For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్లాస్టిక్ బాటిల్లో నీరు తాగుతున్నారా? అయితే ఈ స్టోరీ మీకోసమే..

ప్లాస్టిక్ బాటిల్లో నీరు తాగుతున్నారా? అయితే ఈ స్టోరీ మీకోసమే..

|

సాధారణంగా మనం బయటకు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ప్లాస్టిక్ బాటిల్లో నీళ్ళు నింపుకుని వెళ్ళడం అలవాటు. అందుకు పెప్పి మరియు కోకో కోలా వంటి ఖాలీ బాలిల్స్ ను నీటిని నింపడానికి సులభంగా, ఖర్చులేకుండా ఉపయోగించేస్తుంటాము. అయితే ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

వాస్తవానికి ఇది నిజం అయినప్పటికీ ఇది ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్లాస్టిక్ బాటిళ్ల వాడకంతో చాలా ఆరోగ్య సమస్యలు మనల్ని వెంటాడుతున్నాయి. ప్లాస్టిక్ బాటిళ్ళలో నిల్వ చేసేవి ఏవైనా సరే ఆరోగ్యానికి హానికరమే అని పరిశోధకులు నొక్కి వక్కానిస్తున్నారు. తెలిసో..తెలియకో చేసే ఈ అలవాట్లు వల్ల ఎటువంటి సమస్యలు చుట్టుముడుతాయో మీరు చూడండి..

వాస్తవం : 1

వాస్తవం : 1

శీతల పానీయాలు లేదా మినిరల్ వాటర్ నిల్వ చేయడానికి తయారుచేసిన సీసాలు పాలిథైలిన్ టెరెఫ్తాలేలట్ (పిఇటి)నుండి తయారవుతాయి. ఈ బాటిల్స్ పై సూర్యకిరణాలు పడినప్పుడు లేదా ప్రయాణించే సమయంలో కారులో ఈ బాటిల్స్ పెట్టుకుని ఎండలో ప్రాయాణం చేస్తే, వాతావరణంలోనికి వేడికి బాటిల్స్ లోని రసాయనాలు బయటకు వస్తాయి. అలాగే నీటిని కలుషితం చేస్తాయి.

వాస్తవం : 2

వాస్తవం : 2

ఈ బాటిల్స్ ఒక్క సారి మాత్రమే ఉపయోగించడానికి మాత్రమే పనికివస్తాయి. అటువంటి వాటిల్లో పదే పదే నీరు లేదా వేర ఇతర పదార్థాలను నింపి తరుచుగా ఈ బాటిల్స్ ను ఉపయోగించడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. వీటి వల్ల క్యాన్సర్, మధుమేహం, ఊబకాయం వంటి మరిన్ని ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి.

వాస్తవం : 3

వాస్తవం : 3

కొన్ని పరిశోధనల ప్రకారం ప్లాస్టిక్ బాటిళ్లలోని కొన్ని రసాయనిక పదార్థాలు మహిళల్లో అండోత్సర్గ సమస్య, పిసిఓఎస్ ఎండోమెట్రియాసిస్ మరియు రొమ్ము క్యాన్సర్ వంటి భయంకరమైన సమస్యలు కలిగిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.

వాస్తవం : 4

వాస్తవం : 4

కొన్ని ప్లాస్టిక్ బాటిల్స్ విభిన్న రంగుల్లో వేరు వేరుగా ఉంటాయి. ఇటువంటి బాటిల్స్ తయారికి రసాయనిక పదార్థాలు అధికంగా వినిగించి ఉండటం వల్ల , అటువంటి వాటిని వాడటం వల్ల ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి.

వాస్తవం : 5

వాస్తవం : 5

ట్రెడ్ మిల్ అను పరిశోధన మరియు ప్రయోగశాల పరీక్షల ప్రకారం గడువు ముగిసిన ప్లాస్టిక్ సీలాను వాడటం వల్ల ప్రమాదకరమైన స్మూక్ష్మ జీవులు ఆవిర్భవానికి దారితీస్తుంది. ఇవి ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి.

వాస్తవం : 6

వాస్తవం : 6

ప్లాస్టిక్ బాటిల్స్ స్థానంలో స్టెయిన్ లెస్ స్టీల్ లేదా అల్యూమినియం బాటిల్స్ ఉపయోగించడం చాలా సురక్షితం. అయితే ఇవి కూడా కొన్ని నిర్ణీత కాలం తర్వాత వాడటానికి తగినవి కావు .

వాస్తవం : 7

వాస్తవం : 7

గాజు బాటిల్స్ లో తాగు నీటిని నిల్వ చేయడం సురక్షితమే కానీ, వీటిని మెయింటైన్ చేయడం వల్ల తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వీటి వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావాలుండవు.

English summary

ప్లాస్టిక్ బాటిల్లో నీరు తాగుతున్నారా? అయితే ఈ స్టోరీ మీకోసమే..Why Plastic Bottles Could be Bad Your Health

Most plastics are made of long chains of hydrocarbon molecules and most plastics have added chemicals used for improving the flexibility or even colour of the bottles. Safety of plastic bottles varies depending on the type of plastics that are used. Low-quality products may possess serious health problems like cancer
Story first published:Monday, August 26, 2019, 17:02 [IST]
Desktop Bottom Promotion