Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
What is tomato fever:‘టమోటా ఫీవర్’ అంటే ఏమిటి? దీని లక్షణాలు, చికిత్స విధానాలేంటో తెలుసుకోండి..
టమోటా ఫీవర్ అంటే ఏమిటి? దీని లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అసలే కరోనా మహమ్మారి పూర్తిగా కనుమరుగు కాలేదని బాధపడుతుంటే.. మరో మహమ్మారి మన దేశంలోకి చొచ్చుకొచ్చేసింది.

తాజాగా కేరళ రాష్ట్రంలో మళ్లీ కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. ఈ వైరస్ కేవలం చిన్నారులపై దాడి చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు నిర్ధారించారు.

ఈ కొత్త రకం వైరస్ కు 'టమోటా ఫీవర్' లేదా 'టమోటా ఫ్లూ'గా నామకరణం చేశారు. కేరళ రాష్ట్రంలోని కొల్లాం నగరంలో దాదాపు 82 కేసులు నమోదైనట్టు గుర్తించారు. ఇప్పటివరకు ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు నమోదు కాలేదు. కేవలం కేరళలో మాత్రమే రోజురోజుకు పెరుగుతూ అందరికీ ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతం ఈ మహమ్మారి గురించి జోరుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇంతకీ ఇది అంటు వ్యాధా? కాదా? ఎది ఎలా వ్యాప్తి చెందుతుందనే విషయాలను తెలుసుకునే ప్రయత్నంలో ఆరోగ్య శాఖాధికారులు మునిగిపోయారు. ఈ సందర్భంగా టమోటా ఫీవర్ అంటే ఏమిటి? దీని లక్షణాలేంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్స విధానాలేంటనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

టమోటా ఫీవర్ అంటే?
టమోటా ఫీవర్ నే టమోటా ఫ్లూ అని కూడా పిలుస్తారు. ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఈ మహమ్మారి ఎక్కువగా చిన్నారుల్లో ప్రభావం చూపుతుంది. ‘టమోటా ఫీవర్' వచ్చిన పిల్లల్లో చర్మంపై ఎర్రటి దద్దుర్లు, బొబ్బలు వస్తున్నాయి. అంతేకాదు చిన్నారులు డీహైడ్రేషన్ గురవుతున్నారు. టమోటా ఫీవర్ అని పేరు రావడానికి ప్రధాన కారణం చర్మంపై వచ్చే బొబ్బలు ఎర్రగా గుండ్రగా ఉండటం, పొక్కులు ఉంటాయి. అవి టమోటాల రూపంలో ఉంటాయని, అందుకే వీటికి ఆ పేరు వచ్చిందని నిపుణులు చెబుతున్నారు.

టమోటా ఫీవర్ లక్షణాలు..
టమోటా ఫీవర్ వచ్చిన చిన్నారులకు జ్వరం ఎక్కువగా ఉంటుంది. వారికి బాడీ పెయిన్స్, కీళ్ల నొప్పులు కూడా పెరుగుతాయి. విపరీతంగా అలసిపోవడం, చర్మంపై ఎర్రటి దద్దుర్లు, కొందరిలో బొబ్బలు రావడం వంటివి జరుగుతాయి. డీహైడ్రేషన్ కారణంగా నోటిలో చికాకుగా ఉంటుంది. చేతులు, మోకాళ్లు, పిరుదుల భాగంలో రంగు మారిపోతుంది.

టమోటా ఫీవర్ వస్తే..
చిన్నారులకు టమోటా ఫీవర్ వస్తే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్ ను సంప్రదించాలి. ఈ ఫీవర్ వచ్చిన వారికి గోరువెచ్చని నీటిని తాగిస్తూ ఉండాలి. ముందుగా డీహైడ్రేషన్ బారి నుండి తప్పించాలి. బొబ్బలు, దద్దుర్లను పిండటం, గోకడం వంటివి చేయరాదు. గోరువెచ్చని నీటితోనే స్నానం చేయించాలి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
టమోటా ఫీవర్ ప్రాణాంతకం కాదని, చికిత్స ద్వారా నయం చేయొచ్చని ఆరోగ్య శాఖాధికారులు చెబుతున్నారు. ఈ వైరస్ రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మీరు పరిశుభ్రతను పాటిస్తూ.. మీ చిన్నారులను కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. వైరస్ సోకిన వ్యక్తితో సన్నిహిత సంబంధాన్ని నివారించాలి. వీలైనంత ఎక్కువ కాలం గోరువెచ్చని నీటిని తాగండి. స్నానం చేయడానికి కూడా గోరు వెచ్చని నీటినే వాడండి.
టమోటా ఫీవర్ వచ్చిన చిన్నారులకు జ్వరం ఎక్కువగా ఉంటుంది. వారికి బాడీ పెయిన్స్, కీళ్ల నొప్పులు కూడా పెరుగుతాయి. విపరీతంగా అలసిపోవడం, చర్మంపై ఎర్రటి దద్దుర్లు, కొందరిలో బొబ్బలు రావడం వంటివి జరుగుతాయి. డీహైడ్రేషన్ కారణంగా నోటిలో చికాకుగా ఉంటుంది. చేతులు, మోకాళ్లు, పిరుదుల భాగంలో రంగు మారిపోతుంది.



Click it and Unblock the Notifications