Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
చలికాలంలో చర్మం పొడిబారుతోందా? ఇలా ఒంట్లో నీటి శాతం పెంచుకోవచ్చు
చలికాలంలో హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం. అయితే నీరు ఎక్కువగా తాగడం చాలా మందికి ఇష్టముండదు. దాహం వేసినప్పుడు కొన్ని అలా తాగేస్తుంటారు కానీ ఇష్టంగా తాగలేరు. అలాంటి వారి కోసమే ఈ చిట్కాలు. వీటి ద్వారా శరీరంలో తగినంత నీటి శ
చలికాలంలో వాతావరణంలో తేమ ఉండదు. దాని వల్ల చర్మం పొడిబారుతుంది. చలికాలం దాహం వేయకపోవడం వల్ల డీహైడ్రేషన్‌కు గురవుతుంటాం. దీని వల్ల చర్మం పొడిబారడంతో పాటు అలసట, కండరాల తిమ్మిరి, తలనొప్పి, రక్తపోటు తగ్గడం, చికాకు లాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే చలికాలంలో తగినన్ని నీరు తాగాలని వైద్యులు సూచిస్తుంటారు.

చలికాలంలో రోగనిరోధక శక్తి చాలా బలహీనంగా ఉంటుంది. దీని వల్ల వివిధ రోగాల బారిన పడే అవకాశాలు ఉంటాయి. అందుకే చలికాలంలో హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం. అయితే నీరు ఎక్కువగా తాగడం చాలా మందికి ఇష్టముండదు. దాహం వేసినప్పుడు కొన్ని అలా తాగేస్తుంటారు కానీ ఇష్టంగా తాగలేరు. అలాంటి వారి కోసమే ఈ చిట్కాలు. వీటి ద్వారా శరీరంలో తగినంత నీటి శాతం ఉండేలా చూసుకోవచ్చు.

1. నీటికి రుచిని జోడించడం
చలికాలంలో హైడ్రేటెడ్‌గా ఉండటానికి ఉత్తమమైన, అత్యంత ప్రభావవంతమైన మార్గం నీరు తాగడం. చలికాలంలో నీరు తాగడం కష్టంగా ఉన్నప్పటికీ మంచి రుచిని కలిగించే మార్గాలు చాలా ఉన్నాయి. అవి రోజువారీ నీటిని తీసుకోవడం పెంచడానికి సహాయపడతాయి.
నిమ్మరసం, ఇతర పండ్ల రసాలను నీటికి జోడించడం ద్వారా నీటిని రుచిగా మార్చుకోవచ్చు. గోరువెచ్చని నీటిలో రెండు మూడు చుక్కల నిమ్మరసం వేసుకుంటే రుచిగా ఉండటంతో పాటు శరీరానికి నీరు అందుతుంది.

2. ఉప్పు తగ్గించాలి
వేసవి కాలంతో పోలిస్తే చలికాలంలో చెమట పట్టడం చాలా చాలా తక్కువ. చెమట పట్టకపోవడం వల్ల శరీరంలో ఉప్పు నిల్వలు అలాగే ఉంటాయి. శరీరంలో ఉప్పు శాతం పెరిగితే అది రక్తపోటుకు కారణం అవుతుంది. ఈ పరిస్థితి చలికాలంలో గుండె సంబంధిత సమస్యలను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. అందుకే చలికాలంలో వీలైనంత తక్కువగా ఉప్పు తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు.

3. నీటి శాతం ఎక్కువుంటే ఆహారాన్ని తీసుకోవాలి
చలికాలంలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి నీరు మాత్రమే సరిపోదు. కాబట్టి రోజువారీ ఆహారంలో నీటి శాతం అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. వాటి వల్ల శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. చలికాలంలో లభించే పండ్లను తీసుకోవడం మంచిది. చలికాలం మోసంబి, జామ, నారింజ, సీతాఫలాలు, పైనాపిల్ లాంటి పండ్లు ఎక్కువగా లభిస్తాయి. ఈ పండ్లలో సహజంగానే నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే విటమిన్-సి సమృద్ధిగా లభిస్తుంది. దీని వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

4. కెఫిన్ తీసుకోవడం తగ్గించాలి
కెఫిన్ మూత్ర విసర్జనను పెంచుతుంది. తరచూ మూత్ర విసర్జన చేయడం వల్ల ఒంట్లోని నీరు బయటకు పోతుంది. దీని వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. కెఫిన్ కలిగిన పానీయాలను తీసుకోవడం తగ్గించడం వల్ల శరీరం మరింత నీటిని ఉంచుకుంటుంది. పగలు, సాయంత్రం వేళ కెఫిన్‌కు దూరంగా ఉంటడం మంచిది. ఉదయం ఒక కప్పు హెర్బల్ టీ తాగడం ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుస్తుంది. వెచ్చని ద్రవాలు తాగడం వల్ల శరీరం వెచ్చగా ఉండటంతో పాటు హైడ్రేట్‌గా ఉంటుంది.



Click it and Unblock the Notifications