For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిగుళ్ళ వాపు: కారణాలు, లక్షణాలు, చికిత్స మరియు నివారణ, ఇంటి చిట్కాలు కూడా..!!

మీ మంచి ఆరోగ్యానికి.. శ్రేయస్సుకి.. ఓరల్ హెల్త్(నోటి ఆరోగ్యం)చాలా ముఖ్యం. దంత సంరక్షణలో చిగుళ్ళు వ్యాధులు ఎక్కువగా ఉంటాయి. చిగుళ్ళ వాపు, చిగుళ్ళ నుండి రక్త స్రావం తద్వారా దంతాలు వదులు అవ్వడం మొదలగు లక

|

మీ మంచి ఆరోగ్యానికి.. శ్రేయస్సుకి.. ఓరల్ హెల్త్(నోటి ఆరోగ్యం)చాలా ముఖ్యం. దంత సంరక్షణలో చిగుళ్ళు వ్యాధులు ఎక్కువగా ఉంటాయి. చిగుళ్ళ వాపు, చిగుళ్ళ నుండి రక్త స్రావం తద్వారా దంతాలు వదులు అవ్వడం మొదలగు లక్షణాలు దంత సమస్యలో ఒక భాగం. చిగుళ్ళ వాపుతో పాటు, ఇతర దంత సమస్యలకు మరియు దంత వ్యాధులకు దూరంగా ఉండటం మంచిది.

దంతాల వలే చిగుళ్లు కూడా ఆరోగ్యంగా ఉండాలి. దృడంగా, క్లీన్ గా మరియు పింక్ కలర్లో ఉండాలి. చిగుళ్ళ వాపును ఇగురు(జింజివల్) వాపు అని కూడా పిలుస్తారు. ఈ వాపు ఉన్నప్పుడు చిగుళ్ళు ఎర్రగా, భాదాకరంగా ఉంటుంది.

చిగుళ్ళ వాపుకు కారణాలు

చిగుళ్ళ వాపుకు కారణాలు

చిగుళ్ళ వాపుకు చాలా రకాల కారణాలున్నాయి.

చిగుళ్ళ వాపు: చిగుళ్ళ వాపు కారణంగా చిగుళ్ళలో వాపుతో పాటు చీకాకును కలిగిస్తుంది. ఇది చిగుళ్ళ వాపుకు ప్రధానకారణం అవుతుంది. చిగుళ్ళ వాపు తక్కువగా ఉందని లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే పెరియోడెంటిస్ట్ అనే ప్రమాదకర స్థితికి కారణం అవుతుంది మరియు దంతాలను కోల్పోవడం జరుగుతుంది. చిగుళ్ళవాపుకు ప్రధాన కారణం సరిగా నోటి పరిశుభ్రతను పాటించకపోవడం, నోట్లో దంతవరుసున , చిగుళ్ళ మధ్యన పాచి పేరుకుపోవడం వల్ల చిగుళ్ళవాపుకు దారితీస్తుంది.

పోషకాల లోపం:

పోషకాల లోపం:

ఆరోగ్యానికి అన్ని రకాల పోషకాలు అవసరం అవుతాయి. శరీరంలో విటమిన్ బి12, విటమిన్ సి లోపిస్తే చిగుళ్ళు వాపులు వాస్తాయి. చిగుళ్ళు మరయు దంత సంరక్షణలో విటమిన్ సి ప్రధాన పాత్ర పోసిస్తుంది. విటమిన్ బి12 దంతక్షయాన్ని మరియు చిగుళ్ళ వాపును దూరం చేస్తుంది.

 ప్రెగ్నెన్సీ :

ప్రెగ్నెన్సీ :

ప్రెగ్నెన్సీ సమయంలో చిగుళ్ళ వాపులు సర్వసాధారణం . ఎందుకంటే శరీరంలో హార్మోన్ల అసమతుల్యతలు, శరీరంలో హార్మోన్ల స్థాయిలు పెరగడం వల్ల చిగుళ్ళకు రక్తసరఫరా క్రమంగా పెరగుతుంది. దీని కారనంగా చిగుళ్ళలో చీకాకు కలుగుతుంది. చిగుళ్ళ వాపుకు దారితీస్తుంది. శరీరంలో హార్మోన్లలో వచ్చే మార్పుల వల్ల చిగుళ్ళ వాపుకు కారణం అయ్యే ఇన్ఫెక్షనప్ తో పోరాడే శక్తిసామర్థ్యం తగ్గుతుంది. ఆ కారణంగా చిగుళ్ళ సమస్యలు, చిగుళ్ళ వాపు వచ్చే అవకాశాలు ఎక్కువ.

ఇన్ఫెక్షన్స్

ఇన్ఫెక్షన్స్

కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ మరియు వైరస్ వల్ల చిగుళ్ళలో వాపు వస్తుంది. చిగుళ్ళలో వాపుకు కారణం హెర్పస్ మరియు థ్రష్ అనే ఇన్ఫెక్షన్స్ వల్లే.

చిగుళ్ళ వాపు లక్షణాలు :

చిగుళ్ళ వాపు లక్షణాలు :

  • చిగుళ్ళ నుండి రక్తస్రావం
  • నొప్పి
  • నోటి దుర్వాసన
  • చిగుళ్ళు ఎర్రగ మరియు వాచి ఉండటం
  • దంతాల మధ్య సందులు ఏర్పడటం
  • చిగుళ్ళ వాపుకు చికిత్స:

    చిగుళ్ళ వాపుకు చికిత్స:

    రెండు వారాలు మించి చిగుళ్ళలో వాపు ఉంటే వెంటనే దంతవైద్యులను సంప్రదించాలి. వైద్యులు చిగుళ్ళ వాపుకు గల కారణాలను గుర్తించి , నోటి పరిశుభ్రత కు వాడే లిక్విడ్స్ సూచింపవచ్చు. ఇవి చిగుళ్ళవాపును తగ్గించడంతో పాటు, పాచిని కూడా తగ్గిస్తాయి.

    చిగుళ్ళ వాపు తీవ్రంగా ఉన్నప్పుడు శస్త్రచికిత్సను సిఫారస్సు చేస్తారు. సర్జరీలో స్కాలింగ్ మరియు రూట్ ప్లానింగ్ వంటివి ఉంటాయి. ఈ ప్రక్రియలో దంతవైద్యుడు వ్యాధిగ్రస్తులైన వారిలో చిగుళ్ళుకు సంబంధించిన వ్యాధిని దూరం చేస్తారు, దంతాలపై పేరుకున్న గార మరియు దంతాలపై పాచీ, దంతాల మొదళ్ళలో ఏర్పడ్డ పాచిని తొలగించి మిగిలిన చిగుళ్ళు నయం అయ్యేలా చికిత్స చేస్తారు.

    చిగుళ్ళవాపుకు హోం రెమెడీస్

    చిగుళ్ళవాపుకు హోం రెమెడీస్

    కొన్ని రకాల హోం రెమెడీస్ చిగుళ్ళవాపు లక్షణాలను తొలగించి నొప్పి నుండి ఉపశమనం కలగిస్తాయి. అటువంటి హోం రెమెడీస్ :

    సాల్ట్ వాటర్ తో నోటి పరిశుభ్రత:

    పరిశోధన ప్రకారం, సాల్ట్ వాటర్ చిగుళ్ళ వాపును తగ్గించడానికి, నయం చేసే గుణాన్ని అందిస్తుంది. ఎందుకంటే ఉప్పులో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల చిగుళ్ళ వాపుకు కారణమయ్యే నోట్లో బ్యాక్టీరియా పెరగడకుండా మరియు చిగుళ్ళలో ఉన్న బ్యాక్టీరియాను తగ్గిస్తుంది.

    * ఒక గ్లాసు వేడి నీటిలో ఒక టీస్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి

    * ఈ వాటర్ తో నోటిని 30 సెకండ్ల పాటు శుభ్రం చేసుకోవాలి.

    * నోటిలో ఉంచిన నీరు 30 సెకండ్ల తర్వాత ఊసేయాలి. ఇలా రోజుకు రెండు, మూడు సార్లు చేస్తుంటే తప్పనిసరిగా ఫలితం ఉంటుంది.

    టర్మరిక్ జెల్ :

    టర్మరిక్ జెల్ :

    నేషనల్ జర్నల్ ఆఫ్ మాక్సిలోఫేసియల్ సర్జరీ పరిశోధనల్లో వెల్లడించిన ప్రకారం టర్మరిక్ జెల్ల నోట్లోని పాచిని మరియు చిగుళ్ళ వాపును నివారిస్తుంది.

    పసుపులో ఉండే కుర్కుమిన్ అనే అంశాలు యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటాయి.

    * దంతాలకు బ్రష్ చేసి, నీటితో శుభ్రం చేసుకున్న తర్వాత దంతాలకు , చిగుళ్ళకు పసుపు రాయండి.

    * 10 నిముషాలు అలాగే ఉంచాలి.

    * పది నిముషాల తర్వాత నార్మల్ వాటర్ ను నోట్లో పోసి బాగా పుక్కిలించి ఊసేయాలి.

    * ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

    కలబంద

    కలబంద

    జర్నల్ ఆఫ్ క్లీనికల్ మరియు ఎక్సిపిరిమెంటల్ టెంటిస్ట్రీ పరిశోధనల ప్రకారం చిగుళ్ళ వాపు చికిత్సలో అలోవెర మరో ప్రభావంతమైన హోం రెమెడీ.

    * రెండు టీస్పూన్ల అలోవెర జెల్ తో నోట్లో వేసుకుని కొద్ది సేపు అలాగే ఉంచాలి

    * కొద్దిసేపటి తర్వాత ఊసేసి మంచి నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి.

    * ఇలా క్రమం తప్పకుండా రోజుకు రెండు సార్లు, పది రోజుల పాటు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

    కోల్డ్ మరియు వార్మ వాటర్ కంప్రెసర్

    కోల్డ్ మరియు వార్మ వాటర్ కంప్రెసర్

    చల్లని మరియు వేడి నీటి కాపడం వల్ల చిగుళ్ళ వాపు, నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

    * శుభ్రమైన కాటన్ క్లాత్ ను గోరువెచ్చని నీటిలో ముంచి నీరు పిండేసి, నొప్పి ఉన్న చోట స్మూత్ గా ప్రెస్ చేయండి, అలాగే క్లాస్ ను కొద్దిసేపు అదిపుట్టాలి.

    * ఇక రెండవ పద్దతిలో ఐస్ క్యూబ్ లేదా ఐస్ ప్యాక్ ను శుభ్రమైన బట్టలో చుట్టి, పైన చేసిన విధంగానే అప్లై చేయాలి.

    ప్రత్యేకమైన నూనెలు

    ప్రత్యేకమైన నూనెలు

    యూరప్ జర్నల్ ఆఫ్ డెంటిస్ట్రీ పరిశోధన ప్రకారం పుదీనా నూనె, థైమ్ ఆయిల్, టీట్రీ ఆయిల్స్ నోటి వ్యాధులకు కారణమయ్యే సూక్ష్మక్రిములను నివారించడంలో ప్రభావితంగా పనిచేస్తాయని కనుగొన్నారు.

    * పైన సూచించిన నూనెల్లో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలి.

    * గోరువెచ్చని నీటిలో ఈ నూనెను 3 చుక్కలు వేసి బాగా కలపాలి.

    * ఈ నీటిని నోట్లో పోసుకుని 30 సెకండ్లు అలాగే ఉండనిచ్చి పుక్కలించి ఊసేయాలి.

    * ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

    మూలికలు మరియు మసాలాలు

    మూలికలు మరియు మసాలాలు

    లవంగాల పొండి మరియు పసుపు పొడి వంటివి చిగుళ్ళ వాపు, మంట, నొప్పికి కారణమయ్యే యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి.

    * పైన సూచించన పొడులను గోరువెచ్చని నీటితో పేస్ట్ లా తయారుచేయాలి.

    * ఈ పేస్ట్ ను నేరుగా చిగుళ్ళపై అప్లై చేయాలి.

    * కొన్ని నిముషాల తర్వాత నార్మల్ వాటర్ తో నోటిని శుభ్రం చేసుకోవాలి.

    టీ బ్యాగ్స్

    టీ బ్యాగ్స్

    బ్యాక్ టీ, హైబిస్కస్ టీ, గ్రీన్ టీ లో ఆస్ట్రిజెంట్ ట్యానిన్స్ ఉంటాయి. అలాగే అల్లం టీ మరియు చామంతి టీలలో యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలుంటాయి. టీలలో ఉండే టానిన్స్ చిగుళ్ళ వాపుకు సంబంధించిన చీకాకును నివారిస్తుంది.

    * వేడి నీటిలో టీ బ్యాగ్ ను డిప్ చేసి, 5నిషాలు అలాగే ఉంచండి

    * టీ బ్యాక్ చల్లబడిన తర్వాత ఈ బ్యాగ్ ను చిగుళ్ళ వాపున్న ప్రదేశంలో ఉంచి 5 నిముషాలు అలాగే ఉంచండి.

    చిగుళ్ళవాపుకు నివారణ చర్యలు

    చిగుళ్ళవాపుకు నివారణ చర్యలు

    * రోజుకు రెండు సార్లు బ్రష్ చేయండి.

    * రోజూ పాచిని తొలగించండి.

    * బ్రష్ చేసిన తర్వాత , పాచిని తొలగించిన తర్వాత దంతాల్లో ఇరుకున్న , దాగున్న ఆహార పదార్థాలను మౌత్ వాష్ తో తొలగించండి.

    * స్వీట్స్ తక్కువగా తినండి

    * దంతవైద్యులను తరచూ కలుస్తుండండి.

English summary

Swollen Gums: Causes, Symptoms And Treatment

Oral health is an important aspect of your general health and well-being. Therefore, it is imperative to keep various tooth and gum diseases at bay including swollen gums. Your gums should be as healthy as your teeth. It should be firm, clean and pink in colour. Swollen gums, also called gingival swelling, is characterized by protruding of the gums which appear to be red and painful.
Story first published:Wednesday, September 11, 2019, 16:03 [IST]
Desktop Bottom Promotion