For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక్కనెల రోజులు ఆల్కహాల్ మానేస్తే మీ శరీరంలో ఎన్ని అద్భుతాలు జరుగుతాయో తెలుసా...

ఆల్కహాల్ మరియు బీర్ వంటి పానీయాలను సేవించినప్పుడు మీకు తెలియకుండా మీ శరీరం బరువు పెరిగిపోతుంది. అయితే మీరు మద్యం సేవించడం ఎప్పుడైతే మానేస్తారో.. అప్పుడు మీరు బరువు తగ్గడం అనేది కూడా ప్రారంభమవుతుంది.

|

ప్రస్తత రోజుల్లో చాలా మంది పురుషులు ఆల్కహాల్ ను తెగ తాగేస్తున్నారు. ఒకప్పుడు నగరాలకు, పట్టణాలలో ఈ కల్చర్ ఎక్కువగా ఉండేది. అయితే ఇప్పుడు ఈ కల్చర్ కాస్త మండలాలు, గ్రామాలలో కూడా విపరీతంగా పెరిగిపోయింది.

when you cut out alcohol for 30 days

ప్రస్తుత ప్రపంచంలో ఎవరైనా మద్యం సేవించడం లేదంటే చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని మందు బాటిళ్లపై ఉన్నా ఎవ్వరూ దాన్ని పట్టించుకోవడం లేదు. అయితే కొందరు మాత్రం ఆంగ్ల నూతన సంవత్సరం 2020 సందర్భంగా ఆల్కహాల్ అలవాటును మానేయాలనుకుంటున్నారు.

when you cut out alcohol for 30 days

''కొందరేమో ఇకపై నేను మద్యం ముట్టను'' అని ప్రమాణాలు కూడా చేసేస్తున్నారు. అయితే అలాంటి వారి శరీరంలో కేవలం ఒక్క నెలలోనే ఎన్నో అద్భుతమైన మార్పులు జరుగుతున్నాయి. ఆరోగ్య పరంగా వారిని మరింత శక్తివంతంగా తయారు చేస్తున్నాయి. ఇంతకీ ఏయే ఆరోగ్య ప్రయోజనాలున్నాయో ఈ స్టోరీలో మీరే చూడండి...

30 రోజుల పాటు..

30 రోజుల పాటు..

మీరు ఆల్కహాల్ ను మానేసిన 30 రోజులలోపే మీ శరీరంలో అనేకమైన అద్భుతాలు జరుగుతాయి. అంతేకాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి.

కాలేయం క్లీన్ గా..

కాలేయం క్లీన్ గా..

అధికంగా ఆల్కహాల్ సేవించే వారిలో కాలేయం సిర్రోసిస్ అనే వ్యాధి సంభవిస్తుంది. అయితే ఇది ఒక్కరోజులోనే రాదు. ఎవరైతే ఎక్కువగా ఆల్కహాల్ ను సేవిస్తారో వారిలో ఇది ఎక్కువగా వస్తుంది. అయితే మీరు మద్యం తాగడం మానేస్తే మీ కాలేయం ఎప్పటిలాగే సాధారణ స్థితికి వస్తుంది. అంతేకాదు కాలేయం ఇతర వాటిపై శ్రద్ధ చూపి, మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో బాగా సహాయపడుతుంది.

గుండె జబ్బులను తగ్గిస్తుంది..

గుండె జబ్బులను తగ్గిస్తుంది..

ఆల్కహాల్ ను తక్కువ స్థాయిలో తీసుకుంటే మీ గుండెకు సంబంధించిన జబ్బులను తగ్గిస్తుంది. అయితే మీరు ఎప్పుడైతే మోతాదుకు మించి ఆల్కహాల్ ను సేవిస్తారో అప్పుడు మాత్రం కచ్చితంగా గుండె జబ్బుల బారిన పడాల్సిందే. ఎందుకంటే ఆల్కహాల్ మోతాదుకు మించి తీసుకుంటే కాలేయ జీవక్రియకు కారణమవుతుంది. అయితే మీరు ఒక్క నెలరోజుల పాటు మద్యం తాగడం పూర్తిగా మానివేసి, మీరు కొంత వ్యాయామం చేస్తే మీకు గుండె సంబంధిత జబ్బులు అస్సలు రావు.

బరువు తగ్గుదల..

బరువు తగ్గుదల..

ఆల్కహాల్ మరియు బీర్ వంటి పానీయాలను సేవించినప్పుడు మీకు తెలియకుండా మీ శరీరం బరువు పెరిగిపోతుంది. అయితే మీరు మద్యం సేవించడం ఎప్పుడైతే మానేస్తారో.. అప్పుడు మీరు బరువు తగ్గడం అనేది కూడా ప్రారంభమవుతుంది. అంతేకాదు మీ శరీర కూర్పులోనూ మెరుగుదల ఉంటుంది.

క్యాన్సర్ నుండి రక్షణ..

క్యాన్సర్ నుండి రక్షణ..

మద్యం ఎక్కువగా తాగే వారికి క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన రోగాలు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి ఇటీవల ఓ అధ్యయనంలో వివరాలు వెల్లడించారు. మద్యం సేవించే వారిలో తలనొప్పి మరియు కాలేయం, రొమ్ము, పెద్దపేగుకు సంబంధించిన వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు. అయితే మద్యం మానివేస్తే క్యాన్సర్ రోగం మీ దరిదాపుల్లోకి కూడా రాదట.

ఒకటి లేదా రెండు గ్లాసులు..

ఒకటి లేదా రెండు గ్లాసులు..

అయితే ఆల్కహాల్ ను అస్సలు మానివేయలేకపోతున్నాం అనే వారు. వారానికి ఒకటి లేదా రెండు గ్లాసుల వైన్ ను తాగితే కూడా మీ శరీరంలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా 40 ఏళ్లకు పైబడిన పురుషులకు ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మహిళలు కూడా ఈ ప్రయోజనాలను ఎప్పుడైనా పొందుతారు. మహిళలకు ఇది వయసు మీద ఆధారపడి ఉండదు అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఏకాగ్రత తగ్గిపోవడం..

ఏకాగ్రత తగ్గిపోవడం..

మద్యం సేవించడానికి చట్టబద్ధమైన వయసు 21 సంవత్సరాలు అని చాలా మందికి తెలుసు. అయితే ఈ వయసునే ఎందుకు పెట్టారంటే దీని వెనుక ఓ కారణం ఉంది. ఈ మధ్య టీనేజర్లు ఎక్కువగా మద్యం సేవించడం వంటి చెడు అలవాట్ల బారిన పడుతున్నారు. దీని వల్ల వారిలో జ్ఞాపకశక్తి తగ్గిపోయి మెదడు చురుకుగా పని చేయడం లేదు. ఎందుకంటే ఆల్కహాల్ తాగే వారికి మెదడులో కొన్ని రుగ్మతలు ఉంటాయి. ఇవి ఎక్కువగా మద్యం కారణంగా జరుగుతాయి. మెదడు దెబ్బతినడం వల్ల జ్ఞాపకశక్తి మరియు ఏకాగ్రత తగ్గిపోతుంది. అందుకే మద్యం సేవించడానికి 21 సంవత్సరాలు తప్పనిసరిగా ఉండాలని చట్టం తీసుకొచ్చారు. అయితే ఎవరైతే మద్యం తాగడం వంటి అలవాట్లను మానుకుంటారో వారి మెదడు చాలా చురుకుగా పని చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

English summary

What happens to your body when you cut out alcohol for 30 days

Here we talking about what happens to your body when you cut out alcohol for 30 days. Read on
Story first published:Wednesday, January 29, 2020, 13:03 [IST]
Desktop Bottom Promotion