For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కోకనట్ వాటర్ (కొబ్బరి నీళ్ళు) తాగడానికి సరైన సమయం - దీన్ని అనుసరిస్తే ఆరోగ్య వృద్ధి!

కోకనట్ వాటర్ (కొబ్బరి నీళ్ళు) తాగడానికి సరైన సమయం - దీన్ని అనుసరిస్తే ఆరోగ్య వృద్ధి!

|

కోకనట్ వాటర్ లేదా కొబ్బరి నీళ్ళు ఎక్కువ మంది ప్రజలు ఇష్టపడే సహజసిద్దమైన పానీయం. ఈ జగత్తులో చాలా వరకు కోకనట్ కొబ్బరి నీళ్ళను తాగుతారు. అన్ని గ్రామ మరియు పట్టణ ప్రాంతాల్లో కొబ్బరి బోండాం మరియు కొబ్బరి నీళ్ళు విరివిగా దొరుకుతాయి. ఆరోగ్య పరంగా మరియు మానసిక పరంగా అత్యంత శక్తినిచ్చే అతి చౌకైన పానీయం కొబ్బరి నీళ్ళు.

పురాతన కాలం నుండే అనేక ఆరోగ్య సమస్యలను నివారంచుకోవడానికై కొబ్బరి నీళ్ళు వైద్య రంగంలోనూ సూచింపబడుతున్నది. లేలేత కొబ్బరి బోండాంలోని నీళ్ళులో చాలా తక్కువ చక్కెర శాతం ఉండటం వల్ల సోడా మరియు కొన్ని పండ్ల రసాల కంటే కొబ్బరి నీళ్ళు తాగడం మంచిది. ఈ పానీయం ఎదిగే పిల్లలకు మరియు వృద్ధులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఏ ఇతర పండ్ల రసాలు మరియు పానీయాలు ఇవ్వలేని శక్తిని ఈ కొబ్బరి బోండాంలోని నీరు తక్షణ ఎనర్జీని అందివ్వడంలో ఉత్తమమైనది. కొబ్బరి నీరు మన శరీరంలో నిర్జలీకరణ సమస్యను తొలగిస్తుంది. ఈ కొబ్బరి బోండాంలోని నీటి యొక్క ప్రాముఖ్యత గురించి మీరు తెలుసుకున్నట్లే, కొబ్బరి నీరు తాగకుండా ఉండాలేరు. తప్పకుండా కొబ్బరి బోండాంకు మీరు అత్యంత ఇష్టప్రియులవుతారు.

మీరు సరైన సమయంలో కొబ్బరినీళ్ళు తాగితే, దాని ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి

మీరు సరైన సమయంలో కొబ్బరినీళ్ళు తాగితే, దాని ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి

మీరు రోజులో ఏ సమయంలో అయినా కొబ్బరి నీరు త్రాగవచ్చు. అయితే మీరు దీన్ని సరైన సమయంలో తాగితే, అది ఖచ్చితంగా మీకు ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. అందుకే కొబ్బరి నీళ్ళు తాగడానికి సరైన సమయం తెలుసుకోవాల్సిన అవసరం ఉండి. ఇలా చేయడం వల్ల దాని గరిష్ట ప్రయోజనాలు పొందవచ్చు. మిగతా ఇతర పానీయాలన్నీ తాగడానికి మీకు ఒక సమయం అంటూ ఉంటుంది. కానీ కొబ్బరి నీళ్ళు త్రాగడానికి ఎలాంటి సమయం లేదు. మీరు దీన్ని పగటిపూట లేదా రాత్రి సమయంలో కూడా సేవించవచ్చు. కానీ ఒక నిర్దిష్ట సమయంలో దీన్ని తాగడం వల్ల మీకు ఎంతో ప్రయోజనం ఉంటుంది.

ఉదయం ఖాళీ కడుపు(పరగడుపు)తో త్రాగాలి

ఉదయం ఖాళీ కడుపు(పరగడుపు)తో త్రాగాలి

రోజు ఉదయాన్నే నిద్ర లేచి, నిత్య కార్యక్రమాలు ముగించి, ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్ళు సేవివించడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ఈ నీటిలో లారిక్ ఆమ్లం ఉంటుంది, ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది, జీవక్రియను పెంచుతుంది మరియు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. గర్భిణీ స్త్రీలు నిర్జలీకరణం మరియు మలబద్దకం నుండి ఉపశమనం పొందడానికి ఈ కొబ్బరి నీరు త్రాగాలి. ఇది ఉదయం అనారోగ్యాన్ని తగ్గించడం మరియు గర్భిణీ స్త్రీలలో సామాన్యంగా కనిపించే ఛాతీలో మంట సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది.

వ్యాయామానికి ముందు లేదా తరువాత

వ్యాయామానికి ముందు లేదా తరువాత

కొబ్బరి నీళ్ళు ఒక స్పోర్ట్స్ డ్రింక్ గా కూడా పిలవబడుతుంది. ఎందుకంటే ఇది శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది మరియు తక్షణం శక్తిని అందిస్తుంది. అందుకే వ్యాయామానికి ముందు కొబ్బరి నీళ్ళు తాగడం మంచిది. వ్యాయామం చేసిన తర్వాత కొద్దిగా కొబ్బరినీరు తాగితే మీ శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్లను తిరిగి పొందటానికి ఇది సహాయపడుతుంది. కొబ్బరి నీరు తాగడం వల్ల అలసట నుండి ఉపశమనం కలుగుతుంది మరియు శక్తిని తిరిగి పొందవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే శరీరానికి ఇది ఒక పవర్‌హౌస్ వంటింది.

భోజనానికి ముందు లేదా తరువాత

భోజనానికి ముందు లేదా తరువాత

మీరు భోజనానికి ముందు ఒక కొబ్బరి బోండాంలోని నీరు తాగితే, అది మీ కడుపు నిండుగా చేస్తుంది. దాంతో మీరు అతిగా తినడం తక్కువ చేస్తుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల పొట్టకు కూడా మంచిది. కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు భోజనం తర్వాత పొట్ట ఉబ్బరాన్ని నివారిస్తుంది. కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల అది శరీరంలోని ఎలక్ట్రోలైట్‌ను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది, తద్వారా రక్తపోటును అదుపులో ఉంచుతుంది మరియు జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

పడుకునే ముందు

పడుకునే ముందు

నోటికి తీపి మరియు మంచి రుచని కలిగించే కొబ్బరి బోండాంలోని నీరు తాగడం వల్ల మానసికంగా ప్రభావం చూపుతుంది. దాంతో ఆందోళను ఉండదు మరియు హృదయ స్పందన రేటును తగ్గిస్తుంది. ఒత్తిడిని తగ్గించడానికి మరియు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి మీరు పడుకునే ముందు ఒక కప్పు కొబ్బరి నీరు త్రాగాలి. అయితే, మీరు నిద్రవేళకు ముందు ఈ కొబ్బరి నీరు తాగడం వల్ల శరీరంలోని అన్ని విషపదార్ధాలను తొలగించి, మూత్రాశయాన్ని శుభ్రపరుస్తుంది. ఇన్ఫెక్షన్లను నివారించడం మరియు మూత్రపిండాల సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.

నిషా నుండి బయటపడటానికి

నిషా నుండి బయటపడటానికి

రాత్రి తాగిన మత్త ఉదయం దిగలేదంటే అంటే మీరు హ్యాంగోవర్ నుండి బయటపడాలంటే, మీరు కొద్దిగా కొబ్బరి నీళ్ళు త్రాగాలి. మద్యం సేవించడం వల్ల నిర్జలీకరణం జరుగుతుంది. ఇది మరుసటి రోజు ఉదయం తలనొప్పి మరియు వికారం కలిగిస్తుంది. ఈ రెండింటినీ కొబ్బరి నీటితో నివారించుకోవచ్చు. మరియు శరీరంలో ఎలక్ట్రోలైట్‌లను తిరిగి నింపడం ద్వారా శరీరానికి మంచి అనుభూతిని కలిగిస్తుంది. పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి, కాల్షియం మరియు డైటరీ ఫైబర్ ఈ నీటిలోని కొన్ని ప్రధాన పోషకాలు. అందువల్ల కొబ్బరి బోండాంలోని నీళ్ళు ఆరోగ్యకారిగా మరియు రిఫ్రెష్ చేసే పానీయంగా ఉంది.

English summary

what is the best time to drink tender coconut water

Coconut water is a natural hydrating drink which is a great source of potassium and has several health benefits. It acts as a great alternative to the other high-calorie and high sugar filled drinks available.Coconut water Is low in calories and high in important nutrients like potassium which gets lost in sweat and workouts. Drinking coconut water at right time can double the health benefits.
Story first published:Wednesday, September 11, 2019, 13:12 [IST]
Desktop Bottom Promotion