర్ఫిషియల్ కెరాటిటిస్ :

సూపర్ఫిషియల్ కెరాటిటిస్ :

కార్నియా యొక్క బాహ్య కవచం లెన్స్ కేర్ సొల్యూషన్స్, అలెర్జీలు, ఇన్ఫెక్షన్ మరియు కెమికల్ ఇరిటేషన్ వల్ల కెరాటిటిస్ కు చీకాకు కలుగుతుంది.

కార్నియల్ మోల్డింగ్ :

కార్నియల్ మోల్డింగ్ :

మోల్డింగ్ వల్ల కాంటాక్ట్ లెన్స్ వాడటం వల్ల కార్నియా షేప్ మారుతుంది. ఇది చాలా వరకు కళ్ళకు ఆక్సిజన్ చేరకుండా చేస్తుంది. కాంటాక్ట్ లెన్స్‌ల క్రింద బుడగలు ఏర్పడటం వలన ఇలా సంభవిస్తుంది.

ఇన్ఫిల్ట్రేట్స్ :

ఇన్ఫిల్ట్రేట్స్ :

కాంటాక్ట్ లెన్సులు ఎక్కువ కాలం వాడటం, పేలవమైన కాంటాక్ట్ లెన్సులు అమర్చడం, వివిధ రకాల కాంటాక్ట్ లెన్స్ ధరించడం మరియు లెన్స్ కేర్ లో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల సంభవించే కార్నియా మధ్య ప్రాంతంలో మసకబారి,బూడిదరంగులో కనిపిస్తాయి

గెయింట్ పాపిల్లరీ కండ్లకలక

గెయింట్ పాపిల్లరీ కండ్లకలక

స్మార్ట్ కాంటాక్ట్ లెన్స్ కూడా ఎక్సపైరీ డేట్ ఉంటుంది, ఎక్స్టెండెడ్ డేట్ లో కాంటాక్ట్ లెన్స్ వాడటం వల్ల కళ్ళలో పుసి ఏర్పడుతుంది. కంటి చూపు మందగిస్తుంది.

English summary

9 Dangerous Side Effects Of Contact Lenses You Should Know

Most people choose contact lenses over glasses because they have many advantages - they can adjust the amount of light entering your eyes for optimum vision, they sit directly in your eyes, so peripheral vision isn't obstructed, there is no fear of breakage, and so on.
Desktop Bottom Promotion