For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పీరియడ్స్ సమయంలో ఇవన్నీ సాధారణమే! వీటన్నింటికీ అస్సలు టెన్షన్ పడకండి!!

పీరియడ్స్ సమయంలో ఇవన్నీ సాధారణమే! వీటన్నింటికీ అస్సలు టెన్షన్ పడకండి!!

|

పీరియడ్స్ (రుతుచక్రం) అనేది స్త్రీ శరీరంలో జరిగే ఒక సాధారణమైన ప్రతిక్రియ అయినప్పటికీ దీని వెనుక కొంత అపోహలు అంటిపెట్టుకుని ఉన్నాయి. కొంత మంది మహిళలకు రుతు చక్రం సమయంలో కొన్ని సమస్యలు కండరాల నొప్పులు, హార్మోన్ల మార్పులు మరియు ఉదర ఉబ్బరం వంటి వాటి గురించి చర్చించడానికి ముందుకు వస్తారు. అయితే మరికొంత మంది మహిళలు మాత్రం పీరియడ్స్ సమయంలో జరగబోయే కొన్ని మార్పుల గురించి మాట్లాడటానికి సిగ్గుపడతారు. అయితే మేము ఇక్కడ మీకు కొన్ని రహస్యాలు చెప్పబోతున్నాము.

Things That Happen During Your Period That Are Totally Normal

అదేంటంటే ఈ సమయంలో మీరు అనుభవించే కొన్ని సమస్యలు ఇతర స్త్రీలు కూడా అనుభవిస్తారు. మీరు రుతు చక్ర సమయం గురించి కొన్ని అపోహలు మరియు వాస్తవాలను, మీ శరీరంలో జరిగే మార్పుల గురించి సిగ్గుపడకుండా బహిరంగంగా మాట్లాడాలి. ఇక్కడ జాబితాలో ఐదు ఆలోచనలు పీరియడ్స్ సమయంలో నిషిద్ధం చేయబడనివి అని మీరు అనుకోవచ్చు. అయితే ఇది ఒక సాధారణ విషయం మాత్రమే. ఈ విషయంలో మీరు నిజంగా శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో మిమ్మల్ని ఆశ్చర్య పరిచే కొన్ని విషయాల గురించి, దీనికి సంబంధించిన కొన్ని లక్షణాలు మరియు సమస్యల గురించి పూర్తిగా మాట్లాడవచ్చు. దీన్ని మీరు సాధారణంగా లేదా విచిత్రంగా అనుకోవచ్చు. కానీ వీటి గురించి తెలుసుకోవడం వల్ల ఆ సమయంలో వచ్చే ఇబ్బందికరమైన సమస్యల నుండి బయట పడటానికి ఇతరులతో చర్చించడం మంచిది. పీరియడ్స్ సమయంలో ఎదుర్కొనే కొన్ని విచిత్రమైన సమస్యలు గురించి మనం ఇప్పుడు పరిశీలిద్దాం..

మలవిసర్జన అలవాటు మారవచ్చు

మలవిసర్జన అలవాటు మారవచ్చు

ప్రతి నెలలో పీరియడ్స్ రావడానికి కొన్ని రోజుల ముందు మీకు మలబద్ధక సమస్య కనబడవచ్చు మరియు పీరియడ్స్ ప్రారంభమైన తర్వాత కూడా మలబద్దకం కావచ్చు. ఈ భాగంలో కనిపించే సాధారణ మంట కారణంగా ఇలా జరగవచ్చు. అయితే మలబద్ధకం కొన్ని రోజులు కొనసాగితే లేదా విరేచనాలు అవుతుంటే మీరు వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్స చేయించుకోవడం చాలా అవసరం.

మీరు ఎల్లప్పుడూ అలసిపోయినట్లు భావిస్తారు

మీరు ఎల్లప్పుడూ అలసిపోయినట్లు భావిస్తారు

మీ పీరియడ్స్ అయిన మొదటి రెండు రోజులలో చాలా సాధారణంగా మీ శరీరంలో నిశక్తి , అలసట అనుభూతి చెందుతారు. అయితే మీ శక్తి స్థాయి తగ్గిపోవడం వల్ల ఈ సమయంలో మీరు ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలనే భావన రావడం మీకు సాధారణమని సూచించారు. హార్మోన్ల స్థాయిలలో హెచ్చుతగ్గులు దీనికి కారణం. ఈ సమయంలో మెదడు మరియు కేంద్ర నాడీ వ్యవస్థతో సహా ప్రతి అవయవానికి విశ్రాంతి అవసరం. తక్కువ నిద్ర, ఈ సమయంలో మీరు చేయగలిగే కొన్ని మంచి పనులు తేలికపాటి కార్యకలాపాలు (నడక, యోగా మొదలైనవి).

రక్తపు మరకలు

రక్తపు మరకలు

కొన్ని సందర్భాల్లో మీ ప్యాడ్‌లో లేదా మీరు మూత్ర విసర్జన చేసినప్పుడు రక్తపు మరకలు కనిపిస్తాయి. మీరు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ రక్త మరకలు సాధారణమైనవి. గర్భాశయ పొరలు విస్తరించినప్పుడు ఘనీభవించిన రక్తం, శ్లేష్మం మరియు కణజాలం పెరుగుతాయి, పీరియడ్స్ సమయంలో ఈ వ్యర్థాలు గర్భాశయ గోడల నుండి విచ్ఛిన్నం అయ్యి శరీరం నుండి బయటకు వస్తాయి. చిన్న రక్తం గడ్డకట్టడం సాధారణం. కానీ రక్త స్రావం మొదటి రెండు రోజుల కన్నా ఎక్కువ ఉండకూడదని వైద్యులు సలహా ఇస్తున్నారు. అయినప్పటికీ రక్త స్రావం ఎక్కువగా మరియు పెద్ద పెద్ద కణితులు ఉంటే మీరు తప్పని సరిగా గైనకాలజిస్టును సంప్రదించాలి.

డిశ్చార్జ్ గురించి కొంత అవగాహన కలిగి ఉండాలి

డిశ్చార్జ్ గురించి కొంత అవగాహన కలిగి ఉండాలి

శరీరంలో కొన్ని వైఖరులు మనకు వింతగా అనిపించవచ్చు. కానీ మనం సమస్యగా చూసేది శరీరం యొక్క సాధారణ ప్రతిస్పందన కావచ్చు. రుతు చక్రంలో కూడా డిశ్చార్జ్ అనుభవం కలిగి ఉంటారు.రుతుచక్రంలో రక్తస్రావం యొక్క రంగు చాలా భిన్నంగా ఉంటుందని మీకు ఇప్పటికే తెలుసు. అదే విధంగా రక్త స్రావం రంగులో తేడాలను గమనించినట్లైతే అయోమయానికి గురిచేస్తుంది. అయితే మీరు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పీరియడ్స్ ముగిసే సమయంలో గర్భాశయం తనను తాను శుభ్రపరుస్తుంది. ఇలా కనబడటం సర్వసాధారణం. అయితే డిశ్చార్జ్ సమయంలో చాలా చెడు వాసన లేదా పసుపు, ఆకుపచ్చ రంగులో డిశ్చార్జ్ కాకూడదన్న అన్న విషయం తెలుసుకోవాలి.

ఒకే నెలలో రెండు సార్లు పీరియడ్స్ రావడం

ఒకే నెలలో రెండు సార్లు పీరియడ్స్ రావడం

గర్భాశయం ఒక నెల పాటు అండోత్సర్గము చేయడంలో బిజీగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ రకమైన గర్భాశయ పనితీరు భిన్నంగా ఉంటుంది. ఇది రుతు చక్రంలో కొన్ని సాధారణ మార్పులకు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. మరో వైపు మీరు ఆందోళన చెందవలసిన మూడు విషయాలు ఇక్కడ ఉన్నాయి:

ప్రీ మెన్‌స్ట్రల్ సిండ్రోమ్ (పిఎంఎస్) (రుతుచక్రం ముందు బాధించే లక్షణాలు)

ప్రీ మెన్‌స్ట్రల్ సిండ్రోమ్ (పిఎంఎస్) (రుతుచక్రం ముందు బాధించే లక్షణాలు)

నిపుణుల అభిప్రాయం ప్రకారం, మనం PMSను చాలా తేలికగా తీసుకుంటాము. కొన్ని హార్మోన్ల అసాధారణతలు మరియు పనిచేయకపోవడం వల్ల ఈ లక్షణాలు కనబడుతాయి.

ఎక్కువగా పొత్తికడుపు ఉబ్బరం

ఎక్కువగా పొత్తికడుపు ఉబ్బరం

హార్మోన్ల అసాధారణతలు వల్ల నీరు చేరడం వల్ల లేదా అధిక రక్త ప్రవాహం కారణంగా రుతుచక్రంలో కడుపు నొప్పి వస్తుంది. అయితే వైద్యనిపుణుల ప్రకారం మీకు పొత్తికడుపు ఉబ్బరంగా ఎక్కువగా ఉంటే అది కడుపులో మంట వల్ల కడుపు సరిగా పనిచేయకపోవడం వల్ల ఇలా పొట్ట ఉబ్బరం వస్తుందని సూచిస్తున్నారు.

అధిక రక్తస్రావం మరియు బాధాకరమైన తిమ్మిరి

అధిక రక్తస్రావం మరియు బాధాకరమైన తిమ్మిరి

పీరియడ్స్ సమయంలో ఆ ప్రదేశంలో మితమైన తిమ్మిరి కనిపిస్తుంది. గర్భాశయం సంకోచించడమే దీనికి కారణం. తీవ్రమైన తిమ్మిరి మరియు అధిక రక్తస్రావంకు కారణం మీరు ఎండోమెట్రియోసిస్ లేదా ఫైబ్రాయిడ్స్‌తో బాధపడుతున్నారని వైద్యులు సూచిస్తున్నారు.రుతు చక్రంలో అధిక రక్తస్రావం మరియు నొప్పితో ఉంటే మీరు భవిష్యత్తును ద్రుష్టిలో ఉంచుకుని తప్పని సరిగా వైద్యులు సంప్రదించి వైద్యపరీక్షలు చేయించుకుని సరైన చికిత్స తీసుకోవడం మంచిది. లేకపోతే ఇది సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

English summary

Things That Happen During Your Period That Are Totally Normal!

Despite menstruation being a commonplace experience, there’s still a stigma around periods. While some women are comfortable discussing menstrual miseries like cramping, hormonal changes and bloating, there are a few things many of us are too ashamed to admit happen during that time of the month. But can we let you in on a little secret? Chances are, the same period woes you’re experiencing are probably happening to other women.
Story first published:Wednesday, October 23, 2019, 18:10 [IST]
Desktop Bottom Promotion