For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సీతాఫలం: డయాబెటిస్, గుండె జబ్బులు ఉన్నవారు తినకూడదా. ఎవరు చెప్పారు? ఇది చదవండి ...

|

సీతాఫలం ప్రస్తుత సీజనల్ ఫ్రూట్.చలికాలంలో విరివిగా లభించే ఫలాలలో సీతాఫలం ఒకటి, సీతాఫలాన్ని రకరకాలుగా పిలుస్తారు. సీతాఫలం అమృతఫలాన్ని తలపించే సీతాఫలాన్నే కస్టర్డ్‌ యాపిల్‌ అనీ షుగర్‌ యాపిల్‌ అనీ పిలుస్తారు. పచ్చి సీతాఫలం తినడానికి పనికిరాదు. ఈ ఫలాన్ని రసం రూపంలో కాకుండా నేరుగా తినడమే మంచిది. ఎందుకంటే గుజ్జు నోటిలోని జీర్ణరసాలను పెంచుతుంది. తద్వారా జీర్ణక్రియ వేగవంతమవుతుంది. బాగా పండినతర్వాత మాత్రమే తినడానికి వీలవుతుంది. సీతాఫలం చుట్టూ కళ్లులాగా బెరడులాంటి పధార్థం ఉంటుంది. పండిన సీతాఫలంపై ఈ కళ్లను విడదీస్తే లోపల ఒక్కొక్క గింజ చుట్టూ తెల్లటి గుజ్జు మధురంగా ఉంటుంది.

కాలానుగుణంగా ఉత్పత్తి అయ్యే పండ్లలో ఒక్కొక్క పండుకి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది. ఏ పండు అయినా, శరీరానికి కేలరీలుతోపాటు తగిన మోతాదులో మాంసకృత్తులను సైతం అందించగలవు, అయితే సీతాఫలం మాత్రం ఇందుకు భిన్నమైనదనక తప్పదు. ఆహార పధార్థాంగా ఆకలిని తీర్చడం మాత్రమేగాక, ఆరోగ్యాన్ని పెంచే ఔషధ గుణాలు ఇందులో దాగివున్నాయంటే ఆశ్ఛర్యం కలగక మానదు.

Sitaphal Myths And Facts: Heres Why You Must Have Custard Apple This Season

ఇది రుచికరమైన పండు మాత్రమే కాదు, మన చర్మం, జుట్టు, కంటి చూపు, మెదడు మరియు హిమోగ్లోబిన్ స్థాయిలకు కూడా మంచిది. ఈ పండు గురించి సాధారణ అపోహల గురించి తెలుసుకోండి మరియు మీరు వాటిని ఎందుకు నమ్మకూడదు ఇక్కడ వివరించడం జరిగింది.

సీతాఫాల్ లేదా కస్టర్డ్ యాపిల్ ఆగ్యప్రయోజనాలతో కూడిన పోషకాలు పుష్కలంగా ఉన్న పండు. వీటిలో విటమిన్ సి, విటమిన్ ఎ, పొటాషియం మరియు మెగ్నీషియం వంటివి ఉన్నాయి. ప్రస్తుతం సీజన్ లో సీతాఫలం ఉంది. కాబట్టి, దీన్ని మీ డైట్‌లో తప్పనిసరిగా చేర్చుకోవడం మంచిది. ప్రఖ్యాత పోషకాహార నిపుణుడు రుజుడా దివేకర్ మీ ఆహారంలో సీతాఫంల చేర్చుకోవడం వల్ల దానికి యొక్క ప్రాముఖ్యతను వివరించారు. సీతాఫలం గురించి కొన్ని అపోహలు మరియు వాస్తవాలను పోషకాహార నిపుణులు తన తాజా పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ కాలానుగుణంగా మరియు ఆరోగ్యకరమైన స్థానిక పండు గురించి రుజుతా ఏమి చెబుతుందో తెలుసుకోవడానికి ఇక్కడ చదవండి...

సీతాఫలం: మీరు తెలుసుకోవలసిన అపోహలు మరియు వాస్తవాలు

సీతాఫలం: మీరు తెలుసుకోవలసిన అపోహలు మరియు వాస్తవాలు

1. మధుమేహం ఉన్న వారు సీతాఫలంకు దూరంగా ఉండాలి..!

సీతాఫలం 54 గ్లైసెమిక్ సూచిక కలిగిన పండు. డయాబెటిస్ ఉన్నవారికి ఇది సురక్షితమైన పండు కాదు. అదనంగా, డయాబెటిస్ ఉన్నవారికి జిఐ 55 మరియు అంతకంటే తక్కువ ఉన్న వారికి దీన్ని తినవచ్చని పోషకాహార నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

2. గుండె సంబంధిత సమస్యలున్న రోగులు సీతాఫాలంకు దూరంగా ఉండాలి..?

2. గుండె సంబంధిత సమస్యలున్న రోగులు సీతాఫాలంకు దూరంగా ఉండాలి..?

వాస్తవంగా చెప్పాలంటే సీతాఫలం డయాబెటిస్ వారికి కొంత వరకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో పొటాషియం, మాంగనీస్ మరియు విటమిన్ సి వంటి ప్రయోజనకరమైన ఖనిజాలు ఉన్నాయి. ఆరోగ్యకరమైన గుండె మరియు రక్త ప్రసరణ వ్యవస్థ కోసం, ఈ పండు మీ ఆహారంలో భాగం కావడం చాలా మంచిది.

3. సీతాఫలం జీర్ణక్రియకు మంచిది ..!

3. సీతాఫలం జీర్ణక్రియకు మంచిది ..!

ఇక్కడ ఉన్న అపోహ ఏమిటంటే, అధిక బరువు ఉన్నవారు ఈ పండును నివారించాలని నమ్ముతారు. అయితే వాస్తవంగా చెప్పాలంటే సీతాఫలం జీర్ణక్రియకు మంచిది మరియు మంటను తగ్గిస్తుంది. ఇది కడుపులో ఆమ్లతను నివారిస్తుంది మరియు కడుపులో ఇన్ఫ్లమేషన్ నయం చేస్తుంది. విటమిన్ బి, విటమిన్ బి కాంప్లెక్స్ కు మంచి మూలం, ముఖ్యంగా విటమిన్ బి 6. ఇవన్నీ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

4.పిసిఓడి ఉన్న మహిళలు సీతాఫాల్‌కు దూరంగా ఉండాలి ..?

4.పిసిఓడి ఉన్న మహిళలు సీతాఫాల్‌కు దూరంగా ఉండాలి ..?

ఇది సీతాఫలం గురించి మరొక ప్రసిద్ధ అపోహ. పిసిఒడి ఉన్న మహిళలకు ఐరన్ చాలా అవసరం. అందుకు మంచి మూలం సీతాఫాలం , పిసిఓడి ఉన్న మహిళలు సీతాఫలం తినవచ్చని పోషకాహార నిపులు చెబుతున్నారు. ఇది సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుంది, అలసటను తగ్గిస్తుంది మరియు చిరాకును తగ్గిస్తుంది.

సీతాఫలంను ఎలాంటి సందేహం లేకుండా

సీతాఫలంను ఎలాంటి సందేహం లేకుండా

కాబట్టి, అన్ని వయసుల వారు సీతాఫలంను ఎలాంటి భయం మరియు అపోహ లేకుండా తినవచ్చు. ఈ సీతాఫలం తినడం వల్ల మీ స్కిన్ టోన్, హెయిర్ క్వాలిటీ, కంటి చూపు, మెదడు ఆరోగ్యం మరియు హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరుస్తాయి. ఇది యాంటీ-ఒబెసోజెనిక్, యాంటీ-డయాబెటిక్ మరియు క్యాన్సర్ వ్యతిరేక అధిక బయోయాక్టివ్ అణువులను కలిగి ఉంటుంది. కావున సీతాఫలంను ఎలాంటి సందేహం లేకుండా మీ చేతులతో తినండి, రుచిని ఆనందించండి!

English summary

Sitaphal Myths And Facts: Here's Why You Must Have Custard Apple This Season

Sitaphal or custard apple is a nutritious fruit with an array of health benefits. It contains the likes of Vitamin C, Vitamin A, potassium and magnesium. Sitaphal is currently in season and must be a part of your diet. Highlighting the importance of including sitaphal in your diet is celebrity nutritionist.
Story first published: Monday, November 25, 2019, 14:55 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more