For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

COVID-19: నాసల్ వ్యాక్సిన్ అంటే ఏమిటి? కరోనా కట్టడికి అది ఎలా పని చేస్తుంది?

|

కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది శాస్త్రవేత్తలు కష్టపడుతున్నారు. కరోనా కట్టడి కోసం తీసుకున్న కొత్త చర్యల గురించి జూన్ 8వ తేదీన మంగళవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం జాతినుద్దేశించి ప్రసంగించారు.

వ్యాక్సిన్లకు ప్రత్యామ్నాయంగా నాసికా వ్యాక్సిన్లను కనుగొంటున్నారని, దానిపై పరిశోధనలు జరుగుతున్నాయని తన ప్రసంగంలో వెల్లడించారు. సమర్థవంతమైన నాసికా వ్యాక్సిన్ డెవలప్ కావడానికి కొంత సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ సందర్భంగా నాసికా వ్యాక్సిన్ అంటే ఏమిటి? కరోనా కట్టడికి ఇది ఎలా పని చేస్తుంది? దీని ప్రత్యేకతలేంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

కోవిద్ టీకా కోసం కేంద్రం కొత్త మార్గదర్శకాలు... మీరు తెలుసుకోవాల్సిన కీలక అంశాలు..

నాసికా వ్యాక్సిన్ అంటే ఏమిటి?

నాసికా వ్యాక్సిన్ అంటే ఏమిటి?

నాసికా వ్యాక్సిన్ అనేది చేతిలోని సూది ద్వారా కాకుండా ముక్కు ద్వారా ఇవ్వబడుతుంది. నాసికా స్ప్రే మాదిరిగానే శ్వాసకోశ మార్గానికి తగిన మోతాదులో నేరుగా పంపిణీ చేయడమే దీని లక్ష్యం. గత ఏడాది ఆగస్టు 21వ తేదీన వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ సెల్ జర్నల్ లో దీని గురించి ప్రచురితమైనట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. సైంటిస్టుల టీమ్ కోవిద్-19, సార్స్ వైరస్ కట్టడి లక్ష్యంగా దీన్ని డెవలప్ చేసింది.

ఎలుకలపై ప్రభావవంతగా..

ఎలుకలపై ప్రభావవంతగా..

ఈ నాసికా వ్యాక్సిన్ ను శాస్త్రవేత్తలు మనుషులపై ప్రయోగించలేదు. కానీ గత ఏడాది కరోనాను కట్టడి చేసేందుకు ఎలుకలపై ప్రయోగించారు. ఎలుకలకు ముక్కు ద్వారా ఒక మోతాదులో ఇచ్చారు. ఇది ఎలుకలలో కరోనా సంక్రమణ నివారించడంలో ప్రభావవంతంగా పని చేసినట్లు కనుగొన్నారు. ఈ వ్యాక్సిన్ ముందుగా వైరస్ వ్యాప్తి చెందిన స్థలాన్ని లక్ష్యంగా చేసుకుంటుందని, ఇది రోగనిరోధక ప్రతిస్పందనకు కారణమవుతుందని కనుగొన్నారు.

మన దేశంలోనూ ప్రయోగాలు..

మన దేశంలోనూ ప్రయోగాలు..

నాసికా వ్యాక్సిన్ కు సంబంధించిన ప్రయోగాలు కొద్ది రోజులు క్రితం నుండి మన దేశంలో కూడా జరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ కూడా పేర్కొన్నారు. ఇది పిల్లలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. భారత్ బయోటెక్ డెవలప్ చేసిన ఇంట్రానాసల్(నాసల్ వ్యాక్సిన్) టీకా బిబివి154 ఇప్పటికే ప్రీ-క్లినికల్ ట్రయల్ దశలో ఉంది.

కరోనాకు టీకాలు వేయించుకున్న వారి ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందా? అద్భుతమైన అధ్యయన ఫలితాలు ...!

నాసికా వ్యాక్సిన్ ప్రయోజనాలు..

నాసికా వ్యాక్సిన్ ప్రయోజనాలు..

- దీని వల్ల ఇంజక్షన్ ద్వారా వ్యాక్సిన్ వేయాల్సిన ఉండదు.

- ముక్కు లోపలి భాగంలో రోగ నిరోధక తయారీ, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు తగ్గే అవకాశం ఉంది.

- టీకా వ్యర్థాల అవకాశాన్ని తగ్గించి, ఉత్పత్తి చేయడం సులభమవుతుంది.

- దీన్ని మీరు ఎక్కడికైనా.. ఎప్పుడైనా తీసుకెళ్లొచ్చు. నిల్వ సమస్య కూడా తగ్గిపోతుంది.

- ఈ వ్యాక్సిన్ ఇంజెక్షన్ వేయడానికి ఎవ్వరికీ ట్రైనింగ్ అవసరం లేదు.

- ఇది గాయాలు మరియు అంటువ్యాధుల వంటి సూది-సంబంధిత ప్రమాదాలను తగ్గిస్తుంది.

- ఇది పిల్లలకు మరియు పెద్దలకు మంచిగా సరిపోతుంది.

నాసికా వ్యాక్సిన్ ఎలా పని చేస్తుంది?

నాసికా వ్యాక్సిన్ ఎలా పని చేస్తుంది?

ఇంట్రానాసల్ వ్యాక్సిన్ల యొక్క ప్రయోజనం ఏంటంటే.. ఇది వైరస్ చేరిన ప్రాంతంలో.. బలమైన రోగనిరోధక ప్రతిస్పందనను స్రుష్టిస్తుందని, ఇమ్యూనైజేషన్ కమిటీ, శిశు వైద్యుడు డాక్టర్ విపిఎన్ ఎం.వశిష్ట వివరించారు. ఇది వైరస్ వ్యాప్తిని అడ్డుకుని, మన బాడీలో కవచంగా ఉండేందుకు సహాయపడుతుందని చెప్పారు. దీని వల్ల మన ఊపిరితిత్తులలో వైరస్ ప్రవేశించకుండా, అది దెబ్బతినకుండా ఉంటుంది. అంతేకాదు కరోనా వైరస్ సంక్రమణను ప్రారంభంలోనే ఇది నిరోదించగలదు.

భిన్నంగా ఉంటుందా?

భిన్నంగా ఉంటుందా?

ఇది సంప్రదాయ వ్యాక్సిన్ల మాదిరి కాకుండా నాసికా వ్యాక్సిన్లు శ్లేష్మ పొరలలో ఉన్న వైరస్ ను లక్ష్యంగా చేసుకుంటాయి. నోటి ద్వారా లేదా చేయి ద్వారా కాకుండా ముక్కు ద్వారా ఇవ్వబడుతుందది. పలు అధ్యయనాల ప్రకారం, కోవిద్-19 షాట్ మరియు నాసికా స్ప్రే రెండూ పని చేస్తాయి. నాసికా స్ప్రే ముందుగా పిల్లలకు ప్రాధాన్యతగా ఇవ్వబడుతుంది. అయితే పెద్దలకు కూడా నాసికా స్ప్రే ఫ్లూ షాట్ తో పని చేస్తుందని వైద్యులు కనుగొన్నారు.

గమనిక : కంపెనీ నివేదికలు ప్రకటనలు నిర్వహణ ద్వారానే ఈ వ్యాక్సిన్లు పంపిణీ చేయబడతాయి. అవి మరింత ప్రామాణికమైనవిగా పరిగణించాలి. అయినా కూడా భవిష్యత్తులో వీటి గురించి తప్పుదారి పట్టించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అధికారిక సమాచారం లేకుండా మీరు వీటి జోలికి వెళ్లకండి.

English summary

What is Nasal Vaccine? How Does it Work And How is it Different From Existing Covid-19 Vaccines in Telugu

A nasal vaccine is given by the nose rather than a needle through the arm. The nasal vaccine for COVID-19 is being developed by Bharat Biotech and is said to become available in India by the end of 2021. Nasal vaccines are effective and require lesser resources as compared to injected vaccines.